gopireddy srinivas reddy
-
బాబుకు గోపిరెడ్డి వార్నింగ్
-
అన్ని అనుమతులతో పల్నాడు ఆఫీసు నిర్మించాం
-
గాంధీజీ కలలు సాకారం చేసిన సీఎం
నరసరావుపేట: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ఉద్యోగాల ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేలు నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనచంద్ర టౌన్‌హాలులో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆత్మీయ సభ నిర్వహించారు. సభకు అసోసియేషన్ కార్యదర్శి షేక్ మహమద్ ఆలీ అధ్యక్షత వహించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎటువంటి హాని చేయబోరని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపించాలనే ఆలోచనతోనే సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సచివాలయాల ఏర్పాటు ఓ చరిత్ర: గోపిరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక సచివాలయం ఉండే దశ నుంచి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 10,700 సచివాలయాలను తీసుకురావటం ఒక చరిత్ర అన్నారు. ప్రజల ముగింటకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పరిపాలన తీసుకురావటం సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇక అతిథులు కేక్ కట్‌చేయగా, వారిని ఉద్యోగులు సన్మానించారు. -
రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్ పర్యటన
నరసరావుపేట: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయ లబ్ధి కోసమే నరసరావుపేట వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో మూడు గ్రూపులతో సతమతమవుతున్న టీడీపీని రక్షించుకునేందుకే వస్తున్నాడు తప్ప.. ఆయనకు మహిళల రక్షణపై ఎటువంటి ఆపేక్ష లేదని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో గోపిరెడ్డి మాట్లాడుతూ.. లోకేశ్ తీరుపై నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి, తహసీల్దార్ వనజాక్షి, వైద్య విద్యార్థిని సంధ్య ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పి నరసరావుపేటలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న లోకేశ్ తండ్రి పంచాయితీలు చేశాడే కాని బాధితుల కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా అని నిలదీశారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రమ్య విషాద ఘటన గుంటూరులో జరిగిందని, అంత బాధ్యత ఉంటే అక్కడే ధర్నా చేసుకోవాలని సూచించారు. రమ్య ఉదంతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యతగా స్పందించినా టీడీపీ నాయకులు శవాన్ని అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి సత్వర న్యాయం చేసిందన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశంసించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి నేరుగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా ఏనాడూ చంద్రబాబు బాధ్యతగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది? నాడు రిషితేశ్వరి తన ఆత్మహత్యకు డైరీలో కారణాలు రాసిందని, ప్రిన్సిపాల్ బాబూరావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే గోపిరెడ్డి గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నాడు ఒక్క రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదన్నారు. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో సైకో ప్రొఫెసర్‌పై బహిరంగ ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు, ఆయనను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు శవ రాజకీయాల కోసం అమాయక ప్రజల మాన, మర్యాదలను మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. దిశ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందని, దేశంలో ఏ రాష్ట్రంలో స్పందించని విధంగా ప్రభుత్వం స్పందిస్తోందని తెలిపారు. ఆదుకోవాల్సిన కుటుంబాలను రాజకీయ దుమారాలతో రోడ్లపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. నరసరావుపేట టీడీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని, వాటి మధ్య టీడీపీ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పార్టీ మనుగడ కోసమే లోకేశ్ నరసరావుపేటకు వస్తున్నారన్నారు. -
వికేంద్రీకరణ వికసిస్తేనే అభివృద్ధి ఫలాలు
మూడు రాజధానులనే విత్తనాలు నాటితే పాలన వికేంద్రీకరణ మొక్కలు పుష్పించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తాయని చెబుతూ.. గులాబీ పువ్వులను ప్రజలకు అందజేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పుష్పాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా వివిధ వర్గాల ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. – సాక్షి నెట్వర్క్ ప్రచార రథం ప్రారంభం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలపై రాష్ట్రమంతటా చర్చ నడుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెకండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ నార్త్ అమెరికా (ఏపీ జీఎస్‌ఆర్‌ఎన్‌ఏ) ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణ జరగాలి.. రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలి’ అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథాన్ని రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగేళ్లలో దశాబ్దపు అభివృద్ధిని చూపాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రజలంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా కుంగిన రాష్ట్రాన్ని మరింత కుంగదీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ విభాగం, యువకులు, ఉత్సాహవంతులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ముందుకు కదలటం సంతోషదాయకమన్నారు. నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పండుకాయల రత్నాకర్ మాట్లాడుతూ.. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు. వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా గుంటూరులో విద్యార్థులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను కూడా అందజేశారు. నరసరావుపేట మార్కెట్ సెంటర్లో మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. విశాఖపట్నంలో పలుచోట్ల విద్యార్థులు గులాబీ పువ్వులు, కరపత్రాలు పంపిణీ చేశారు. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ఆనందపురం, తగరపువలస, అచ్యుతాపురం మండలం మల్లవరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. చోడవరం, రావికమతం మండలం కొత్తకోటలో వంటావార్పు నిర్వహించగా.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరై సంఘీభావం తెలిపారు. విజయనగరంలో చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో వాహన చోదకులు, పాదచారులకు గులాబీ పువ్వులు, అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. జిల్లాలోని నెల్లిమర్ల, సాలూరు, గజపతినగరం, పార్వతీపురంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ప్రజలకు గులాబీలు పంచిపెట్టారు. ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు హాజరై సంఘీభావం ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేసి వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరై మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా భామిని, రాజాంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాదరావు సంతాప సభను రాజకీయ సభగా మార్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆత్మహత్యకు చంద్రబాబు, కోడెల పిల్లలే కారణమంటూ ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్లి పలకరించలేదని గుర్తుచేశారు. ఒకవేళ పలకరించి ఉంటే చనిపోయేవారు కాదని వ్యాఖ్యానించారు. కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే ఆయన కూతురు, కొడుక్కి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవులను ఇవ్వాల్సింది కదా? ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు చులకన చేసి మాట్లాడుతున్నారని, ఆయనకు వయస్సు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ప్రివిలైజేషన్ కమిటీకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు
సాక్షి, అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలని కోరడానికి గవర్నర్‌ను కలవాలన్న టీడీపీ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మూడు నెలలుగా తన దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పరామర్శకు వెళ్లని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఈ ప్రశ్నలు అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ ఎమ్మెల్యేలు అంబటి, గోపిరెడ్డి 20 ప్రశ్నలను సంధిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు అంబటి, గోపిరెడ్డి సంధించిన ప్రశ్నలు : 1. గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా? 2. కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా? 3. అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా? 4. కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు? 5. గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే ట్యాక్స్ వసూలు చేశారా? లేదా? 6. గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా? 7. గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా? 8. ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు? 9. కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? 10. కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా? 11. కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా? 12. చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లడిల్లి పోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా? 13. వేధింపులు అంటే ఎలా ఉంటాయో, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో మీరే ప్రపంచానికి చెప్పారు కదా? మీరు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ సొంతమామని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందికి లాగినప్పుడు ఆయన వేదన గురించి ఏ రోజైనా ఆలోచించారా? ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని ఎన్నికలు అయిన ఏడాదికి లాక్కుని ఎన్టీఆర్ మరణానికి మీరు కారకులయ్యారని సాక్షాత్తూ ఆయన భార్యే ఇవ్వాల్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కాని, ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు లేదు? 14. కోడెల శివప్రసాద్ గారిది హత్యా? లేక ఆత్మహత్యా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? చంద్రబాబు పాత్ర ఏమిటి? అనే అంశాలమీద సీబీఐ విచారణ జరిపించమంటారా? 15. కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాలమీద సీబీఐ విచారణ జరపమంటారా? 16. అసలు సీబీఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ మీరు ప్రతిజ్ఞచేసి, జనరల్ పర్మిషన్ను ఉపసంహరించుకుంటూ జీవోలు కూడా జారీచేశారు కదా? మరి మీకు సీబీఐమీద నమ్మకం ఎప్పుడు కుదిరింది? 17. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరని.. ఆయనకు ఏ హక్కు ఉందని జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన మీరు.. అసలు గవర్నర్ వ్యవస్థ నే రద్దు చేయమని చెప్పిన మీరు.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారు? 18. బీజేపీ నేతలు రఘురాం సహా మరికొందరు చెప్పిన దాని ప్రకారం మీరు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కోడెలే స్వయంగా చెప్పారు. మరి సీబీఐ విచారణ అంటూ జరిగితే ఏ1 గా హాజరుకావాల్సింది మీరే చంద్రబాబు గారు. అందుకు మీరు సిద్ధమా? 19. చివరకు నిన్న కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడిచేయడానికి మీరే పురిగొల్పారు. మరీ దిగజారిపోయి మూడురోజులపాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేయలేదా? 20. బహుశా నిజాలు బయటకు రావన్న నమ్మకంతోనే మీరు ఈ కార్యక్రమాలన్నింటికీ పూనుకున్నారు. కాబట్టి కోడెల శివప్రసాదరావు అరాచకాలమీద, అతని కుటుంబ సభ్యుల అరాచకాలమీద, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద మొత్తంగా మీ పాత్రమీద సీబీఐ విచారణ కోరండని మేమే చంద్రబాబుకు సలహా ఇస్తున్నాం. -
‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు దిగారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో జరిగిన అరాచకాలపై చర్ఛకు తాము సిద్దమని, చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సత్తనపల్లి, నరసరావు పేటలో ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలు మరిచిపోలేదన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరు తప్పుడు కేసులు పెట్టారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు మైనింగ్ మాఫియాగా మారి గనులను దోచుకున్నారని ఆరోపించారు. సత్తెనపల్లి, నరసరావు పేటలో కోడెల చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కాదన్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలను గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా కనీసం ఓటును కూడా వేయకుండా చేశారని మండిపడ్డారు. పోలీసులు కూడా టీడీపీ వాళ్లకే సహకరించారని విమర్శించారు. రౌడీ షీటర్లను తీసుకొచ్చి పునరావాస మీటీంగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. -
నోట్ దిస్ పాయింట్
సాక్షి, నరసరావుపేట : పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తనను కలిసేందుకు శాలువాలు, బోకెలు, ఇతర సన్మాన సామగ్రితో రాకుండా నోట్ పుస్తకాలతో రావాల్సిందిగా సూచించారు. నిత్యం నియోజకవర్గం నుంచి ఎందరో పార్టీ నాయకులు, అధికారులు తనను కలిసేందుకు వస్తూ దండలు, బోకెలను తీసుకురావడాన్ని గమనించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా, వైద్యానికి ఇస్తున్న అధిక ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యిగా ఉడతా సాయంగా విద్యాభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. తన వద్దకు వచ్చే సందర్శకులను బొకెలు, పూలదండలకు బదులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు వంటి విద్యా సామగ్రితో కలవాల్సిందిగా పిలుపునిచ్చారు. విశేష స్పందన.... పేద విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇచ్చిన పిలుపుతో అధికారులు, పార్టీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన ప్రతిసారి నోట్ పుస్తకాలతో హాజరవుతున్నారు. గత పదిహేను రోజుల్లో దాదాపు ఎనిమిది వేల నోటుపుస్తకాలు ఈ విధంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ఇలా లభించిన నోట్ పుస్తకాలను మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 29 మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఈ పుస్తకాలను అందిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని 17 పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ పూర్తయింది. గోపిరెడ్డి చారిటీస్ ద్వారా... దాతలు అందించిన 8వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేయగా మిగిలిన పాఠశాలలకు గోపిరెడ్డి చారిటీస్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి తన సొంత నిధులతో మరో 8 వేల పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో మున్సిపాలిటి పరిధిలోని అన్ని పాఠశాలలకు నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన విద్య ద్వారానే పేదిరికాన్నినిర్మూలించవచ్చని బలంగా నమ్మే కుటుంబం మాది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాతండ్రి మా ముగ్గురు అన్నదమ్ములు, సోదరికి విద్యనే ఆస్తిగా ఇచ్చారు. ఇప్పుడు సమాజంలో గౌరవస్థానాల్లో ఉన్నాం. అటువంటి విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భవిష్యత్‌లో మరికొన్ని కార్యక్రమాలను తీసుకురాబోతున్నాం.. – ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత
-
‘బైఎలక్షన్కు చంద్రబాబు సిద్ధమా?’
సాక్షి, గుంటూరు: ఆంధ్రపదేశ్‌లో అధ్వాన్నమైన పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బోగస్ సర్వేలతో టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారన్నారు. నిజంగా రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉంటే బై ఎలక్షన్లకు చంద్రబాబు సిద్ధమా?.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. -
నర్సరావుపేటలో రాస్తారోకో
మహానేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానిన ధ్వంసం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ.. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద గుంటూరు-వినుకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రులకు హక్కులా భావించాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికోసం పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గమధ్యలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఐటీ, ఇతర పరిశ్రమలు వస్తాయని తద్వారా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, టీడీపీ నాయకులు చేసిన వాగ్దానాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న ఢిల్లీలో చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయండి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుందని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మిట్టపల్లి రమేష్ శుక్రవారం మ్మెల్యే గోపిరెడ్డిని బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి పూలదండలు వేసి కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రమేష్‌కు సూచించారు. రమేష్ మాట్లాడుతూ నమ్మకంతో తనకు పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, సహకరించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ నాయకులు కపలవాయి విజయకుమార్, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పట్టణ అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావులు హాజరయ్యారు. పలువురు పార్టీ నాయకులు మిట్టపల్లి రమేష్‌ను ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, సి.వి.రెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, ఎన్‌కె.ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర తదితరులు రమేష్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఉద్రిక్తతల నడుమ 'జన్మభూమి' వాయిదా
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావు పేటలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్లెక్సీలు ఉంచడంపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలను తొలగించాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు తొలిగించమని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ప్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నతాధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మరింది. జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.