విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రజల్లో సమైక్య ఆకాంక్ష రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు 18వ రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కా ర్యాలయాలు తెరుచుకోలేదు. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఉద్యోగులంతా కలెక్టరేట్ ముందు ఆటా పాట నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక కోట జం క్షన్ వద్ద 10 బెలూన్లపై జై సమైక్యాంధ్ర నినాదాలు రాసి ఎగురవేశారు. రాజ్యసభ సభ్యుడు వీహెచ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యు త్ భవనం నుంచి ఉద్యోగులంతా విజిల్స్ ఉదుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు మేల్కొనాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఆవరణలో మానవహారం నిర్వహించిన అనంతరం బొత్స, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశా రు. ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు కళ్లకు గంతలు, నోటికి మాస్కు లు వేసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించగా.. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. చీపురుపల్లిలో మహిళా ఉపాధ్యాయులు ప్రధాన రహదారి మోకాళ్లపై నడుస్తూ, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు
. గజపతినగరం నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతు గా బైక్ ర్యాలీలు జరిగాయి. బొబ్బిలిలో సమైక్యవాదులు రోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మకు కోడిగుడ్లు, టమోటా పళ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్ర దర్శన నిర్వహించారు. రామభద్రపురం మండలంలో వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీల నిరసన దీక్షలు కొనసాగుతుండగా, రోడ్డుపై ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగించారు. పార్వతీపురంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా ముగిసింది.
18వ రోజు కొనసాగిన ఆందోళనలు
Published Sun, Aug 18 2013 4:57 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement