Geographical conditions
-
సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి..
ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది.. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. ‘మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..‘ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణ ‘క’సినిమాలోనిదని మీకీ పాటికే అర్థమై ఉంటుంది. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఊరే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురపాక గ్రామం. రీల్స్, వీడియోలతో ఇప్పుడా ఊరు నెట్టింట సందడి చేస్తోంది. – సాక్షి, పెద్దపల్లినాలుగు గుట్టల మధ్య.. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం నాలుగు గుట్టల మధ్య.. హుస్సేనిమియా వాగు చెంత.. పచ్చని ప్రకృతి నిలయంగా ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకులు గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్య భౌగోళిక పరిస్థితులను గమనించిన శాతవాహనులు ఈ ఊరు వెలుపల నంబులాద్రీశ్వరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. గ్రామ ప్రత్యేకతను శిలాఫలకంపై చెక్కించారు. ఆలస్యంగా ఉదయం.. తొందరగా సాయంత్రం.. సాధారణంగా 3 గంటలకు ఒక్కజాము చొప్పున రోజులో మొత్తం 8 జాములుంటాయి. పగటిపూట నాలుగు, రాత్రిపూట నాలుగు జాములుగా లెక్కిస్తారు. తూర్పున ఉన్న గొల్లగుట్ట ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కునున్న రంగనాయకులు గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో కొండల నీడతో ఈ గ్రామాన్ని చీకటి తొందరగానే అలుముకుంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రాత్రితో కలిసిపోతుండటంతో పగటి సమయం తగ్గిపోతోంది. దీంతో ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాకగా పిలుస్తున్నారు. ఆ ఊరికి సాయంత్రం జాము లేకపోవడంతో.. సాయంత్రం 4 గంటలకే ఇళ్లలో దీపాలు, వీధి దీపాలు వెలిగించాల్సి వస్తోంది. దేవుడు లేని ఆలయం ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రంగనాయకులు గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. దీంతో ప్రతీ దసరాకు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం నుంచి నంబులాద్రి నరసింహస్వామిని రథయాత్రతో తీసుకొచ్చి.. ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత తిరిగి దేవునిపల్లికి తీసుకెళ్తారు. దీంతో ఏడాదిలో ఆ ఒక్కరోజే ఆ గుడిలో వేడుకలు నిర్వహిస్తారు.పర్యాటకంగా అభివృద్ధి చేయాలి మా గ్రామాన్ని చూడటానికి ఎంతోమంది ఎక్కడినుంచో వచ్చి పోతున్నారు. వచ్చిపోయే వారికి గ్రామంలో సౌకర్యాలు కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – బాలాజీరావు, స్థానికుడు నలుదిక్కులా గుట్టలు మా ఊరుకు నలుదిక్కులా గుట్టలు ఉండటంతో ఉదయం ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. తొందరగానే సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో సాయంత్రం 4 గంటలు దాటిందంటే ప్రతీ ఇంట దీపం వెలిగించుకోవలసిందే. – రాజగౌడ్, స్థానికుడు -
ఆ నగరాల్లో.. కరోనా కమ్మేసింది ఇలా..
కరోనా రక్కసి నగరాలకు ఊపిరాడనివ్వడం లేదు. అత్యధిక జనసాంద్రత, వాణిజ్య కార్యకలాపాలు, భౌతిక దూరం పాటించడానికి అవకాశం లేని పరిస్థితి ఉండడంతో కోవిడ్ కాటేస్తోంది. ప్రపంచంలో అత్యధిక కోవిడ్–19 కేసులు నమోదైన అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా వాణిజ్య కార్యకలాపాలు జరిగే నగరాలే కోవిడ్ దెబ్బకి అల్లాడిపోతున్నాయి. అమెరికాలో న్యూయార్క్, స్పెయిన్‌లో మాడ్రిడ్, ఇటలీలో మిలన్, బ్రిటన్‌లో లండన్, ఫ్రాన్స్‌లో పారిస్ ఇలా ఏ నగరాన్ని చూసుకున్నా కరోనా విధ్వంసం సృష్టించింది. కరోనా వ్యాప్తి కరోనా వైరస్ దాడి చేయడం మొదలు పెట్టాక అన్ని చోట్లా ఒకే మాదిరిగా వ్యాపించడం లేదు. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, లాక్డౌన్ అమలు తీరుతెన్నులు, యువ జనాభా, వృద్ధజనాభాలో ఉన్న తేడాలు, ప్రజల్లో రోగనిరోధక శక్తి, వైద్య సదుపాయాలు వంటివెన్నో కరోనా వ్యాప్తిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. న్యూయార్క్, మాడ్రిడ్ వంటి నగరాల్లో కరోనా ఎప్పుడు మొదలైంది, ఎలా వ్యాప్తి చెందింది అన్నది పరిశీలించి చూస్తే ఆ రెండు నగరాల్లో కరోనా తీవ్రంగా మొదలై కొద్ది రోజుల్లోనే అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకొని (ఒక్క రోజులోనే కేసుల సంఖ్యలో రెట్టింపు కావడం) ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలు పెట్టింది. కేసులు నమోదైన రోజు దగ్గర్నుంచి 12 రోజుల్లో్లనే తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య బాగా తగ్గడానికి నెలరోజులు పట్టింది. భారత్‌లో నగరాల పరిస్థితి ఏంటి ? దేశ వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీలను కరోనా భయపెడుతోంది. తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి ఇప్పటివరకు రోజువారీగా నమోదైన కేసుల తీరుని విశ్లేషించి చూస్తే కేసులు ఉన్నట్టుండి పెరగడం, తగ్గడం, మళ్లీ పెరుగుతూ వచ్చి తగ్గడం ఇలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో ముందస్తుగానే లాక్డౌన్ ప్రకటించింది. ఢిల్లీలో తొలి కేసు నమోదైన 19 రోజుల తర్వాత కేసులు కాస్త నెమ్మదించాయి. భారీగా కేసుల్లో తగ్గుదల కనిపించకపోయినా నిలకడగా నమోదవుతున్నాయి. అదే ముంబైని తీసుకుంటే తొలి కేసు నమోదైన తర్వాత అయిదారు రోజులు కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి మళ్లీ తీవ్రస్థాయిలో పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో తగ్గుతూ వచ్చిన కేసులు రెండో వారం తర్వాత మళ్లీ పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. జనాభాతో కిటకిటలాడే ముంబైలో కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ముందు ముందు ఎలా ఉంటుందన్న ఆందోళనైతే నెలకొంది. ఈ రెండు నగరాలతో పాటు అహ్మదాబాద్, ఇండోర్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. మన దేశంలో మే 11వ తేదీ తర్వాత కోవిడ్ కేసులు తీవ్ర స్థాయికి చేరుకొని నెలాఖరు నుంచి తగ్గుముఖం పడుతుందన్న అంచనాలైతే ఉన్నాయి. సాధారణంగా ఏ దేశాన్నయినా కరోనా మహమ్మారి 70 నుంచి 80 రోజుల పాటు పీడించాక గానీ తగ్గుముఖం పట్టడం లేదని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. -
నీటి చుక్క మనిషి జీవితానికి చుక్కాని
సందర్భం భిన్నత్వంలో ఏకత్వం... మన నినాదం. ప్రకృతి ఇచ్చిన భిన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయులంతా కలిసి జీవించడమే మన జాతీయత. సగటు భారతీయ గ్రామీణ మహిళ జీవితంలో ఒక రోజు... ఎలా గడుస్తోంది అని గమనిస్తే మంచినీటి సేకరణలో గడిచిపోతున్న గంటలే ఎక్కువ. నీటిలభ్యత కొరవడిందా లేక లభించిన నీటిని పరిరక్షించుకోవాలనే స్పృహ కొరవడిందా అంటే రెండోదే అసలైన సమాధానం అంటున్నారు నీటి వనరుల మీద అధ్యయనం చేస్తున్న నిపుణులు. వర్షపునీటిని భద్రపరుచుకోవడంలో ఆధునిక మానవుడు విఫలమవుతూండడమే ఇందుకు కారణం. ప్రపంచం అంతా పర్యావరణ పరిరక్షణ కోసం ఎలుగెత్తి చాటాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతి పచ్చగా ఉంటే పర్యావరణం చల్లగా ఉంటుంది. చెట్టును కొట్టేసి ఎత్తై భవనం కట్టడానికి, పాతాళంలోని నీటిని వెలికి తీసి వాటర్ టేబుల్ని చిన్నాభిన్నం చేయడానికి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న నేటి మానవుడిని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తూనే ఉంది. పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఏడాదికో నినాదంతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తోంది. ‘గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టి సముద్రాలు పొంగకుండా నివారిద్దాం, భూగోళాన్ని ముంచెత్తే ప్రమాదాన్ని అరికడదాం’ అని గగ్గోలు పెడుతూనే ఉంది. కరుగుతున్న మంచుకొండల్ని కరగకుండా ఆపడంతోపాటు ఇంకిపోతున్న నీటి చుక్కను పదిలంగా కాపాడుకోవడమూ అవసరమే. ఈ నేపథ్యంలో ఆధునిక విజ్ఞానాన్ని ప్రతి వర్షపు చుక్కనీ పదిలపరుచుకోవడానికి వినియోగించమని సూచిస్తున్నారు జాతీయ వర్షపునీటి నిర్వహణ సంస్థ డెరైక్టర్ ఎ.కె. మెహ్రా. దేశంలో ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటిని అందించే ప్రయత్నాలు పూర్తి కానేలేదు. ఈ లోపే బిందెడు నీళ్లు దొరికితే చాలనే పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలో నీటిమట్టాన్ని పెంచాలని (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ) ఆయన గుర్తు చేస్తున్నారు. (రేపుప్రపంచ పర్యావరణ దినోత్సవం)