garden city
-
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.... శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది. ఓటర్లలో నిరుత్సాహం... శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది. వలసదారులకు ఉన్నచోటే ఓటు! జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బెంగళూరు’ నగరానికి ఏమైందీ?
సాక్షి, న్యూఢిల్లీ : 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఎటు చూసినా పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో అలరించిన బెంగళూరు నగరం 21వ శతాబ్దంలో బోసి పోయింది. ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుపొందిన నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా పేరు మార్చుకుంటోంది. 17వ శతాబ్దంలో కూరగాయల పంటలతో పచ్చగా కనిపించిన నగరంలో 18వ శతాబ్దంలో ఆనాటి పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు మొదటిసారిగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను డిజైన్ చేశారు. 1799లో బ్రిటీష్ పాలకులు టిప్పు సుల్తాన్‌ను ఓడించి బెంగళూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక నగరంలోని అతి ప్రాచీన ‘లాల్ బాగ్’ పార్క్‌లో ఫలపుష్పాల పెంపకాన్ని ప్రోత్సహించారు. అందుకోసం వారు ప్రతి ఏటా భారీ ఎత్తున పూల ప్రదర్శన పోటీలను కూడా నిర్వహించేవారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పార్కులను అభివృద్ధి చేసిన బ్రిటీష్ పాలకులు, ఓరాంగుటాన్, నల్ల పులుల లాంటి జంతువులను విదేశాల నుంచి తీసుకొచ్చి జంతు సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నాడు బ్రిటీష్ పర్యాటనకులను కూడా విశేషంగా ఆకర్షించిన బెంగళూరు నగరం అనతికాలంలోనే ఇతర దేశాల పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించింది. ఫలితంగా భిన్న సంస్కృతల సమ్మిళిత నిలయంగా నగరం కనిపిచ్చేది. 1970వ దశకంలో, 1990వ దశకంలో నగరంలో పార్కులను దేశ పాలకులు బాగా అభివృద్ధి చేశారు. 1973లో నగరంలో 68.27 శాతం చెట్లు ఉండగా, 2013 నాటికి అవి 15 శాతానికి చేరుకున్నాయని, అంటే ప్రతి ఏడుగురు పౌరులకు ఒక్క చెట్టు చొప్పున మిగిలిందని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. నేడు నగరంలో 1200 పార్కులు ఉన్నట్లు ‘బృహత్ బెంగళూరు మహానగర పాలిక’ ఘనంగా చెప్పుకుంటోంది. కానీ ఆ పార్కుల మొత్తం విస్తీర్ణం కలిపి రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే. మొత్తం బెంగళూరు నగరం విస్తీర్ణం 2,196 చదరపు కిలోమీటర్లు. అంటే నగర విస్తీర్ణంలో పార్కుల శాతం 0.1 శాతం మాత్రమే. ప్రస్తుతం ఆ పార్కులు కూడా వాకర్లకు తప్పించి మరెవరికీ ఉపయోగపడడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది లేదా పది గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకే తెరిచి ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా వాకర్లే పార్కుల్లో తిరుగుతుంటారు. ఏ మూలో బాగుందగదా అని కాసేపు కూర్చుంటే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏ పిట్టల అరుపులో అనుకుంటే పొరపాటే. పార్కు సెక్యూరిటీ గార్డుల విజిల్స్. పార్క్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరికలు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కులను సంఘవిద్రోహ శక్తులు, మందుబాబులు, పడుపుకత్తెల బెడద పేరుతో మూసేస్తున్నారు. ఈ మాత్రపు పచ్చదనాన్ని అనుభవించే భాగ్యం ప్రవేశ రుసుంల కారణంగా పేదలకు, కార్మికులకు అందుబాటులో లేకుండా పోతోంది. (నగరంలోని ఆజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ప్రొఫెసర్ హరిణి నాగేంద్ర తన నగరానికి ఏమైందన్న ఆందోళనతో రాసిన ‘నేచర్ ఇన్ ది సిటీ’లో అంశాలివి) -
గార్డెన్ కాదు.. గార్బేజ్ సిటీ!
ఒకప్పుడు ఆ నగరం అంటే అందాల హరివిల్లు. ఎటు చూసిన పచ్చదనంతో, చల్లటి గాలులు వీస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బెంగళూరు నగరం ఒకప్పుడు గార్డెన్ సిటీ నుంచి తర్వాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారి, ఇప్పుడు ఏకంగా గార్బేజ్ సిటీ అయిపోయిందని అంటున్నారు. నగరంలో జనాభా ఎక్కువ కావడం వల్లో, ప్రజల్లో అవగాహన కొరవడటం వల్లో గానీ.. చెత్త సేకరణ సేవలు సరిపోవడం లేదని దాంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం విస్తరిస్తున్న విషయాన్ని కొన్ని దశాబ్దాల నుంచి ఎవరూ పెద్దగా పట్టించకోలేదు. కేవలం రోడ్లు, తాగునీరు, డ్రైనేజి, వీధిలైట్లు, గృహసముదాయాల్లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుందని భావించారు తప్ప.. కొత్తగా వస్తున్న ఇళ్ల నుంచి చెత్తను ఎలా తీసుకెళ్లాలి, ఎక్కడ డంప్ చేయాలి, చెత్త నిర్మూలన వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పాలకులలో కొరవడటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. పొద్దున్నే లేచేసరికి అప్పుడే ఏదో కల ముగుస్తూ ఉంటుందని.. కానీ నిద్రలేవగానే చెత్త కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తుందని రస్తోగి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. తాము తలుపులు, కిటికీలు అన్నీ మూసేసినా కూడా ఇదే పరిస్థితి అని వివరించారు. ఒకప్పుడు వేరే రాష్ట్రాల వాళ్లు ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటే ముందుగా బెంగళూరు గురించి ఆలోచించేవాళ్లు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చల్లగా ఉండటం, దానికితోడు మంచి వాతావరణం కనిపించడమే అందుకు కారణం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. 1990లలో బెంగళూరు జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడది ఏకంగా 80 లక్షలు దాటిపోయింది. కానీ సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. పట్టణాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నా, ప్రణాళికలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ప్రధాన సమస్య. ఐటీ హబ్‌గా బెంగళూరు తయారుకావడంతో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోడానికి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. దాంతో నగరం కూడా బాగా విస్తరించింది. దాంతో మునిసిపాలిటీ మీద భారం పెరిగిపోయింది. ఒక రోజుకు బెంగళూరు నగరంలో 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాంతో 2013లో కొత్త ట్రీట్మెంట్ ప్లాంటును మునిసిపాలిటీ ప్రారంభించింది. మొదట్లో అది నగర శివార్లలోనే ఉండేది. కానీ నగర విస్తరణలో భాగంగా అక్కడివరకు ఇళ్లు వచ్చేయడంతో.. చుట్టుపక్కలవాళ్లు ఆ కంపు భరించలేకపోతున్నారు. ఇక్కడొక్క చోటే కాదు.. నగరంలో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనం ఇస్తున్నాయి. దాంతో రోడ్లమీద వెళ్లేవాళ్లు కూడా ముక్కులు మూసుకోక తప్పడం లేదు. మళ్లీ తమ నగరం గార్డెన్‌సిటీ, క్లీన్‌సిటీగా ఎప్పటికి మారుతుందోనని బెంగళూరు వాసులు ఎదురుచూస్తున్నారు. -
బెంగళూరు 'మార్కు' మారనుందా?
సూర్యతాపం ఉద్యానగిరిగా పేరొందిన బెంగళూరునూ వదలడం లేదు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ట్రోగ్రతలు పెరిగిపోవడంతో ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. సాధారణంగా ఈ గార్డెన్ సిటీలో 31 డిగ్రీలు దాటని ఎండలు... ఈసారి తీవ్రంగా పెరిగిపోయి బెంగుళూరు మార్కునే కోల్పోయేలా చేశాయి. ఈ యేడు సూర్యతాపంలో వచ్చిన తీవ్ర ప్రభావం బెంగళూరుపైనా చూపింది. ఉద్యాననగరిగా పేరొందిన బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, ఈసారి 40 డిగ్రీల వరకు వచ్చేసింది. ఆదివారం నాడు అక్కడ 39.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సారి ఏర్పడిన వాతావరణ ప్రతికూల పరిస్థితులు 40 డిగ్రీలను దాటేట్టు చేసి రాకార్డును తిరగరాశాయి. బెంగళూరులోనే కాక కర్ణాటక రాష్టంలోనే ఈసారి అధిక ఉష్ణోగ్రత నమోదౌతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటకలోని వేసవి విడిది ప్రాంతంగా పేరొందిన కలబుర్గీలో కూడా ఈసారి సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఎయిర్ కండిషన్డ్ నగరంగా పేరొందిన బెంగళూరు పరిస్థితే మారిపోయే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 80 ఏళ్ల క్రితం 1931 ఏప్రిల్ నెలలో బెంగళూరులో 38.3 డిగ్రీల ఉష్ణోత్రత నమోదై రికార్డును సృష్టించిందని, ఆతర్వాత 2016 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రికార్డును మించిపోయినట్లు వాతావరణ శాఖ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈసారి బెంగళూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుపుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగుళూరు సంపాదించిన ప్లెజెంట్ వెదర్ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రి సమయాల్లోనూ వేడి అసౌకర్యాన్ని కలిగించడం వాతావరణ అధికారులకు కూడా అంతుబట్టడం లేదు. రాగల రెండు రోజుల్లో బెంగళూరు వాతవరణం కాస్త చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. -
గార్డెన్ సిటీలో ఫ్యాషన్ వీక్