Government Administration
-
పారదర్శకంగా పాలనా వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రజలపై ప్రభుత్వ పరిపాలన ప్రభావాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిస్థాయిలో విధానాలను, ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా పాలనా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా తీర్చదిద్దడానికి శ్రమిస్తున్నామని అన్నారు. సుపరిపాలనా వారం(సుశాసన్ సప్తాహ్) సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు దేశ ప్రజలకు సందేశామిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ దాకా సుపరిపాలనా వారం జరుపుకోనున్నారు. ‘ప్రజలే కేంద్రంగా’ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, దరఖాస్తుల స్వీకరణ–పరిష్కారం, సుపరిపాలనా విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాలం చెల్లిన వేలాది చట్టాలను రద్దు చేశామన్నారు. అనవసర విధానాలు, పద్ధతులకు స్వస్తి పలికామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రజలు సాధికారత సాధించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. -
చాటుమాటు పాలన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. ప్రభుత్వ పరిపాలన రోజురోజుకు గోప్యమవుతోంది. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు ప్రజలు తెలుసుకోడానికి అందుబాటులో తెచ్చిన జీఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్) వెబ్సైట్లో జీవోల నమోదు క్రమంగా తగ్గిపోతోంది. గత మూడేళ్లలో వెబ్సైట్లో జీవోల అప్లోడ్ తంతు మూడో వంతుకు పడిపోయింది. చిన్నాచితకా అంశాల జీవోలు మినహా.. పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలకు సంబంధించిన కీలక జీవోలను బహిర్గతం చేయడం లేదు. పాలనలో పారదర్శకత పాటిస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు.. కీలక నిర్ణయాలు, ఆదేశాల జారీలో మాత్రం గోప్యత పాటిస్తోంది. 2017లో 8,600 జీవోలే 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి 21,702 జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయగా.. 2017లో కేవలం 8,696 జీవోలే అప్లోడ్ అయ్యాయి. ఈ లెక్కన మూడేళ్లలో జీవోల సంఖ్య మూడో వంతుకు పతనమైంది. పాలనాపర అంశాలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేస్తున్నా.. వాటిని వెబ్సైట్లో మాత్రం అప్లోడ్ చేయడం లేదు. సాంకేతిక విభాగం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతోనే జీవోలు ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెండు, మూడేళ్లుగా వెబ్సైట్లో కనిపించడం లేదు. ఉన్నతాధికారుల బదిలీలు, కొందరి నియామకాలు, పదోన్నతులు, శాఖాపరమైన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జీవోలు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదు. కొన్ని ఆయా శాఖల ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా ఆ వెబ్సైట్లపై అవగాహన లేక వివరాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. కుప్పలుతెప్పలుగా సాధారణ జీవోలు చిన్నాచితకా ఉత్తర్వులే వెబ్సైట్లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులకు టీఏ, డీఏ మంజూరు, పేపర్ బిల్లుల చెల్లింపులు, స్టేషనరీ, లేబర్ కేసుల వివరాలు వందల్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ.. ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. త్వరలో ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు. -
2016 ఆశలు-ఆశయాలు
నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన అధికారులు ఏమనుకుంటున్నారు.. కొత్త సంవత్సరంలో వారి ఆశలు, ఆశయాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి. కొత్త సంవత్సరంలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అందరూ కాంక్షించారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే.. - సాక్షి, హైదరాబాద్ రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. వరుణ దేవుడు కరుణించాలి. మంచి వర్షాలు కురవాలి. పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి. అవినీతి రహిత, నిర్లక్ష్య రహిత పాలన ఉండాలి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఎక్కడ అవినీతి జరుగుతుందో గుర్తించి కట్టడి చేయాలి. లంచం ఇచ్చే వారికి శిక్షలు వేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తిరుపతిలోనే న్యూ ఇయర్ : భన్వర్‌లాల్, ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి ప్రతి ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తాను. దాదాపు 20 ఏళ్లుగా డిసెంబర్ 31 లేదా జనవరి 1న తిరుపతికి వెళ్తున్నా. ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అక్కడే. కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో ఎన్నికల కమిషన్ ముందున్న లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఏపీలో చిత్తూరు ఎమ్మెల్సీ సీటు ఒకటి ఖాళీగా ఉంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక నిర్వహించలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఎన్నిక జరుపుతాం. ఫిబ్రవరి 25 లోపు తెలంగాణలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాం. 2016 మార్చి 11న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. జనవరి 25న రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తాం. బెస్ట్ పోలీసింగ్.. ఇదే మా విజన్ : అనురాగ్ శర్మ, డీజీపీ రాష్ట్ర పోలీసు విభాగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. కొత్త రాష్ట్రానికి మొదటి డీజీపీగా అరుదైన అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అనేలా చేయాలన్నదే ఆకాంక్ష. బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పట్టణీకరణ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైబర్‌క్రైం అదుపు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మావోయిజం, ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన విఘాతంగా మారినట్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతిమంగా మా లక్ష్యం ప్రజా శ్రేయస్సు.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ప్రజల సహకారంపైనే ఆశలు బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ నూతన సంవత్సరంలో హైదరాబాద్ నగర ప్రజల సహకారంపైనే ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నా. పురపాలనలో ప్రజల సహకారం లేనిదే ఏ పని విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని పొందడమే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని. కొత్త ఏడాదిలో ప్రజల నుంచి మంచి భాగస్వామ్యం పొందుతామని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎక్కువగా ప్రభుత్వ రవాణా వాహనాలను వినియోగించటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించటం.. తదితర అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్యకరమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దటమే నా ప్రధాన ధ్యేయం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఓ భరోసా. వారి మనోగతానికి తగ్గట్టుగా రైళ్లను నడపడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచటమే కొత్త సంవత్సరంలో మా కర్తవ్యం. సకాలంలో భద్రంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు 24 గంటల పర్యవేక్షణకు మరింత పదును పెడతాం. సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుత్‌ను ఆదా చే స్తూ, పర్యావరణానికి మేలు చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తాం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తే దేశం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. అందుకే అంతా స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేద్దాం. హరిత భారత నిర్మాణంలో పాలు పంచుకుందాం. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రైల్వే క్లబ్లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటా. 2016.. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు విభాగం వచ్చే ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటుంది. పోలీసు విధి నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలను అరికట్టేందుకు, జరిగిన నేరాలకు కొలిక్కి తీసుకురావడంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కాప్ లెస్ జంక్షన్స్ విధానాన్ని అమలు జరుగుతోంది. పోలీసు ప్రమేయం లేకుండా వాహనచోదకులు తమంతట తామే నిబంధనలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కనిపించకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడతాం. నగర పోలీసుకు సంబంధించి 2016 ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆకాంక్షించారు. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలి. అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకెళ్లాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి. -
రోజూ 10 లక్షల మందికి అన్నదానం
కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు - ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తాం - ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కర స్నానం - వర్తక, వాణిజ్య సంఘాలు ముందుకు రావాలి - ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల ముకరంపుర : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. గోదావరిలో నీటి కొరత దృష్ట్యా ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5కోట్ల మంది జిల్లాలో పుష్కరస్నానాలకు వచ్చే అవకాశముందన్నారు. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్రంలో రూ.600 కోట్లతో పలు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 13న ధర్మపురి చేరుకుని రాత్రి బస చేస్తారని, 14న ఉదయం 6.26 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరిస్తారని పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సేవలందించేందుకు ముందుకు రావాలి పుష్కరాల్లో రోజుకు 10లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం దాతలు, స్వచ్చంద సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగరావుతో పాటు బాధ్యులు ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల వద్ద ఉద్యోగులకు, ఇతర భక్తులకు రోజుకు 2-4 వేల మందికి అన్నదానం చేసేందుకు సహకరిస్తామన్నారు. జువెల్లరీ అసోసియేషన్ బాధ్యులు రమేష్ మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కంకర క్రషర్ సంఘం ప్రతినిధి అంజయ్య రూ.2లక్షలు విరాళం అందిస్తామన్నారు. ఐఎంఏ బాధ్యులు అవసరమైన వైద్యసిబ్బందితో క్యాంపులు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రైవేట్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా వైద్యశాఖ సూచనల మేరకు అన్నివిధాలా సహకరిస్తామన్నారు. వెల్గటూర్ కంకర ప్రెషర్ యాజమాన్య బాధ్యులు చక్రవర్తి కోటిలింగాల వద్ద 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని, పుష్కరఘాట్లకు ప్రెషర్ డస్ట్‌ను పంపిస్తామని అన్నారు. దాతలు అందించే సేవా కార్యక్రమాలను డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు పర్యవేక్షిస్తారని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. -
చేతగాని మంత్రులు రాజీనామా చేయాలి
సీపీఐ రైతు సంఘం నాయకుల డిమాండ్ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ జిలాల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని విత్తన పంపిణీ కేంద్రం వద్ద గురువారం సంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 3.28 లక్షలు క్వింటాళ్లు కేటాయించినా కనీసం 2 లక్షల క్వింటాళ్లు కూడా పంపిణీ చేయకుండానే కార్య క్రమాన్ని ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా కొనసాగడం కన్నా రాజీనామా చేయడం మేలన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రెండో విడత, మూడో విడత విత్తన పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరెడ్డి, రఘురామయ్య, నాగరాజు, వెంకటనారాయణ, వెంకటేష్‌నాయక్, సీపీఐ నాయకులు మస్తాన్, ఎర్రిస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
తెలంగాణ @ ఏడాది ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో అష్టకష్టాలు పడ్డారు. భూమిపై, వనరులపై హక్కు కోల్పోయి బానిస బతుకులు బతికారు. ఈ క్రమంలో ‘మనమంతా ఏకమవుదాం. మన రాష్ట్రం మనం సాధించుకుందామంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు.., వేలు, లక్షల ప్రజల్లో ఆశ రేపింది. ఒక్కొక్కరు వేలు, లక్షలై కదిలారు. అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమలు నోచుకో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కేసీఆర్ పాలన ‘కొంచెం ఇష్టం...కొంచెం కష్టం’గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. - నిజామాబాద్ అర్బన్ ♦ కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం ♦ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ♦ వేడుకలకు సన్నద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం ♦ హామీలు అమలు అంతంతే నైరాశ్యంలో ప్రజలు రుణమాఫీపై కొర్రీలు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కేసీఆర్ మొదట రైతుల రుణ మాఫీ అంశంపై నెల రోజుల పాటు తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన రైతులకు సంబంధించిన 1786 కోట్ల 96 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యూయి. ఇంతవరకు బాగానే ఉన్నా తొలి విడతగా 25 శాతం మాత్రమే రుణాలు మాఫీ చేశారు. దీంతో జిల్లాకు 446 కోట్ల 74 లక్షలను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. వీటిలో సరైన ఆధారాలు చూపిన 3 లక్షల 98 వేల మంది రైతులకు 401 కోట్ల 30 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో చిన్న చిన్న లోపాలు ఉన్న రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రుణమాఫీ డబ్బులు మొత్తం చెల్లించకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు రైతును ఇబ్బందికి గురిచేస్తున్నారు. పాత రుణం తీర్చితేనే కొత్త రుణం అని నిక్కచ్చిగా చెబుతున్నట్టు రైతులు వాపోతున్నారు. మిగిలిన రుణమాఫీ సొమ్మును త్వరలో రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు జమచేయలేకపోయూరు. కల్యాణ లక్ష్మి, షాదీ ‘ముబారక్’ సమాజంలో ఆడపిల్ల అంటేనే భారంగా భావించే తల్లిదండ్రులకు గొప్ప వరంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఆడపిల్లల పెళ్లి చేయూలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ పథకాలను రూపొందించింది. పెళ్లి సమయంలో వీరికి రూ. 51 వేలు అందజే స్తారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి 96 దరఖాస్తులు రాగా, 61 మందికి 51 వేల రూపాయల చొప్పున 31 లక్షల 11 వేలు మంజూరు చేశారు. ఇంకా 35 పరిశీలనలో ఉన్నాయి. షాదీ ముబారక్‌లో 244 దరఖాస్తులు రాగా, 30 మందికి 51 వేల రూపాయల చొప్పున 15 లక్షల 30 వేలు మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కాస్త చొరవ చూపుతున్నట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి పెళ్లి సమయూనికి డబ్బులు అందేలా కృషి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. మిషన్ కాకతీయ కాకతీయుల కాలం నాటి చెరువులు ఆంధ్ర పాలకుల పాలనలో నిరాధరణకు గురయ్యూరుు. వీటికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. జిల్లాలో 3251 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటి దశలో 20 శాతం చెరువుల్లో పునరుద్దరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, చెరువులు సర్వే చేసి దశల వారీగా ప్రభుత్వం అనుమతి పంపడానికే నెలల కొద్దీ సమయం పట్టింది. పరిపాలన అనుమతి ఇవ్వడంలోనూ జాప్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 661 చెరువులకు మాత్రమే అనుమతి లభించింది. వీటిలో 519 చెరువుల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన 142 చెరువుల పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇలా అయితే వేల సంఖ్య లో ఉన్న చెరువులు పూర్తవ్వాలంటే మరో ఐదేళ్ల సమయం కావాల్సిందే అని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆసరా పింఛన్ల గోస గత ఏడాది నవంబర్‌లో ఆసరా పింఛన్ పథకం ప్రారంభించారు. పథకం ప్రారంభానికి ముందు చేపట్టిన సకల జనుల సమ్మెతో చాలా మంది పింఛన్ దారులను అనర్హులుగా గుర్తించారు. అర్హులకే పింఛన్ వర్తించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత కార్మికులు మొత్తం 3 లక్షల 86 వేల 544 మందికి నెలకు వెయ్యి చొప్పున పింఛన్లు పింఛన్లు, వికలాంగులకు నెలకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా పింఛన్ రాని వారు అన్ని అర్హతలు కలిగి ఉంటే విచారణ చేపట్టి మంజూరు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. వీరితో పాటు బీడీ కార్మికుల కోసం జీవన భృతి పింఛన్ పథకం ప్రవేశపెట్టారు. ఇందులో 2,70,633 మంది బీడీ కార్మికులు ఉండగా, 1,14,208 మంది జీవన భృతి పొందుతున్నారు. అయితే, వీరికి పింఛన్ మంజూరు చేయడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో చాలా మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ అంశంపై చాలా చోట్ల నిరసనలు, ధర్నాలు నేటికీ కొనసాగుతున్నారుు. అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకుంటే అర్హులకు పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నారు. నల్లా నీళ్లొచ్చేనా..? ప్రతి ఇంటికి నల్లా’ హామీలు పకడ్బంధీగా అమలు చేసేందుకు ‘వాటర్‌గ్రిడ్’ను పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి జిల్లాను రెండు సెగ్మెంట్లుగా విభజించారు. ఒక సెగ్మెంట్‌కు సింగూర్ జలాశయం నుంచి 16 మండలాలకు రూ. 1710 కోట్ల అంచనా వ్యయంతో , రెండో సెగ్మెంట్‌కు శ్రీరాంసాగర్ జలాశయం నుండి 20 మండలాలకు రూ.1765 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు పనులు ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ తాగునీటి సరఫరా ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణంలో తాగునీరు సదుపాయాల గురించి 4 పనులను రూ. 232 కోట్ల 47 లక్షల వ్యయం తో చేపట్టగా నిజామాబాద్ పట్టణానికి సం బంధించిన పనులు పూర్తయ్యూయి. ఈ పథకం అమలుకు కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలో ఓటు అడుగను అని నిక్కచ్చిగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సాధారణ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా వచ్చేలా ఉందని పలు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భూమి ఎప్పుడిత్తరో..! భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయూధారిత మూడెకరాల భూమి పంపిణీ చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూమిని కొనుగోలు చేసేందుకు సమాయత్తమైంది. పంపిణీ చేసిన భూమిలో బోరు, మోటారు, కరెంటు కనెక్షన్ లాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మొదటి ఏడాది పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెడుతుందని, సదరు భూముల్లో భూసార పరీక్షలు, భూగర్భ జల పరీక్షలు జరుపుతామని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 16 మందికి మాత్రమే 48 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అర్హులైన వారు ఎంతో మంది ఉన్నా వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యూరనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆవిర్భావ వేడుకల్లోనైనా అర్హులైన దళితులను గుర్తించి వారికి భూమి పంపిణీ చేయూలని పలువురు దళిత నేతలు కోరుతున్నారు. కేసీఆర్ ప్రధాన హామీలు:- ⇒ రైతుల రుణాలు మాఫీ ⇒ వృద్ధులు, వికలాంగుల పింఛన్ పెంపు ⇒ బీడీ కార్మికులకూ పింఛన్ ⇒ ఇంటింటికి నల్లా ⇒ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్య ⇒ దళితులకు మూడెకరాల భూమి -
వానొస్తే అంతే!
♦ చిన్నపాటి చినుకులకే పొంగుతున్న నాలాలు ♦ కానరాని ముందు జాగ్రత్త చర్యలు ♦ మేలుకోని అధికారులు ♦ వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు సాక్షి, సిటీబ్యూరో : ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పారిశుధ్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా చెత్త, డెబ్రిస్‌ను భారీ మొత్తంలో తరలిస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు కొంత మెరుగయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ఈ పని పేరిట దాదాపు నెల రోజులుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం మిగిలిన పనులను పక్కన పెట్టేసింది. సమస్త సిబ్బంది ఈ కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారు. దీంతో మిగతా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పేటట్టు లేదు. వానా కాలంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వేసవిలోనే కొన్ని పనులు పూర్తి చేయాలి. నాలాల్లో పూడిక తొలగింపు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా అవసరమైన మరమ్మతులు, వర్షాలు అధికమైతే ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాల నియామకం తదితరమైనవి వీటిలో ఉన్నాయి. శిథిల భవనాలను తొలగించే పనులూ వేసవిలోనే పూర్తి చేయాలి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. నగరంలో ముంపు సమస్యలకుప్రధాన కారణం నాలాలు. స్వచ్ఛ హైదరాబాద్‌లో సీఎం పర్యటనలో సైతం ప్రజలు నాలాలతో తలెత్తే ఇబ్బందులనే ప్రధానంగా ప్రస్తావించారు. వీటిలో పూడిక పేరుకుపోయి... నాలుగు చినుకులు పడినా... రాదారులు గోదారులు కావడం... తాగునీరు-మురుగునీరు కలిసిపోవడం... ఇళ్లలోకి నీరు చేరడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నాలాల్లో పూడికతీత పనులను గత ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవి సగం కూడా పూర్తి కాలేదు. మరవైపు వర్షాకాలం ముంచుకొస్తోంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక చేసేందుకు కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారు. కొంత వెసులుబాటు చేసుకొని వానాకాల సమస్యల నిరోధంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ►రోడ్లపై నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోనంత వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదు. వర్షం వెలిశాక గంట తర్వాత కూడా నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాల జాబితాను ట్రాఫిక్ పోలీసులు అధికారులకు అందజేశారు. వాటిల్లో 40 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటి మరమ్మతులు మాత్రం పూర్తి కాలేదు. ఈ జాబితాలో కిమ్స్ ఆస్పత్రి, డీవీ కాలనీ, సీతాఫల్మండి-ఆడిక్‌మెట్, మెహదీ ఫంక్షన్‌హాల్, రవీంద్రభారతి(ఫ్రీలెఫ్ట్), తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా ఫ్లోర్‌మిల్, పిల్లర్ నెంబర్ 78-80, 102 నుంచి లంగర్‌హౌస్, బాపూ ఘాట్ న్యూబ్రిడ్జి, బేగంబజార్ పీఎస్ తదితరమైనవి ఉన్నాయి. ►నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించించుకుపోయాయి. ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. ►‘వర్షాకాల విపత్తు నిర్వహణ’ చర్యలకు అవసరమైన ఏర్పాట్లూ లేవు. ►దాదాపు 800 శిథిల భవనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కూల్చివేయడమో... అవసరమైన మరమ్మతులు చేయడమో లేదు. వర్షం వస్తే వాటితో ప్రమాదం పొంచి ఉంది. ►సెల్‌టవర్లు, హోర్డింగ్‌ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై శ్రద్ధ చూపాలని గత సంవత్సరమే నిర్ణయం తీసుకున్నా... అమలు చేస్తున్న దాఖలా లేదు. -
నేడు సీఎం ప్రజెంటేషన్
ముంబై: తన ప్రభుత్వ పరిపాలన తీరు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పనితీరును సమీక్షించాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ ప్రక్రియంతా అని మంత్రాలయ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ధరల పెరుగుదల, గతేడాది వేసవిలో కరువు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలు, విదర్భలో తరచూ వరదలు వచ్చినప్పుడు తీసుకున్న సహాయక చర్యలు గురించి పార్టీ అధిష్టానానికి సీఎం చవాన్ వివరిస్తారని చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కొత్తగా తీసుకొచ్చిన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం ఎలా అమలుచేయనుందన్న విషయాలను కూడా చెబుతారని వెల్లడించారు. -
18వ రోజు కొనసాగిన ఆందోళనలు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రజల్లో సమైక్య ఆకాంక్ష రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు 18వ రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కా ర్యాలయాలు తెరుచుకోలేదు. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఉద్యోగులంతా కలెక్టరేట్ ముందు ఆటా పాట నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక కోట జం క్షన్ వద్ద 10 బెలూన్లపై జై సమైక్యాంధ్ర నినాదాలు రాసి ఎగురవేశారు. రాజ్యసభ సభ్యుడు వీహెచ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యు త్ భవనం నుంచి ఉద్యోగులంతా విజిల్స్ ఉదుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు మేల్కొనాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఆవరణలో మానవహారం నిర్వహించిన అనంతరం బొత్స, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశా రు. ఆర్అండ్బీ ఉద్యోగులు కళ్లకు గంతలు, నోటికి మాస్కు లు వేసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించగా.. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. చీపురుపల్లిలో మహిళా ఉపాధ్యాయులు ప్రధాన రహదారి మోకాళ్లపై నడుస్తూ, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు . గజపతినగరం నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతు గా బైక్ ర్యాలీలు జరిగాయి. బొబ్బిలిలో సమైక్యవాదులు రోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మకు కోడిగుడ్లు, టమోటా పళ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్ర దర్శన నిర్వహించారు. రామభద్రపురం మండలంలో వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీల నిరసన దీక్షలు కొనసాగుతుండగా, రోడ్డుపై ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగించారు. పార్వతీపురంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా ముగిసింది.