g.kishanreddy
-
'ఆయన ఆంధ్రానాయకుల చేతిలో కీలుబొమ్మ'
నర్సంపేట (వరంగల్ జిల్లా): తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడు కుతంత్రాలను అడ్డుకోలేని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారాడని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 60 చెరువుల వద్ద ఒకే రోజు లక్షమొక్కలను నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేని కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ధర్నాలు చేయడం విచారకరమన్నారు. పాలమూరు, దిండి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నప్పటికీ పట్టించుకోని కిషన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయాలని హితవు పలికారు. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించకపోవడంతో ఆయన తెలంగాణ ప్రజల పక్షమా..ఆంధ్రా నాయకుల పక్షమా.. తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, పద్మారావు, ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. -
స్థానికతపై మెలిక రాజ్యాంగ విరుద్ధం
జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ధారిస్తూ స్థానికతపై మెలిక పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయలేని తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. శాసనసభలోని 119 మంది ఎమ్మెల్యేలు 1956 స్థానికత సర్టిఫికేట్లు తెస్తారా.., ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకలో ఆనాటి రికార్డులు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. భూముల్లేని ఎస్సీ, బీసీలు ఆనాటి రికార్డులను ఎలా తీసుకురాగలరన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ప్రాంతీయ సమస్యగా చూపొద్దని, ఫాస్ట్ పథకం వల్ల బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని కిషన్‌రెడ్డి అన్నారు -
బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం
హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన చరిత్ర బీజేపీ సొంతమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేతివృత్తులు, కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం నిరాహారదీక్షలు చేపట్టామని గుర్తు చేశారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రధాని మోడీని కలిసి కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మరోవైపు హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కిషన్‌రెడ్డి సీఎంకు వినతిపత్రం సమర్పించారు. కిషన్‌రెడ్డితో ఓయూ విద్యార్థుల భేటీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బుధవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని ఆయనను కోరారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలకు కొదవ ఉండదని ఆశపడ్డామని... ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో తమకు అవకాశాలు లేకుండా పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.