gold lizards
-
పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి
సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం. 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు. పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. – దావీదురాజు నాయుడు, ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం ఫొటోలు తీశా పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. – కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’ -
పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
బెంగాల్ పులులున్నాయ్.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్.. అలుగులు అలరారుతున్నాయ్.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది. బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్), 4 గిరి నాగులు (కింగ్ కోబ్రా) ఉన్నట్టు గణించారు. చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి జింకలు.. చుక్కల దుప్పులు ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. నేషనల్ విన్నర్ ‘ఆరంజ్ ఓకలీఫ్’ ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్ ఓకలీఫ్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్ ఓకలీఫ్ అభయారణ్యంలో అలుగులు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు. చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు -
కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న విశేషం ఏంటి..?!
కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని ఒక నమ్మకం. బల్లి శరీరం మీద పడిన వారు... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం... బంగారు, వెండి బల్లులకి సంబంధించిన పురాణగా«థ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. రోజూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ... అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా... కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు. పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది. -
తిరుమల గిరుల్లో బంగారు బల్లులు
⇒ తిరుమల శేషాచల కొండల్లో పెరుగుతున్న సంతతి ⇒ అంతరించిపోతున్న జాతి పునరుజ్జీవం ⇒ శేషాచలంలో అనుకూలంగా వాతావరణం సాక్షి, తిరుమల: అరుదైన బంగారు బల్లి జాతిని తిరుమల గిరులు సంరక్షిస్తున్నాయి... శేషాచల కొండల్లో బంగారు బల్లి సజీవంగా ఉంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండ డంతో ఏడాదిలోనే వాటి సంతతి గణనీయంగా పెరిగింది. తిరుమలేశుని ఆలయానికి 3 కి.మీ దూరంలోని చక్రతీర్థంలో ఇవి ఎక్కు వగా కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం ఇక్కడ ఓ బల్లి కనిపించగా ఇప్పుడు వాటి సంఖ్య ఆశా జనకంగా ఉంది. తిరుమలలోని కొండ గుహల ప్రాంతాల్లో సాక్షి ప్రతినిధి నిర్వహించిన పరిశోధనలో ఈ బల్లులు అనూహ్య సంఖ్యలో కనిపించాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ బల్లిజాతి క్రమంగా పెరుగుతోందనే అభిప్రాయానికి ఇది బలం చేకూర్చింది. దీనిపై ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని చక్రతీర్థంతోపాటు 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం ప్రదేశాల్లో మాత్రమే ఈ బంగారు బల్లి కనిపిస్తోంది. సజీవంగా చూడాలంటే శేషాచలంలోనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే నిజంగానే బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుంది. ఏడాది ముందు చక్రతీర్థంలో ఈ బంగారు బల్లి సజీవంగా కనిపించింది. తాజాగా అదే ప్రాంతంలో బంగారు బల్లులు కనిపించటం విశేషం. బంగారు వర్ణంతో ఈ బల్లులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కాలొడాక్టి లోడన్ ఇల్లింగ్ గోర్థోరన్ జాతికి చెందిన బంగారు బల్లి ఓసారి శ్రీలంకలో కని పించింది. ఈ రెండు జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉన్నట్టు ఆధారాలు లేవు. వీటి జీవనం ఇలా.. ► బంగారు బల్లి శాస్త్రీయనామం కాలొడాక్టి లోడస్ అరీస్. ఇది రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదు రు పసుపు, లేత పసుపురంగులో ఉంటుంది. ► అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరిందని సర్వేలు చెబుతున్నాయి. తొలి సర్వేలో తిరుమల కొండల్లో మాత్రమే కనిపించాయి. అటవీ ప్రాంతాల్లో కొండలను తొలచి నిర్మాణాలు చేపడుతుండటంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నాయి. ► ఇవి 150 మి.మీ. నుంచి 180 మి.మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం. అందులోనూ రాతి సందుల్లో తేమ ప్రాంతాలంటే వాటికి మహా ఇష్టం. ► సాధారణంగా చీకటిపడ్డాక వెలుపలకు వస్తాయి. ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఇళ్లలో ఉన్న సాధారణ బల్లుల కంటే గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం చాలా వింతగానూ ఉంటుంది. జీవజాతులకు ఆవాసం జీవజాతులకు ఆరోగ్యవంతమైన ఆవాస కేంద్రం శేషాచలం. ఇటీవల కాలం లో శేషాచలంలో ఏనుగులు, చిరుతలు, బంగారు బల్లులు కనిపిస్తుండటం, వాటి సంఖ్య పెరగటం ఇందుకు నిదర్శనం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, సమతుల్యత తో పాటు శేషాచల గిరులు మరింత దట్టంగా పెరగటం, రక్షణ చర్యలు పెరగటం కూడా మరో ప్రధాన కారణం. – ఎన్వీ శివరామ్‌ప్రసాద్, డీఎఫ్‌వో, టీటీడీ బంగారు బల్లి జాడపై పరిశోధన బంగారుబల్లి జాడపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఎస్వీ యూనివర్శిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. 1998వ సంవత్సరంలో అప్పటి ప్రొఫెసర్ ఎస్వీ నందకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.రాజశేఖర్ శేషాచల అడవుల్లో రాత్రిళ్లలో తిరిగి వాటి జాడలపై నివేదిక సమర్పించారు. వాటి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు రూపంలో నివేదిక సమర్పించారు. దీనిపై తర్వాత ఎలాంటి చర్యలు లేకపోవడం ఆవేదన కలిగించే విషయం.