Global Hospitals
-
ఆపరేషన్..పరేషాన్
-
గ్లోబల్ హాస్పిటల్స్ సీవోవోగా గుజ్రాల్
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ హాస్పిటల్స్ కార్యకలాపాలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా జగ్ప్రాగ్ సింగ్ గుజ్రాల్ నియమితులయ్యారు. గ్లోబల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలున్న పార్క్‌వే పంటాయ్ సంస్థ ఈ విషయం వెల్లడించింది. హైదరాబాద్‌లోని తమ కార్పొరేట్ కార్యాలయం కేంద్రంగా గుజ్రాల్ పనిచేస్తారని తెలిపింది. గ్లోబల్కుహైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఎనిమిది ఆసుపత్రులున్నాయి. హెల్త్‌కేర్ రంగంలో గుజ్రాల్‌కు దాదాపు 18 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ కె. రవీంద్ర నాథ్ తెలిపారు. -
మలేషియా కంపెనీ చేతికి గ్లోబల్!
గ్లోబల్ హాస్పిటల్స్‌లో 73.4 శాతం వాటా కొంటున్న ఐహెచ్‌హెచ్ ♦ డీల్ విలువ రూ.1,280 కోట్లు; 3 నెలల్లో పూర్తి ♦ దేశంలో 1,800 పడకలకు చేరనున్న ఐహెచ్‌హెచ్ సామర్థ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంస్థ గ్లోబల్ హాస్పిటల్స్... మలేషియా కంపెనీ పరమవుతోంది. ‘రవీంద్రనాథ్ జీఈ మెడికల్ అసోసియేట్స్’ పేరిట ఉన్న ఈ సంస్థలో 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ కైవసం చేసుకుంటోంది. డీల్ విలువ దాదాపు 1,280 కోట్ల రూపాయలు. మూడు నెలల్లో డీల్ పూర్తి కానున్నట్టు సమాచారం. ఆరోగ్య సేవల రంగంలో మార్కెట్ విలువ పరంగా ఐహెచ్‌హెచ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ. దక్షిణాదిలో నాలుగు ఆసుపత్రులతో పాటు ముంబైలోనూ ఆసుపత్రిని కలిగి ఉన్న గ్లోబల్‌ను కొనుగోలు చేయటం ద్వారా దేశంలో ఐహెచ్‌హెచ్ విస్తరించడానికి దోహదం చేయనుంది. అంతర్జాతీయంగా ఐహెచ్‌హెచ్‌కు ఉన్న అనుభవం, తమకున్న సామర్థ్యం కలిసి భారత్‌తోపాటు విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం మరింత మెరుగైన సేవలందించడానికి ఈ డీల్ దోహదపడనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.రవీంద్రనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక సంస్థలో ఎవర్‌స్టోన్ క్యాపిటల్‌కు 54 శాతం, రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు 27 శాతం, ఆనంద్ రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 10 శాతం, వైద్యులు, ఇన్వెస్టర్లకు 9 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరి నుంచి ఎంత వాటా కొనుగోలు చేయనున్నదీ వెల్లడి కాకపోయినా... మొత్తమ్మీద 73.4 శాతం వాటాను ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేయనున్నట్లు మాత్రం ధ్రువపడింది. గ్లోబల్ హాస్పిట ల్స్ విలువను రూ.1,744 కోట్లుగా లెక్క కట్టారు. వివిధ కంపెనీల్లో ఐహెచ్‌హెచ్.. భారత్‌లో అగ్రశ్రేణి హాస్పిటల్స్ గ్రూప్‌లలో ఒకటిగా తమను ఈ డీల్ నిలుపుతుందని ఐహెచ్‌హెచ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌కు సీఐఎంబీ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌గా వ్యవహరించాయి. హైదరాబాద్‌కు చెందిన కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను ఈ ఏడాది మార్చిలో ఐహెచ్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లు వెచ్చించింది. ప్రముఖ హాస్పిటల్స్ చైన్ అపోలో హాస్పిటల్స్‌లో సైతం దీనికి 10.85 శాతం వాటా ఉంది. గ్లోబల్ హాస్పిటల్స్ డీల్‌తో ఐహెచ్‌హెచ్ సామర్థ్యం భారత్‌లో 1,800 పడకలకు పెరుగుతుంది. 2020 నాటికి ఈ సామర్థ్యాన్ని 4,000 పడకలకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఐహెచ్హెచ్మొత్తం సామర్థ్యం 10 దేశాల్లో 45 ఆసుపత్రుల్లో 8,000 పడకలకు పైనే. కాగా, దేశంలో వైద్య రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు 2013లో రూ.4,880 కోట్లు రాగా, 2014లో రూ.3,420 కోట్లు వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ గ్లోబల్ ప్రస్థానం.. గ్లోబల్ హాస్పిటల్స్ 1999లో ప్రారంభమైంది. కె.రవీంద్రనాథ్ సీఎండీగా తొలుత 50 పడకలతో లక్డీకాపూల్‌లో ఆసుపత్రి ఏర్పాటైంది. దీనిని 200 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ స్థాయికి చేర్చారు. ఎల్బీ నగర్ ఆసుపత్రి పడకల సామర్థ్యం 300. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా గ్లోబల్ హాస్పిటల్స్ అడుగు పెట్టింది. ఏటా 3 లక్షల మంది ఔట్ పేషెంట్లు, 50 వేల మంది ఇన్ పేషంట్లకు వైద్య సేవలందిస్తోంది. ఏడాదికి 18 వేల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తోంది. టెలి మెడిసిన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఔట్రీచ్ క్లినిక్స్ పేరుతో చిన్న నగరాలకూ వైద్య సేవలను పరిచయం చేస్తోంది. -
1,000 కోట్ల సమీకరణకు గ్లోబల్ హాస్పిటల్స్ రెడీ
వైదొలగనున్న ఎవర్‌స్టోన్, ఆనంద్ రాఠీ జనవరిలో డీల్ పూర్తికావొచ్చు గ్లోబల్ హాస్పిటల్స్ సీఎండీ రవీంద్రనాథ్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ రంగంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ హాస్పిటల్స్ రుణ భారాన్ని మరింత తగ్గించుకొని, ప్రస్తుతం ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న సంస్థలకు ఎగ్జిట్ దారి (తమ వాటాలను అమ్ముకొనేవీలు) చూపేందుకు వీలుగా నిధుల సమీకరణ చేపట్టింది. దీనికోసం రూ వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ... బేరింగ్ ఏసియా, ఏటీ క్యాపిటల్, టీపీజీ గ్రోత్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ లాంటి సంస్థలతో నిధుల సమీకరణ సంబంధించి చర్చలు పలు దఫాలుగా జరిపామని, వీటితో పాటు మరిన్ని సంస్థలతో కూడా చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ‘నిధుల సేకరణకు మేం సమాయత్తమౌతున్నాం. పలు సంస్థలతో చర్చలను ప్రారంభించాం. ప్రాధమిక దశలను దాటి చర్చల్లో మరింత స్పష్టమైన పురోగతి సాధించాం. జనవరిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది’ అని రవీంద్రనాథ్ తెలిపారు. సంస్థలో ప్రధాన ఇన్వెస్టర్లయిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎవర్‌స్టోన్ క్యాపిటల్ (35 శాతం), పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ ఆనంద్ రాఠీలకు (10 శాతం) కలిపి మొత్తం 45 శాతం వాటా ఉంది. గత ఏడు సంవత్సరాలుగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. హెల్త్‌కేర్ రంగంలో మూలధనంపై వ్యయం (కాస్ట్ ఆఫ్ క్యాపిటల్) సంవత్సరానికి 15 శాతంపైనే ఉండటంతో రుణ భారాన్ని మోయడం తలకుమించిన భారం అవుతోంది. రుణ పత్రాల ద్వారా కాకుండా ఈక్విటీ నిధులను సమీకరించాలని గ్లోబల్ హాస్పిటల్స్ గత కొంత కాలంగా యోచిస్తోంది. 2016లో ఐపీవో ద్వారా పెట్టుబడుల మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ హాస్పిటల్స్‌కు 2,200 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై,ముంబైలలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లున్నాయి. కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులతో పాటు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను విజయవంతంగా అందించే సంస్థగా గ్లోబల్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. హెల్త్ టూరిజం పెంపొందించటంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. హాట్‌కేక్‌లా మారిన హెల్త్‌కేర్ రంగం.. హెల్త్‌కేర్ రంగం ప్రస్తుతం పెట్టుబడులకు హాట్‌కేక్‌లా మారింది. కొనుగోళ్లు, విలీనాలకు ఫార్మా తర్వాత హెల్త్‌కేర్ రంగం ముందుందని జియోజిత్ పీఎన్బీ పారిబస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మ్యాథ్యూస్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించేందుకు హెల్త్‌కేర్ గ్లోబల్, ఎస్ఆర్ఎల్ డయాగ్నాస్టిక్స్ (ఫార్టిస్ గ్రూప్), ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, థైరో కేర్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. -
డామిట్... ఈ వామిట్స్ తగ్గేదెలా?
నేడు డాక్టర్స్ డే డాక్టర్. కె.ఎస్. లక్ష్మీకుమారి, సీనియర్ కన్సల్టెంట్ - మినిమల్ యాక్సెస్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్ అప్పటికే ఎన్నో బేరియాట్రిక్ సర్జరీలు చేసిన అనుభవం నాది. అత్యంత సంక్లిష్టమైన కేసులు ఎదుర్కొన్న రికార్డు నాది. ఓ అంతుచిక్కని కేసు. శ్రీనివాస్ అనే పేషెంట్ అప్పటికే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మూడుసార్లు సర్జరీ చేయించుకున్నాడు. అప్పటినుంచి కొద్దిగా ఆహారం తీసుకున్నా వాంతి అయిపోతోంది. అప్పటికే మూడు సర్జరీలు! ఇక ఏం చేయాలో తెలియక ప్రాణాన్ని రక్షించడం కోసం అవసరమైన పోషకాలు అందడానికి వీలుగా నేరుగా పొట్టలోకి, పేగుల్లోకి ఒక చిన్న పైప్ వేశారు. పైప్ ద్వారా ఘనాహారం అందించలేరు, ద్రవాలను పంపిస్తూ ఉన్నారు. తప్పు ఎక్కడ దొర్లిందో అర్థం కావడం లేదు. మళ్లీ ఒకసారి వరసక్రమంలో పరీక్షలు చేసుకుంటూ వచ్చాం. తప్పిదం ఎక్కడో తెలియలేదు. అయినా సరే... మరోమారు శ్రీనివాస్ శరీరానికి శస్త్రచికిత్స చేయాలనుకున్నాం. అయితే అప్పటికే అది నాలుగో శస్త్రచికిత్స! ఆపరేషన్ చేస్తున్నప్పుడు జరిగిన పొరబాటేమిటో తెలిసింది. గతంలో శస్త్రచికిత్స చేసే సమయంలో జీర్ణమార్గం ఉండాల్సిన రీతిలో కాకుండా, పొరబాటున దాన్ని కాస్త దారి మళ్లించినట్లు మాకు అర్థమైంది. దాన్ని సరిదిద్దడానికి మాకు చాలా వ్యవధి పట్టింది. ప్రక్రియనైతే పూర్తి చేశాం గానీ... మా అందరిలో ఎంతో ఉద్విగ్నత. శ్రీనివాస్ మామూలుగా భోజనం చేసిన రోజు మా అందరి కళ్లలోనూ తృప్తి నిండిన కాంతులే.