
ఆంధ్రపదేశ్‌లో అధ్వాన్నమైన పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
సాక్షి, గుంటూరు: ఆంధ్రపదేశ్‌లో అధ్వాన్నమైన పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బోగస్ సర్వేలతో టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారన్నారు. నిజంగా రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉంటే బై ఎలక్షన్లకు చంద్రబాబు సిద్ధమా?.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.