girl education
-
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్‌లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్‌లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
ఆమె అక్షర... లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం. వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది. అబ్బురపరిచే అంకెలు ► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్‌కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్‌లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107. ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్ దాదాపు రివర్స్ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం. ► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. పరిశోధనల వరకూ వెళ్ళాలి మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ సాధికారత సాధించాలి విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు, ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులేయాలి విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్‌లో ప్రత్యేక కోర్సును డిజిటల్ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. – ప్రొఫెసర్ కవిత దార్నా, వీసీ, జేఎన్ఎఫ్ఏ విధాన నిర్ణేతలుగా ఎదగాలి చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్ జాబ్స్‌లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. – సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్ యూనివర్సిటీ -
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
పేదిళ్లలో పెళ్లి సందడి..బాలికల విద్యకూ ప్రోత్సాహం!
సాక్షి, అమరావతి: పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే శనివారం విడుదలైన జీవోలో పథకం విధివిధానాలు వెల్లడిస్తూ.. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. ఈ నిబంధనకు 2024 వరకు మినహాయింపు లేదని పేర్కొంది. పేద బాలికల వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా బాలికల విద్యను ప్రోత్సహించడానికే ఈ నిబంధనను విధించింది. బాలికలు కోరుకున్న విద్యా స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించడంలో భాగంగా అర్హతల్లో దొర్లిన తప్పును సరిచేశారు. తద్వారా అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లైందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. పేద వర్గాల చదువుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు–నేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించడం అన్నది తప్పనిసరి చేయడం వల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా రంగం, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు. అన్ని వర్గాల్లోనూ ఆనందం ‘పెళ్లి చేయాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలు పడాలో నాకు తెలుసు. అదే పేదోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఆనందం మాటేలా ఉన్నా అప్పుల తిప్పలు తప్పవు. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. అని పెద్దలు అనేవారు. అలా అప్పులపాలు కాకుండా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా ప్రభుత్వం అమలు చేయనున్న కళ్యాణమస్తు పథకం అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆడ పిల్ల ఉన్న ప్రతి పేదింట్లో పెళ్లి సందడి తేనుండటం పట్ల ఆడపిల్ల తల్లిగా చాలా ఆనందంగా ఉంది’ అని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గృహిణి దేవకి ముద్రబోయిన ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు, వికలాంగుల కుటుంబాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేద ఆడపిల్లల కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు ఈ పథకాలు తోడ్పడనున్నాయి. ఇక అప్పుల ఊబిలో ఇరుక్కోరెవరూ.. అనేక కుల వృత్తులపై ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల్లో పెళ్లి చేయాలంటే పడే కష్టాలు వర్ణనాతీతం. బీసీల్లో చాలా మంది తమ ఆడబిడ్డ కాపురం బాగుండాలని అప్పోసప్పో చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. నగా నట్రా, దుస్తుల కొనుగోలు, ఏర్పాట్లు తదితరాలకు అప్పు చేయక తప్పని పరిస్థితి. పేదలు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాలను ప్రకటించడం గొప్ప విషయం. గతంలో చంద్రబాబు హడావుడిగా రూ.35 వేలు ప్రకటించారు కానీ, అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీని ఆచరణలో చూపిస్తూ రూ.50 వేలు అందించనున్నారు. బీసీ కులాంతర వివాహాలకు చంద్రబాబు ఆరంభ శూరత్వంగా రూ.50 వేలు ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ రూ.75 వేలు అందించనుండటం అభినందనీయం. బీసీలు పెళ్లి పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఈ పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. – వేముల బేబీరాణి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీ బీసీ సంఘం ఎస్సీల ఇంట నిజమైన పెళ్లి సందడి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండే ఎస్సీల ఇంట్లో పెళ్లి చేయడం అంటే చాలా భారం. ఎస్సీల ఇళ్లలో పెళ్లికి చందాలు, అప్పులు చేయక తప్పని దయనీయ స్థితి గతంలో ఎక్కువ. ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. అంబేడ్కర్ మహనీయుడి రాజ్యాంగంతో ఎస్సీలు అనేక రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే వైఎస్సార్ పుణ్యమా అని ఆర్థికంగా ఊతమిచ్చారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఎస్సీల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు ఎస్సీల పెళ్లికి రూ.40 వేలు, కులాంతర వివాహానికి రూ.75 వేలు ప్రకటించి అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలోకి తెచ్చేలా కళ్యాణమస్తు ద్వారా ఎస్సీలకు రూ.లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలు ప్రకటించడం గొప్ప విషయం. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, పీవీరావు మాల మహానాడు గిరిజనులకు గొప్ప వరం అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో జీవించే గిరిజనులు దాదాపు అందరూ నిరుపేదలే. బతుకుదెరువే కష్టమనుకునే తరుణంలో వారింట్లో పెళ్లి తంతు మరీ కష్టం. చాలా మంది గిరిజనులు పెళ్లి ఖర్చులకు కూడా లేక అవస్థలు పడేవారు. అటువంటి వారికి కళ్యాణమస్తు పేరుతో సీఎం వైఎస్ జగన్ గొప్పవరం ఇచ్చారు. గత ప్రభుత్వం గిరిజనుల పెళ్లికి రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు ప్రకటించి మమ అన్పించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ ఎస్టీల పెళ్లికి రూ.1 లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 అందించనుండటం అభినందనీయం. – వడిత్యా శంకర్ నాయక్, గిరిజన నాయకుడు గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితం గత ప్రభుత్వం ఆర్భాటం జాస్తి.. ఆచరణ నాస్తి అనే రీతిలో వ్యవహరించింది. ఎన్నికల ముందు హడావుడిగా పథకాలను ప్రకటించిన చంద్రబాబు వాటిని అమలులోకి తేకుండా కాగితాలకే పరిమితం చేశారు. కానీ, మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా అత్యంత పవిత్రంగా భావించిన సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాన్ని ప్రకటించడం గొప్ప విషయం. మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దడంలో సీఎం వైఎస్ జగన్ చేతల్లో మరోసారి చూపించారు. మైనార్టీలకు చంద్రబాబు రూ.50 వేలు ప్రకటించి ఇవ్వకపోగా, సీఎం వైఎస్ జగన్ ఏకంగా రూ.లక్షకు పెంచి అందించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం. – షేక్ మునీర్ అహ్మద్, కన్వీనర్, ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లికి భరోసా నిర్మాణ రంగంలో సర్వశక్తులు ధారపోస్తూ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భవన నిర్మాణ కార్మికులు తమ ఇంట్లో పెళ్లికి అప్పులపాలు కాకుండా భరోసా ఇచ్చారు. కళ్యాణమస్తు పథకం ద్వారా రూ.40 వేలు అందించేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటించి దరఖాస్తు చేసుకొమ్మని చెప్పిందే కానీ ఆర్థిక సాయం అందించలేదు. భవన నిర్మాణ కార్మికులకే కాకుండా దివ్యాంగులకు సైతం అండగా నిలిచేలా వారి పెళ్లికి రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. – తాళం మావుళ్లు, భవన నిర్మాణ కార్మికుడు, మహాదేవపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బలహీన వర్గాలకు గొప్ప వరం వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం బలహీన వర్గాలకు గొప్ప వరం అని ఏపీ బీసీ సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల హామీని ఆచరణలోకి తేస్తూ గొప్ప పథకాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ బీసీ సంఘ రాష్ట్ర సమావేశం తీర్మానం చేసింది. విజయవాడలోని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాధీ తోఫా పథకాలు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన కార్మికుల కుటుంబాలకు ఒక భరోసా ఇస్తాయన్నారు. ఈ వర్గాలు అప్పులపాలు కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా సీఎం వైఎస్ జగన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తమ్మిశెట్టి రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితా అజయ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కరణం అశోక్ మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఫథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖ్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లిం మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, మాజీ వుడా చైర్మన్ రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని వివిధ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సీట్ల కేటాయింపు ఈ విద్యాసంవత్సరం నుంచి మారనుంది. ఇప్పటివరకు అన్ని ఐఐటీల్లోని సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది మాత్రం ఈ విధానాన్ని తొలగించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన మహిళల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే 20 శాతం కోటా సీట్లను నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల ఈ మార్పులను ప్రకటించింది. అర్హులైన మహిళా అభ్యర్థుల అందుబాటును అనుసరించి సూపర్ న్యూమరరీ సీట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆయా ఐఐటీలకు కల్పించింది. ఐఐటీల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు 2018 నుంచి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐఐటీల్లోని మొత్తం సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో కేవలం మహిళలకు కేటాయించేలా అదనపు సీట్లను ఏర్పాటు చేయించింది. 2018–19లో 14 శాతం సీట్లను ఇలా కేటాయించగా, 2019–20లో ఈ సంఖ్యను 17 శాతానికి పెంచింది. 2020–21లో దీనిని 20 శాతం చేసింది. ఇక 2021–22 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆయా ఐఐటీలే ఈ 20 శాతం కోటాపై నిర్ణయం తీసుకునేలా చేసింది. గత ఏడాది కరోనా వల్ల జేఈఈ మెయిన్‌లో అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రాయలేకపోయారు. వారికి ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నేరుగా రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. వీరు గత ఏడాది జేఈఈ మెయిన్ అర్హతతోనే ఈ అడ్వాన్స్‌డ్‌ను రాసే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.50 లక్షల మందికి వీరు అదనం. ఈ కారణంగానే మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపును ఆయా ఐఐటీలకు అర్హత సాధించే మహిళల సంఖ్యను అనుసరించి నిర్ణయం తీసుకునేలా కొత్త మార్పు చేశారు. గత ఏడాదిలో అర్హులైన మహిళలు లేకపోవడం వల్ల పలు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా సీట్లు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. కొన్ని ఐఐటీల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నా సూపర్ న్యూమరరీ కోటాను అనుసరించి సీట్లకేటాయింపు చేశారు. ఈనేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా ఈసారి మార్పులు చేశారు. టాప్ 100 అభ్యర్థులకు పూర్తి రాయితీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన వారిలో మొదటి 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్లు తమ ఐఐటీలో చదువులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కాలర్షిప్ కింద అందించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఫుల్ స్కాలర్‌షిప్‌నకు అర్హులని వివరించింది. ‘పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫుల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈఈ ర్యాంకర్స్’ పేరిట అందించనుంది. దీనికింద ఇనిస్టిట్యూషన్ ఫీజు, వసతి భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు ఇతర వ్యయాలను కూడా ఐఐటీయే భరిస్తుంది. వీటితోపాటు ప్రతినెలా పాకెట్ మనీ కూడా అందిస్తుంది. -
21వ శతాబ్దపు పౌరులకు టీచర్‌ను!
రంజిత్ సిన్హ్ దిశాలె...ఇంజనీర్ కాలేకపోయిన ఒక ఉపాధ్యాయుడు. విద్యాబోధనలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు. పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేశారు. విద్యార్థుల మాతృభాషలో వీడియోలు, ఆడియోలు తెచ్చారు... బాలికల హాజరును నూరు శాతానికి పెంచారు. ఈ పద్ధతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఆ తర్వాత... కేంద్రప్రభుత్వం కూడా. ఈ సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సిన్హ్... గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్నారు. మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లా, పరేటి వాడీ అనే చిన్న గ్రామం. అందులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల లో ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిశాలె. ఆయన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 పురస్కారానికి ఎంపికయ్యారు. 140 దేశాల నుంచి వచ్చిన పన్నెండు వేల ఎంట్రీలలో రంజిత్ విజేతగా నిలిచారు. గురువారం నాడు లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ నటుడు, ప్రసారకర్త స్టీఫెన్ ఫ్రై అవార్డు ప్రకటించిన వెంటనే రంజిత్ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. విద్యాబోధనలో సాంకేతికతను జోడించి విద్యార్థులను మంచి విద్యనందించిందుకు గాను రంజిత్‌కి ఈ గౌరవం లభించింది. బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది! అతడు పని చేసే పాఠశాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండేది. వాళ్లను బడికి రప్పించాలంటే పాఠాలతో వాళ్లను అలరించడమే మార్గం అనుకున్నారాయన. పాఠాలను దృశ్య, శ్రవణ విధానంలో రికార్డు చేశారు. పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించడం ద్వారా పిల్లలందరికీ పాఠాలు చేరేటట్లు చేశారు. దాంతో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎనభై ఐదు శాతం మంది ‘ఏ’ గ్రేడ్‌లో పాసయ్యారు. రెండు శాతం ఉన్న బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఇప్పుడు బాల్య వివాహాల్లేవు. రంజిత్ సాధించిన ప్రగతిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రం మొత్తం క్యూఆర్ కోడ్ సాంకేతికతను దత్తత చేసుకుంది. ఆ తర్వాత భారత విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) ద్వారా ఈ విధానాన్ని అవలంబించింది. ఈ సాంకేతిక విప్లవం ఇంతటితో ఆగిపోలేదు. దేశం సరిహద్దులు దాటింది. పాకిస్థాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యూఎస్, నార్త్ కొరియా కూడా అనుసరించాయి. మొత్తం 19 వేల మంది విద్యార్థులను అనుసంధానం చేశారు రంజిత్ సిన్హ్. ఆయన అందుకుంటున్న గ్లోబల్ టీచర్ ప్రైజ్ వెనుక ఇంతటి కఠోరదీక్ష ఉంది, అంతకు మించిన అంకిత భావమూ ఉంది. (చదవండి: ట్రావెలింగ్ టీచర్) మార్చే శక్తి టీచర్దే! ‘‘రంజిత్ సింగ్ వంటి ఉపాధ్యాయులు ఉంటే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది. మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది’’ అని యునెస్కో విద్యావిభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా గియాన్ని ప్రశంసించారు. రంజిత్ మాత్రం... ‘‘ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విద్యారంగాన్ని కూడా కుదిపేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని నూటికి నూరుశాతం నిర్వర్తించారు. విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన విద్యాహక్కును సమర్థంగా అందించారు. కరోనా పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపకుండా కాపాడగలిగారు’’ అన్నారు. ఈ సందర్భంగా రంజిత్ సిన్హ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఇరవయ్యో శతాబ్దపు ఉపాధ్యాయుడిని, నేను బోధిస్తున్నది 21వ శతాబ్దపు పౌరులకు. మనం పాఠాలు చెప్పే విధానం కూడా మారాలి. సిలబస్ పందొమ్మిదవ శతాబ్దంలో, సాంకేతిక విధానం 18వ శతాబ్దంలోనే ఉండిపోయింది. అలా ఉండిపోకూడదు. అందుకే కొత్త సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నాను’’ అన్నారు. అందరూ విజేతలే! ఈ ఎంపిక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన పదిమందిలో రంజిత్ విజేత... కాగా మిగిలిన తొమ్మిది మంది కూడా తక్కువవారేమీ కాదు. అంకితభావంతో పని చేసిన వారేనంటూ... వర్కీ ఫౌండేషన్ చేంజ్ డాట్ ఓఆర్జీ ఇచ్చే బహుమతిలో సగం డబ్బును మిగిలిన తొమ్మిదిమందికీ పంచుతున్నట్లు ప్రకటించారు రంజిత్. అలాగే తన సగభాగం డబ్బును మూలనిధిగా ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా మారుస్తానని కూడా చెప్పారు. ఈ నిర్ణయంతో రంజిత్ మరోసారి ప్రపంచం ప్రశంసలు అందుకున్నారు. ఈ పురస్కారానికి నగదు బహుమతి పది లక్షలు డాలర్లు (ఏడుకోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా). అందులో సగం అంటే ఐదు లక్షల డాలర్లను తొమ్మిది మందికి ఒక్కొక్కరికీ యాభై ఐదు వేల డాలర్ల చొప్పున పంచుతారు. ఇంతకు ముందు... రంజిత్ సిన్హ్ దిశాలె 2016లో కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇన్నోవేటివ్ రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు అందుకున్నారు. 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్స్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2019లో గ్లోబల్ పీస్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌తోపాటు పారిస్‌లో మైక్రోసాఫ్ట్స్ ఎడ్యుకేషన్ ఎక్సేంజ్ ఈవెంట్లో పురస్కారాన్ని అందుకున్నారు. -
స్కూలు టీచర్‌కు భారీ బహుమతి.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సిన్హ్ డిసేల్ (32) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి మరీ డిసేల్ ఈ ఘనతను సాదించారు. అంతేకాదు తన ప్రైజ్ మనీని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి విశేషంగా నిలిచారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా తన బహుమతిలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. అంటే మిగతా తొమ్మిదిమంది ఫైనలిస్టులు ఒక్కొక్కరూ 55 వేల డాలర్లు చొప్పున అందుకుంటారు. బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్‌లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్‌ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు. డిసేల్ కృషి 2009 లో సోలాపూర్‌లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం. స్టోర్ రూంగా, పశువుల కొట్టంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న డిసెల్ పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా డిసేల్ విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్ , ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరడం విశేషం. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా వీకెండ్స్‌లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్‌కు తీసుకెళతారు. మరీ ముఖ్యంగా తన ఇంటిలో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ ప్రయోగాలతో విద్యార్థులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. కాగా 2014 లో వర్కీ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్లను గౌరవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా డిసేల్ ఎంపికయ్యారు. నైజీరియాకు చెందిన ఒలాసుంకన్మి ఒపీఫా, యూకేకు చెందిన జామీ ఫ్రాస్ట్, ఇటలీ నుండి కార్లో మజ్జోన్, దక్షిణాఫ్రికా నుండి మోఖుడు సింథియా మచాబా, అమెరికాకుచెందిన లేహ్ జుయెల్కే, యున్ జియాంగ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యూన్, మలేషియాకు చెందిన శామ్యూల్ యెషయా, వియత్నాం నుండి హన్హ్ ఫాంగ్ , బ్రెజిల్ నుండి డోని ఇమాన్యులా బెర్టాన్ టాప్ 10లో నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీని 10 సంవత్సరాలలో సమాన వాయిదాలలో చెల్లిస్తుంది -
బడికొస్తా.. నిరాశ
పశ్చిమగోదావరి, నిడమర్రు: విద్యా హక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి. ఏటా ప్రభు త్వ విద్యార్థినులకు అందించే న్యాప్కిన్ల పంపిణీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ‘నేస్తం’ పథకం అటకెక్కింది. 9వ తరగతి బాలికలకు ఉచిత సైకిళ్ల పథకం రెండేళ్లుగా వాయిదాలతో సా..గు..తోంది. గతేడాది అందాల్సిన ఉచిత సైకిళ్లకు సర్కారు మంగళం పాడింది. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతుల విద్యార్థినులను మాత్రమే విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో ‘బడికొస్తా’ పథకాన్ని ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యకే బాలికలు పరిమితం కాకుండా ఉన్నత విద్యలోనూ కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. ఇంటికి పాఠశాల దూరంగా ఉండడంతో చదువుకు స్వస్తి చెప్పకుండా 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా సైకిల్ ఇచ్చేలా కార్యాచరణ రూపొం దించారు. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో నమోదైన 9వ తరగతి విద్యార్థినులు 16,841 మందికి సైకిళ్లు పంపిణీ చేయాల్సుంది. ఐతే వారంతా 10వ తరగతిలోకి చేరాక 2017–18లో సైకిళ్లను అందించారు. ఈ ఏడాది 8, 9వ తరగతుల విద్యార్థినులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేటికీ ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. మరో మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. గతేడాది మంగళం 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత 2017–18 విద్యా సంవత్సరంలో పంపిణీ చేశారు. గతేడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటికీ సైకిళ్లు అందలేదు. ఈ ఏడాది 9వ తరగతితో పాటు 8వ తరగతి బాలికలకూ సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించింది. ఈ నేపథ్యంలో గతేడాది తొమ్మిది చదివిన విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఏడెడ్ పాఠశాలల్లో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజక వర్గాల బాలికలకు ఉచితంగా సైకిళ్లు అందిస్తారు. అర్హులు 35,200 మంది గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు అందాయి. సైకిళ్లను ఆధార్ అనుసంధానం చేసి బయోమెట్రిక్ హాజరు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివిధ కారణాల దృష్ట్యా జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి ఆయా పాఠశాలల్లో, ఎంఆర్సీ భవనాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం 8,9 తరగతుల్లో నమోదైన బాలికలు 35,200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సైకిల్ ఖరీదు రూ.3,680గా టెండర్ పూర్తి చేసినట్లు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను విద్యార్థులకు సంబంధించిన ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గుత్తేదారులు సైకిల్ విడిభాగాలు తీసుకొచ్చి పాఠశాలల వద్దే సైకిళ్లు బిగించి హెచ్ఎంలకు అందించనున్నారు. సైకిళ్లు అందలేదు గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన విద్యార్థినులకు సైకిళ్లు అందలేదు. 2016–17లో 9వ తరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు ఇచ్చారు. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్థినులు వస్తారు. వీరికి సైకిళ్లు ఇస్తే హాజరు శాతం పెరుగుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్ఎం, నిడమర్రు అర్హత కోల్పోయాను ఐదు కిలో మీటర్ల దూరంలోని మండల కేంద్రం నిడమర్రులో ఉన్న జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఏడాది నుంచి సైకిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది నుంచి 8, 9వ తరగతి బాలికలకే ఇస్తానంటున్నారు. నాకు సైకిల్ వచ్చే అవకాశం లేదు.– సీహెచ్ లాస్యప్రియ, 10వ తరగతి విద్యార్థిని, మందలపర్రు సైకిళ్లు త్వరలో అందిస్తాం బడికొస్తా పథకం సైకిళ్లు త్వరలో అందిస్తాం. ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 8, 9వ తరగతి విద్యార్థినుల వివరాలు ఉన్నతాధికారులకు అందించాం. గతేడాది మిగిలిన సైకిళ్లను మినహాయించి కొత్త సైకిళ్లు అందిస్తామన్నారు. అప్పటికి వాటిని జాగ్రత్త చేయమన్నారు.– సబ్బితి నర్సింహమూర్తి, జిల్లా అధ్యక్షులు, ఎంఈఓల సంఘం -
బాలికా విద్యపై స్కేటింగ్ యాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 40శాతం బాలికలు మాత్రమే విద్యనభ్యసించగల్గుతున్నారు.50శాతం పిల్లలు ముఖ్యంగా బాలికలు పదో తరగతికి ముందే స్కూల్ మానేస్తున్నారు. ఇలాంటి వివరాలు చదివినప్పుడు కాసేపు చింతిస్తాం. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొందరే ఈ పరిస్థితిని మార్చాలని ఆలోచిస్తారు. అందుకు ముందడుగు వేస్తారు. అందులో ఒకరే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడు ఉప్పలపాటి రానా. మహిళలు విద్యావంతులైనప్పుడే భవిష్యత్తు బాగుంటుందని, అందుకు ఏదైనా చేయాలని సంకల్పించిన రానా... బాలికా విద్యపై అవగాహన కల్పించేందుకు 6వేల కి.మీ స్కేటింగ్ యాత్రను పూర్తి చేశాడు. సాక్షి, సిటీబ్యూరో : వైజాగ్ చెందిన ఉప్పలపాటి రానా ఈ యాత్రలో భాగంగా 25వేల మంది బాలికల విద్యావసరాలకు అవసరమైన నిధులు సేకరించాలని సంకల్పించాడు. ఈ సంకల్పానికి ‘టైటాన్’ కంపెనీ సహకారం తోడైంది. పేద బాలికల విద్య కోసం నిధులు సమీకరించేందుకు ఎకో (ఎడ్యుకేట్ టు క్యారీ హర్ ఆన్వర్డ్స్) కార్యక్రమాన్ని చేపట్టిన ‘టైటాన్’ రానాకు అన్ని విధాలుగా సహకరించింది. సెప్టెంబర్ 5న కర్ణాటకలోని హోసూర్‌లో ప్రారంభమైన ఈ స్కేటింగ్ యాత్ర 6 వేల కి.మీ సాగి డిసెంబర్ 13న ముగిసింది. అందరి సహకారంతో ఒక పాపకి పుస్తకాలు, బ్యాగ్ ఇలా బేసిక్‌గా 3,600 విద్యావసరాలుంటాయని గుర్తించాం. ఆ లెక్కన ఈ యాత్రలో దాదాపు 18వేల మంది బాలికల విద్యకు కావాల్సిన నిధులు సేకరించగలిగాం. దీనికి అందరూ సహకరించకపోతే నిధులు వచ్చేవి కావు. నేను 6వేల కి.మీ స్కేటింగ్ పూర్తి చేసేవాడినీ కాదు. మంచి ఉద్దేశానికి చాలా మంది తోడ్పాటునందిస్తారనేది నేనీ జర్నీలో తెలుసుకున్న ముఖ్యమైన విషయం. అయితే ఏదో సాధించాననే దాని కంటే... ఇంత పెద్ద దేశంలో బాలికా విద్యను గుర్తించి, దానికేమైనా చేయాలని ఆలోచించే వాళ్లు ఇంకా ఎవరూ లేరా? అనిపిస్తోంది. ఎందుకంటే 25వేల మందికి సహకారం అందించడంతో ఈ సమస్య తీరిపోదు. ఇంకా ఎంతో మంది అవసరార్థులు ఉన్నారు. అందరూ దీనిపై ఆలోచిస్తేనే బాలికా విద్య సాధ్యమవుతుంది. ఆ ఆలోచనతోనే... ‘గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అక్షరాస్యతా 40శాతమే. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మన దేశంలో 50శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మాతాశిశు మరణాలు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు ఇలా ఎన్నో సమస్యలున్నాయి. దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఇద్దలు బాలలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇవన్నీ విని ఊర్కుంటే కుదరదు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఏదైనా చేయాలి. అదే ఆలోచనతో ఈ యాత్ర చేపట్టాను. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనకు బాధ్యతలున్నట్లే సమాజం విషయంలోనూ మనకు కొంత బాధ్యత ఉంటుంది. అది సామాజిక సేవగా కాకుండా బాధ్యతగా చేయాలి. మన చుట్టూ ఉన్న వారి విషయంలోనూ మనకు బాధ్యత ఉందని నేను నమ్ముతాను. కేన్సర్ అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అందులో నాకు అర్థమైందేమిటంటే 40 ఏళ్లు వచ్చిన తర్వాత మహిళలకు కేన్సర్, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించటం కన్నా... చిన్నప్పటి నుంచే విద్యావంతులను చేస్తే అన్ని విధాల మేలు’ అని చెప్పారు రానా. 76 రోజులు... యాత్ర ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. గంటకు 12–15 కి.మీ స్కేటింగ్ చేసేవాడిని. ఇక చివరి యాత్ర రోజుల్లో గంటకు 20–25 కి.మీ చేయగలిగాను. రోజుకు సగటున 80కి.మీ చేసేవాడిని. మొత్తం 100 రోజుల యాత్రలో 76రోజులు స్కేటింగ్ చేశాను. మిగతా రోజుల్లో నేను ప్రయాణించిన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ సహా 70 నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే ఠీఠీఠీ.్టజ్టీ్చnఛిౌఝp్చny.జీn/్ఛఛిజిౌ వెబ్సైట్ ద్వారా అందించొచ్చు. వాటిని ఇంపాక్ట్, నన్హీ కలీ స్వచ్ఛంద సంస్థలు బాలికా విద్య కోసం వెచ్చిస్తాయి. -
బాలికా విద్యకు కరువైన ప్రోత్సాహం
పశ్చిమగోదావరి, నిడమర్రు: బాలికా విద్యకు ప్రోత్సాహం కరవవుతోంది. ప్రభుత్వానికి పథకాల ప్రకటనలపై ఉన్న ప్రచారపు హోరు.. వాటి అమలులో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు నీరుగారుతున్నాయి. ఏటా విద్యార్థినులకు ప్రభుత్వం అందించే న్యాప్కిన్ల పంపిణీ పథకం టీడీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కింది. 9వ తరగతి విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు అందించే పథకం ప్రారంభించినా అది వాయిదాల పర్వంగా సాగుతోంది. నైన్త్‌లో బాలికలకు అందించాల్సిన ఉచిత సైకిళ్లు అదే విద్యాసంవత్సరంలో పంపిణీ చేయకపోవడంతో బడికొస్తా పథకం లక్ష్యం నీరుగారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నీరు గారుతున్న లక్ష్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 2016లో ‘బడికొస్తా’ పథకం ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యతోనే బాలికలు బడి మానేయకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా పాఠశాల దూరమంటూ చదువుకు స్వస్తి చెప్పకుండా, బాలికలను ప్రోత్సహించి వారు హైస్కూల్లో చేరేందుకు 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా ప్రభుత్వమే సైకిల్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో 9వ తరగతిలో నమోదైన 16,841 మంది బాలికలకు సైకిళ్ల పంపిణీ చేయ్యాల్సి ఉంది. కానీ ఆ విద్యా సంవత్సరంలో సైకిళ్ల పంపిణీ ప్రారంభించ లేదు. 2017–18 సంవత్సరంలో వారంతా 10వ తరగతిలోకి చేరాక ఆ సైకిళ్లను అందించారు. దీంతో 9వ తరగతిలో అందించాలనే లక్ష్యం నీరుగారింది. గతేడాది ‘బడికొస్తా’కు మంగళం 2017–18 విద్యా సంవత్సరంలో 2016–17కు సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత అందించారు. దీంతో గత ఏడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటి వరకూ ఉచిత సైకిళ్లు అందించలేదు. కనీసం వారి వివరాలు కూడా నేటి వరకూ ఉన్నత అధికారులు సేకరించలేదు. దీంతో గత ఏడాది ‘బడికొస్తా’ పథకంలోని ఉచిత సైకిళ్లకు ప్రభుత్వం మంగళం పాడిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తొమ్మిదితో పాటు 8వ తరగతి బాలికలకు కూడా ఉచితంగా సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించిన నేపథ్యంలో గత ఏడాది నైన్త్ విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక,, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజకవర్గాల బాలికలకు సైకిళ్లు అందనున్నాయి. 35,200 మందికి లబ్ధి గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీని ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ హాజరు ద్వారా అందించాలని నిర్ణయించడంలో వివిధ కారణాలతో జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి పాఠశాలల్లోనూ, ఎమ్మార్సీ భవనాల్లోనూ మూలకు చేరాయి. ప్రస్తుతం 8, 9 తరగతుల విద్యార్థినులు 35,200 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క సైకిల్ ధర రూ.3,680 గా టెండర్ ప్రక్రియ పూర్తయినట్టు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. గతేడాది అందని సైకిళ్లు గత విద్యా సంత్సరంలో 9వ తరగతి విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు అందలేదు. 2016–17 విద్యాసంవత్సరంలో 9వతరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు అందాయి. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్ధినిలు పాఠశాలకు వస్తారు. వీరికి సైకిల్స్ ఇవ్వడం వల్ల బాలికల హాజరుశాతం మెరుగవుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్ఎం, నిడమర్రు -
బాలిక విద్యకు ప్రాముఖ్యత
నందిపేట్ (ఆర్మూర్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ, అందుకు కావాల్సిన అన్ని సౌకార్యాలను కల్పిస్తుందని కలెక్టర్ రామ్మోహాన్‌రావు అన్నారు. నందిపేట మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసు రూంలను పరిశీలించారు. చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ ప్రభుత్వ విద్యతో పాటు ఆత్మస్థైర్యం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ లాంటివాటిలో శిక్షణనిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2822 మంది బడిబయట పిల్లలను బడిలో చేర్పించామన్నారు. మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో బాలికలను ఉన్నత విద్యలు చదివించాలని తల్లిదండ్రులను కోరారు. బాలికలు చదివితే గ్రామం చదివినట్టేనన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న సర్పంచు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులను అబినందించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని సౌకార్యలను కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మంచి విద్యను అందిస్తామని భరోసా ఇచ్చారు. సెజ్ పనుల పరిశీలన మండలంలోని లక్కంపల్లి శివారులో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయాధారిత పరిశ్రమ (సెజ్) పనులను మంగళవారం కలెక్టర్ రామ్మోహాన్‌రావు పరిశీలించారు. సెజ్ కోసం కేటాయించిన భూమి వివరాలను తహసీల్దార్ ఉమాకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెజ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటి వివరాలను ఆరా తీశారు. వ్యవసాయాధిరిత పరిశ్రమలలో భాగంగా పశుపుశుద్ధి, విత్తన శుద్ధి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వ్యవసాయ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ, పాలశీతలీకరణ కేంద్రం తదితర కార్యక్రమాల కోసం 78 ఎకరాలను ఉపయోగించుకున్నట్లు, మిగితా భూమి ఇతర పరిశ్రమల కోసం లీజ్‌కు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివిరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్ మీసాల సుదర్శన్, ఎంపీపీ అంకంపల్లి యమున, జడ్పీటీసీ డి.స్వాతి, వైస్ ఎంపీపీ మారంపల్లి గంగాధర్, ఎంపీటీసీ ఎర్రటి సుజాత, ఎంపీడీఓ నాగవర్దన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ లక్ష్మినారాయణ, హెచ్ఎం గంగాధర్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో 12వ తరగతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఈ ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బాలికా విద్యపై పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు, పాఠశాలల్లో బాలికల చేరిక సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానమైన కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యను అందించడానికి కేంద్రం అంగీకరించింది. బాలికా విద్యపై సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఢిల్లీలో కలసి సిఫార్సుల అమలుపై చర్చించారు. కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు కడియం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది నుంచే కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కేజీబీవీల్లో 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 9, 10వ తరగతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 8వ తరగతి వరకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని 12వ తరగతి వరకు కల్పించాలని కోరామని, యూనిఫాంలను అందించాల ని విజ్ఞప్తి చేశామని కడియం తెలిపారు. ప్రస్తుతం 12వ తరగతి వరకు విద్యనందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, మధ్యాహ్న భోజనం, యూనిఫాం సౌకర్యాల కల్పనను పరిశీలిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్‌కు ఐఐఎం! వచ్చే విద్యా సంవత్సరం హైదరాబాద్‌లో ఐఐఎం ప్రారంభానికి జవదేకర్ సానుకూలంగా స్పందించినట్టు కడియం తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఐఐఎం మంజూరు చేయాలని కోరామని, ఈ ఏడాది ప్రకటించే ఐఐఎంల్లో తప్పుకుండా ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చారన్నారు. బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణలో మహిళా వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, తెలంగాణకు ఒక ట్రిపుల్ ఐటీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. -
దీనావస్థలో బాలికా విద్య
సాక్షి, బెంగళూరు: ఐటీ హబ్‌గా మురిసిపోతున్న బెంగళూరు నగరం.. బాలికల విద్యలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉద్యాననగరిలో దాదాపు 33 శాతం మహిళలు పదో తరగతి వరకు కూడా చదువుకోలేదు. ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, హెల్త్ సర్వే నివేదికలో ఈ వాస్తవం వెల్లడైంది. 2015–16 సంవత్సరంలో 67 శాతం మంది మహిళలు 10వ తరగతి లేదా ఆపై తరగతుల వరకు చదువుకున్నారని సర్వేలో తేలింది. మిగిలిన 33 శాతం మంది కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో బాలికల విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టారు కానీ ఫలితాలు మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. పేద బాలికలకు భాగ్యలక్ష్మి పథకం ద్వారా చదువుకయ్యే ఖర్చును భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని పేద బాలికలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా చదువు అందించేలా కొత్త పథకాన్ని తీర్చిదిద్దుతోంది. -
బాలికల విద్యకు ప్రోత్సాహం : కడియం
సాక్షి, హైదరాబాద్ : బాలికల విద్యను ప్రోత్సహించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో బాలికల విద్యపై కేబినెట్ అడ్వైజరీ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అసోం, జార్ఖండ్ రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. అన్ని రాష్ర్టాల్లో మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బాలికల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని కడియం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎన్రోల్ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా బాలికల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. సమావేశంలో బాలికల విద్యకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించామని, 15,16 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయాలను 8వ తరగతి వరకూ కాకుండా 12వ తరగతి వరకూ పెంచాలని, వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న మంచి విధానాల్లో బాలికల విద్యావ్యాప్తికి తోడ్పడే 10 విధానాలను పరిశీలనలోకి తీసుకుని అమలుచేయాలని, జనవరి 15 లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు
– ఈ నెల 24 తర్వాత అందజేయనున్న అధికారులు కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా తెలిపారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ బడికొస్తా పథకంలో భాగంగా 14,900 సైకిళ్లు మంజూరయ్యాయని.. ఇందులో 70 శాతం ఇప్పటికే జిల్లాకు చేరాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 24 తర్వాత విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 సంవత్సరంలో బాలికల విద్యపై చేపట్టిన ఓ సర్వేలో బాల్య వివాహాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోవడమే కారణంగా వెల్లడయిందన్నారు. ఈ కారణంగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు సర్వే ప్రకటించిందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలికల హాజరు శాతం ఉన్నత పాఠశాలలకు వచ్చే సరికి సగానికి పైగా తగ్గుతోందన్నారు. ఈ నేపథ్యంలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తే కనీసం 10వ తరగతి పూర్తి చేసేందుకైనా అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ స్కూళ్లకు చెందిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీని ఎంపిక చేశారన్నారు. ఈ కంపెనీ సైకిల్ విడి భాగాలను తీసుకొచ్చి స్కూళ్ల వద్ద పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
బాలికా విద్యకు ప్రాధాన్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా విద్యా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బాలికలకు సంబంధించి ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించింది. వ చ్చే విద్యా సంవత్సరంలో (2016-17) బాలికల డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని బాలికల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిం చింది. బాలికల కోసం నిర్మించిన టాయిలెట్లలో నీటి వసతి కలిగి ఉండేలా పక్కాగా చర్యలు చేపట్టడంతో పాటు వారి కోసం స్కూళ్లలో రెస్ట్ రూమ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. పారిశుధ్య లోపమూ కారణమే! ప్రస్తుతం రాష్ట్రంలో 4,563 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో చదివే బాలికలకు పారిశుధ్యం, ప్రత్యేక టాయిలెట్ వంటి సమస్యలు తప్పడం లేదు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఈ కారణాల వల్ల కొందరు బాలికలు బడి మానేస్తున్న విషయాన్ని విద్యా శాఖ గుర్తించింది. ఇప్పటికే ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అలాగే బాలికల కోసం అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో రెస్ట్ రూమ్‌లను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒక్కో గదికి రూ.10 లక్షల చొప్పున వెచ్చించి, ప్రతి జిల్లాలోని 5 నుంచి 10 ఉన్నత పాఠశాలల్లో వీటిని నిర్మించనున్నారు. మరోవైపు బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు 1,836 ఉన్నత పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. డ్రాపౌట్లను తగ్గించే చర్యలు రాష్ట్రంలో బాలికల డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. బాలికలను చదివించేందుకు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండటాన్ని విద్యా శాఖ గుర్తించింది. అందుకే విద్య పరంగా వెనుకబడ్డ మండలాల్లో బాలికల కోసం మోడల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టింది. 182 మోడల్ స్కూళ్లలో 100 వరకు బాలికల హాస్టళ్లను గతంలోనే ప్రారంభించింది. మిగిలిన హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటికి తోడు మోడల్ స్కూల్స్ ఫేజ్-2లో మరో 125 మోడల్ స్కూళ్లలో 125 బాలికల హాస్టళ్లు మంజూరయ్యాయి. అయితే కేంద్రం ఆ పథకాన్ని రద్దు చేయడంతో వాటిని గురుకుల విద్యాలయాలుగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. -
ఇకపై భర్తల పెత్తనం చెల్లదు...
న్యూఢిల్లీ: 'సర్పంచ్ పతి' సంస్కృతికి ఇక చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళల పేరుతో వారి భర్తలు పెత్తనం చెలాయించే పద్ధతికి ఇక కాలం చెల్లిందన్నారు. మహిళలు సాధికారత సాధించాల్సి అవసరం ఉందని, ఆవైపుగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలకు చట్టం సమాన హక్కులు కల్పించిందని, వాటిని మనం గౌరవించాలని మోదీ అన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్టుగా.. గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. బాలికల విద్య, డ్రాప్ అవుట్స్‌ను నిరోధించే విషయంలో, వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో గ్రామాలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాలికలు ఎవరైనా స్కూల్ మానేస్తే అది తీవ్రంగా పరిగణించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని సలహాలిచ్చారు. గ్రామాల పట్ల గౌరవంలేకపోతే అభివృద్ధిని సాధించలేమంటూ . ఐదు సంవత్సరాల ప్రణాళికతో ముందుకు పోవాలని పంచాయితీ, జిల్లా పరిషత్ అధికారులు సలహా యిచ్చారు. ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేసేలా పంచాయత్ సభ్యులు చూడాలన్నారు. జాతీయ పంచాయతీరాజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'ఈ- పంచాయితీ అవార్డు'లను ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్నజిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అభినందనలు తెలియజేశారు. -
'మీతో అనుబంధం మాకెంతో గౌరవం'
ఐక్యరాజ్యసమితి (ఐరాస) వల్లే ప్రపంచం మనుగడ సాధించగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస ప్రధాన విభాగమైన యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రారంభం నుంచి నేటివరకు అనుబంధాన్ని కొనసాగించడం భారత్ గౌరవ ప్రదంగా భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం ప్యారిస్‌లోని వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో జరిగిన యునెస్కొ 38వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్య, శాస్రవిజ్ఞానం, సాంస్కృతిక అంశాల్లో యునెస్కో తోడ్పాటు మరువలేనిదన్నారు. ప్రతి బాలిక బడికి వెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్న మోదీ.. బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం ద్వారా భారత్‌లో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చుతున్నామని సమావేశానికి హాజరైన ప్రతినిధులకు వివరించారు. సానుకూల పరిస్థితుల్లోకంటే ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన అభివృద్ధినే పరిగణనలోకి తీసుకుంటామని, తద్వారా నమ్మకం రెట్టింపవుతుందని అప్పుడు మాత్రమే ప్రజల ముఖంలో సంతోషం చూడగలమని వ్యాఖ్యానించారు. తొమ్మిది రోజులపాటు మూడు దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జర్మనీ, కెనడా సందర్శనకు వెళ్లనున్నారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
అయ్యా.. నేను సదివి బాగుపడతా
నాగిరెడ్డిపేట: ‘నాన్నా...నన్ను బడికెందుకు పంపవు...పంపకపోతే చచ్చిపోతా’అంటూ ఓ గిరిజన బాలిక పంతం పట్టి అనుకున్నది సాధించింది. వివరాలివీ... నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం పంచాయతీ పల్లెబొగడ తండాలో గురువారం జాతీయ బాల కార్మిక చట్టం పథకం సంచాలకుడు సుధాకర్, ఎంఈవో గోవర్దన్‌రెడ్డి కలిసి బడి బయట పిల్లలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి నిర్మల అనే బాలిక తారసపడింది. తల్లిదండ్రులు ఆమెను గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివించి ఆరునెలల క్రితం మాన్పించిన విషయం తెలుసుకున్నారు. అధికారులు నిర్మల తల్లితో మాట్లాడి కూతురును బడికి పంపేందుకు ఒప్పించారు. అయితే, ఆమె తండ్రి దేవుజా గ్రామంలో లేకపోవటంతో ఫోన్లో సంప్రదించారు. అతడు మాత్రం కూతురును బడికి పంపడానికి అంగీకరించలేదు. జైలుకు పంపుతామని హెచ్చరించినా లెక్క చేయలేదు. ఈ సంభాషణంతా వింటూ అక్కడే ఉన్న నిర్మల పీడీ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని తండ్రితో మాట్లాడింది. తనను ఎందుకు బడికి పంపవని నిలదీసింది. బడికి పంపకపోతే చచ్చిపోతానని బెదిరించింది. కంగుతిన్న దేవుజా చివరికి కూతురును బడికి పంపేందుకు అంగీకరించాడు. అనంతరం బాలికను పీడీ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డితో కలిసి తండాలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.