GPT-4
-
‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే..
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దానికి అనువుగా కంపెనీలు అందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు భవిష్యత్తు జనరేటివ్ ఏఐదేనని బలంగా విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు ఉచితంగా ఈ చాట్‌బాట్ సేవలు అందిస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రం ప్రీమియం చెల్లించి వాటి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎలన్ మస్క్ ఎక్స్‌లో ‘గ్రోక్ ఏఐ’అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్‌బాట్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్‌లో సబ్స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్‌కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్‌జీపీటీ కంటే ఎక్స్ ప్రవేశపెట్టిన గ్రోక్ఏఐ చాట్‌బాట్ కొంత ఖరీదుగా ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రోక్ ఏఐతో ప్రత్యేకతలివే.. Edit post Longer posts Undo post Post longer videos Top Articles Reader Background video playback Download videos Get paid to post Creator Subscriptions X Pro (web only) Media Studio (web only) Analytics (web only) Checkmark Encrypted direct messages ID verification SMS two-factor authentication App icons Bookmark folders Customize navigation Highlights tab Hide your likes Hide your checkmark Hide your subscriptions -
2023 పాఠాలు... 2024 ఆశలు
2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఒకపక్క కృత్రిమ మేధ, మరోపక్క రాజకీయ పరివర్తన జోరుగా సాగుతున్న ఈ ఏడాది మనకు మిగిల్చిన జ్ఞాపకాలేమిటి? ప్రపంచం పట్టు తప్పిపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జీపీటీ–4 రావడం ఈ ఏడాది అత్యంత కీలకమైన పరిణామం.ఇక నుంచి కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో 2024ను ఊహించుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న ప్రత్యేక పరిస్థితులు మరిన్ని యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అయితే, వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ‘కాప్’ సమావేశాల్లో అంగీకారం కుదరడం శుభపరిణామం. చాలా దేశాల పౌరులు హ్రస్వదృష్టితో కూడిన జాతీయవాదానికీ, తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసే నేతలకూ పగ్గాలు అప్పగించారు. కోవిడ్–19 పరిస్థితులు ప్రచండంగా ఉన్న సమయంలో టీకాల పేరుతో జాతీయ వాదం ప్రబలింది. ఇదెంత సంకుచితమైనదో ఆ తరువాత కానీ అర్థం కాలేదు. ఇది సాటి మానవుడి బాధను కూడా మరచిపోయేలా చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నా ఎవరికీ పట్టకపోవడం కూడా దీనికి మరో నిదర్శనం. అదుపులేని హింసకు కొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ ఆజ్యం పోస్తున్నాయి. వేగంగా వృద్ధి చెందు తున్న ఈ టెక్నాలజీలు మానవాళి నిశ్చేష్టతకూ దారితీస్తున్నాయనడంలో సందేహం లేదు. కల్పనకూ, వాస్తవానికీ తేడాలు చెరిగి... ఈ ఏడాది మార్చిలో ఓపెన్ ఏఐ జీపీటీ–4ను విడుదల చేసింది. ఇది కాస్తా రక్తమాంసాలతో కూడిన వాస్తవానికీ, కల్పనకూ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేస్తోంది. ఈ డిజిటల్ వాస్తవాన్ని మన అనలాగ్ బుర్రలు ఎలా అర్థం చేసుకోగలవు? 2023 మొత్తమ్మీద అత్యంత కీలకమైన పరిణామం ఇదే అనడం అతిశయోక్తి కాబోదు. 2024లోనే కాదు... ఆ తరువాతి కాలంలోనూ మన జీవితాలను మార్చేసే పరిణామం. జీపీటీ–4 లాంటివి మన జియోపాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ‘‘టెక్నాలజీ అనేది భౌగోళిక రాజకీ యాలపై ప్రభావం చూపడం కొత్త కాకపోయినా, కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో పరిస్థితి సమూలంగా మారనుంది. కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది’’ అని ఓ విశ్లేషకుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రస్తుతం కృత్రిమ మేధే అతిపెద్దది. దీని నియంత్రణ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లో అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేదు. నియంత్రించే శక్తీ లేదు. నియంత్రించాలన్నా ప్రభుత్వాలు ఈ కంపెనీలపైనే ఆధార పడాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలు చాలాకాలంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై గట్టి నియంత్రణ పాటిస్తూ వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. బహుశా చైనా ఈ కృత్రిమ మేధను ఇతరుల కంటే మెరుగ్గా నియంత్రించగలదేమో. కానీ అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధను కూడా తమ పార్టీ లక్ష్యాల సాధనకు పావుగా వాడు కున్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే అది ప్రపంచంలో అధికార అసమతౌల్యానికి దారితీయవచ్చు. ద్వైదీ భావ పరాకాష్ఠలో ప్రపంచం... మానవాళి సంక్షేమానికి అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో మన ఆలోచనా ధోరణులు మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతున్నాయి. దేశాలకు, ప్రాంతాలకు పరి మితమైపోతున్నాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో బహుముఖీన అంతర్జాతీయ సహకారం, సమష్టి బాధ్యతల పంపిణీతోనే మనం ప్రస్తుత సమస్యలను ఎదుర్కోగలం. సమ న్యాయం పాటించగలం. ప్రస్తుతం ప్రభుత్వాతీత శక్తులన్నింటికీ శక్తి మంతమైన హింసాత్మక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్దాడి దీనికో తార్కాణం. బలహీనులు, నిర్వా సితులు కూడా బలంగా దెబ్బకొట్టగలరు అనేందుకు ఇజ్రాయెల్‌పై దాడి ఒక రుజువు. ఉగ్రవాదంపై పోరు ఇప్పుడిప్పుడే అంతమయ్యేది కాదని 2023 మరోసారి నిరూపించింది. ఈ పోరు ఏకరీతిన లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజ్యాంగాలను పక్కనబెట్టిన అన్ని దేశాలూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, తిరుగుబాట్లను సమర్థంగా అణచివేసిన సంఘటనలు చరిత్ర మొత్తం వెతికినా కనిపించవూ అని! చిన్న రాపిడి మళ్లీ నిప్పు పుట్టించడం ఖాయం. ఫలితం తీవ్ర నష్టం, హింస. రాజకీయం ద్వారా హింసను చట్టబద్ధం చేయడం ఎంతమాత్రం తగని పని. అమాయ కులు, మహిళలు, పిల్లలను చంపివేయడాన్ని కూడా సమర్థించే లక్ష్యం ఎంతటి ఉదాత్తమైనదైనా సమర్థనీయం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. హింసను ఆయుధంగా వాడుకోవడం ఎప్పుడూ పులి మీద స్వారీ లాంటిదే. హింస మొదలైతే అది కేవలం తాము ఉద్దేశించిన లక్ష్యాలకే పరిమితమవుతుందని అనుకోలేము. హింస అటు ఆక్రమణదారులనూ, ఇటు బాధితులనూ రాక్షసుల్లా మార్చేస్తుంది. ఈ సత్యాన్ని చాలాకాలం క్రితమే మహాత్మగాంధీ బాగా అర్థం చేసు కున్నారు. ‘అహింస’ భావన ఈ ప్రగాఢమైన అవగాహన నుంచి పుట్టిందే. గాంధీ మాటలను మనం ఎంత విస్మరిస్తామో ప్రపంచంలో అంతేస్థాయిలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒక్క సానుకూల పవనం... ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో చూసిన ఒక సానుకూల అంశం ఏదైనా ఉందీ అంటే అది దుబాయిలో ఇటీవలే ముగిసిన కాప్ సమావేశాలని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మానవాళి జరుపుతున్న కృషిలో భాగంగా జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని ఆశాజనకమైన ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. వీటిని సక్రమంగా అమలు చేయగలి గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామాజిక సుస్థిరత దిశగా మళ్లే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని అందరూ అంగీకరించడం శుభపరిణామం. కృత్రిమ మేధతోపాటు వినూత్నమైన టెక్నా లజీలను అందిపుచ్చుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 2023లో వాతావరణ మార్పుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కల్పించిన ఆశ వచ్చే ఏడాదిలో సఫలీకృతమవుతాయని ఆశిద్దాం. దీన్ని పక్కనపెడితే... ప్రపంచం వచ్చే ఏడాది కూడా కొంత అసందిగ్ధ్దతను ఎదుర్కొంటుందనేందుకు కొన్ని నిదర్శనాలు కనిపి స్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది 2024లోనే. ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. అడ్డంకులు తొలిగి ట్రంప్ పోటీ చేసి గెలిస్తే మాత్రం అగ్రరాజ్యంలో సరికొత్త స్థానిక వాదం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతోపాటు రష్యా ఉక్రెయిన్ జగడమూ వచ్చే ఏడాది మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే విషయంలో అమెరికా కొంత అసందిగ్ధతతో వ్యవహరిస్తూండటాన్ని పుతిన్ గుర్తించక మానడు. తన దాడులను ఉధృతం చేయకుండా ఉండడు. అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలను పర్యవేక్షిస్తూండటం, ఆ దేశంతో మనకున్న సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. పైగా చైనాతో తనకున్న శత్రుత్వాన్ని కొంత తగ్గిగంచుకునే ప్రయ త్నాలు చేయవచ్చు. ఇప్పటికే దీనికి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కారాదని బైడెన్ నిర్ణయించుకోవడం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే క్వాడ్ సమావేశాల వాయిదాను కూడా ఈ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది. కెనెడా ఉగ్రవాది పన్నూ విషయంలో వచ్చిన అభిప్రాయబేధాలూ ఈ ధోరణికి కారణం కావచ్చు. సెప్టెంబరులో విజయవంతంగా నిర్వహించిన జీ20 సమావేశాల ప్రాభవం కాస్తా ఈ పరిణామాలతో తగ్గి పోయింది. మరోవైపు దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రాజకీయ సుస్థిరత 2024లో అంతర్జాతీయ స్థాయిలో మనకు మేలు చేస్తుందని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
Generative AI Battle: చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్‌జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్‌జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్‌జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్‌గా కూడా పని చేస్తుంది. గూగుల్‌కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్‌పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్‌ఎం2 మోడ్‌గా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్‌జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్‌ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్‌పుట్స్‌ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్‌్కలను రియల్‌టైమ్‌లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్‌గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్‌పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్‌జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్‌జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
కృత్రిమ మేధకు పగ్గాలు వేయాలా?
సుమారు 19,000 మంది టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ ‘జనరేటివ్ ఏఐ’పై ఆందోళన వెలిబుచ్చుతూ బహిరంగ లేఖ రాశారు. జీపీటీ4 లాంటి టెక్నాలజీలను కనీసం ఆరు నెలల పాటు నిలిపేయాలని కోరారు. మనం చాలా టెక్నాలజీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మానవ క్లోనింగ్, జన్యుమార్పిడి, అణు టెక్నాలజీలు వీటిల్లో కొన్ని మాత్రమే. కానీ ఈ నిలిపివేత వల్ల ప్రపంచం మొత్తానికి దాదాపుగా ఉచితంగా, అది కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా అందివ్వగల కేంద్రక సంలీన ప్రక్రియను సాకారం చేసే జీపీటీ7, జీపీటీ8 వంటి అత్యాధునిక జనరేటివ్ ఏఐ మోడళ్లు రావడం ఆలస్యం కాదా? అత్యద్భుత మేధతో మాత్రమే పరిష్కారం కాగల పెద్ద పెద్ద సమస్యల మాటేమిటి? అందుకే దీనిమీద గట్టి చర్చ జరగాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. అదొక బెస్ట్ సెల్లర్. అననుకూల వాతావరణంలో మనుగడ కష్టమై బెదిరిపోయిన పిచ్చుకల గుంపు కథ ఇందులో ఉంది. సమస్యలను అధిగమించేందుకు ఆ పిచ్చుకల గుంపు ఓ గుడ్లగూబను దత్తత తీసుకోవాలని నిర్ణయిస్తుంది. ఆ గుడ్లగూబ తమ గూళ్లు కట్టి పెడుతుందనీ, వేటాడేందుకు వచ్చిన జంతువులను భయపెట్టి తరిమే స్తుందనీ, ఆహారాన్ని వెతుక్కునేందుకు సాయపడుతుందనీ ఆ పిచ్చు కలు భావిస్తాయి. ఇదేదో భలే ఉందే అనుకున్న పిచ్చుకల గుంపు గుడ్లగూబ లేదా దాని గుడ్డు వెతకాలని నిర్ణయించుకుంటాయి. అయితే గుంపులో స్క్రాన్ ఫింకెల్ అనే పిచ్చుక ఈ ఆలోచనతో అంగీ కరించదు. గుంపులో గుడ్లగూబ ఉంటే సమస్యలు తప్పవనీ, అందుకే ముందు ఆ గుడ్లగూబను నియంత్రించడమెలా, మచ్చిక చేసుకోవడం ఎలా అన్నది ఆలోచించాలనీ ప్రతిపాదిస్తుంది. మిగిలిన పిచ్చుకలు ఈ అభ్యంతరాలను పట్టించుకోవు. గుడ్లగూబను వెతికి తెచ్చుకోవడమే పెద్ద విషయమనీ, మచ్చిక, నియంత్రణలను ఆ తరువాత చూసు కోవచ్చుననీ అంటాయి. సానుకూల ఫలితాలే ఉంటాయా? అచ్చం ఇలాంటి కథే వాస్తవంలోనూ నడుస్తోంది. కానీ ఇందులో ఇప్పటివరకూ కనీసం 19,000 స్క్రాన్ ఫింకెల్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి... ఈ మధ్యకాలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఛాట్ జీపీటీపై! టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎలాన్ మస్క్, స్టీవ్ వోజ్నియాక్, స్టూవర్ట్ రస్సెల్ వంటి మరెందరో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ జీపీటీ4పై, స్థూలంగా ‘జనరేటివ్ ఏఐ’పై తమ ఆందోళన వెలి బుచ్చారు. అక్కడితో ఆగలేదు. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘పవర్ఫుల్ ఏ.ఐ. సిస్టమ్స్’ పేరుతో ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అన్ని సానుకూల ఫలితాలుంటాయనీ, ఎదురయ్యే ప్రమాదాలను నియంత్రించేందుకు అవకాశముంటుందన్న నమ్మకం కుదిరిన తరువాత మాత్రమే జీపీటీ4 లాంటి టెక్నాలజీలను మరింత అభివృద్ధి చేయాలనీ వారు ఈ లేఖలో స్పష్టం చేశారు. జీపీటీ4ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ‘ఓపెన్ ఏఐ’ స్వయంగా ‘‘ఏదో ఒకదశలో దీనిపై స్వతంత్ర సమీక్ష ఒకటి జరపడం చాలా ముఖ్యమవుతుంది. జీపీటీ4 లాంటి వ్యవస్థలకు మరింత శిక్షణ ఇచ్చే ముందు ఇది జరగాలి. అలాగే ఇలాంటి వ్యవస్థల కోసం ఉపయోగించే గరిష్ఠ కంప్యూటింగ్ శక్తిని కూడా మదింపు చేయాలి’’ అని చెప్పడాన్ని వీరు తమ లేఖలో ఉదహరించారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందన్నది టెక్ దిగ్గజాల అంచనా. ఈ విషయమై కృత్రిమ మేధపై పని చేస్తున్న అన్ని కంపెనీలకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. జీపీటీ4 కంటే ఎక్కువ శక్తిమంతమైన అన్ని కృత్రిమ మేధ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వ డాన్ని కనీసం ఆరునెలలు ఆపాలనీ, అది వెంటనే జరగాలనీ కోరారు. అలా సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా సూచించారు. (అయితే ‘ట్విట్టర్’ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఒక ఏఐ వేదిక ప్రారంభించనున్నట్టూ, దానికి ట్రూత్ జీపీటీ అని పేరు పెడు తున్నట్టూ వెల్లడించడం గమనార్హం). బోస్ట్రోమ్ పిచ్చుకల కథకూ, దీనికీ కొంచెం తేడా ఉందంటారు ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ రాస్ డౌదాట్. పిచ్చుకలకు కనీసం గుడ్లగూబ ఎలా ఉంటుంది, ఏ రకమైన హాని చేయగలదన్న విష యమైనా తెలుసుననీ, జీపీటీ4 వంటి కృత్రిమ మేధ విషయంలో మనకు ఆమాత్రం కూడా తెలియదనీ వివరించారు. ఐఫోన్ , ఫేస్బుక్, టిక్టోక్లు అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా వాటితోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉండగలవని ఎవరు ఊహించారు? ఆచితూచి వ్యవహరించాల్సిన టెక్నాలజీలు జీపీటీ4 లాంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అతితక్కువ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలను ఎలా ప్రదర్శిస్తోందో టెక్ కంపెనీలకు సైతం ఇంకా తెలియకపోవడం గమనార్హం. ‘‘కొంచెం జాగ్ర త్తగా ఉండక తప్పదు. దీని (ఏఐ) గురించి మనమూ భయపడు తున్నామని తెలిస్తే ప్రజలు కొంత సంతోషంగా ఫీల్ అవుతారు’’ అంటారు ‘ఓపెన్ ఏఐ’ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ . ఇదేదో అమాయ కమైన చిన్న పిచ్చుక లాంటి వ్యవహారం కాదు, ప్రమాదకరమైనది అని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. టెక్ దిగ్గజాలు రాసిన బహిరంగ లేఖలో ఒక్క విషయాన్నయితే అంగీకరించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో మనం చాలా టెక్నా లజీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాం. కొన్నింటి పురోగతిని నిలిపివేసే ప్రయత్నమూ చేశాం. మానవ క్లోనింగ్, జన్యుమార్పిడి టెక్నాలజీలు వీటిల్లో కొన్ని మాత్రమే. భూమండలాన్ని ధ్వంసం చేసే సామర్థ్యమున్న రసాయన, జీవాయుధాలు, అణ్వస్త్ర టెక్నాలజీలను కూడా అడ్డుకున్నాం. అణ్వస్త్ర టెక్నాలజీనే తీసుకుంటే... శక్తిమంతమైన కృత్రిమ మేధలాగే, అణువును విభజించడంలో లాభాలెన్నో, నష్టాలూ అన్నే. అనంతమైన విద్యుత్తు ఇవ్వగలగడం సానుకూల అంశమైతే, విధ్వంసం దీనికి మరోవైపున కనిపిస్తుంది. ఈ రెండో రూపాన్ని గుర్తించేందుకు హిరోషిమా, నాగసాకి వంటి భయంకరమైన అణుబాంబు దాడుల్ని చూడాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత దేశాలన్నీ ఒక్కతాటిపై వచ్చి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం వంటి వాటిద్వారా అణ్వస్త్రాలపై నిషేధం, నియంత్రణలు తేగలిగాయి. తద్వారా మరిన్ని హిరోషిమా, నాగ సాకీలు జరక్కుండా ఇప్పటివరకూ నిరోధించగలిగాం. అణు టెక్నాలజీకి సంబంధించిన ఇంకో పార్శ్వమూ ఉంది. విధ్వంసం, వినాశనాలకు బెదిరి మనం వాడకాన్ని మరీ పరిమితం చేసేశాం. ఫలితంగా వాతావరణ మార్పులకు కారణమైన శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ముప్పు తప్పించుకునేందుకు ఇంకోముప్పును కొని తెచ్చుకున్నట్టు అన్నమాట! అత్యాధునిక మోడళ్లను ఆపడమా? కృత్రిమ మేధ టెక్నాలజీపై ఆరు నెలల విరామం వల్ల ఏం ఫలితం ఉండగలదని చాలామంది ప్రశ్నించవచ్చు. ఒక వేళ ఆరునెలల పాటు నిలిపేసినా చైనా లాంటి దేశాలు దీన్ని అనుసరిస్తాయా? తాత్కాలిక నిలిపివేత వల్ల ప్రపంచం మొత్తానికి దాదాపుగా ఉచితంగా, అది కూడా పర్యావరణ కాలుష్యం అనేది లేకుండా అందివ్వ గల కేంద్రక సంలీన ప్రక్రియను సాకారం చేసే శక్తి ఉన్న జీపీటీ7, జీపీటీ8 వంటి అత్యాధునిక జనరేటివ్ ఏఐ మోడళ్లు రావడం ఆలస్యం కాదా? వాతావరణ మార్పులు మొదలుకొని అత్యద్భుత మేధతో మాత్రమే పరిష్కారం కాగల పెద్ద పెద్ద సమస్యల మాటేమిటి? ఈ ప్రశ్నలపై చర్చోపచర్చలు దీర్ఘకాలం కొనసాగుతాయి. అందులో సందేహం లేదు. అయితే జనరేటివ్ ఏఐ విషయంలో మనం నైతిక అంశాలపై మొట్టమొదట మాట్లాడుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జనరేటివ్ ఏఐ మోడళ్లను విడుదల చేసినంత వేగంగా, అత్యవ సరంగా ఈ అంశంపై చర్చ జరగాలన్నది నా అభిప్రాయం. సాధారణ పరిస్థితుల్లోనైతే అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ మదింపునకు అంతర్జాతీయ సంస్థలు బోలెడంత సమయం తీసుకునే అవకాశ ముంది. అందుకే ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. ఆరునెలల తాత్కాలిక నిషేధం గొప్ప పరిష్కారం కాకపోవచ్చు. కానీ టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నట్టుగా జనరేటివ్ ఏఐ అనే గుడ్లగూబను నియంత్రించడం, మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలుసుకున్న తరువాతే మను షులనే పిచ్చుకల గుంపులోకి దాన్ని తీసుకురావడం మేలు. ఈ విషయమై ప్రపంచం స్థిమితంగా ఆలోచించాల్సిన అవసరం, సమయం వచ్చేసింది! జస్ప్రీత్ బింద్రా వ్యాసకర్త రచయిత; ‘ఏఐ అండ్ ఎథిక్స్’ అంశంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్నారు. (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!
డాక్టర్లు చేయలేని పనిని అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్‌జీపీటీ చేసింది. ప్రాణ ప్రాయ స్థితులో ఉన్న మూగజీవి ప్రాణాలు కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ట్విటర్ యూజర్ కూపర్ Cooper (@peakcooper) ఓపెన్ఐకి చెందిన చాట్‌జీపీటీ లేటెస్ట్ వెర్షన్ జీపీటీ-4 ఏఐ తన కుక్క ‘సాసీ’(Sassy) ప్రాణాల్ని కాపాడిందని ట్వీట్ చేశారు. Tick-borne జబ్బుతో కుక్కల్లో పేలు బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా Tick-borne అనే జబ్బు చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అనారోగ్య సమస్య కారణంగా మూగజీవాల్లో ఆకలి లేకపోవడం, శోషరస గ్రంథులు ఉబ్బడం, కీళ్ల వాపులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలోని లోపలి భాగాల్లో రక్తస్త్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. నచ్చని వైద్యుల సలహా అయితే కూపర్ పెంపుడు కుక్క సాసీ Tick-borneతో అనారోగ్యం పాలైంది. అత్యవసర చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాడు. రక్తహీనత ఏర్పడి అనారోగ్యం పాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సతో ఆరోగ్యం కుదుట పడింది. కానీ కొన్ని రోజులకు ఆరోగ్యం యధావిధికి చేరింది. దీంతో చేసేది లేక మరోసారి ఆస్పత్రికి తరలించి టిక్-బోర్న్ పరీక్షలు చేయించాడు. రిపోర్ట్ నెగిటీవ్ వచ్చింది. కుక్క ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆ సలహా కూపర్‌కు నచ్చలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చాట్‌జీపీటీ-4 సాయంతో అదే సమయంలో టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్ జీపీటీని ఆశ్రయించాడు. తన కుక్క సాసీ అనారోగ్య సమస్యను చాట్‌జీపీటీ-4కి వివరించాడు. అందుకు జీపీటీ తాను వెటర్నరీ డాక్టర్‌ను కాదంటూనే..కుక్కకి తీసిన బ్లడ్ శాంపిల్స్‌తో మీ కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందోనని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తానని తెలిపింది. In the meantime, it occurred to me that medical diagnostics seemed like the sort of thing GPT4 could potentially be really good at, so I described the situation in great detail. I gave it the actual transcribed blood test results from multiple days, and asked for a diagnosis 4/ pic.twitter.com/K7kqaGnyAd — Cooper ☕ (@peakcooper) March 25, 2023 సాసీ అనారోగ్యానికి కారణం ఇదే వెంటనే కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందో తెలుపుతూ జబ్బులకు సంబంధించిన లక్షణాల గురించి చాట్‌జీపీటీ-4 ఓ డేటాను అందించింది. చాట్‌జీపీటీ చెప్పిన అనారోగ్య సమస్యలు సాసీలో ఉన్నాయని బదులివ్వడంతో..మీ కుక్క ఇమ్యూన్-మెడియేటెడ్ హెమోలిటిక్ అనీమియా (IMHA) అనే సమస్యతో బాధపడుతుందని సూచించింది. చాట్‌జీపీటీ-4 చెప్పింది.. వైద్య చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం! దీంతో రెండో సారి ఆశ్రయించిన వైద్యులతో సాసీకి ఐఎంహెచ్‌ఏ సమస్య ఏమైనా ఉందా? అని కూపర్ ప్రశ్నించాడు. అదే అనుమానాన్ని రక్తపరీక్ష చేసిన వైద్యులు నిజం చేశారు. కుక్క ఐఎంహెచ్‌ఏ సమస్య తలెత్తిందని.. కాబట్టే ఆరోగ్యం క్షీణించిందని నిర్ధారించారు. ప్రస్తుతం సాసీ ఆరోగ్యం కుదుట పడిందంటూ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. #GPT4 saved my dog's life. After my dog got diagnosed with a tick-borne disease, the vet started her on the proper treatment, and despite a serious anemia, her condition seemed to be improving relatively well. After a few days however, things took a turn for the worse 1/ — Cooper ☕ (@peakcooper) March 25, 2023 ఆశ్చర్యంలో 9 మిలియన్ల మంది యూజర్లు కూపర్ ట్విట్లను 9 మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. పెంపుడు జంతువు యజమానికి చాట్‌జీపీటీ-4 ఎలా సహాయం చేసిందో తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 వాళ్ల ఉద్యోగాలు ఊడడం ఖాయం.. చాట్ జీపీటీ సృష్టికర్త సంచలన వ్యాఖ్యలు