ground level
-
పట్టు సాధిస్తున్న ఇజ్రాయెల్
జెరూసలేం: హమాస్ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటిదాకా 800 పైచిలుకు ప్రాంతాలను నేలమట్టం చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఇజ్రాయెలీ ప్రాంతాలను మిలిటెంట్ల చెర నుంచి సోమవారం విడిపించింది. అయితే దక్షిణాదిన పలుచోట్ల ఇంకా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ సైన్యం హోరాహోరీ పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పదుల కొద్దీ అదనపు దళాలను ఇజ్రాయెల్ రంగంలోకి దించుతోంది. ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతు అందించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల నేపథ్యంలో ఆ దేశ విమాన వాహక యుద్ధ నౌకలు తదితరాలు తూర్పు మధ్యదరా సముద్రం వైపు తరలాయి. సమీప ప్రాంతాల యుద్ధ విమాన దళాలను కూడా అమెరికా హుటాహుటిన సమీకరిస్తోంది. దాడి వెనక ఇరాన్! ఇజ్రాయెల్‌పై దాడి వెనక ఇరాన్ హస్తం, ప్లానింగ్ ఉన్నట్టు హమాస్, హెజ్బొల్లా నేతలే స్వయంగా వెల్లడించారు. గాజా స్ట్రిప్‌లో 30 మందికి పైగా ఇజ్రాయెలీలను తాము బందీలుగా పట్టుకున్నట్టు ఇస్లామిక్ జిహాద్ సంస్థ చీఫ్ జైద్ అల్ నఖాలా చెప్పాడు. -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
ఉక్రెయిన్‌పైకి హైపర్ సోనిక్ క్షిపణితో దాడి
కీవ్: యుద్ధానికి తెర తీసి మూడున్నర వారాలైనా విజయం అందని ద్రాక్షే కావడంతో రష్యా చిర్రెత్తిపోతోంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’తో ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. రేవు పుట్టణం ఒడెసా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక స్థావరాలను కూడా యాంటీ షిప్ మిసైల్ సిస్టం సాయంతో క్షిపణి ప్రయోగాలతో నేలమట్టం చేసినట్టు చెప్పారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే శుక్రవారం నాటి దాడిలో సాంప్రదాయిక వార్ హెడ్నే వాడారు. మిగ్–31 ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించారు. డెలియాటిన్ సెటిల్మెంట్లోని తమ ఆయుధాగారంపై క్షిపణి దాడి నిజమేనని ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో ఉన్న యూరప్‌లోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అజోవ్‌స్టాల్ కూడా రష్యా సైన్యం దాడిలో దాదాపుగా నేలమట్టమైందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా భూ, గగన తలాల గుండా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్, మారియుపోల్, అవ్డివ్కా, క్రమటోర్స్క్, పొక్రోవ్స్క్, నొవొసెలిదివ్కా, వెర్కోనొటొరెస్కే, క్రిమ్కా, స్టెప్నే, లివివ్ తదితర నగరాలు బాంబుల దాడితో వణికిపోతున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. స్కూళ్లు, ఆస్పత్రులు, మ్యూజియాలు, షాపింగ్ సెంటర్లు వేటినీ వదలడం లేదని ఆరోపించింది. మారియుపోల్ దాదాపుగా రష్యా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధం తెగిపోయిందంటున్నారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌లో ఓ సైనిక స్థావరంపై రష్యా జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. 50కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దాడి సమయంలో రెజిమెంట్‌లో 200 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. పాపం పిల్లలు! ఉక్రెయిన్ నుంచి వలసల సంఖ్య 40 లక్షలు దాటినట్టు సమాచారం. దేశ జనాభాలో ఇది దాదాపు 10 శాతం! 75 లక్షల ఉక్రెయిన్ బాలల్లో సెకనుకు ఒకరి చొప్పున శరణార్థిగా మారుతున్నారు. మరో 10 కారిడార్లు కీవ్, మారియుపోల్, లుహాన్స్క్, రష్యా అధీనంలోని ఖెర్సన్ సహా పలు నగరాల్లో 10 హుమానిటేరియన్ కారిడార్లకు రష్యాతో అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్ తెలిపింది. నిత్యావసరాల సరఫరాను రష్యా సైన్యం అడ్డుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఇప్పటికైనా తనతో నేరుగా చర్చలకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. తటస్థ హోదాకు ఉక్రెయిన్ ఓకే: రష్యా నాటో సభ్యత్వ డిమాండ్‌ను వదులుకునేందుకు, తటస్థ దశంగా కొనసాగేందుకు ఉక్రెయిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. కానీ తమ వైఖరిలో మార్పూ లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ దుస్తుల్లో రష్యా వ్యోమగాములు? శుక్రవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ముగ్గురు రష్యా వ్యోమగాములు ఉక్రెయిన్ జెండాతో సరిపోలే నీలి, పసుపు రంగు స్పేస్ సూట్లు ధరించి కన్పించారు! ‘‘ఏ రంగు సూట్లు ఎంచుకోవాలన్నది మా ఇష్టం. పసుపు రంగు సూట్లు మా దగ్గర చాలా పోగుపడ్డాయి. దాంతో అవే వేసుకోవాల్సి వచ్చింది’’ అని వాళ్లు చెప్పారు. ఉక్రెయిన్‌కు నైతిక మద్దతుగానే ఈ పని చేశారా అన్నది తెలియరాలేదు. -
ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!
సాక్షి, కర్నూలు(సెంట్రల్): ట్రాఫిక్ రద్దీ.. వాహనాల పొగతో జిల్లాలోని పట్టణాల్లో భూస్థాయి ఓజోన్ మోతాదు అంతకంతకూ అధికమవుతోంది. ఫలితంగా వివిధ వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు అస్తమా, బ్రాంకైటీస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్నకాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సీనియర్ సిటిజన్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి 9 రాత్రి గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ అక్సైడ్ , ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలసిపోవడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్న ప్రయాణీకులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నసమయాల్లో సుమారు ఘనపు మీటరు గాలిలో 125 మైక్రో గ్రాములుగా నమోదు అవుతుండడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. అనర్థాలిలా.. –అస్తమా, ట్రాకంఐటిస్‌తో సతమతమవడం, ఊపిరిఆడకపోవడం – గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం – ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం ఉపశమనం ఇలా... కర్నూలు,నంద్యాల, ఆదోనిలతోపాటు ఇతర పట్టణాల్లో సుమారు 20 లక్షల వాహనాల్లో పదిహేనేళ్లకు పైబడిన 5లక్షల వాహనాలను రోడ్డు ఎక్కకుండా చూడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్కులు, హెల్మెట్లు ధరించాలి. వాము కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగిస్తే కొంత మేర నివారించే అవకాశం ఉంది. ప్రజల్లోమార్పు రావాలి రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో కొన్నింటిని కాలం చెల్లినా వినియోగిస్తున్నారు. ఇవి పర్యావరణానికి ఎంతో కీడు చేస్తాయి. అవి విడుదల చేసే వాయువులు, ఓజోన్ కలసి భూ వాతావరణాన్ని వేడెక్కిస్తుండడంతో ప్రమాదం దాపురిస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ప్రజల్లో అవగాహన వస్తే తప్పా ఏమి చేయలేము. -బీవై మునిప్రసాదు, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి, కర్నూలు -
కందకాలతో జలసిరి!
భూగర్భ జాలాలు అడుగంటిన నేపథ్యంలో వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లోని పండ్ల తోటల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోకసాని పద్మారెడ్డి కూడా వారిలో ఒకరు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో పద్మారెడ్డికి 80 ఎకరాల భూమి ఉంది. ఇందులోబత్తాయి తదితర తోటలు ఉన్నాయి. తోటలకు నీటి కొరత తీర్చుకునేందుకు గత కొన్నేళ్లుగా మొత్తం 247 బోర్లు వేసిన రైతు పద్మారెడ్డి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల బోర్లలో నీరు ఆఫ్ ఇంచ్‌కు తగ్గిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), వాటర్ మేనేజ్మెంట్ ఫోరం నిపుణుడు శంకరప్రసాద్ (90003 00993) సూచన మేరకు జూలై 5–6 తేదీల్లో తమ 80 ఎకరాల్లో, వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, కందకాలు తవ్వించారు. అదృష్టం కొద్దీ కందకాలు తవ్విన కొద్ది రోజుల్లోనే 3 రోజుల పాటు మంచి వర్షాలు కురిశాయి. పొలాల్లో కురిసిన ప్రతి చినుకూ కందకాల ద్వారా అంతకుముందెన్నడూ లేని విధంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జల మట్టం పెరిగింది. గతంలో ఆఫ్ ఇంచ్ పోసే బోర్లు ఇప్పుడు 2.5 ఇంచులు ఫుల్లుగా పోస్తుండడంతో పద్మారెడ్డి పరమానందభరితుడయ్యారు. అనూహ్యంగా ఇంత సులువుగా, ఇంత తక్కువ రోజుల్లో భూగర్భ జల మట్టం పెరగడం తనను ఆశ్చర్యపరచిందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో గుంటిపల్లి దగ్గర ఉన్న మరో 30 ఎకరాల్లో కూడా కందకాలు తీయిస్తున్నామన్నారు. సాగు నీటి భద్రత కోసం కందకాల ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక, టీవీ యాజమాన్యాలకు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నేతలకు పద్మారెడ్డి(99481 11931) కృతజ్ఞతలు తెలిపారు. -
బోరు భోరుగా..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సుమారు 40 శాతం బోరుబావులు నీళ్లు లేక వట్టిపోయాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం... భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరవాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాననగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రా>జేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా..ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్లో భూగర్భజలవిల ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు. మరోవైపు రాజధానిలో నీటి బొట్టు కనుమరుగు కానుంది. వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. విలువైన వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జిపిట్స్ తగినన్ని లేక భూగర్భజలమట్టాలు పెరగడం లేదు. గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్.. బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ’కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజల మట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది. -
గుక్కెడు నీటికి.. కడివెడు కష్టాలు
గుక్కెడు నీటికోసం ‘అనంత’ అల్లాడిపోతోంది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటగా బిందెనీటి కోసం జనం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారగా.. ప్రజలు పనులు మానుకుని నీటియుద్ధాలు చేస్తున్నారు. ఏటా ఇదే సమస్య నెలకొంటున్నా ఉన్నతాధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నం కాగా.. రెండు నెలలుగా పల్లెలు జలం కోసం ఘొల్లుమంటున్నాయి. అనంతపురం, టవర్‌క్లాక్ : భూగర్భజలం పాతాళంలోకి పడిపోయింది. కరువుకు నిలయమైన ‘అనంత’లో ఏటా అనావృష్టి నెలకొనడంతో జలం...జటిలంగా మారింది. జిల్లాలో 63 మండలాలుండగా.. 1003 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి వేసవిలోనూ పల్లెవాసులు నీటి చుక్కకోసం అష్టకష్టాలు పడుతున్నారు. పాతాళంలో జలం అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, రామగిరి, వజ్రకరూరు, పుట్లూరు. గుత్తి, గుంతకల్లు, కనగానపల్లి మండలాల్లో భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఈ మండలాల్లోని వారంతా వేసవి వచ్చిందంటే తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతారు. బిందె నీటికోసం మండుటెండలో కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా ఇదే సమస్య నెలకొంటున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం చూపని సర్కార్ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో మూడు నియోజకవర్గాలకు తాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. ఆ మేరకు నిధులు విడుదల చేసి పనులు కూడా వేగవంతంగా చేయించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు వైఎస్సార్ హయాంలోనే రూపుదిద్దుకున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణను టీడీపీ సర్కార్ గాలికొదిలేయడంతో పల్లెలన్నీ గొంతుతడిపే చుక్కనీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా...అవి ఎందుకూ చాలడం లేదని జనం చెబుతున్నారు. పైగా అరకొర నీటి సరఫరా వల్ల నీటికోసం ఘర్షణ పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. డేంజర్ జోన్లో ఉన్న గ్రామాలు భూగర్భజలం పూర్తిగా అడుగంటడంతో జిల్లాలోని 31 గ్రామాలు డేంజర్‌జోన్‌లోకి వెళ్లిపోయాయి. అనంతపురం రూరల్ మండలంలోని ఎంబీపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రోనిపల్లి, ఎర్రోనిపల్లి తాండకు, గంగినేపల్లి తండా, ఫ్యాదిండి, వెళ్ళుదుర్తి, రామగిరి మండలంలోని గరిమేకపల్లి, కొండాపురం, వజ్రకరూరు మండలంలో కొనకొండ్ల, పుట్టపర్తి మండలంలో సి.వెంగన్నపల్లి, పుట్లూరు, పి.చింతపల్లి, చింతలపల్లి, బాలపురం, ఎం.కాండాపురం, కుండగారికుంట, గోపరాజుపల్లి, చింతకుంట్ల, తుకపల్లి, నాగిరెడ్డిపల్లి, గుత్తి మండలం కె.ఊబిచెర్ల, ఉటకల్లు, బేదపల్లి, ఊబిచెర్ల, జక్కలచెరువు, టి.కొత్తపల్లి, గుంతకల్లు మండలంలో మల్లెనపల్లి, ఎన్.కొట్టాలకు, మొలకలపెంట, కనగానపల్లి మండలంలోని వేపకుంటల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులే చెబుతున్నారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ అరకొర నీటి సరఫరాతో అల్లాడిపోతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతున్నా...అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారని వాపోతున్నారు. -
పొంచి ఉన్న నీటి గండం
నూజివీడు: ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గానికి సాగర్‌జలాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రానున్న వేసవిలో ఈ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా సాగర్‌జలాలను విడుదల చేసి చెరువులను నింపాల్సి ఉంది. అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వాడైనప్పటికి సాగర్‌జలాలను తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలుండగా, నూజివీడు, ఆగిరిపల్లి మండలాలకు నూజివీడు మేజర్ ద్వారా, చాట్రాయి, ముసునూరు మండలాలకు వేంపాడు మేజర్ ద్వారా సాగర్‌జలాలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా గాని, సంబంధిత జలవనరుల శాఖాధికారులు గాని సాగర్‌జలాలను తీసుకురావాలనే ఆలోచన చేస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడో అక్టోబర్‌లో 10 రోజుల పాటు వచ్చిన సాగర్జలాలే తప్ప ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా రాలేదు. మూడోజోన్‌కు షెడ్యూల్ ప్రకారం నవంబరు 15 నుంచి మార్చి 15 వరకు సాగర్‌జలాలు సరఫరా కావాల్సిఉంది. రబీ సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరే కాకుండా, వేసవిలో మంచినీటి ఎద్దడి ఎదురుకాకుండా నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నింపాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పటివరకు కాలం గడిపేశారు. కొన్ని మండలాలకు ఇంతవరకు అసలు సాగర్‌జలాలు రాలేదు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రతిఏటా ఇదే తంతు జరుగుతోంది తప్ప సాగర్‌జలాలను తీసుకువచ్చిన దాఖలాలు లేవు. బోరుమంటున్న చెరువులు వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, వడగాడ్పులు కూడా ఉధృతంగా వీస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 65 చెరువులను సాగర్‌జలాలతో నింపాల్సి ఉంది. లేకపోతే గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోవడంతో పాటు మనుషులకు, పశువులకు నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సాగర్‌జలాలు రప్పించి చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు. -
గ్రామాల్లోకి వచ్చి ఆ మాటలు చెప్పండి
ఎమ్మెల్యే బండారు ప్రకటనపై సీపీఎం ధ్వజం నరసాపురం : ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని.. సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులే తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నారని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేసిన ప్రకటనపై సీపీఎం నిప్పులు చెరిగింది. సీపీఎం నాయకులు శుక్రవారం స్థానిక మీరా భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.రాజారామ్మోహన్రాయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవనాయుడు తుందుర్రు పరిసర గ్రామాలకు వచ్చి నీతి సూత్రాలు చెబితే బాగుంటుందన్నారు. ఎవరో చెబితే రెచ్చిపోయే స్థితిలో జనం లేరన్న విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళా దినోత్సవం రోజున, మహిళలను పోలీసులు ఈడ్చుకెళితే.. ఎమ్మెల్యేగా కనీస కనికరం చూపించలేని వ్యక్తి ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ డివిజన్ కమిటి సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం ఏమాత్రం ఉండదని ఇప్పుడు చెబుతున్న మాధవనాయుడు గతంలో మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని కట్టనిచ్చేది లేదని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ఆయన మనసు మారడానికి కారణం ఏమిటో చెప్పాలన్నారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.త్రిమూర్తులు మాట్లాడుతూ ఈనెల 14న రాష్ట్రస్థాయి అఖిలపక్ష పార్టీల నాయకులు తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు పొగాకు పూర్ణ, పూరిళ్ల శ్రీనివాస్, పొగాకు నారాయణరావు, పొన్నాడ రాము, ఎం.రామాంజనేయులు పాల్గొన్నారు.