General counseling
-
జనరల్ కౌన్సెలింగ్
అతి నీరసం, అతి ఆకలి, అతిగా మూత్రవిసర్జన... ఎందుకు? నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. ఆకలి బాగా వేస్తుంది. నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ లక్షణాలు చెబుతుంటే... నాకు షుగర్ వచ్చిందేమోనని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరంగా చెప్పండి. – కె. ప్రద్ముమ్న, విశాఖపట్నం ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి. డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, కొన్ని సందర్భాల్లో మీరు చెబుతున్నట్లుగానే ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీ1ఏసీ వంటి పరీక్షలతో డయాబెటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. వీలైనంత త్వరగా మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనలను అనుసరించండి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌కు కారణం ఏమిటి? నా వయస్సు 42 ఏళ్లు. ఇటీవలే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల చాలారోజులు ఆసుపత్రిలో ఉండాల్సివచ్చింది. వెంటిలేటర్ కూడా పెట్టారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కె. జగ్గారావు, విజయవాడ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాటిక్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే సమస్య. ఆల్కహాల్ మొదలుకొని పిత్తాశయంలో రాళ్లు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిలో కడుపు నొప్పితో వాంతులు కావడం, ఒక్కోసారి ఇతర అవయవాలు, వ్యవస్థలు పనిచేయకపోవడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే దీన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి చికిత్స తర్వాత కూడా దీర్ఘకాలికంగా మందులు, క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం. మీరు మితాహారం తీసుకోవడం అవసరం. మాంసాహారం, నూనె పదార్థాలు కూడా అతి తక్కువగా తీసుకోవాలి. ఎప్పుడూ ఆందోళనే.... తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనతో ఉంటాను. త్వరగా ఉద్వేగాలకు గురవుతుంటాను. ఎడతెరిపి లేకుండా ఆలోచనలు వస్తుంటాయి. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – సుధీర్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
పులుపు తగ్గిస్తే కానీ అల్సర్ తగ్గదా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయి స్వభావసిద్ధంగా చురుగ్గా ఉంటాడు. ఆ చురుకుదనం వల్ల ఆటల్లో పరుగెడుతున్నాడు. కానీ త్వరగా ఆయాసపడుతున్నాడు. అలా ఆయాసం వస్తే అది ఆస్తమానేనా? పిల్లల్లో ఆస్తమాను గుర్తుపట్టడానికి మార్గాలు చెప్పండి. - శ్రీరేఖ, పెంచికల్‌దిన్నె పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు వారు శ్వాసతీసుకోడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసపడుతుంటారు. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తాయి. రాత్రివేళ దగ్గు కూడా వస్తుంటుంది. పిల్లల స్వభావసిద్ధత వల్ల చాలా చురుగ్గా పరుగెడుతుంటారు. ఇక మాట్లాడినప్పుడు కూడా మాట పూర్తికావడానికి తగినంత దమ్ము అందుతుండదు. ఇలా జరిగినప్పుడు దాన్ని ఆస్తమాగా గుర్తుపట్టడానికి వీలవుతుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ పరీక్షలు మొదలైనవాటిని వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్లు చేయిస్తుంటారు. పైన పేర్కొన్న పరీక్షల ద్వారా ఆస్తమానా లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధి ఏమైనా ఉందా అని వారు నిర్ధారణ చేస్తుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానీయాలు, ఐస్‌క్రీములు తినకూడదు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉంచాలి కొన్ని జంతువుల విసర్జరకాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి పెయింట్ వంటి ఘాటైన వాసనలు, వివిధ రకాల స్ప్రేలు, దోమల నివారణకు ఉపయోగించే ఘాటైన వాసనలు వెలువరించే మస్కిటో రిపల్లెంట్స్ వంటివి పిల్లలకు సరిపడటం లేదని గుర్తిస్తే వాటిని వాడకూడదు. చికిత్స: హోమియో విధానంలో అలర్జీలకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలియం ద్వారా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియలో రోగనిరోధకశక్తిని పెంపొందించపజేసి, ఎలాంటి అలర్జిక్ ప్రతిచర్యనైనా శరీరం తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచే మందులు ఇస్తారు. ఇలా ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేయడం వల్ల ప్రతికూల పరిస్థితల్లోనూ పిల్లలు ఆరోగ్యంతో ఉండేలా చూడటం హోమియో విధానం ప్రత్యేకత. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ జనరల్ కౌన్సెలింగ్ నాకు కొన్ని పులుపు పదార్థాలంటే చాలా ఇష్టం. ఉదాహరణకు పులుసు కూరలు, చింతకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి వంటివి ఇష్టంగా తింటాను. అవి తిన్న వెంటనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. చాలా మంది డాక్టర్లను కలిస్తే ఇది అల్సర్ వల్ల కావచ్చని అంటున్నారు. నేను ఎప్పటికీ నాకు ఇష్టమైన వాటిని తినలేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఉపేంద్రనాథ్, సిరిసిల్ల పుల్లటి పదార్థాలు తినడం అన్నది అసిడిటీని పెంచడం మాత్రమే కాదు... ఒకవేళ కడుపులో అల్సర్స్ ఉంటే అవి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. మీరు నోట్లో నుంచి ఓరల్ ఎండోస్కోపీ చేయించుకుంటే... మీకు అల్సర్ ఉన్నా లేదా ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నా తెలుస్తుంది. మీరు మీ లేఖలో మీకు సరిపడని పదార్థాలు తింటే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయో, మీకు కలుగుతున్న ఇబ్బంది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు. మీరు ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు ఎండోస్కోపీ చేశాక... అల్సర్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే... పాంటాప్రొజోల్ లేదా ఒమెప్రొజోల్ మందులను సూచిస్తారు. నా వయసు 45 ఏళ్లు. నాకు కొద్ది రోజులుగా కుడి డొక్కలో నొప్పి వస్తోంది. కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గుతోంది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యా ఉండదు. చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. కొందరు ఇది తీవ్రమైన సమస్య కావచ్చని అంటుండటంతో ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - టి. రవికుమార్, ఒంగోలు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు గాల్‌బ్లాడర్‌లో రాయి ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొంత మందిలో మధ్యమధ్యలో నొప్పి కలగడం ద్వారా ఆ సమస్య బయటపడుతుంది. మీరు అల్ట్రా సౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవాలి. సీరమ్ అమిలేజ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో రాయి ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు సర్జన్‌ను సంప్రదించాలి. రాయి పరిమాణాన్ని బట్టి నిపుణులు తగిన శస్త్రచికిత్స మార్గాన్ని సూచిస్తారు. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్-ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. నేను మందులు వాడినప్పుడే నాకు రుతుక్రమం వస్తోంది. లేడీడాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్ఎస్హెచ్ పాళ్లు 50 ఇంటర్నేషనల్ యూనిట్స్/ఎమ్ఎల్ అన్నారు. దాంతో పాటు ఏఎమ్‌హెచ్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త శుక్రకణాల సంఖ్య నార్మల్‌గానే ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? - ధనలక్ష్మి, విశాఖపట్నం మీ కండిషన్‌ను ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఈ కండిషన్ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆటోఇమ్యూన్ పరీక్షలూ, ఫ్రాజైల్ ఎక్స్ క్రోమోజోమ్ పరీక్షలూ, డెక్సాస్కాన్ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. ఇలాంటి సమస్య ఉన్నవారు తమ సాధారణ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం (ఫిజికల్ ఫిట్నెస్) కోసం రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్-డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నందుకు మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైయొక్కఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్‌తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!
గైనకోమాజియా కౌన్సెలింగ్ గాటు లేకుండా గైనకోమాజియా చికిత్స సాధ్యమా? నా వయసు 23. నాకు మహిళల్లో ఉన్నట్లుగా రొమ్ములు పెద్దవిగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే చిన్న సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని సరిచేయవచ్చని చెప్పారు. సర్జరీ తర్వాత గాటు కనిపిస్తుంది కదా అంటే అది చాలా చిన్న గాటు అని చెప్పారు. ఎలాగూ రొమ్ములు పెద్దగా ఉన్నందున మొదట షర్ట్ విప్పలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకున్నా గాటు వల్ల షర్ట్ విప్పలేను కదా అనిపిస్తోంది. నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా? - వినోద్, జనగామ కొందరు యువకుల్లో మహిళల్లాగా పెద్ద పెద్ద రొమ్ములు రావడం వారిని న్యూనతకు గురిచేస్తుంటుంది. దీంతో వారు మానసిక సమస్యలు లేదా డిప్రెషన్ బారిన పడుతుంటారు. స్నేహితులతో కలవలేరు. యువకుల్లో రొమ్ములు పెరిగే ఈ సమస్యను గైనకోమాజియా అంటారు. ఈ కండిషన్ ఎందుకు వస్తుందనే విషయంపై అంతగా అవగాహన లేదు. అయితే మూత్రం ఎక్కువగా పోవడానికి వాడే డైయూరెటిక్స్ మందుల వాడకం వల్ల, అతిగా మద్యం తాగే కొందరిలో ఇలా రొమ్ములు పెద్దవిగా మారతాయి. మరికొందరిలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. స్థూలకాయుల్లోనే కాకుండా బాగా సన్నగా ఉన్నవారిలోనూ కొందరిలో ఈ సమస్య రావచ్చు. అయితే దీన్ని చక్కదిద్దడానికి చాలా మార్గాలు (టెక్నిక్స్) అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా మామూలు చర్మం, నిపుల్ వద్ద రంగు మారే చర్మం వద్ద చిన్న గాటు పెట్టి అదనపు కొవ్వును తీసేసి, మళ్లీ కుట్టడం ఒక టెక్నిక్. దీనివల్ల సాధారణ చర్మం, రంగుమారే చర్మం జంక్షన్లో (ఏరియోలా అంచున) గాటు పెడతారు. కాబట్టి అది అంత ప్రస్ఫుటంగా కనిపించదు. అయితే ఈ చిన్నపాటి గాటు కూడా కనిపించడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు మరో టెక్నిక్ కూడా అభివృద్ధి చేశారు. ఈ టెక్నిక్‌లో నిపుల్, దాని చుట్టూ ఉండే రంగు మారేచోట ఉండే గ్రంధితో పాటు, మిగతా భాగంలో ఉండే కొవ్వు... ఈ రెండింటినీ తొలగిస్తారు. అంటే ఒకరకంగా చూస్తే ఇది లైపోసక్షన్, సర్జరీ... ఈ రెండూ కలిసిన ప్రక్రియ అన్నమాట. లైపోసక్షన్ ద్వారా రొమ్ము ప్రాంతంలోని కొవ్వును తొలగించడాన్ని చంకలోంచి చేస్తారు. ఈ గాటు చంకలో ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. అలాగే రొమ్ము ఉబ్బుగా కనిపించేలా చేసే గ్రంథిని సరిగ్గా రొమ్ము మధ్యన గాటు పెట్టి తీస్తారు. ఈ సరికొత్త టెక్నిక్ వల్ల అసలు సర్జరీ చేసిన గుర్తు గానీ, లైపోసక్షన్ చేసిన గాటుగానీ కనిపించవు. కాబట్టి యువత అభిరుచి మేరకు వారికి నచ్చేలా ఈ టెక్నిక్ ఉంటుంది. జనరల్ కౌన్సెలింగ్ నిద్రలో పిక్కలు పట్టేస్తున్నాయి..! రాత్రివేళ్లల్లో నా పిక్కలు పట్టుకుపోతున్నాయి. దాంతో నిద్రాభంగమై మధ్యలోనే నిద్రలేస్తున్నాను. ఎంత బాధగా ఉంటుందో వర్ణించలేను. చాలాసేపు కుంటుతూ నడిచాక కాస్త చక్కబడుతుంది. మళ్లీ నిద్ర కోసం పక్కమీదికి ఒరగగానే మళ్లీ పిక్కలు పట్టుకుబోతాయి. దాంతో గంటలు గంటలు నిద్రలేక బాధపడుతున్నాను. ఈ మజిల్క్రాంప్స్ తగ్గడానికి తగిన సలహా ఇవ్వండి. - టి. వెంకటేశ్వర్లు, నర్సంపేట మీలా కండరాలు పట్టేసి చాలా బాధపడే లక్షణాలు కనిపించేవారిలో అందుకు కారణాలు చాలా ఉంటాయి. ఒకవేళ మీరు డయాబెటిస్ అయి మీలో చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోకపోయినా ఇలా జరగవచ్చు. ఇక సాధారణంగా మన శరీరంలో ద్రవాలు తగ్గి, తద్వారా పొటాషియమ్ లోపించడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒక్కోసారి విటమిన్ బి12 లోపం వల్లగానీ లేదా థైరాయిడ్ సమస్య వల్లగానీ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. మీ సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం ముందుగా జరగాల్సిన పని. ఆ కారణాన్ని బట్టి చికిత్స చేస్తే మీ సమస్య నయమవుతుంది. నా వయసు 40. రాత్రివేళల్లో నిద్రపట్టదు. చాలా కష్టమ్మీద ఉదయం వేళలో కాస్త నిద్రపడుతుంది. ఇలా సూర్యోదయానికి ముందు నిద్రపట్టడం వల్ల ఉదయం పది, పదకొండు గంటల వరకు నిద్రపోతున్నాను. దాంతో నా పనులు చాలా చెడిపోతున్నాయి. ఒక డాక్టర్గారిని కలిసి నా సమస్య వివరిస్తే కొన్ని నిద్రమాత్రలు ఇచ్చారు. అవి వేరే సందర్భంలో మరో డాక్టర్ గారికి చూపిస్తే, ఆయన వాటిని చూసి, అవి ఫిట్స్ రోగులకు ఇస్తారని, వాటిని వాడవద్దని సూచించారు. దాంతో నేను అయోమయంలో పడిపోయాను. నేనిప్పుడు ఆ మాత్రలు వాడాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఈ విషయంలో నేను ఏ నిపుణుడిని కలవాలో తగిన సలహా ఇవ్వండి. - సుకుమార్, నిజామాబాద్ మీరు రాసిన లేఖలో మీరు వాడుతున్న టాబ్లెట్ల పేరు రాయలేదు. నిద్ర కోసం ప్రిస్క్రయిబ్ చేసే మందుల్లో కొన్నింటిని తలనొప్పి కోసం లేదా ఫిట్స్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. మీకు రాసిన మందులు మీరు ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోడానికి ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఈరోజుల్లో నిద్రలేమి సమస్యను చక్కదిద్దడానికి సురక్షితమైన చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల అవి అలవాటు కావు, వాటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి కూడా రాదు. అయితే మీ వ్యాధిచరిత్ర, మీ లక్షణాలు, ఇతరత్రా అంశాలు పరిశీలించాక మీకు తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను కలిసి మీకు తగిన మందులు రాయించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మెడనొప్పి భుజానికీ పాకుతోంది..! నా వయసు 27. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ప్రసేన్, హైదరాబాద్ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ అనుసరణీయం కాని భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరిస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొని పనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి.ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నాలుగేళ్లుగా సంతానలేమి... పరీక్షలేమైనా చేయించాలా? నా వయసు 30. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. గత నాలుగేళ్లుగా మేం గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. అయినా ఫలితం లేదు. మేము ఏదైనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకని నాకు ఇంకా గర్భం రావడం లేదు? దయచేసి వివరించండి. - సుశాంతి, హైదరాబాద్ మీ విషయంలో ఒకసారి మీరూ, మీతో పాటు మీ భర్త కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం ఎందుకు రావడం లేదనే కారణం తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సంతానలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒవ్యూలేటరీ డిజార్డర్స్, వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబుల్లో లోపాలు... ఇలా అనేక సమస్యల వల్ల సంతానలేమి కలగవచ్చు. ఒక్కోసారి పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నా సంతానం కలగకపోవచ్చు. అప్పుడు కారణాలేమిటో కూడా తెలియదు. దీన్నే ‘అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. ఇక సంతానలేమితో బాధపడే దంపతుల్లోని 40 శాతం కేసుల్లో ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు. కాబట్టి లోపం ఎక్కడుందో తెలుసుకోడానికి మీరిద్దరూ ఒకసారి కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. నా వయసు 40. నా భార్య వయసు 35. మాకు ఇద్దరు పిల్లలు. ఒకసారి ఈతకు వెళ్లి ఇద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా నా భార్య లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ట్యూబెక్టమీ చేయించుకుంది. ఇప్పుడు మాకు పిల్లలు కావాలని ఉంది. మాకు సంతానం కలిగే అవకాశం ఉందా? - ఒక సోదరుడు, కర్నూలు మొదట మీరిద్దరూ కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వీర్యపరీక్ష కూడా అవసరమవుతుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఇక మీ భార్య విషయానికి వస్తే ఆమె అండాల వద్దకు వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలించాలి. అవసరమైతే ట్యూబల్ కన్స్ట్రక్షన్ అనే శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ఆమెలో అండం ఉత్పత్తి సరిగా ఉంటే స్వాభావిక పద్ధతిలోనే మీరు సంతానం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీ భార్య విషయంలో ట్యూబల్ సర్జరీ విజయవంతం కాకపోయినా లేదా అండం విడుదల సరిగా లేకపోయినా లేదా మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) అనే ప్రక్రియను ఆలోచించవచ్చు. ఈరోజుల్లో సంతానలేమికి మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను కలవండి. -
సర్వం సిద్ధం
సాక్షి, చెన్నై : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఉన్నత విద్యావిధానం మేరకు ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియను ప్రతి ఏటా అన్నావర్సిటీ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రంలోని 538 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కోటా సీట్లు రెండు లక్షలకు పైగా ఉన్నాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి ప్రతి ఏడాది వలే ఈ సారి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. కొన్నేళ్లుగా దరఖాస్తుల పర్వానికి స్పందన కరువు అవుతుండడంతో సీట్ల భర్తీ పూర్తి స్థాయిలో జరిగేది అనుమానంగా మారింది. ఈ ఏడాది 1.90 లక్షల దరఖాస్తులు విక్రయించగా, 1.54 లక్షల దరఖాస్తులు తిరిగి వచ్చాయి. ఈ దరఖాస్తులకు ర్యాండం నెంబర్లను ప్రకటించారు. ప్లస్‌టూ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితా వెలువడింది. ర్యాండం నెంబర్ల ఆధారంగా విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించే పనిలో అన్నావర్సిటీ ప్రత్యేక విభాగం వర్గాలు నిమగ్నం అయ్యాయి. సర్వం సిద్ధం: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పర్వం ఆరంభం అవుతుండడంతో విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు, వివరాలు, సీట్ల సంఖ్య, తదితర అంశాలను విద్యార్థులకు వివరించే రీతిలో అక్కడక్కడ ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, పలు బ్యాంక్‌లకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు అయ్యాయి. విద్యార్థుల సౌకర్యార్థం క్యాంటీన్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. పోలీసు బూత్, అగ్నిమాపక వాహనాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో తెలియజేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక, సుదూర ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో రాయితీ ప్రకటించి ఉన్నారు. అలాగే, చెన్నై కోయంబేడు బస్టాండ్, తాంబరం పరిసరాల నుంచి అన్నా వర్సిటీ మీదుగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి కౌన్సెలింగ్: ఆదివారం నుంచి కౌన్సెలింగ్ పర్వం ఆరంభం కానున్నది. తొలి రెండు రోజులు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. తొలుత వికలాంగుల కోటా, తదనంతరం క్రీడా కోటా సీట్ల భర్తీ నిర్వహిస్తారు. అనంతరం మాజీ సైనికోద్యుగుల పిల్లలకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. చివరగా జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగుతుంది. ఈ ఏడాది సీట్ల సంఖ్య అధికంగా ఉండడం, దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో అందరికీ సీట్లు దక్కడం ఖాయం. అయితే, ప్రధాన కళాశాలల్లో కీలక కోర్సుల సీట్లను కైవసం చేసుకోవడంలోనే విద్యార్థుల మధ్య పోటీ సాగనుంది.