వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయండి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుందని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మిట్టపల్లి రమేష్ శుక్రవారం మ్మెల్యే గోపిరెడ్డిని బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి పూలదండలు వేసి కృతజ్ఞతలను తెలిపారు.
ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రమేష్‌కు సూచించారు. రమేష్ మాట్లాడుతూ నమ్మకంతో తనకు పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, సహకరించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ నాయకులు కపలవాయి విజయకుమార్, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పట్టణ అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావులు హాజరయ్యారు.
పలువురు పార్టీ నాయకులు మిట్టపల్లి రమేష్‌ను ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, సి.వి.రెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, ఎన్‌కె.ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర తదితరులు రమేష్‌ను కలిసిన వారిలో ఉన్నారు.