gidugu
-
పెద్దనోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదలచేయాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అమలాపురం టౌన్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత నల్ల ధనాన్ని వెనక్కి తీసుకోగలిగింది...? తదితర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండు చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నగదు కష్టనష్టాలకు నిరసనగా ఈనెల 6 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ పలు రూపాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరినా ఇవ్వకుండా ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. ప్రజల ఇబ్బందులకు నిరసనగా కాంగ్రెస్ ఉద్యమం మాదిరిగా పలు దశల్లో పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టనుందన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఘెరావ్‌లు, ముట్టడి, ధర్నాలు వంటి నిరసనలు చేపట్టనున్నామన్నారు. అలాగే 9న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖాళీ కంచాల ప్రదర్శనతో నిరసన తెలపనున్నారని వివరించారు. విత్ డ్రాలపై ఉన్న పరిమితులు తక్షణమే ఎత్తి వేయాలని రుద్రరాజు డిమాండు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శి కల్వకొలను తాతాజీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బాబుకు జన్మనిచ్చింది కాంగ్రెస్సే : గిడుగు
మండపేట : సీఎం చంద్రబాబుకు రాజకీయంగా జన్మనిచ్చి, ఓనమాలు దిద్దించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీని విమర్శించే అర్హత ఆయనకు లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు విమర్శించారు. స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆదివారం పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగింది కాంగ్రెస్పార్టీలోనేనన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ పని అయిపోందనడాన్ని గిడుగు, కామనలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పచ్చి మోసకారని, పేదల జీవితాలను కార్పొరేట్ శక్తులకు పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు విషయం ముందుగానే తెలుసుకుని వారి ఆస్తులను కాపాడుకున్నారన్నారు. -
బాబు ఇచ్చిన 600 హామీలపై నిలదీయండి
కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్లో ఆలోచించి ఓటేయండి ప్రజలకు రుద్రరాజు సూచన అమలాపురం టౌ¯ŒS : చంద్రబాబు 2014 ఎన్నికల్లో తమ ఎన్నికల మేనిఫేస్టోలో 600 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లయినా ఆ హామీలను అమలు చేయలేదని, ఆ అంశంపై టీడీపీ జన చైతన్య యాత్రలో మీ ముందుకు వచ్చే నాయకులను నిలదీయండని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీబీ మహేశ్వరరావు, పీసీసీ నాయకులతో కలిసి గురువారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా? వద్దా? చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు అమలయ్యాయా? లేదా? అనే రెండు ప్రశ్నలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్లో ప్రజలు ఆలోచించి మరీ ఓట్లు వేయాలని రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజా బ్యాలెట్లు తొలుత జిల్లా కేంద్రాలు, తర్వాత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో కూడా దశల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతిలో ప్రజాబ్యాలెట్ నిర్వహించామని, ఈనెల 7న కర్నూలులో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మన జిల్లాలోనూ ప్రజా బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఓ మాజీ సైనికుడు ఆత్యహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని పీపీపీ ఉపాధ్యక్షుడు బుచ్చి మహేశ్వరరావు ఖండించారు. 19 నుంచి ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వందో జయంతి ఈనెల 19న జరుగుతోందనిరుద్రరాజు తెలిపారు. 19వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 19 వరకూ ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాదంతా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఇందిరాగాంధీ పేరును కొనసాగించాలని ఆయన డిమాండు చేశారు. పీసీసీ నాయకులు కల్వకొలను తాతాజీ, అయితాబత్తుల సుభాషిణి, సత్తి బాపూజీ, ములపర్తి సత్యనారాయణ, విప్పర్తి మాధవరావు, కొత్తూరి శ్రీను, షహె¯ŒS షా, ఎండీ ఆరీఫ్, డీసీసీ నాయకులు కోడూరి బాబి, కుడుపూడి శ్రీను, తిక్కా ప్రసాద్, అడపా మాచరరావు తదితరులు పాల్గొన్నారు.