games and sports
-
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
అంతర్జాతీయ క్రికెట్ లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ
-
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్న వినేష్ ఫోగట్
-
శభాష్ వినేష్.. ఓడినా నువ్వే బంగారం
-
ఆటల్లేని.. చదువులు..!
ఆట, పాటలతో ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది. మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మైదానాలూ ఉండవు. ఇవి రెండూ లేని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోకొల్లలు. మంచిర్యాలసిటీ: అత్తెసరు వ్యాయామ ఉపాధ్యాయులతో అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులు ఆటలకు దూరమై.. కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. మానసిక ప్రశాంతత కొరవడి చదువుకు కూడా దూరమవుతున్న వారు అనేకమంది విద్యార్థులు జిల్లాల్లో ఉండటం గమనార్హం. ఆటలంటే ఇష్టమున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చదువుకు, ఆటలకు దూరమై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, కళాశాలలు 523 ఉండగా.. 338 విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 185 విద్యాసంస్థల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 36 శాతం విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులకు క్రీడలు అందుబాటులో ఉండగా.. 64 శాతం సంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మైదానాల పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 466 ఉన్నత పాఠశాలలకుగాను సుమారు 150 పాఠశాలలకు మైదానాలు లేవు. 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 20కి పైగా కళాశాలలకు మైదానాలు లేవు. 11 డిగ్రీ కళాశాలలకు మైదానాలు ఉన్నా.. తొమ్మిది కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు లేరు. అవసరమైన స్థలం అన్ని రకాల ఆటలను విద్యార్థులతో ఆడించేందుకు కొలతల ప్రకారం స్థలం అవసరం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు ఒకటిన్నర ఎకరం, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడెకరాలు, ఉన్నత పాఠశాలలకు ఐదెకరాల స్థలం ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. జూనియర్ కళాశాలలకు ఐదు, డిగ్రీ కళాశాలలకు పదెకరాల స్థలం ఉండాలి. పోస్టులు భర్తీ చేయాలి విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీడీలకు పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించడానికి అవకాశం ఉండేది. ఖాళీల ప్రభావంతోనే విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆటలు దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. – బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, తాండూర్ మండలం -
స్పోర్ట్స్ సిటీగా కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ స్మార్ట్‌సిటీలో నగరం నడిబొడ్డున్న అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి రూ.18 కోట్లు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. ఈ నిధులతో స్టేడియంను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన నమూన పోస్టర్‌ను ఆవిస్కరించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఉన్న మైదానలను తీసివేయకుండా వాటి రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా కొత్తగా సైక్లింగ్‌రింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్టేడియంకు ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు షాపింగ్ కాంప్లె„Šక్స్ నిర్మిస్తామన్నారు. ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీతోపాటు స్పోర్ట్స్ సిటీగా, హెల్తీ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు. క్రీడారంగంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. క్రీడలంటే అందరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుందని, అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి తర్వాత అందరూ కరీంనర్‌వైపు చూస్తార పేర్కొన్నారు. స్మార్ట్ స్టేడియాన్ని కరీంనగర్ ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా టెండర్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టేడియం చుట్టూ ఉన్న రహదారులను సైతం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 11న స్మార్ట్ స్టేడియం పనులను జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభిస్తారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ ఎల్.రూప్సింగ్, ఇన్చార్జి డీవైఎస్వో నాగిరెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు. -
ఆటలకు దూరం..!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం. చదువుపైనే ధ్యాస పెడుతున్న విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎంతగానో నష్టపోతున్నారు. జిల్లాలోని సర్కార్ బడుల్లో వ్యాయామ విద్య అందడం లేదు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీలు ఉన్నా అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తుండగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీల నియామకం లేకపోవడంతో వ్యాయామ విద్య అటకెక్కింది. చదువు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు అవసరమని ఉపాధ్యాయ వర్గాలు, వైద్యులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఉపాధ్యాయులు వారికి ఆటలు ఆడిస్తున్నారు. కానీ ఆటల్లో నియమ నిబంధనలు, రక్షణ చర్యలు తెలియకపోవడంతో ఆయా ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడా మైదానంలో వదిలేస్తున్నారు. దీంతో ఇష్టం వచ్చినట్లు ఆటలాడిన విద్యార్థులు గాయాలపాలవుతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు మరుగునపడిపోతున్నారు. జీవోలు జారీ తప్ప అమలేది..! జీవోలు జారీ చేయడమే తప్ప వాటి అమలు పర్యవేక్షణపై అటు ప్రభుత్వాలు, ఇటు అధికారుల్లో చిత్తశుద్ధి కానరావడం లేదు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పాటు కోసం వ్యాయామ విద్య, క్రీడలు, నైతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్న తల్లిదండ్రుల విన్నపాన్ని మన్నించిన గత ప్రభుత్వం జూలై 2012లో జీవో నంబర్ 63 విడుదల చేసింది. ప్రతి రోజు పిరియడ్ వ్యాయామ విద్యకు కేటాయించాలని అప్పటి సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ ఆదేశా>లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం స్వాగతించాయి. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైన పీఈటీ, పీడీలు లేకపోవడంతో అమలుకు నోచుకోవడం లేదు. ఆట స్థలాలు, క్రీడా సామగ్రి ఏది.. జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 65 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 18 మండలాల్లో కేవలం 47 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలో 49 పాఠశాలలకు మాత్రమే పోస్టులను కేటాయించారు. కాగా 19 పీడీ పోస్టులకు గాను 15 మంది, 30 పీఈటీ పోస్టులకు గాను 27 మంది పని చేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పక్కన పెడితే, 53 ఉన్నత పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కేటాయించకపోవడం గమనార్హం. వీటిలో సగానికి పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. దీంతో అయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మరో పక్క చాలా స్కూళ్లలో క్రీడా సామగ్రి లేదు. విద్యార్థులే క్రీడా సామగ్రిని ఇంటి నుంచి తెచ్చుకుని ఆడుకుంటున్నారు. క్రీడలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో క్రీడలు మరుగునపడుతున్నాయి. త్వరలో టీఆర్టీ ద్వారా భర్తీ కానున్నాయి జిల్లాలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీకానున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫిక్టెట్లను పరిశీలించడం జరిగింది. దాదాపు నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆదిలాబాద్ -
ఆటంకాలు
మనజిల్లా అంత విస్తీర్ణం కలిగిన దేశాలు సైతం ఒలంపిక్స్‌లో సత్తాచాటుతున్నాయి.. మనం మాత్రం జాతీయస్థాయిని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి. 125 కోట్లకు పైగా జనం అందులో 60 శాతం దాకా యువత ఉన్న మనదేశంలో గత ఒలంపిక్స్‌లో వచ్చిన పతకాల సంఖ్య రెండు.. పతకాల పట్టికలో 57వ స్థానం. మన జిల్లాకు సమానంగా ఉండే చిన్న చిన్న దేశాలు సైతం పతకాల పంట పండిస్తుంటే ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం.. సరైన శిక్షణ, సౌకర్యాలు లేకపోవడంతో మన క్రీడాకారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీడల పరిస్థితులపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాల కడప నగరంలోనే ఉన్నప్పటికీ ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయస్థాయి పతకం కూడా రాకపోవడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ, వసతులు, క్రీడాసామగ్రి లేకపోవడంతో ఉన్నంతలోనే కాస్తో కూస్తో రాణిస్తున్నారే తప్ప ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు కనిపించకపోవడం గమనార్హం. క్రీడాపాఠశాల ఏర్పాటై దాదాపు 12 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కనీసం ఒక్క క్రీడాకారుడు కూడా అంతర్జాతీయస్థాయిలో పాల్గొనలేదు. దీనికి తోడు తీరా పతకాలు సాధించే సమయంలో ఇంటర్మీడియట్ గ్రూపును తీసివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. దీంతో 7 సంవత్సరాల పాటు సాధన చేసినప్పటికీ ఫలితాలు వచ్చే సమయానికి బయటకు పంపేస్తుండటంతో అంతర్జాతీయ పతకాలు కలగానే మిగిలాయి. డీఎస్ఏ మైదానం.. తిరోగమనం కడప నగరంలోని ఏకైక క్రీడామైదానం ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికార సంస్థ మైదానం. 1963లో దాదాపు 8 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మైదానం నేడు తిరోగమనంలో పయనిస్తోంది. వర్షం వస్తే మడుగులా మారడంతో పాటు ఇటీవల మైదానం మధ్యలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంతో మైదానం ధ్వంసమైంది. తర్వాత పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అధ్యాన్నస్థితికి చేరుకుంది. వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం ఆవరణం సైతం చినుకు రాలితే.. మడుగులా మారుతోంది. పాఠశాలస్థాయిలో పరిస్థితులు ఇలా.. జిల్లాలో దాదాపు 4376 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 1,151 పాఠశాలలు అనగా మూడోవంతు పాఠశాలల్లో తప్ప మిగతా పాఠశాలలు మైదానం లేకుండానే నెట్టుకొస్తున్నాయి. ఆటస్థలాలు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను వేళ్లమీద లెక్కగట్టవచ్చు. పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టి విద్యార్థులకు ప్రతిరోజూ డ్రిల్, ఆటలు నిర్వహించాలి. ఇది నిబంధన కూడా. కానీ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఒక్కరోజు కూడా డ్రిల్ చేయించిన పాపాన పోవడం లేదు. రోగాల ఉత్పత్తి కేంద్రాలు చదువు పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చివేస్తున్నారు. పిల్లల ఇష్టాఇష్టాలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఆశయాలను పిల్లలపై రుద్దేస్తూ ఎప్పుడూ చదువుపైనే ధ్యాస ఉంచు అంటూ ఊదరగొడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రోగాల ఉత్పత్తి కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల భారం.. ఆటలకు దూరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చతికిలపడుతోంది. దీంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతోంది. క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో మైదానాలన్నీ బోసిపోతున్నాయి. జీఓ నెం. 63 ప్రకారం 2012లో అప్పటి ప్రభుత్వం వ్యాయామవిద్యను తప్పనిసరి చేస్తూ జీఓ నెం.63 జారీచేసింది. ఈ ఉత్వర్వు ప్రకారం ప్రభుత్వ, గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో వ్యాయామవిద్యను తప్పనిసరిగా నిర్వహించాలి. దీని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొం దించి ఒక పీరియడ్‌ను నిర్వహించాలి. ఈ ఉత్వర్వుల ప్రకారం వారంలో 6 పీరియడ్లు అమలుచేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకావడం లేదు. 51వ జీఓ ప్రకారం 2003 మే 7వ తేదీన అప్పటి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు జీఓ నెంబర్ 51 జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం. జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తే రూ. 4.5 లక్షలు, రజతం సాధిస్తే 3 లక్షలు, కాంస్యపతకం సాధిస్తే 1.5లక్షలు నగదు బహుమతిగా ఇవ్వాల్సి ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రోత్సాహకాలు అమలుకావాలి. కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అమలు కాని క్రీడా సమయం చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్న ప్రతిపాదన కేవలం నీటిమీద రాతల్లాగా మారింది. ఆటలను చుట్టేసి.. చదువు, ర్యాంకులు, జీపీఏలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం తగ్గి మరమనుషుల్లా మారుతున్నట్లు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. 45 నిమిషాల పాటు ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి చలాకీగా ఉంటారని.. శారీరకంగా ఎదుగుదల సక్రమంగా జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏ ఒక్క పాఠశాలల్లోను క్రీడలకంటూ ప్రత్యేక సమయం కేటాయించడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులైతే మైదానం వైపు చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. స్పెషల్‌క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ ఇలా చదువులకే పరిమితం చేస్తున్నారు. ఇరుకైన మైదానాల్లోనే.. జిల్లాలో ఆటస్థలాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో మైదానాలు ఉండాలన్న నిబంధనలు చాలాచోట్ల కనిపంచడం లేదు. దీంతో ఇరుకైన మైదానంలోనే విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తోంది. రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనపు తరగతుల నిర్మాణం చేపడుతుండటంతో ఉన్న స్థలం కాస్తా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. ఇక పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఎక్కడ ఉంటుంది. మరిక్నొ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక పిల్లలు క్రీడల్లో వెనుకబడుతున్నారు. -
ఆటంకాలెన్నో!
ఆకివీడు : ‘ఆటలకు అమిత ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తాం. వారు ఆటల్లో తర్ఫీదు పొందేందుకు అన్ని వసతులూ కల్పిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 464 ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పచ్చికబయళ్లను తలపిస్తున్నాయి. కొన్ని మైదానాలు ఆటకు అనుకూలంగా లేవు. చాలా పాఠశాలల్లో కీడ్రా పరికరాలే లేవు. దాతల సహకాంతో క్రీడా సామగ్రి పాఠశాలలకు అందినా ఆడుకునేందుకు క్రీడామైదానం అనుకూలంగా లేకపోవడంతో అవి స్టోర్ రూమ్లకే పరిమితమైపోతున్నాయి. రైకాకి రెక్కలొచ్చేనా! గతంలో పైకా (పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్) పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవారు. అయితే ఆ పథకం పేరును గత ప్రభుత్వం రైకా(రాజీవ్ యువ క్రీడా ఖేల్ అభియాన్)గా మార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అటకెక్కించాయి. పాఠశాలల్లో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం కింద మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పీఈటీలేరీ ! పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరిపడా పీఈటీలూ లేరు. పీఈటీలు ఉన్నా.. బడుల్లో క్రీడా మైదానాలు లేవు. మైదానాలు ఉన్నా.. అవి ఆటలకు అనుకూలంగా లేవు. ఇలా అనేక సమస్యలు ఆటలతో దోబూచులాడుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల కొరత అధ్వానంగా తయారైన మైదానాల మరమ్మతులకు, క్రీడా సామగ్రికి నిధుల కొరత ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అయితే స్కూల్ గ్రాంట్‌ను దీనికి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ గ్రాంటుతో బడి నిర్వహణ చేస్తున్నందున క్రీడాభివృద్ధికి దానిని కేటాయించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్ గ్రాంట్ వినియోగించలేం స్కూల్ గ్రాంట్‌ను క్రీడాభివృద్ధికి వినియోగించలేం. రూ.7 వేల గ్రాంటును బడి నిర్వహణకే సరిపోతోంది. – రామానుజాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు, చినకాపవరం ఆటలకు జాగాలేదు మా బడిలో క్రీడా ప్రాంగణం ఉన్నా.. ఆడుకునేందుకు జాగాలేదు. నిన్న మొన్నటి వరకూ వర్షపు నీటితో మైదానం నిండిపోయింది. ఇప్పుడిప్పుడే నీరు ఇంకుతోంది. ప్రస్తుతం కొద్ది ఖాళీ స్థలంలోనే ఆటలాడుకుంటున్నాం. మాకు తగిన శిక్షణ లేదు. – రవి, విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు స్కూల్ గ్రాంట్‌తో క్రీడాసామగ్రి స్కూల్ గ్రాంట్లతో క్రీడా సామగ్రి కొనుక్కోవచ్చు. దాతల సహకారంతో కొన్ని పాఠశాలలకు సామగ్రి అందుతోంది. – ఎం.సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం. రైకా తేదీలు ఖరారు కాలేదు రైకా పోటీలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశం ఉంది. అండర్–14, అండర్–17 స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తాం. మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఈ ఏడాది పోటీలు లేవు. – ఎస్కె. అజీజ్, జిల్లా క్రీడాధికారి, ఏలూరు -
ఆటంకాలెన్నో!
ఆకివీడు : ‘ఆటలకు అమిత ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తాం. వారు ఆటల్లో తర్ఫీదు పొందేందుకు అన్ని వసతులూ కల్పిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 464 ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పచ్చికబయళ్లను తలపిస్తున్నాయి. కొన్ని మైదానాలు ఆటకు అనుకూలంగా లేవు. చాలా పాఠశాలల్లో కీడ్రా పరికరాలే లేవు. దాతల సహకాంతో క్రీడా సామగ్రి పాఠశాలలకు అందినా ఆడుకునేందుకు క్రీడామైదానం అనుకూలంగా లేకపోవడంతో అవి స్టోర్ రూమ్లకే పరిమితమైపోతున్నాయి. రైకాకి రెక్కలొచ్చేనా! గతంలో పైకా (పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్) పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవారు. అయితే ఆ పథకం పేరును గత ప్రభుత్వం రైకా(రాజీవ్ యువ క్రీడా ఖేల్ అభియాన్)గా మార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అటకెక్కించాయి. పాఠశాలల్లో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం కింద మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పీఈటీలేరీ ! పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరిపడా పీఈటీలూ లేరు. పీఈటీలు ఉన్నా.. బడుల్లో క్రీడా మైదానాలు లేవు. మైదానాలు ఉన్నా.. అవి ఆటలకు అనుకూలంగా లేవు. ఇలా అనేక సమస్యలు ఆటలతో దోబూచులాడుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల కొరత అధ్వానంగా తయారైన మైదానాల మరమ్మతులకు, క్రీడా సామగ్రికి నిధుల కొరత ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అయితే స్కూల్ గ్రాంట్‌ను దీనికి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ గ్రాంటుతో బడి నిర్వహణ చేస్తున్నందున క్రీడాభివృద్ధికి దానిని కేటాయించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్ గ్రాంట్ వినియోగించలేం స్కూల్ గ్రాంట్‌ను క్రీడాభివృద్ధికి వినియోగించలేం. రూ.7 వేల గ్రాంటును బడి నిర్వహణకే సరిపోతోంది. – రామానుజాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు, చినకాపవరం ఆటలకు జాగాలేదు మా బడిలో క్రీడా ప్రాంగణం ఉన్నా.. ఆడుకునేందుకు జాగాలేదు. నిన్న మొన్నటి వరకూ వర్షపు నీటితో మైదానం నిండిపోయింది. ఇప్పుడిప్పుడే నీరు ఇంకుతోంది. ప్రస్తుతం కొద్ది ఖాళీ స్థలంలోనే ఆటలాడుకుంటున్నాం. మాకు తగిన శిక్షణ లేదు. – రవి, విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు స్కూల్ గ్రాంట్‌తో క్రీడాసామగ్రి స్కూల్ గ్రాంట్లతో క్రీడా సామగ్రి కొనుక్కోవచ్చు. దాతల సహకారంతో కొన్ని పాఠశాలలకు సామగ్రి అందుతోంది. – ఎం.సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం. రైకా తేదీలు ఖరారు కాలేదు రైకా పోటీలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశం ఉంది. అండర్–14, అండర్–17 స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తాం. మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఈ ఏడాది పోటీలు లేవు. – ఎస్కె. అజీజ్, జిల్లా క్రీడాధికారి, ఏలూరు