Gravel excavation
-
కొండలకు గుండు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతికొచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అధికారులను బెదిరించి దారికి తెచ్చుకుని కొండలకు కొండలనే మాయం చేసేస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేసి కొండలను పిండి చేస్తున్నారు. అడిగేవాడు లేడనే ధైర్యంతో అడ్డగోలు దోపిడీకి తుని పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు ఇలాకాలో గ్రావెల్ దోపిడీ గడచిన నెల రోజులుగా ఇష్టారాజ్యంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల అండదండలు చూసుకుని తమ్ముళ్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్‌ను దోచుకుపోతూ కొండలను పిండి చేసేస్తున్నారు. దళితులు, బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం డి.పట్టా భూములను ఇచ్చి సాగుకు మలుచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అటువంటి సాగుకు అనుకూలంగా లేని భూమిని చదును చేయిస్తున్నామనే కుంటి సాకులతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గతంలో ప్రభుత్వాలు దళితులు, బీసీల స్వయం సమృద్ధి కోసం ఇచ్చిన పట్టా భూములను కూడా వదిలి పెట్టడం లేదు. ఇందుకు తుని పరిసర ప్రాంతాలలో ఉన్న కొండలను తమ్ముళ్లు ఒకటొకటిగా మాయం చేస్తున్నారు. అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో.. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తోన్న తుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా బరితెగిస్తోంది. తుని రూరల్ మండలం డి.పోలవరం శివారు అశోక్‌నగర్ గండి సమీపాన ఎ.నాయుడికి గతంలో ప్రభుత్వం 1.15 ఎకరాలు కేటాయించింది. ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించాలనేది డి పట్టాభూములు ఇవ్వడంలో ప్రభుత్వ ఆశయం. అటువంటి డి పట్టా భూమికి మైనింగ్, రెవెన్యూ సహా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే లారీలకు లారీలలో గ్రావెల్‌ను తవ్వేసి ఇప్పటికే రూ.లక్షలు వెనకేసుకున్నారు. డి.పట్టా భూమి నుంచి అనుమతి లేకుండా తట్ట గ్రావెల్‌ను కూడా తరలించే వెసులుబాటు ఎవరికీ లేదు. అటువంటిది గ్రావెల్ తవ్వకాలు జరిపి తుని–నర్సీపట్నం రోడ్డును ఆనుకుని ఉన్న రూ.లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని మెరక చేశారు. డి.పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పీఎస్ రావు అధికార అండతో గ్రావెల్ తవ్వేసి రూ.లక్షలు మింగేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల తిరగకుండానే గ్రావెల్, రాయి తవ్వేసి ట్రాక్టర్లపై తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకున్నారు. గడచిన రెండు నెలల్లోనే ఈ డి పోలవరం పరిధిలో రూ.కోటికి పైనే ఎర్ర గ్రావెల్‌ను కొల్లగొట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. డి పోలవరం నుంచి డైలీ పాతిక, ముప్పై లారీలకు తక్కువగాకుండా రాత్రి, పగలు అనే వ్యత్యాసం లేకుండా అడ్డగోలుగా తవ్వేసుకుపోయారు. తమ వెనుక యనమల ఉన్నారని తమకు అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.పోలవరం ఎడమ కాలువ మట్టినీ తరలించారుఇందుకు తీసిపోని రీతిలోనే కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి అతి సమీపాన తుని రూరల్ మండల పరిధిలో తేటగుంట శివారు రాజులకొత్తూరులో ఇదే దందా నడుస్తోంది. రాజులకొత్తూరు సమీపాన జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూమి చదును చేసుకుంటున్నామంటూ దొడ్డిదారిన గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్, మండల స్థాయి నాయకుడు కుమ్మక్కై రెడ్ గ్రావెల్ తవ్వకాలతో అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఇక్కడి నుంచి నిత్యం 10, 12 టైర్ల లారీల్లో 50 వరకు గ్రావెల్‌ను తరలించేసి రూ.లక్షలు కూడబెడుతున్నారు. అటవీ భూములు అక్రమంగా తవ్వేస్తున్నారన్న ఫిర్యాదుతో రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సర్వే జరిపి జిరాయితీ భూమికి, అటవీ భూమికి సరిహద్దులు ఏర్పాటు చేశారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్ తవ్వకాల దందాకు మాత్రం అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవకొత్తూరు, తేటగుంట సమీపాన పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్ల వెంబడి ఎర్రమట్టిని కూడా అయినకాడికి తెగనమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కాలువల నుంచి తీసిన మట్టితో పాటు గట్లను కూడా పెకలించి వేసి మట్టిని దోచుకుపోతున్నారు. డైలీ లారీల్లో ఎడమ కాలువ మట్టిని తవ్వి లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వంతున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. -
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
అక్రమాల బాటపై పూదోట
రాజు మారితే రాజ్యం మారిపోవాలా అని ఇటీవల ఓ నేత పదం బాగుంది కదా అని ఓ ‘డైలాగ్’ వదిలాడు. ఆ డైలాగ్ ప్రకారమే ముందుకెళ్దాం. ఔను... రాజు మారితే అందుకు అనుగుణంగా పాలన కూడా మారుతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ‘యథా రాజా తథా ప్రజలు, అధికారులు’ అనడానికి కూడా పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. టీడీపీ హయాంలో పెద్దాపురాన్ని ఓ సామంత ‘రాజు’ ఏలేవారు. పాలించే రాజు అక్రమాల చక్రవర్తి కావడంతో సామంత రాజులు, ఆయన అనయాయులు నీతి వాక్యాలు వల్లిస్తూ కూర్చోరు కదా...వీరు దందాలు చేయడం ప్రారంభించారు. ‘తిలా పాపం తలా పిడికెడు’ చందంగా చేతికందినకాడికి దోచేసుకున్నారు. చివరకు 688 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన 823 ఎకరాలను కూడా వదలకుండా గుల్ల చేసేశారు. అప్పటి ‘రారాజు’ అండ చూసుకొని ... అధికారులను పక్కకు నెట్టేసి, పెద్దాపురం ‘సామంతరాజు’ కనుసైగలతో కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను కొల్లగొట్టేశారు. ఈలోగానే రాష్ట్రంలో రాజు మారారు...జిల్లా అధికారీ మారారు...అయితే గ్రహపాటున ఆ నియోజకవర్గ సామంత‘రాజు’ మాత్రం మారలేదు. దీంతో వారి అనుచరుల బుద్ధీ మారలేదు. పాత పద్ధతిలోనే అక్రమాల బాట పట్టడంతో కొత్త రాజ్యంలో ఆ దూకుడుకు కళ్లెం వేశారు. అర్ధరాత్రి కూడా ఆకస్మిక తనిఖీలు చేయడంతో కబ్జాదారులకు ముచ్చెమటలు పట్టాయి. చిత్తశుద్ధి ఉండే రాజు కొరడా ఝుళిపిస్తే ‘మారాల్సిందే’... మార్పు రావల్సిందే’ అనడానికి ఇదే... ఇదే ‘పెద్ద’ ఉదాహరణ. సాక్షి, రాజమహేంద్రవరం : అధికారం ఉన్నన్నాళ్లు అడ్డగోలుగా దోచుకున్న గ్రావెల్ మాఫియా ధనదాహం ఇంకా తీరినట్టు లేదు. అధికారం పోయినా ‘పచ్చ’నేతల పాపాలకు ఫుల్స్టాప్ పడటం లేదు. గడచిన మూడేళ్లుగా పెద్దాపురం సమీపాన రామేశంమెట్ట కొండను పిండిచేసి టీడీపీ నేతలు, వారి వందిమాగదులు కోట్లు దోచుకుపోయారు. 1985 నుంచి 1995 వరకూ 688 మంది నిరుపేద దళితులకు అసైన్ చేసిన 823 ఎకరాల భూములపై పడి గుల్ల చేసేశారు. సాగుకు అనువుగా తీర్చిదిద్దుతామనే సాకుతో ఇందులో మూడొంతులు కొండను దోచుకున్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప బినామీలు ఈ విచ్చలవిడి దోపిడీలో క్రియాశీలకపాత్ర పోషించారు. అప్పటి అధికారులు కూడా ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ చేసిన చందంగా అనుమతులపై అనుమతులు ఇచ్చేశారు. ఒక లబ్థిదారుకు ఎకరా 30 సెంట్లు భూమి ఇస్తే వాటిని చదునుచేసి సాగుకు అనుకూలంగా మలిచి ఇస్తామని రెండు లక్షలు చేతిలోపెట్టి దోపిడీకి రాచబాట వేశారు. అటువంటి రామేశంమెట్టను సంస్కరించి తిరిగి హక్కుదారులైన దళితులకు అప్పగించి జీడిమామిడి, మామిడి మొక్కలను సాగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి గురువారం తొలి అడుగు వేశారు. లబ్థిదారులను పిలిపించి వారికి నచ్చజెప్పి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా గ్రావెల్ తవ్వకాలకు భూములు ఇవ్వవద్దని హితబోధ చేశారు. అంతటితో ఆగకుండా భూముల్లో మొక్కలు కూడా నాటి, మొత్తం భూమిని సర్వేచేసి లబ్థిదారులకు అప్పగించడమే కాకుండా మైనింగ్, ఉద్యానవన, రెవెన్యూ శాఖల సమన్వయంతో బోర్లు వేయించి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించే దిశగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశకు సూచనలు కూడా ఇచ్చారు. కలెక్టర్ ఆదేశించినా... కలెక్టర్ ఆదేశాలు జారీచేసి 24 గంటలు కూడా గడవకుండానే గ్రావెల్ మాఫియా మరోసారి విజృంభించింది. అనుమతి ఉన్న భూమిలో గ్రావెల్ తవ్వాల్సి ఉండగా, అనుమతి లేని ప్రాంతంలో అర్థరాత్రి అడ్డగోలుగా దోపిడీకి తెరతీసింది. రామేశంమెట్టలో కొండ్రు పార్థుడుకు చెందిన 28/5 సర్వే నెంబర్లో గ్రావెల్ తవ్వకానికి అనుమతి ఉందని పెద్దాపురం రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పార్థుడు ఈ భూమిలో హక్కుదారుడు. కొండపల్లి మాజీ సర్పంచి కూడా. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడు. ఇతని భూమిని విడిచిపెట్టేసి అనుమతి లేని 26/7 సర్వే నంబర్లోని బక్కి లక్ష్మమ్మకు చెందిన భూమిలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ బాగోతం ఎన్ని రోజులుగా జరుగుతుందో ఇదమిద్ధంగా అ«ధికారులు కూడా చెప్పలేకున్నారు. కానీ గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్లే సరికి మాత్రం తవ్వకాలు నిలిచిపోయి ఉన్నాయి. 30వ తేదీ అర్థరాత్రి దాటాక జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి వచ్చిన సమాచారంతో పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ పద్మావతి సిబ్బందితో దాడిచేసి 12 లారీలు, రెండు పొక్లెయిన్లు సీజ్‌చేశారు. అంత అర్థరాత్రి సమయంలో ఘటనా స్థలంలో ఉన్న పార్థుడు పాత్రపై రెవెన్యూ యంత్రాంగం లోతుగా పరిశీలన జరుపుతోంది. దీని వెనుక పాత్రధారులెవరెవరున్నారనే అంశాలపై విచారణ జరుపుతోంది. సీజ్ చేసిన వాహనాలకు ఎంత అపరాధ రుసుం విధించాలి, ఏ సెక్షన్లపై కేసు నమోదు చేయాలనే అంశాన్ని పెద్దాపురం రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులతో చర్చిస్తున్నారు. నాలుగు నెలల కిందటి వరకూ నిలువు దోపిడీ... ఇప్పుడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రావెల్, ఇసుక విధానంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, జిల్లా కలెక్టర్ ఇచ్చిన ధైర్యంతో రెవెన్యూ అధికారులు అర్థరాత్రి కూడా దాడులు చేయగలిగారు. కానీ నాలుగు నెలల కిందటి వరకూ టీడీపీ నేతలు ఈ మెట్టను గుల్ల చేస్తూనే ఉన్నా అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయారు. ప్రభుత్వమే తమ చేతుల్లో ఉందనే ధైర్యంతో ‘పచ్చ’ మాఫియా బరితెగించి కోట్లు కొల్లగొట్టేసింది. రామేశంమెట్ట నుంచి రోజుకు 150 లారీల గ్రావెల్ తరలించుకుపోయారు. ఒక లారీ గ్రావెల్ రూ.2000 వంతున విక్రయించారు. ఏడాదిలో 300 రోజులు యథేచ్ఛగా గ్రావెల్ తరలించుకుపోయారు. ఈ లెక్కన ఏడాదికి ఎంత తక్కువగా చూసుకున్నా రూ.9 కోట్లు నిలువునా దోచుకున్నారని చెప్పొచ్చు. అంటే మూడేళ్లు (2016 నుంచి 2019 ఫిబ్రవరి) దోపిడీ విలువ లెక్కగడితే సుమారుగా రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్ని కోట్లు కొల్లగొట్టుకుపోయినా ఇంకా దోచుకోవడానికి వెనుకాడటం లేదు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల పేరుతో గ్రావెల్ మాఫియా ఇక్కడి గ్రావెల్‌ను తరలించుకుపోతోంది. ఈ దోపిడీని కఠిన చర్యల ద్వారానైనా జిల్లా యంత్రాంగం అడ్డుకట్ట వేయాలి. -
అధికారిక దోపిడీ
* నక్కవాగులో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకం * అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్న అధికారులు అన్నపర్రు (పెదనందిపాడు): అధికార పార్టీ నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను యథేచ్ఛగా తోలుకుంటున్నారు. దీనిని ఆపాల్సిన అధికారులు అధికార పార్టీ వారికే కొమ్ము కాస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా గ్రావెల్ తోలుకున్నారని వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నేతపై కేసు పెట్టించి జైలుకు పంపిన అధికారులు ప్రస్తుతం స్పందించటం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను అమ్ముకుంటున్న అధికార పార్టీ నేతలను మాత్రం వారు పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని అన్నపర్రు గ్రామంలో ఉన్న నక్కవాగులో గ్రావెల్‌ను అధికార పార్టీ నేతలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్థులు డ్రెయినేజి అధికారులకు సమాచారం అందించినా ప్రయోజనం శూన్యం. అధికారులు రేపు వస్తాం అంటూ.. వచ్చే ముందు అధికార పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు వచ్చే సమయానికి ఆ ప్రదేశం ఖాళీగా మారుతుంది. ఈ ప్రభుత్వంలో సామాన్యులను న్యాయం జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు ఇప్పుడు ఎందుకు చేయరు? గ్రామానికి చెందిన ఎంపీటీసీ గ్రావెల్‌ను యథేచ్ఛగా అధిక ధరకు అమ్ముకుంటున్నారు. గతంలో పొలానికి కట్ట వేయటానికి గ్రావెల్‌ను తోలుకుంటే నాపై అక్రమంగా డ్రెయినేజి ఏఈ స్వాతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నన్ను జైలుకు కూడా పంపారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ అమ్ముకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయటం లేదు. ఇదేనా అధికారుల పని తీరు. - వైఎస్సార్సీపీ నాయకుడు కల్లూరి నాగేశ్వరరావు(నాగు)