Graves
-
ఎటు చూసినా మృతదేహాలే
డమాస్కస్: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్‌తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్ ఎమర్జెన్సీ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... లక్షల మంది గల్లంతు సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్ తహ్రీర్ అల్షామ్ (హెచ్‌టీఎస్) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్హెల్మెట్స్తో కలిసి హెచ్‌టీఎస్ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారేమైనట్టు? తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్‌కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. గుర్తించలేని స్థితిలో శవాలు ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్ ఆశాభావం వెలిబుచి్చంది. -
సమాధుల వద్ద థమ్సప్లా!
వర్జీనియా: సైనిక అమరులకు నివాళుల సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సందర్భంగా అబే గేట్ వద్ద మరణించిన 12 మంది సైనికులకు ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశానవాటికలో ట్రంప్ నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద హావభావాలు ప్రదర్శించారు. సమాధుల వద్ద ఫొటోలకు పోజులివ్వడమే గాక చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. అంతటితో ఆగకుండా బొటనవేలు పైకెత్తి థమ్సప్ చిహ్నం చూపారు. వీటిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సైనిక అమరుల పట్ల ఆయన అత్యంత అగౌరవంగా, అవమానకరంగా ప్రవర్తించారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. సమాధుల వద్ద చిరునవ్వులు చిందించడమేంటని మండిపడుతున్నారు. సమాధుల వద్ద నవ్వడం అసాధారణమని రిపబ్లికన్ నేత ఆడమ్ కిన్సింగర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సైనిక అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపినందుకు ట్రంప్‌ను కొందరు అభినందించారు. మరికొందరేమో ఇది కూడా ప్రచార వ్యూహంలో భాగమంటూ పెదవి విరిచారు. -
ఆదిమానవుల సమాధులు మాయం
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఆదిమానవుల సమాధులను ఎత్తుకుపోయారు. వంద సమాధులను మాయం చేసేశారు. ఆదిమానవుల సమాధులకు వినియోగించిన పెద్దపెద్ద రాతి గుండ్లను తీసుకుపోయి, వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు సజీవసాక్ష్యంగా ఉన్న ఆధారాలను లేకుండా చేశారు. వృత్తాకారంలో ఉన్న ఈ రాతిగుండ్ల వరుస క్రీ.పూ. వెయ్యేళ్ల నాటి ఇనుపయుగపు మానవుడి సమాధి. ఇది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేట గ్రామ శివారులోనిది. స్థానికంగా ఇలాంటి సమాధులను ముత్యపు గుండ్లుగా పిలుచుకుంటారు. రాకాసి గుండ్లని బంతిరాళ్లని పిలుచుకుంటారు. స్థానికంగా ఇప్పుడు ఇలాంటివి ఆరు సమాధులున్నాయి. సోమవారం ఈ సమాధులను చూసిన చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి విస్తుపోయారు. ‘నేను రెండు దశాబ్దాల క్రితం పురావస్తు శాఖ అధికారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేశాను. ఇనుప యుగానికి చెందిన వందకుపైగా సమాధులు ఈ ప్రాంతంలో కనిపించాయి. మూసాపేట, సంకలమద్ది, వేముల తదితర ప్రాంతాల్లో ఉన్న సమాధులను గుర్తించి నివేదిక రూపంలో పురావస్తు శాఖకు సమర్పించాను. ఇప్పుడు వాటిని మరోసారి చూద్దామని ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’అవగాహన కార్యక్రమంలో భాగంగా వచ్చాను. కేవలం ఆరు సమాధులు మాత్రమే కనిపించాయి. మిగతావాటి రాళ్లను తీసుకెళ్లి రకరకాల అవసరాలకు వాడేసుకున్నారు’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. మిగిలిన ఆరు సమాధులనైనా కాపాడుకోవాలని స్థానికులకు వివరించినట్టు పేర్కొన్నారు. కంకరగా, పునాది రాళ్లుగా, కడీలుగా ఆ రాళ్లను వాడుకున్నట్టు తెలుస్తోందన్నారు. గతంలో పలువురు ఈ సమాధి రాళ్లను పరిశోధించారని, అలాంటివి తొలగించి, నాటి చరిత్రను కనుమరుగు చేయటం బాధగా ఉందని తెలిపారు.. -
దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?
రెజీనా: కెనడాలోని 1899 నుంచి 1997 వరకు నడిచిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో 751 మంది గుర్తు తెలియని పిల్లల సమాధులు కనుగొన్నారు. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఇక ప్రస్తుత ఘటన జరిగిన ప్రాంతం సస్కట్చేవాన్ రాజధాని రెజీనాకు తూర్పున 87 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ఘటనపై కౌసెస్ చీఫ్ కాడ్ముస్న్ డెల్మోర్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలను నిర్వహిస్తున్న రోమన్ కాథలిక్ చర్చి అక్కడ ఆనవాళ్లు తెలియకుండా గుర్తులను తొలగించింది. దీన్ని నేరంగా భావిస్తున్నాం. ఇది ఓ విధంగా దేశంపై దాడి చేయడం వంటిది. ఇక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలను పూడ్చి పెట్టారో.. వాటన్నింటిని తెలుసుకునే వరకు అన్వేషణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని’ పేర్కొన్నారు. ఇలా వెలుగులోకి.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని ఓ పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి ఏం జరిగిందో.. తెలుసుకోవాల్సిందిగా మత, రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కెనడా ప్రభుత్వం పాఠశాలలో శారీరక, లైంగిక వేధింపులు అధికంగా ఉన్నట్లు, అంతేకాకుండా విద్యార్థులు తమ మాతృభాష మాట్లాడితే వారిపై దాడి చేయడం వంటివి క్రూరమైన చర్యలు కూడా జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. చదవండి: వైరల్:అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి! -
వరుణుడి దెబ్బ.. 2వేలకు పైగా శవాలు
న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో గంగా నది తీరం వద్ద ఇసుకలో పాతిపెట్టిన వేలాది సమాధులు బయటపడ్డాయి. ఒకవైపు భారీ సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదు .. మరోవైపు శవాలను కాల్చేందుకు శ్మశానవాటికలు కూడా సరిపోకపోవడం లాంటి కారణాలతో చాలా మంది తమ వారిని ఇలా ఇసుకలో సమాధి చేసి వెళ్లి పోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్ల ఆ ప్రాంతంలో 71 మంది మృతదేహాలను గుర్తించినట్లు బిహార్ బక్సర్ జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత వానలు పడడం కారణంగా ఇలా 2 వేలకు పైగా మృతదేహాలు గంగా నది పరివాహక ప్రాంతాల్లో బయటపడ్డాయి. శవ దహనానికి డబ్బులు ఖర్చు చేయలేక, మృతదేహాలను ఖననం చేయడానికి శ్మశానవాటికలు సరిపడక ఇలా గంగా నది తీరంలోని ఇసుకలో పైపైనే సమాధుల మాదిరిగా కట్టికొందరు చేతులు దులుపుకుంటున్నారు. యూపీ, బీహార్ రెండూ రాష్ట్రాలు కలిపి 1,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ గంగా నది ప్రవహిస్తుంది. యూపీలోని కాన్పూర్, ఘాజిపూర్, ఉన్నవో, బాలియా జిల్లాల్లో మృతదేహాలను డంపింగ్ చేసే ధోరణి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఎంహెచ్ఏ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవలే మృతదేహాలు గంగా నదిలో తేలుతూ కింది ప్రాంతాలకు వచ్చిన సందర్భంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ( చదవండి: Covid Vaccination in India: వ్యాక్సిన్‌లోనూ వివక్ష..! ) -
మాస్క్ లేదా.. సమాధి తవ్వాల్సిందే
జకర్తా: కరోనా వైరస్ నియంత్రణ కోసం మాస్క్ తప్పక ధరించాలి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికి నేటికి కూడా కొందరు మాస్క్ ధరించడం లేదు. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించడానికి బదులుగా వినూత్న శిక్ష విధిస్తుంది. ఎవరైతే మాస్క్ ధరించరో వారు కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి గాను సమాధులు తవ్వాలని ఆదేశించింది. ది జకార్తా పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఎనిమిది మంది బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించకుండా తిరిగారు. వారికి శిక్షగా కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారని తెలిపింది. ‘ప్రస్తుతం స్మశాన వాటికలో ముగ్గురు మాత్రమే సమాధులు తవ్వడానికి అందుబాటులో ఉన్నారు. కనుక మాస్క్ ధరించని వారికి శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించాను’ అని సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను ఒక సమాధి తవ్వడానికి నియమించారు. వీరిలో ఒకరు సమాధి తవ్వితే.. మరోకరు శవపేటికలో చెక్క బోర్డులను అమర్చుతారు అని తెలిపారు.(చదవండి: మాస్క్.. లైట్ తీసుకుంటే రిస్కే!) ఈ వినూత్న పనిష్మెంట్ మంచి ప్రభావం చూపించగలదని ఇండోనేషియా అధికారులు భావిస్తున్నారు. రీజెంట్ లా నెంబర్ 22/2020 ప్రకారం, ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా లేదా సమాజ సేవ చేయాలని శిక్ష విధించవచ్చని నివేదిక పేర్కొంది. ఇకపోతే ఇండోనేషియాలో ఆదివారం వరుసగా ఆరవ రోజు 3,000 కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో సామాజిక దూర పరిమితులను తిరిగి విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం కొత్తగా 3,636 కేసులు నమోదు కాగా.. 73 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,382 కు, మరణాలు 8,723 కు చేరుకున్నాయి. -
సమాధులపై రామాలయం నిర్మిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పరశరన్‌కు ఓ లేఖ రాశారు. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ నగర ముస్లిం ప్రజలు ట్రస్టు అధిపతి పరశరన్‌కు ఫిబ్రవరి 15న లేఖ రాశారు. రామాలయ నిర్మాణం సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందని ఆ లేఖలో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయబడ్డ బాబ్రీ మసీదు ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులపై రామాలయాన్ని నిర్మించడం హిందూ సనాతన ధర్మానికి విరుద్ధమని ముస్లిం తరఫు న్యాయవాది ఎంఆర్ శంషాద్ పేర్కొన్నారు. 1885లో జరిగిన అల్లర్లలో సుమారు 75 ముస్లింలు చనిపోయారని, వారి సమాధులు అక్కడే ఉన్నాయని ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్రీ మసీదు నిర్మించిన ప్రాంతాన్ని శ్మశానవాటికగా వాడారని, అలాంటి చోట రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ఆ లేఖలో ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి జన్మస్థాన ఆలయాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా? దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. మొత్తం 67 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు న్యాయవాది లేఖలో తెలిపారు. -
సమాధిలో వెలుగు
‘‘అమ్మా ఫలానా ఆయన కోసం సమాధి తవ్వుతుంటే పక్కనే ఉన్న మీ ఆయన సమాధి బయట పడింది. అందులో మీ ఆయన కఫన్ (శవ) వస్త్రం కొంచెం కూడా నలగలేదు. చనిపోయి ఇన్నేళ్లయినా మీ ఆయన కఫన్ వస్త్రంపై వేసిన పూలూ వాడిపోలేదు. పైగా సువాసనలు వెదజల్లుతున్నాయి’’ ఏమిటీ కారణం, బతికుండగా అంతటి పుణ్యకార్యాలు ఏమిచేశారో కాస్త చెబుతారా?’’ అంటూ ఒక్కొక్కరూ అడగడం మొదలెట్టారు ఆ ముసలావిడను. సుమారు డెబ్బై ఏళ్లక్రితం ఒక వ్యక్తి అంత్యక్రియల్లో భాగంగా సమాధి తవ్వుతుంటే పక్కన ఉన్న సమాధిలోని భౌతికకాయం బయల్పడింది. ఆ సమాధిని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంత్యక్రియల అనంతరం సమాధిపై ఉన్న ఫలకంపై ఉన్న వివరాల ప్రకారం ఆ ఇంటి వారిని గుర్తించి ఆ ఇంటికి వెళ్లగా ఓ ముసలావిడ మంచంపై మూలుగుతూ ఉంది. వయసు మీదపడిన ఆ మహిళ బలం కూడగట్టుకుని లేచి పరిశీలనగా చూసింది. ఎవరో నలుగురు మనుషులు వచ్చి తన ముందు నిల్చున్నట్లు మసక కళ్లతోనే గమనించింది. వాళ్లడిగిన దానికి ఏం చెప్పాలో ముసలావిడకు ఏమీ తోచలేదు. తన భర్త చనిపోయి ఇన్నేళ్లు గడిచినా సమాధి ఇంతగా మెరుస్తుందా అని ఆశ్చర్యపోయింది. ‘‘నా భర్త ఏమీ చదువుకోలేదు. దానాలు చేయడానికి మేం ధనవంతులమూ కాము. చదువుకోకపోయినా ఎప్పుడూ ధార్మికంగా ఉండేవాడు. ఎవరైనా ఖుర్ఆన్ చదవడం కనపడితే ఎంతో శ్రద్ధగా వినేవాడు. తనకు ఖుర్ఆన్ చదవడం వచ్చి ఉంటే తానూ పారాయణం చేసేవాడని బాగా చింతించేవాడు. ఇంట్లో ఉన్న ఖుర్ఆన్ గ్రంథాన్ని చేతుల్లో తీసుకుని ముద్దాడేవాడు. ఖుర్ ఆన్ వాక్యాలను తాకుతూ తెగ మురిసిపోయేవాడు. ఒక్కోసారి రాత్రంతా ఖుర్ఆన్ను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఖుర్ఆన్ పట్ల ఉన్న ఆ ప్రేమే అతని సమాధిని ఇలా దేదీప్యమానం చేస్తుందని నేననుకుంటాను’’ అని చెప్పింది ఆ పెద్దావిడ. జీవితాంతం ఖుర్ ఆన్ చదివి, అర్థం చేసుకుని, దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే మన సమాధి ఇంకెంత జ్యోతిర్మయమవుతుందో ఆలోచించండి. – తహూరా సిద్దీఖా -
చిన్న కోరిక
గొప్ప ధనికుడు, ధార్మికవేత్తగా పేరుగాంచిన ఒక పెద్దాయన ఒకరోజు తన పిల్లల్ని దగ్గరకు పిలిచాడు. వారికేసి చూస్తూ, ‘‘పిల్లలూ! ‘నాకా వయసు మీద పడుతోంది. ఏ క్షణాన గుటుక్కుమంటానో నాకే తెలియదు. నాదో చిన్న కోరిక. తీరుస్తారా?’‘ అని అడిగాడు.‘‘భలే వారే నాన్నగారు మీరు, మమ్ముల్ని పెంచి పోషించి పెద్ద చేశారు. మేము, మా పిల్లలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టి ఇచ్చారు. మీకోసం ఆ మాత్రం చేయలేమా? చెప్పండి నాన్నా!. ఏమి చేయాలో.‘ అన్నారు అంతా ముక్తకంఠంతో. ‘ఏమీ లేదు నాయనా! నేను చనిపోతే, నా కాళ్లకు నా చెప్పులు తొడిగి సమాధి చేయండి’ అన్నాడు. సరేనన్నారు పిల్లలు. కొన్ని రోజులకు ఆ తండ్రి చనిపోయాడు. అంతిమ యాత్ర సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సంతానానికి తన తండ్రి కోరిక జ్ఞాపకం వచ్చింది. కాని ఇస్లామీయ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని తెల్లని గుడ్డ లో చుట్టి సమాధి చేయాలి. వెంట చిన్న వస్తువును కూడా సమాధిలో వేయరాదు.ఇప్పుడెలా? వారు పండితులను సంప్రదించారు. వారు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయడం కుదరదంటే కుదరదు’అన్నారు.‘అయ్యో! మా తండ్రి చిన్న కోరికను సైతం తీర్చలేకపోతున్నామే!’ అని బాధ పడుతున్నారు వారంతా. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ‘బాబూ! మీ నాన్నగారు ఈ ఉత్తరాన్ని నాకు ఇచ్చి నేను చనిపోయిన తర్వాత మా వాళ్లకు ఇవ్వమని చెప్పారు’ అంటూ ఆ లేఖను వారికి ఇచ్చాడు.వారు ఆత్రుతగా ఆలేఖనుతీసి చదవడం మొదలు పెట్టారు.‘పిల్లలూ చూసారా!? నేను ఎంతగా సంపాదించినా, చివరకు చనిపోయిన తర్వాత కనీసం పాతబడిపోయిన చెప్పులు కూడా తొడుక్కొని పోలేకపోతున్నా. రేపు మీఅందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కనుక ఆస్తులు అంతస్తులు కూడబెట్టకుండా పుణ్యాలు సమకుర్చుకునే పనుల్లో ధనాన్ని ఖర్చు చేయండి’ అని రాసి ఉంది.నిజమే కదా. ఈ సత్యం తెలిసి కూడా ఆధర్మ మార్గంలో అన్యాయంగా అక్రమాలకు పాల్పడి సంపాదించే వారు ఒకసారి ఆలోచించాలి. విశ్వసించిన ప్రజలారా! క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు చెల్లని, ఆ చివరి దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. (ఖురాన్ 2:254) – షేక్ అబ్దుల్ బాసిత్ -
సమాధి దొంగలు
అర్ధరాత్రి వర్షం కుండపోతగా కురుస్తోంది.నగరంలోని ఓ సిమెట్రీ అది. రెయిన్ కోట్స్, గమ్ బూట్సూ ధరించిన నలుగురు దృఢకాయులు అందులోకి ప్రవేశించారు. ఒకడి చేతిలో ఓ పొడవాటి పెట్టె ఉంది. ఇంకొకడి దగ్గర బరువైన గోనెసంచి ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో ఒక్కొక్క సమాధినే చూసుకుంటూ ముందుకు నడిచారు వాళ్లు. చివరికి ఓ సమాధి వద్ద ఆగారు. గోనెసంచిలోంచి పార, పలుగు, గునపం, వగైరా పనిముట్లను బయటకు తీశారు. ఒకడు టార్చ్ లైట్ వెలుతురును ఫోకస్ చేస్తూంటే, మిగతా ముగ్గురూ ఆ సమాధిని తవ్వడానికి ఉపక్రమించారు. శవపేటిక కనిపించగానే, ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో గోతిలోకి దిగి తాళ్లను దానికి కట్టారు. నలుగురూ కలసి పేటికను పైకి తీశారు. సుత్తితో కొట్టి శవపేటికను తెరిచారు. లోపల ఫ్రెష్‌గా ఉన్న మృతదేహం కనిపించింది. వర్షానికి తడిసిపోకుండా శవాన్ని వాటర్ ప్రూఫ్ క్లాత్ తో కప్పి, తమతో తీసుకువచ్చిన పెట్టెలో ఉంచి క్లోజ్ చేసేశారు. సమాధిని పూర్తిగా పూడ్చకుండానే వదిలేసి, పనిముట్లను గోనెసంచిలో సర్దేసుకుని, డెడ్ బాడీ ఉన్న పెట్టెను మోసుకుంటూ సిమెట్రీ బయటకు నడిచారు. వీధిలో కొద్ది దూరంలో చిన్నసైజు ఆంబులెన్స్ ఒకటి ఆగి ఉంది. ఆ శవపేటికను అందులోకి ఎక్కించారు. దానితోపాటు ముగ్గురు వ్యక్తులు ఎక్కితే, టార్చ్ లైట్ చూపిస్తూన్న నాలుగవ వ్యక్తి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తూన్న ఆ వర్షాన్ని చీల్చుకుంటూ ముందుకు పరుగెత్తింది ఆంబులెన్స్. గత కొన్ని నెలలుగా నగరంలోని సమాధుల నుండి శవాలు అదృశ్యమవుతున్నాయి. ప్రజలలో అలజడి రేపింది అది.బతికున్నవారిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజడం కద్దు. కానీ, శవాలను ఏం చేసుకుంటారో!... అంతుపట్టలేదు క్రై మ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్‌కి. కుల మతాల వివక్ష లేకుండా దొంగలు అందరి సమాధులనూ టార్గెట్ చేయడం విశేషం! రాత్రి పదకొండు గంటలు అవుతుంది. సెల్‌ఫోన్ మోగడంతో పక్క మీద తలగడ పక్కనున్న ఫోన్‌ని అందుకుని స్క్రీన్ వంక చూశాడు బాలరాజు. అది ‘అన్న’ కాల్!‘‘ఏరా, రాజూ! పనిని గాలికి వదిలేసి పెళ్లాం పక్కలో వెచ్చగా తొంగున్నావట్రా?’’ అవతలి గొంతుక కర్కశంగా వినిపించడంతో గతుక్కుమన్నాడు బాలరాజు. ‘‘ఆఖరు బాడీని తెచ్చి అప్పుడే రెండు వారాలు దాటింది. ఏం చేస్తున్నావ్?’’ మళ్లీ కోపంగా అడిగాడు ‘అన్న’.‘‘లేదన్నా. ఆ పని మీదే ఉన్నాను. ఈ మధ్య సిమెట్రీల దగ్గర, శ్మశానాల దగ్గరా పోలీసుల నిఘా అధికంగా ఉంది. అందుకే కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని’’ నసిగాడు బాలరాజు.‘‘నెలకు కనీసం మూడు శవాలనయినా సప్లయ్ చేయాలన్నది మన కాంట్రాక్ట్. ఆర్నెల్లలో డజనుకు మించి సరఫరా చేయలేకపోయాం. మన మీద నమ్మకం సన్నగిల్లితే వాళ్లు మరో సోర్స్‌ని వెదుక్కునేప్రమాదం ఉంది.’’‘‘లేదన్నా. అలా జరగనివ్వను’’ హామీ ఇచ్చాడు బాలరాజు. ఓ క్షణం ఆగి, అన్నాడు ‘అన్న’ – ‘‘రెండు రోజుల్లో బాడీ ఏదీ దొరక్కపోతే నీ మనుషుల్లో ఒకణ్ణి చంపి అయినా, వాడి బాడీని తీసుకురా’’.బాలరాజు చిన్నగా ఉలికిపడ్డాడు. ‘‘అదేంటన్నా, అంత మాట అనేశావ్?’’ అవతల చిన్నగా నవ్వు వినిపించింది. ‘‘శవానికి లక్ష ఇస్తున్నాను. ఆ మాత్రం అథారిటీ ఉంటుందిలే నాకు!’’ ఫోన్ కట్‌అయింది. బాలరాజుకు ముప్పయ్ అయిదేళ్ళు ఉంటాయి. మనిషి ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవరుగా పనిచేసేవాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోక ప్రతినెలా అప్పులు చేయవలసి వచ్చేది. అయితే, కొన్ని నెలల క్రితం అనుకోకుండా ‘అన్న’ తో పరిచయమయింది అతనికి. అది అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది.కొందరు ‘పార్టీలకు’ శవాలనుసప్లయ్ చేసే సీక్రెట్ కాంట్రాక్ట్‌ని కుదుర్చుకున్నాడు ‘అన్న’. ఆ దందాలోకి బాలరాజును కూడా లాగి, ఆ వ్యవహారానికి ఇన్చార్జ్ని చేశాడు. ‘అన్న’ ది క్రిమినల్ మైండ్. పథకం అతనిదీ,ఆచరణబాలరాజుదీను. ‘అన్న’ సలహా మేరకు ఓ మినీ వ్యాన్ని వాయిదాల పద్ధతిలో తీసుకుని, దాన్ని ఆంబులెన్స్ గా మార్చుకున్నాడు బాలరాజు. పైకి అది ప్రైవేట్ ఆంబులెన్స్. లోపాయకారీగామాత్రం దొంగిలించిన శవాలకు రవాణా వాహనం! ఆ ‘ఆపరేషన్’లో పాలు పంచుకునే వ్యక్తులకు బాలరాజు తప్ప, ‘అన్న’ ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. సమాధి దొంగలను ఎలాగైనా పట్టుకుని తీరాలని కంకణం కట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ శివరామ్. ఆ కేసు పూర్వాపరాలను నిశితంగా సమీక్షించాడు. శవాలు ఏయే ప్రాంతాల నుండి అదృశ్యమయ్యాయో, ఆ ప్రాంతాలకు మరోసారి వెళ్లి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాడు– తాము మిస్ చేసిన ‘క్లూస్’ ఏవైనా లభిస్తాయేమోనని. దొంగల ‘మోడస్ ఆపరెండీ’ని అధ్యయనం చేసి, అది ఒకే ముఠా పనేనని నిర్ధారించుకున్నాడు. ఆ ముఠా రాష్ట్రానికి చెందినదా, లేక ఇతర రాష్ట్రాలకు చెందినదా అన్నది మాత్రం తెలియలేదు. నగరంలోని పలు ప్రాంతాలలో అతను చేసిన దర్యాప్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఒకవేళ ఏ శవపేటికలోనయినా విలువైన వస్తువులో, బంగారమో దొరికితే దొంగలు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే మార్వాడీ షాపులను, పాన్ షాపులను, ఇతర సోర్సెస్నీ అలర్ట్ చేసాడు. క్రిస్టియన్ సిమెట్రీస్, ముస్లిమ్ ఖబరస్తాన్లు, హిందూ శ్మశాన వాటికల వద్ద రాత్రులు ప్రత్యేకంగా పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేశాడు శివరామ్. అయితే, శ్మశాన వాతావరణానికి జడుసుకున్న ఒక కానిస్టేబుల్ జ్వరం తెచ్చుకున్నాడు. మరోచోట కానిస్టేబుల్‌కి ‘దయ్యాలు’ కనిపించాయి! భయంతో మంచం పట్టేశాడు. దాంతో ఎవరూ శ్మశాన డ్యూటీకి ముందుకు రావడం లేదు. నైట్ పెట్రోలింగును ఉధృతం చేయడంతోనే సంతృప్తి చెందవలసి వచ్చింది శివరామ్‌కి. ఆ నెల రోజుల్లో మరో మూడు సమాధుల నుంచి శవాలు మాయమయ్యాయి. దాంతో నగర ప్రజలలో అసహనం, ఆగ్రహం పెరిగిపోయాయి. పోలీసుల అసమర్థతను తిట్టిపోశారు. ఇన్స్పెక్టర్ శివరామ్‌కి పై అధికారుల ఒత్తిడి అధికమయింది. అదే సమయంలో సిల్వర్ లైనింగులా అనిపించింది – ఓ రోజున ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఒకటి. అది మెడికల్ కాలేజెస్లోని ఎనాటమీ క్లాసుల గురించినది. దాన్ని కుతూహలంతో చదివాడు శివరామ్. దాని సారాంశం ఇది– ‘మెడికల్ కాలేజీల్లో ఎనాటమీ క్లాసులలో విద్యార్థుల చేత డిసెక్షన్ చేయించడానికి సరిపడినన్ని మృతదేహాలు సరఫరా కావడంలేదు.ప్రభుత్వాసుపత్రుల మార్చురీలలోని అన్–క్లెయిమ్డ్ బాడీస్‌ని సాధారణంగా మెడికల్ కాలేజీలకు తరలించడం జరుగుతుంది. వాటిని అనాథ శవాలుగా నిర్ణయించేందుకు న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి డిక్లేర్ చేసేసరికి జాప్యం జరగడమేకాక, శవాలు చెడిపోవడం కూడా కద్దు. పైగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూండటంతో అందుబాటులో ఉన్న మృతదేహాలు సరిపోవడంలేదు. అందువల్ల ఎనాటమీ క్లాసులను ప్రాక్టికల్స్ లేకుండా థియరీతోనే సరిపెట్టడం జరుగుతోంది. దాన్ని మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణిస్తోంది.’ఆ ఆర్టికిల్ చదువుతూంటే ఇన్స్పెక్టర్ బుర్రలో కొత్త ఆలోచనలు రేగాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్లాడు. ఎనాటమీ క్లాసుల వారికి అందుతూన్న శవాలను గురించి చర్చించాడు. ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆయా కాలేజీలకు గత కొన్ని నెలలుగా లభ్యమైన శవాలను గూరించి ఆరా తీసాడు. ఎవరూ రికార్డులను సవ్యంగా మెయింటెయిన్ చేయడం లేదని గుర్తించాడు. అనంతరం తన మేనకోడలిని అక్కడ చేర్పించదలచుకున్నట్టు చెబుతూ, మెడికల్ స్టూడెంట్స్‌తో మాట్లాడాడు. మఫ్టీలో ఉండడంతో అతన్ని ఓ పోలీసు ఆఫీసరుగా ఎవరూ గుర్తించలేదు. గత నెల్లాళ్లలో ఏయే కాలేజీలకు ఎన్ని శవాలు వచ్చాయోనని లోపాయకారీగా విచారించితే – మూడు ప్రైవేట్ కాలేజీలకు ఒక్కో శవం చొప్పున వచ్చినట్టు తెలిసింది. సమాధుల నుండి శవాలు మాయమైన రెండు రోజులకు అవి సప్లై చేయబడ్డట్టు గ్రహించాడు.ఆ కాలేజీలలో ఒకదానికి మారువేషంలో వెళ్ళాడు శివరామ్. ఆ కాలేజీ మార్చురీ అటెండర్ని మచ్చిక చేసుకుని, తాను ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి చెందినవాడననీ, ఎనాటమీ క్లాసులకు శవాలను సప్లై చేసే సోర్స్ కావాలనీ అడిగాడు.‘అప్పుడప్పుడు డెడ్ బాడీస్’ ఓ ఆంబులెన్స్ లో వస్తాయనీ, మిగతా వివరాలు తనకు తెలియవనీ చెప్పాడు అతను. ఆ ఆంబులెన్స్ నంబర్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి, ఓ అరవయ్యేళ్ల వృద్ధుణ్ణి తెచ్చి లాకప్‌లో వేశారు అతని సిబ్బంది. బంగారు నెక్లెస్ ఒకటి ఓ పాన్ షాపులో అమ్మబోతూ పట్టుబడ్డాడట అతను. ఆ నగ తన కోడలిదనీ, కొడుకు తనకు తాగుడుకు డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో దాన్ని అమ్మేయడానికి తెచ్చాననీ చెప్పాడు ముసలాడు. కానిస్టేబుల్స్ ని పంపించి అతని కొడుకును రప్పించాడు శివరామ్. తన పేరు గంగులు అనీ, కూలిపని చేసుకుంటాననీ చెప్పాడు వాడు. మొదట ఆ నెక్లెస్ గురించి తనకేమీ తెలియదన్నాడు. తరువాత అది తనకు ఎక్కడో దొరికిందన్నాడు. చితగ్గొట్టేసరికి, ‘ఓ ఆడమనిషి శవం మెళ్లో ఉంటే తీసుకున్నానంటూ’ నిజాలు బయటపెట్టాడు.. అతను చెప్పిన బాలరాజు ఆంబులెన్స్ నంబరూ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మార్చురీ అటెండర్ ఇచ్చిన నంబరూ ఒకటే. బాలరాజు ఇంటికి వెళ్ళాడు శివరాం. అతను నాలుగు రోజులుగా ఊళ్లో లేడు. మరదలి పెళ్లికి వెళ్లాడనీ, మర్నాడు వస్తాడనీ తెలిసింది. అతని గురించి విచారిస్తే... ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆర్థికంగా కష్టపడుతూన్న బాలరాజు, కొద్ది నెలలలోనే జల్సా జీవితం గడుపుతున్నాడని తెలిసింది. మర్నాటి ఉదయం బాలరాజును నాంపల్లి రైల్వే స్టేషన్లోనే పికప్ చేసుకున్నాడు శివరామ్.ఎవరెవరో తన ఆంబులెన్సుని వాడుకుంటారనీ, శవాల సంగతి తనకు తెలియదనీ బుకాయించబోయాడు బాలరాజు. గంగులు తమ అధీనంలో ఉన్నాడనే సరికి గతుక్కుమన్నాడు. మాట మార్చి, ‘తానుఅన్న కోసం ఆంబులెన్స్‌ను నడుపుతాడనీ, అతను అనాథ శవాలను కొని మెడికల్ కాలేజీలకు సప్లయ్ చేస్తాడనీ’ చెప్పాడు. అయితే, పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూశాక, నిజం కక్కక తప్పలేదు. నేరమంతా ‘అన్న’ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తూ, ‘అన్న’ పేరు గురవారెడ్డి అనీ, అతనికి తెలియకుండా తాను తన సెల్లో రికార్డ్ చేసిన తమ సంభాషణలను ప్లే చేసి వినిపించాడు. బాలరాజును తీసుకుని గురవారెడ్డి ఇంటికి వెళ్ళాడు శివరామ్. అతను ఇంట్లో లేడు. ‘గత దినం గురవారెడ్డి తల్లి డెత్ యానివర్సరీ అనీ, కార్యక్రమం ముగిసే సరికి సాయంత్రం అయిపోయిందనీ, ఆ తరువాత తల్లి సమాధిని దర్శించేందుకు అతను శ్మశానానికి వెళ్ళాడనీ’ చెప్పింది అతని భార్య. తద్దినం రోజున ఆవిడ సమాధి వద్దకు వెళ్ళి గంటల కొద్దీ గడిపి వస్తాడంది. తెల్లవారినా రాకపోయే సరికి ఫోన్ చేశామనీ, స్విచాఫ్ చేసి ఉందనీ చెప్పింది. అంతలో బాలరాజు సెల్ మ్రోగింది. శివరామ్ సైగనందుకుని స్పీకర్ ఆన్ చేశాడు అతను. ‘‘బాలరాజన్నా! ఊరి నుంచి వచ్చావా? మేము మార్చురీలో ఉన్నాం, వస్తావా?’’ అన్నాడు అవతలి వ్యక్తి. అది ‘అన్న’ ప్రైవేట్ మార్చురీ అని చెప్పాడు బాలరాజు. కానిస్టేబుల్స్‌ని గురవారెడ్డి ఇంటి దగ్గర కాపలా ఉంచి, బాలరాజుతో మార్చురీకి వెళ్లాడు శివరామ్. అక్కడ శవాన్ని చూసి బాలరాజు బిగుసుకుపోయాడు. శివరామ్ మఫ్టీలో ఉన్నందున, అతన్ని క్లెయింటుగా భావించారు అక్కడున్న వ్యక్తులు ఇద్దరూ. ‘‘పెద్దన్న చెప్పాడని, నువ్వు వచ్చేసరికి ఓ శవాన్ని తెచ్చి ఉంచమన్నావుకదా? ఇదిగో!’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి, బాలరాజుతో. ’’గంగులు గాడు ఎటు పోయాడో తెలీలేదు. మీరిద్దరూ లేకుండా సమాధి తవ్వడానికి మాకు ధైర్యం చాల్లేదన్నా! బాడీ అర్జెంటన్నావని, శ్మశానంలో తిరుగుతూన్న ఒకణ్ణి వెనుక నుంచి బుర్ర పగులగొట్టి వాడి శవాన్ని తెచ్చేశాం’’. ‘‘అన్నా! మా కష్టాన్ని గుర్తించి ఎప్పుడూ ఇచ్చేదాని కంటే ఎక్కువే ముట్టజెప్పాలి మాకు’’ అన్నాడు రెండోవాడు. శిలావిగ్రహంలా ఉండిపోయిన బాలరాజు తేరుకుని ఇన్స్పెక్టర్ వంక వెర్రిచూపులు చూశాడు. ‘‘సార్! ఇతనే ‘అన్న’ గురవారెడ్డి’’ అన్నాడు శవాన్ని చూపిస్తూ!! - తిరుమలశ్రీ -
సమాధిపై న్యాయం మొలిచింది
2005లో కుమారుడి మరణం కారణంగా పద్మావతమ్మ కళ్లలో పెల్లుబికిన నీరు.. 2018 జూలైలో కుండపోత వర్షంతో ముగిసింది. సమాధిపై పూచిన పువ్వు ఈ అమ్మ. చీర మీద నేసిన పువ్వు ఆ కొడుకు.చెరగని జ్ఞాపకానికి పూదండ.. ఈ కథనం.కన్నీటితో బాధను కడిగేయడం కాదు..ఆ కన్నీరే దుఃఖజ్వాలకు ఆజ్యం కావాలన్నది నీతి. అవును.న్యాయం సమాధి కాకూడదు. సమాధి పైన కూడా న్యాయం మొలవాలి. ఓనం పండగ. అమ్మకు చీర కొని తెచ్చేందుకు వెళ్లిన కొడుకు ఎంతకూ రాలేదు. తల్లి తల్లడిల్లింది. రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. కొడుకు ఏమయ్యాడోనన్న ఆందోళన ఓ పక్కన తొలుస్తోంది. గుండె దిటవు చేసుకుని ఉద్యోగానికి వెళ్లింది. స్కూల్లో పని. కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ‘‘ఆసుపత్రిలో ఒక శవం ఉంది, అది మీ వాళ్లదేనేమో వచ్చి చూసుకోండి’’ అని చెప్పాడు. తల్లి గుండె గుభేలుమంది. అది తన కొడుకుది కాకూడదని వేయి దేవుళ్లకు మొక్కుకుంది. ఆస్పత్రికి వెళ్లింది. ఆమె మొక్కులనూ, మొరలనూ భగవంతుడు ఆలకించలేదు. ఆ శవం ఆమె కొడుకుదే! పదమూడేళ్ల పోరాటం గుండెలవిసేలా రోదించింది తల్లి. ఆ వచ్చిన వ్యక్తి వచ్చి ఆమె కొడుకు మరణానికి కారణాలు చెప్పాడు. అప్పుడే నిర్ణయించుకుందామె దోషులకు శిక్ష పడేవరకూ విశ్రమించకూడదని. అప్పటికి ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇప్పుడు 67. ఈ 13 ఏళ్ల వ్యవధిలో తన కుమారుడి మృతికి కారకులైన వారిని ఉరి కంబం ఎక్కించేలా తీర్పు వచ్చేవరకూ ఆ తల్లి విశ్రమించలేదు. ఓ పక్క వయసు కరిగిపోతోంది. నిస్సత్తువ ఆవహిస్తోంది. సాక్షులు ఎదురుతిరుగుతున్నారు. పోలీసులే ఆమెను చంపడానికి మూడుసార్లు ప్రయత్నించారు. బెదిరించారు. కోర్టు మెట్లపైనే ఆమెను కొట్టారు. నడిచి వెళుతుండగా మూడుసార్లు కార్లతో ఢీకొట్టి చంపబోయారు. అయినా వెరవలేదు. అనన్య సామాన్యమైన ఆమె పోరాటఫలితం ఊరికే పోలేదు. కుమారుడి మృతికి కారకులైన ఇద్దరు పోలీసులకు ఉరి శిక్ష, మరో ముగ్గురికి జైలు శిక్ష పడింది. ఆమె పేరు పద్మావతమ్మ. కేరళలోని తిరువనంతపురం ఆమె స్వస్థలం. ఒక్కగానొక్క కొడుకు ఉదయ్‌కుమార్ పనికి రాని వస్తువుల అమ్మకాలూ, కొనుగోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. అది 2005 సంవత్సరం ఓనం పండక్కి యజమాని ఇచ్చిన బోనస్ డబ్బులు తీసుకుని అమ్మకు చీర, తనకు కొత్త బట్టలు తెచ్చుకునేందుకు బయటికి వెళ్లాడు ఉదయ్‌కుమార్. యజమాని ఇచ్చిన 4020 రూపాయల పండగ బోనస్ తీసుకుని జేబులో పెట్టుకుని బయలుదేరాడు. అదే రోజున కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పట్టణమంతా హడావిడిగా ఉంది. ఆ సంబరాలు సద్దుమణిగాక, బట్టలు కొని ఇంటికి వెళదామని రోడ్డుపై నిలబడి చూస్తున్నాడు ఉదయ్‌కుమార్. ఈలోగా అతడి పక్కన ఓ అపరిచిత యువకుడు వచ్చి నిలబడ్డాడు. ఆ యువకుడికి చోరీలు చేసిన చరిత్ర ఉంది. అతడిని గమనించిన పోలీసులు అతడితో పాటు పక్కనే ఉన్న ఉదయకుమార్‌ను కూడా పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఏదో చోరీకి సంబంధించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ జేబులో ఉన్న డబ్బును గమనించారు. అది తన యజమాని ఇచ్చిందని ఎంత చెప్పినా వినకుండా, డబ్బు తీసుకున్నారు. స్టేషను నుంచి వెళ్లి పొమ్మన్నారు. తల్లికి బట్టలు కొనకుండా ఆ డబ్బును వదిలి వెళ్లడానికి ఉదయ్‌కుమార్‌కు మనస్కరించలేదు. తన డబ్బు తనకిమ్మని పట్టుబట్టాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు! డబ్బు కోసం ఎవరైనా వస్తే సరైన ఆధారాలు తెలుసుకుని ఇవ్వాలనే ఉద్దేశం పోలీసులది. సాధారణంగా ఆ పోలీస్ స్టేషన్‌కి ఇలాంటి కేసులే వస్తుంటాయి. అయితే ఉదయ్‌కుమార్ మంకుపట్టుతో పోలీసుల కర్కశ ప్రవృత్తి బయటపడింది. అతడిని తీవ్రంగా కొట్టారు. బ్రిటిషు కాలంనాటి హింసాత్మక పద్ధతులను అతనిపై ప్రయోగించారు. బల్లపై బోర్లా పడుకోబెట్టి, కాళ్లు చేతులు చెరో వైపు లాగి కట్టారు. ఒక కానిస్టేబుల్ అతడిపై ఎక్కి కూర్చున్నాడు. కాళ్ల మీద పెద్ద ఇనుపరాడ్లను ఆపకుండా దొర్లించారు. ఈ చర్యతో అతడి కాళ్లు విరిగిపోయాయి. ‘దాహం దాహం’ అని మంచినీటి కోసం అర్థిస్తే, ఖాళీ సీసా ఇచ్చి, వికృతానందం పొందారు. రాత్రంతా కొడుతూనే ఉన్నారు. ఫలితంగా ఉదయ్‌కుమార్ ప్రాణాలు ఆ కటకటాల వెనుక గాలిలో కలిసిపోయాయి. అప్పుడు మొదలైంది పద్మావతమ్మ న్యాయ పోరాటం. ఆమెకు ఆమె బంధువు మోహనన్, సీపీఐ నాయకుడు పి.కె.రాజు, ముస్లిం అడ్వొకేట్ సిరాజ్ ఆ తల్లికి అండగా నిలిచారు. దురదృష్టమేమిటంటే, పద్మావతమ్మకు అన్నివిధాల సహకరిస్తున్న రాజును కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. రాజకీయ ర్యాలీలు, ఇతర ఆందోళనల సమయాలలో రాజును లక్ష్యంగా చేసుకుని చితకబాదారు. సివిల్ డ్రెస్‌లో వచ్చి మరీ అతనిని కొట్టేవారు. ఊహించని మలుపు పద్మావతమ్మ చేస్తున్న న్యాయపోరాటం 2007 లో చిత్రమైన మలుపు తీసుకుంది. ఆ మలుపే కేసుకు కీలకం అయింది. ఆమె విజయానికి బాటలు పరిచింది. పత్రికలలో ఆమె రాసిన లేఖలు ఒక ముస్లిం మత ప్రబోధకుడి కుమారుడైన సిరాజ్ కరోలీ దృష్టిని ఆకర్షించాయి. సిరాజ్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఈ కేసును సీబీఐతో విచారింపచేయాలని 2007 సెప్టెంబరులో అతడు కోర్టులో పిటిషన్ వేశాడు. సాధారణంగా కేసు విచారణ దశలో ఉండగా, ఏ కేసు పైనా ఏ కోర్టయినా అసాధారణ నిర్ణయాలు తీసుకోదు. అయితే 2002 లో బెస్ట్ బేకరీ కేసుకి సంబంధించిన సాక్షులను ప్రాసిక్యూషన్ తమ వైపుకి తిప్పుకున్న సందర్భాన్ని ఈ పిటిషన్లో సిరాజ్ ఉదహరించారు. ఆ కేసు రిఫరెన్స్ ఆధారంగా కోర్టు కేసును íసీబీఐకి అప్పగించింది. తల్లి తెచ్చుకున్న తీర్పిది! పద్మావతమ్మ నుంచి సిరాజ్ ఎటువంటి ఫీజూ ఆశించలేదు. కాని ఆమె తాను కూడబెట్టుకున్న మూడు వేల రూపాయలను అతడికి ఇచ్చింది. సిరాజ్ రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. కుమారుడి మరణం కారణంగా పద్మావతమ్మ కళ్లలో పెల్లుబికిన నీరు, 2018 జూలైలో కుండపోత వర్షంతో ముగిసింది. ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె. జితా కుమార్, పోలీసు ఆఫీసరు ఎస్. వి. శ్రీకుమార్‌లకు సీబీఐ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో ముగ్గురికి జైలు శిక్షపడింది. ఈ కేసులో మొత్తం 34 మందిని సాక్షులుగా చేర్చగా, 33 మందిని ప్రాసిక్యూషన్ తన వైపుకి తిప్పుకుంది. ఆమె వైపు నిలబడిన ఆ ఒక్క మహిళ కావడం. ఆమె టైపిస్టుగా పనిచేస్తోంది. అమ్మ మనసు తెలుసుకుని, పద్మావతమ్మకు కడ దాకా అండగా నిలబడింది. తీరిన కొడుకు రుణం న్యాయ పోరాటంలో గెలిచిన పద్మావతమ్మ ఇప్పుడు మనశ్శాంతిగా కొత్త జీవితాన్ని గడుపుతోంది. పక్కింట్లో ఉంటున్న ఒక పిల్లవాడు ఆమెకు చేరువయ్యాడు. ‘నన్ను అమ్మా అని పిలుస్తాడు’ అంటూ చెమర్చిన కళ్లతో చెబుతారు పద్మావతమ్మ. మెడకు చుట్టుకున్న పాపం ఉదయ్‌కుమార్‌ని కొట్టి చంపినవారు బాగానే ఉన్నారు. కాని అలా అతడిని కొట్టడానికి కారణమైన ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు ఉరి శిక్షపడింది. వారి కుటుంబాలు ఇప్పుడు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇళ్లు అమ్ముకున్నారు. తమ వారిని రక్షించుకోవడానికి ఒక పెద్ద లాయర్ని పెట్టుకుని ఈ డబ్బు ఖర్చు చేశారు. అద్దె ఇంట్లోకి మారవలసి వచ్చింది. ఓ పోలీసు అధికారి భార్య కుటుంబాన్ని పోషించుకోవడం కోసం టైలరింగ్ పని చేస్తోంది. – రోహిణి -
పకీర్ బాషా
అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, ఎవరూ ప్లాట్లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది. ‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకొస్తాను. నాక్కొంత డబ్బు ఇప్పిస్తావా?’’ అన్నాడు మిల్టన్.. అవధానితో.. ఎండకు వగరుస్తూ వచ్చి. ఆ మాటకు అవధాని, మిల్టన్ వైపు చూడకుండా తన పక్కనే ఉన్న పకీర్‌బాషా వైపు చూశాడు. పకీర్‌బాషా ఒక్క క్షణం మిల్టన్ వైపు చూసి, వెంటనే అవధానిని చూశాడు. ఆ చూడ్డంలో.. ‘వీడెవడు.. వింత మనిషి’ అనే అర్థం ఉంది. అది పకీర్‌బాషా ఇల్లు. మిల్టన్ మొదట అవధాని ఇంటికి వెళ్లి.. అవధాని ఇంట్లో లేడు, పకీర్‌బాషా ఇంటికెళ్లాడని తెలుసుకుని, పకీర్‌బాషా ఎవరో, అతడి ఇల్లెక్కడుందో కూడా తెలుసుకుని నేరుగా అక్కడికే వెళ్లాడు. అంతగా అతడికి అవధాని అవసరం ఏదో పడినట్లుంది. అవధాని, మిల్టన్ స్నేహితులు. తనకు తెలియకుండా అవధానికి పకీర్‌బాషా అనే మనిషితో పరిచయం ఉందంటే.. ఆ పరిచయమేదో ఈ మధ్యే అయి ఉంటుందని మిల్టన్ ఊహించాడు. పకీర్‌బాషా ఇంకా అలాగే మధ్యమధ్యలో మిల్టన్‌ని చూస్తూ, అవధాని వైపు చూస్తున్నాడు.. ‘వీడెవడు.. వింత మనిషి’ అన్నట్లుగానే. ‘ఇతనెవరో దెయ్యాల్ని పట్టే మనిషిలా ఉన్నాడే..’ అనుకున్నాడు మిల్టన్.. పకీర్బాషాను చూసి. వాళ్లిద్దరికీ ఒకరికొకరు నచ్చలేదని అవధానికి అర్థమైంది. ‘‘వీడు నా చిన్ననాటి ఫ్రెండు. మిల్టన్’’ అన్నాడు అవధాని పకీర్బాషాతో. ‘‘రేయ్.. మిల్టన్, ఇతను పకీర్‌బాషా. ఇద్దరం కలిసి ఓ వెంచర్ చేస్తున్నాం. ఫైనల్ అయ్యాక నీకు చెబుదామనుకున్నాను’’ అన్నాడు అవధాని. చెప్పకపోయినా హర్ట్ అయ్యే మనిషి కాదు మిల్టన్. అతడి లోకంలో ఈ వెంచర్లు, అడ్వెంచర్లు ఉండవు. చిన్న ప్రాణి. అయినా మిల్టన్‌కు ఏదీ చెప్పకుండా ఉండడు అవధాని. కాస్త ముందో, వెనకో చెబుతుంటాడు. ఆ ఇద్దరి చిన్ననాటి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ‘‘ఎందుకురా అంత డబ్బు?’’ అన్నాడు అవధాని మిల్టన్‌తో. మిల్టన్ ఎప్పుడూ ఎంత అవసరమో చెప్పడు. అవసరం ఎంతటిదో చెబ్దాడు. ఇప్పుడూ అలాగే చెప్పాడు. అర్ధరాత్రి, శ్మశానం, తెల్లసున్నం, సమాధి, నిమ్మకాయ.. అన్నాడంటే.. అతడేదో చచ్చేంత అవసరంలో ఉన్నాడని. మిల్టన్ మితంగా బతికే మనిషి. చెయ్యి చాచాడూ అంటే.. బతుకు ఆ మాత్రం మితంగా కూడా అతణ్ణి ఉండనివ్వడం లేదనే అనుకోవాలి. మిల్టన్ బతుకులో మిల్టన్, అతడి భార్యా పిల్లలు మాత్రమే లేరు. మరికొందరికి కోసం కూడా అతడు రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన బాంధవ్యాలు ఉన్నాయి. ఆ బాంధవ్యాల గురించి బయటెక్కడా చెప్పుకోడు. పుట్టుకతో చెయ్యీ కాలూ ఉన్నట్లే తన బాధ్యతల్ని కూడా దేహావయవాలే అనుకుంటాడు. కాలు, చెయ్యి ఉన్నవాళ్లు తమకు కాలుందనీ, చెయ్యుందనీ చెప్పుకుంటారా?! అలాగే తనకు బాధ్యతలు ఉన్నాయని మిల్టన్ చెప్పుకోడు. అలాంటి మిల్టన్‌కి అకస్మాత్తుగా కొంత డబ్బు కావలసి వచ్చింది. ఎంత డబ్బో అతడు చెప్పలేదు. కొంత అన్నాడు. ఆ కొంత ఒక కోటి అయినా, చిన్న నోటే అయినా.. అతడు మళ్లీ తీర్చలేడు. తీర్చడానికి అసలు అతను అప్పుగా ఇవ్వమని అడగడు. పని చేసిపెడతానంటాడు. పని చేశాకే చెయ్యి చాపుతాడు. ‘‘సరే చూద్దాంలేరా..’’ అని మిల్టన్‌కి చెప్పి పంపాక, మిల్టన్ గురించి పకీర్బాషాకు ఈ విషయాలన్నీ చెప్పాడు అవధాని. ‘‘ఎంత అడుగుతున్నాడని ఇప్పుడు మనం అనుకోవాలి?’’ అన్నాడు పకీర్‌బాషా ఆశ్చర్యంగా.‘‘ఎంతైనా అవొచ్చు’’.‘‘తెలిస్తేనే కదా ఇవ్వగలం’’‘‘వాడికీ తెలీదు. పని తీసుకుంటాడు. చేశాక ఇచ్చింది తీసుకుంటాడు’’ ‘‘ముందైతే డబ్బు తీసుకో. పనేదైనా ఉన్నప్పుడు వచ్చి చేసుకో అంటే?’’‘‘పండించకుండా తిండి తినే హక్కు తనకు లేదంటాడు’’‘వింత మనిషే’ అనుకున్నాడు పకీర్‌బాషా. ‘‘సరే.. చెప్పు. నా దగ్గర పనుందని నీ ఫ్రెండుకి చెప్పు’’ అన్నాడు. ‘‘ఏ పని?’’ అన్నాడు అవధాని.‘‘అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నం కొట్టిన సమాధిపై నిమ్మకాయ ఉంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయను తీసుకురావాలి’’ అన్నాడు పకీర్‌బాషా. పెద్దగా నవ్వాడు మిల్టన్. ‘‘పకీర్బాషాగారు.. మా అవధాని మీకు చెప్పే ఉంటాడు. డబ్బు నాకు ఎంత అవసరమో చెప్పడానికి ‘శ్మశానంలోకైనా వెళ్లొస్తానని’ నేను అంటుంటానే కానీ, నిజానికి నాకదేం పెద్ద పని కాదు. అది మీకు పనికొచ్చే పనైతే నాకూ సంతోషంగా ఉంటుంది. నా సంతోషం కోసం మీరొక పని సృష్టించడం నాకేమాత్రం ఆనందాన్నివ్వదు’’ అన్నాడు మిల్టన్. ఆ మాట నిజం. మిల్టన్ ఏమిటో తెలిశాక, అతడికి ఏదో ఒక విధంగా డబ్బు సాయం చేయాలని మాత్రమే పకీర్‌బాషా అనుకున్నాడు. అలా అని మిల్టన్తోనూ అనలేదు, అవధానికీ చెప్పలేదు. ‘‘నీ ధైర్య సాహసాలతో నాకు పన్లేదు మిల్ట . పని కావాలంటున్నావు కాబట్టి నా దగ్గర ఉన్న పనేమిటో చెబుతున్నాను. మేము మొదలుపెడుతున్న వెంచర్లో ఓ సమాధి ఉంది. అదొక్క సమాధే అక్కడెందుకు ఉందో తెలీదు. అయితే అక్కడ రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందనీ, ఎవరూ ప్లాట్లు కొనేందుకు రారనీ ప్రచారం జరుగుతోంది. నువ్వొకసారి వెళ్లొస్తే, అక్కడేం లేదని జనానికి తెలిస్తే మంచిదే కదా’’ అన్నాడు పకీర్‌బాషా. ఆ రాత్రి ఒక్కడే.. వెంచర్లో సమాధి ఉందని పకీర్‌బాషా చెప్పిన చోటుకు వెళ్లొచ్చాడు మిల్టన్. ఆ ఉదయాన్నే మంచం పట్టాడు! అక్కడేం జరిగిందీ అతడు ఎవరికీ చెప్పలేదు. అసలు అక్కడికి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. పకీర్‌బాషా ఇంటికొచ్చి మరీ మిల్టన్‌కు డబ్బు ఇచ్చి వెళ్లాడు. అతడు వెళ్తుంటే వెనక్కు పిలిచి మెల్లిగా చెప్పాడు.. మిల్టన్. ‘‘నిజమే. ఉంది’’ అన్నాడు. ‘‘ఎలా తెలిసింది?’’.. అడిగాడు పకీర్‌బాషా. ‘‘ఆ దెయ్యం నాకు సమాధి కూడా కనిపించకుండా చేసింది’’ అన్నాడు మిల్టన్ సన్నగా మూలుగుతూ. పకీర్‌బాషా బయటికి వస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. - మాధవ్ శింగరాజు -
కన్నుమూసిన వారినీ కనికరించలేదు
పిఠాపురం: పచ్చటి బతుకులను కకావికలం చేసిన హుదూద్ తుపాను చివరికి కంకాళాల్నీ విడిచి పెట్టలేదు. రెచ్చిపోయిన ఆబోతులా.. నేలను పెళ్లగించి సమాధుల్లోని అస్థిపంజరాల్నీ పెకలించింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటలో ు ప్రత్యేకంగా శ్మశానం లేకపోవడంతో సముద్రతీరానికి సమీపంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. తుపాను ప్రభావంతో కడలి విరుచుకుపడడంతో పలు సమాధులు కొట్టుకుపోయి కంకాళాలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం భీతావహంగా ఉంది. అయినవారి అవశేషాలు ఇలా దిక్కులేనివిగా చెల్లాచెదురు కావడాన్ని చూసి గ్రామస్తులు వేదనకు గురవుతున్నారు.