godavari puskaralu stampede
-
చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రమాదం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఉన్న కమిషన్‌తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని జగన్ మండిపడ్డారు. కాగా పుష్కరాల సమయంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద జరిగిన తొక్కిసలాటకు ముహూర్త కాలంపై జరిగిన ప్రచారమేనని సోమయాజుల కమిషన్ బుధవారం నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ జగన్ ట్విటర్లో స్పందించారు. పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే.. దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవడం మరో తప్పని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పుల మీద తప్పులు చేశారని.. చంద్రబాబు చర్యల వల్లనే అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
గోదావరి పుష్కరాలు: అతి ప్రచారానికి బాబు కారణం కాదా?
విజయవాడ : గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు కారణం ముహుర్త కాలంపై జరిగిన విస్తృత ప్రచారమేనని సోమయాజులు కమిషన్ నివేదిక తేల్చింది. మూడేళ్ల కిందట జరిగిన పుష్కర విషాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మాటల కందని ఈ విషాదం బాధితులను ఇంకా వెంటాడుతుంటే గోదావరి పుష్కరాలపై ఊదరగొట్టిన సీఎం చంద్రబాబునాయుడు మాత్రం ఈ దుర్ఘటనకు కారణం కాదని కమిషన్ నివేదిక నిగ్గుతేల్చడం విడ్డూరం. కమిషన్ నివేదికలో ప్రస్తావించిన అంశాలు చూస్తే..144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి హద్దుమీరిన ఉత్సాహంతో ప్రజలు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ముహూర్త కాలంపై విస్తృత ప్రచారమే ప్రమాదానికి ప్రధాన కారణమని, ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని తెలిపింది. పత్రికలు, ఛానెళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది. బాబు ఊతంతో రెచ్చిపోయిన ఎల్లో మీడియా మహాపుష్కరాలకు మహా ఏర్పాట్లంటూ ఎల్లో మీడియా హోరెత్తించడం, చంద్రబాబు ప్రచారార్భాటం ఈ విషాదానికి అసలు కారణం అన్నది బహిరంగ రహస్యమే. వీఐపీలకు సరస్వతీ ఘాట్‌ను కేటాయించినా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ షార్ట్ ఫిల్మ్ కోసం పుష్కర ఘాట్‌లో సీఎం కుటుంబం, మంత్రులు స్నానాలు చేయడం తోపులాటకు కారణమైంది. ఒకే చోట వీఐపీలందరూ స్నానం చేయాలన్న కారణంతో పోలీసులు సాధారణ భక్తులను ఆపేశారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగిందని సోమయాజులు కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాన్ని తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికలో ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మరుగునపరిచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబులెన్స్‌లకు సైతం దారి ఇచ్చేలా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఉదయం 8 గంటల సమయంలో తొక్కిసలాట జరగ్గా, 9.15 గంటలకు తొలి బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు అంబులెన్స్ రికార్డులో పేర్కొన్నారు. సరైన సమయంలో అంబులెన్స్‌లు వచ్చిఉంటే పలువురు ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. షార్ట్ ఫిలింపైనే శ్రద్ధ.. పుష్కరాల నేపథ్యంలో విపరీత రద్దీ ఏర్పడకుండా నిర్ధేశిత ప్రాంతాల్లో భక్తులను నిలువరించడం, ఇతర ఘాట్లకు వారిని మళ్లించడం వంటి మార్గదర్శకాలను విస్మరించారు. నిబంధనల ప్రకారం ఘాట్లలో ప్రతి 50 మీటర్లను కంపార్ట్మెంట్లుగా విడగొట్టాలి. సీసీ టీవీలు ఏర్పాటు చేసి 72 గంటల ఫుటేజ్‌ను స్టోర్ చేయాలి. వీటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు పుష్కర ఘాట్‌కు ప్రజలను భారీగా మళ్లించారు. షార్ట్ ఫిల్మ్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చినట్టు కనిపించాలనే ఇలా చేసినట్టు స్పష్టమవుతోంది. ఇక వాస్తవాలు వెలుగుచూస్తాయనే ఉద్దేశంతో నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ నేటికీ వెలుగుచూడలేదు. ప్రచారయావతో గాల్లో కలిసిన ప్రాణాలు.. చంద్రబాబు ప్రచార యావే పుష్కర భక్తుల ప్రాణాలు తీసిందని ప్రజలు బాహాటంగా చర్చించుకోవడం తెలిసిందే. 29 మంది చనిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమని విస్పష్టంగా తేలినా సోమయాజులు కమిషన్‌లో చెప్పిన అంశాలను మరుగునపరిచి మరీ ప్రభుత్వం సీఎంకు క్లీన్చిట్ ఇవ్వడం దారుణం. -
బాబు మీడియా పిచ్చే ప్రాణాలు తీసింది!
-
బాబు మీడియా పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింది!
పుష్కరాలలో తొక్కిసలాటపై సభలో చర్చ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా పిచ్చితోనే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మరణించిన వారి కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం అందలేదని, ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదని సోమవారం ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన సమాధానంపై జగ్గిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీవై సోమయాజులు నాయకత్వంలోని కమిటీ విచారణ జరుపుతోందని, త్వరలో నివేదిక వస్తుందని, ఈ పరిస్థితుల్లో సభలో చర్చించలేమని యనమల చెప్పారు. దీనిపై జగ్గిరెడ్డి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ విచారణ కమిటీకి జిల్లా కలెక్టర్ సీసీటీవీ ఫుటేజీ కూడా ఇవ్వలేదన్నారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్లలో కాకుండా చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని చెప్పారు. తొక్కిసలాటకు కారణం చంద్రబాబేనన్నారు. ఘాట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నా సుమారు 90 వాహనాలు అక్కడకు చేరాయని వివరించారు. ఆ మేరకు ఫోటోలను కూడా సభలో ప్రదర్శించారు. చంద్రబాబు స్నానం చేసే ఘట్టాన్ని చిత్రీకరించడంతో పాటు పుష్కరాలపై డాక్యుమెంటరీ తీసేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నానా హంగామా చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై కమిషన్‌ను నియమించినా అటు జిల్లా కలెక్టర్ గానీ ఇటు ఇతర అధికారులు గానీ సహకరించడం లేదని, అటువంటప్పుడు ఈ కమిషన్‌తో ఏమి ప్రయోజనం ఉంటుందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సార్లు సోమయాజులు కమిషన్ గడువును పొడిగించారని, ఇంకెంత కాలం సాగదీస్తారని నిలదీశారు. చంద్రబాబు మీడియా పిచ్చితో అనర్థం జరిగిందన్నప్పుడు సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.. చంద్రబాబు తప్పేమీ లేదని, ప్రతిపక్ష సభ్యులు ప్రతి అంశానికీ వక్రభాష్యం చెబుతున్నారన్నారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ తమ లెక్కల ప్రకారం 27 మందే చనిపోయారని, 50 మంది గాయపడ్డారని, అందరికీ ఆర్థిక సాయం అందించామని, ఇంకా ఎవరికైనా రాకుంటే వారి వివరాలను తన దృష్టికి తీసుకువస్తే అందిస్తామన్నారు.