ground nut crop
-
తెగులు.. దిగులు!
సాక్షి, దామరగిద్ద: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతున్నకు వేరుశనగ సాగులోనూ కష్టాలు తప్పడం లేదు. కృత్రిమ ఎరువుల వాడకం వాతవరణ పరిస్థితులు కలుపుమందులు వాడకంతో కొత్త తెగుళ్లు పంటలను ఆశిస్తూ తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. ఆకుమచ్చ తెగులు, పొగాకు లద్దెపురుగు, ఆకుముడత పురుగు లార్వా వంటి చీపపీడల నివారణలో రైతన్నలు తలమునకలౌతున్నారు. ఓ వైపు సరైన వర్షాలు లేక ఇప్పటికే బోర్లల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు చీడపీడలు సోకడంతో పంటలను కాపాడుకోవడంతో రైతులు అహర్నిషలు శ్రమిస్తున్నారు. అధికారుల సూచనమేరకే సాగు మండలంలోని దామరగిద్ద, మద్దెల్‌బీడ్, కాన్కుర్తి, ఉల్లిగుండం, క్యాతన్‌పల్లి, వత్తుగుండ్ల, కాంసాన్‌పల్లి, దేశాయ్‌పల్లి, ఆశన్‌పల్లి చాకలోన్పల్లి, లోకుర్తి నర్సాపూర్, మొగుల్‌మడ్క అన్నాసాగర్ తదితర గ్రామాల్లో వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేశారు. మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గత సెప్టెంబర్ 18న వేరు శనగ (కే6 రకం) విత్తనాలను పంపిణీ చేశారు. మండల రైతులకు 500 క్వింటాళ్లకు పైగా విత్తానాలను ప్రభుత్వం అందించిని 35 శాతం సబ్సిడీపై (బస్తా 30 కేజీలు రూ.1250 చొప్పున) కొనుగోలు చేశారు. మొత్తం 1600కు పైగా బస్తాల విత్తనాలతో పాటు రైతులు తాము సొంతగా నిల్వ చేసిని విత్తనాలను సైతం సాగు చేశారు. విత్తనాలు సకాలంలో అందడంతో ఆయా గ్రామాల రైతులు గత సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ మొదటి వా రాల్లో వేరుశనగ పంటను సాగుచేసుకున్నారు. పం ట సాగు చేసి 30 నుంచి 45 రోజులు గడుస్తుంది. పంటను ఆశిస్తున్న తెగుళ్లు సాధారణంగా పంట 25రోజుల లోపు ఉన్న సమయంలో పంటలపై తెగుళ్లు పరుగుల దాడి అధికం గా ఉంటుంది. ప్రస్తుతం ఇదే దశలో ఉన్న వేరుశనగ పంటను పొగాకు లద్దెపరుగు, ఆకుముడత ప రుగు లార్వా ఆకుమచ్చ తెగుళ్లు సోకడంతో పం టలు దెబ్బతింటున్నాయి. పోగాకు లద్దెపురుగు రాత్రి సమయంలో బయటకు వచ్చి లార్వా దశలో పంట ఆకులను మేస్తూ పంట ఎదుగుదలను దెబ్బతీస్తుంది. దీనికి తోడు ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి ఊడలు దిగకుండా గింజలు పట్ట కుండా పంటను దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు తీసుకోవల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులు స్పందించి తమ పంటలను కాపాడుకోవడంలో తగిన సలహాలు సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా రైతులు ఎన్నికల వి«ధులతో పాటు రైతులకు పెట్టుబడి సహాయం అందించడంతో బిజీగా ఉండటంతో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు చేసే వారు కరువయ్యారు. అధికారులు సలహా ఇవ్వాలి వేరుశనగ పంటలకు సోకిన తెగుళ్లు పురుగుల నివారణలో రైతులు అవసమైన సలహాలు సూచనలు అందజేయాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి ఏఏ చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏఏ మందులు పిచికారీ చేయాలో తెలపాలి. అధికారులు ఇతర పనులు పేరుతో పంటలను పరిశీలించడం లేదు. రైతులకు నష్టం వాటిల్లకుండా సకాలంలో స్పందించి పంటలను కాపాడుకోవడంలో రైతులకు అవగాహణ కల్పించాలి. – వెంకటప్ప, రైతు వత్తుగుండ్ల మందు పిచికారీ చేయాలి వేరుశనగ పంట సాగు చేసిన నలభై రోజుల వ్యవధిలో ఉన్న సమయంలో తెగుళ్లు పురుగులు అధికంగా ఆశిస్తుంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, పొగాకు లద్దెపరుగు, లార్వా దశలో రాత్రి వేళలో పంటను ఎక్కువగా నష్ట పరుస్తుంటాయి. వీటి నివారణకు ఎక్టాకొనెజోల్ ఎకరాకు 400ఎంఎల్ పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు క్లోరిఫైరీపాస్ ఎకరానికి 400ఎంఎల్ లేదా 300 ఎంఎల్ మోనోకొటాపాస్ను పంటలపై పిచికారీ చేయాలి. లార్వా«ను నాశనం చేసేందుకు అరకిలో బెల్లం, పావులీటలర్ మోనోకొటపాస్ను తగినంత వరితౌడులో కలిపి ముద్దలుగా చేసి పొలం ఉంచాలి. పంట దిగుబడి నాణ్యత కోసం సాగుచేసిన 40 రోజుల వ్యవధిలోనే ఎకరానికి 200కిలోల జిప్సంను పంట మొదల్లో చల్లాలి. – జాన్ సుధాకర్, ఏడీఏ, నారాయణపేట -
దిగుబడి లేదు..గిట్టుబాటు రాదు
కారంచేడు : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతన్నలను నిండా ముంచేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.11 లక్షల ఎకరాల్లో వరి, 2.57 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. వరి, శనగ సాగుల్లో ప్రకాశం జిల్లా రైతులు మంచి మెళకువలు పాటించి ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటారు. కానీ వాతావరణం అనుకూలించక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కర్షకులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిగుబడులు పతనమై, ధరలు దిగజారిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ధాన్యాగారానికి తప్పని నష్టాలు.. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంత రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వాతావరణం అనుకూలించి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్న అన్నదాతలు ఈ ఏడాది మాత్రం పంట దిగుబడుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ఏడాది దిగుబడులు బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు లేకపోగా ధరలు కూడా పతనమవడంతో ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు.జిల్లాలోని 12 సబ్ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో మొత్తం శనగ సాగు 2,56,598 ఎకరాల్లో, వరిసాగు 1,10,513 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయా«ధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత ఘోరమైన దిగుబడులు గతంలో చూడలేదు గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శనగ సాగు ఘోరంగా ఉంది. వాతావరణం అనుకూలించపోవడంతో కాపు తగ్గిపోయింది. చెట్టు బాగా పెరిగింది. కానీ కాయలు తగ్గిపోయాయి. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వచ్చేలా ఉంది. ఒక్కో రైతు కనీసం 5 ఎకరాల వరకు సాగు చేశారు. – దగ్గుబాటి నాగశ్రీను, రైతు, కారంచేడు వరిలోనూ నష్టపోవాల్సిందే ఈ ఏడాది వరి సాగులో కూడా రైతులు నష్టపోవాల్సిందే. ముదురులో సాగు చేసిన చేలల్లో కనీసం 90 శాతం పంట పడిపోయింది. దీంతో గింజ రాలిపోయింది. వాతావరణం ఈ ఏడాది అన్నదాతలను నిండా ముంచేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోగా ధరలో బస్తాకు రూ.300 వరకు తగ్గింది. దీంతో రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కొంత ఊరటగా ఉంటుంది. – యార్లగడ్డ శ్రీకాంత్, రైతు, కారంచేడు -
జిల్లాలో పల్లీ ఆధారిత పరిశ్రమ
వనపర్తి : మరో నెలరోజుల్లో ఇక్రిషాట్ సహకారంతో జిల్లాలో వేరుశగన (పల్లి) ఆధారిత పరిశ్రమలు నెలకొలిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ శ్వేతామహంతి వెల్లడించారు. గురువారం రాత్రి ఈ విషయమై కలెక్టర్ ఇక్రిషాట్ ప్రతినిధులతో తన చాంబర్లో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. వనపర్తి మండలం దత్తాయపల్లి సమీపంలో యూనిట్‌ను ఏర్పాటు చేసి పల్లితో నూనె, పల్లిచెక్కిలు, పీనట్ బట్టర్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ నిర్వాహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. యూనిట్ ఏర్పాటు కోసం కావాల్సిన రా మెటీరియల్, మార్కెటింగ్ ఉద్యోగాలు, అవసరమయ్యే నిధులు, వ్యాపార నిర్వాహణ బాధ్యతలపై ఇక్రిషాట్ ప్రతినిధులు సైకత్దత్తా ఎంజుదార్, అర్వాడి, డీఆర్డీఓ గణేష్, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఏపీఎంలతో చర్చించారు. రా మెటీరియల్‌ను వెంటనే కొనుగోలు చేయా లని డీఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఇక్రిషాట్ ప్రతినిధులు దత్తాయపల్లి సమీపంలో యూనిట్ ప్రారంభించే ప్రదేశాన్ని పరిశీలించారు. గొర్రెల పంపిణీపై నిర్లక్ష్యం సహించం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే.. సహించబోనని కలెక్టర్ శ్వేతాహంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గొర్రెల యూనిట్లను సకాలంలో గ్రౌండ్ చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెల రవాణాకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. ఎక్కడా రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పక్కాగా పథకం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసవంర్ధక శాఖ అధికారి వీరనంది, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో వేరుశెనగ వాము దగ్ధం
శెట్టూరు (అనంతపురం) : చేతికొచ్చిన పంటను సొమ్ము చేసుకోకముందే అగ్నికి ఆహుతయ్యింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేరుశెనగ వాముకు అంటుకోవడంతో.. కాయలన్నీ కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లింగబీర్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడ్డయ్య అనే రైతు తన వేరుశెనగ పంటను వాము వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వాము పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
వేరుశనగ వద్దు.. ప్రత్యామ్నాయమే ముద్దు
మడకశిర రూరల్ : ఖరీఫ్ సాగుకు అదను దాటిపోతున్నా వర్షం పడలేదు. విత్తడానికి సిద్ధం చేసుకున్న సబ్సిడీ విత్తన వేరుశనగకు ఊజీ సోకే ప్రమాదం కనిపించడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మడకశిర మండలం తిరుమదేవరపల్లి, గౌడనహ ళ్ళి, ఆమిదాలగొంది, చందకచర్ల, హరేసముద్రం, మెళవాయి తదితర గ్రామాల రైతులు లక్ష్మీనరసప్ప, అంజినప్ప, తిప్పేనాయక్ తదితరులు అయినకాడికి అమ్ముకున్నారు. వేరుశనగ విత్తనాలు విక్రయించినా పెట్టుబడి కూడా రాలేదని వాపోయారు. అదను దాటిన తర్వాత వచ్చే వర్షానికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే కనీసం పశుగ్రాసమైనా దొరుకుతుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి వర్షం రాకపోవడంతో వేరుశనగ పంట సాగుకు సిద్ధం చేసుకున్న 50 కేజీల విత్తనాలను వ్యాపారస్తులకు విక్రయిస్తున్నాం. ఈ ఏడాది జీవనం సాగించడం కష్టతరంగా ఉంది. ఖరీఫ్ సాగుకు అదను దాటిపోయింది. ఇప్పుడే పడే వర్షానికి వేరుశనగ సాగు చేస్తే దిగుబడి రాదు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. - తిప్పేనాయక్, రైతు, టీడీ పల్లి 4 వరకు వేరుశనగ సాగు ఆగస్టు 4వ తేదీ వరకు వేరుశనగ పంట సాగు చేసుకోవచ్చు. అప్పటికీ వర్షం రాకపోతే ఐదో తేదీ తర్వాత 50 శాతం సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు పంపిణీ చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందవద్దు. - పెన్నయ్య, వ్యవసాయాధికారి, మడకశిర -
మద్దతుకే లొల్లి..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం,గద్వాల న్యూస్‌లైన్: ఈ ఏడాది వేరుశనగ పంటను సాగుచేసిన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా త యారైంది. వర్షాలు సంమృద్దిగా కురవడంతో మంచిరోజులు వచ్చాయని రైతులు భావించారు. గత రబీలో ప ల్లీ పంటను వేసిన వారికి కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందనే భావనతో ఈ రబీలో 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగపంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. వాస్తవానికి చెట్టుకు 20 కాయల వరకూ వస్తే మంచి కాపుగా భావిస్తారు. కాన్నీ పలు ప్రాంతాల్లో మొక్కకు ఏడునుంచి 10 కాయలకు మించి లేవు. మరోవైపు మద్దతుధర రాక రైతులు తికమక పడుతున్నారు. ఈ స్థితిలో రైతుల నుండి పంటను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు వేరుశనగ కొనే ప్రయత్నం జరగలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తామని చెప్పినా ఇంకా అవి ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు తమకు తోచిన ధరకు ఇచ్చేస్తున్నారు. విత్తనానికి రూ.4,500..రైతు పంటకు మాత్రం రూ.2,500 ? రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఈ ఏడాది వేరుశనగ విత్తనాలను సరాఫరా చేసి క్వింటాకు రూ.4500 తీసుకుంది. ఇప్పుడు పంట ధర మాత్రం రూ. 2500 దాటడం లేదు.రైతులు తెచ్చిన పంట తడిగా ఉందని, నాపలు ఎక్కువగా ఉన్నాయంటూ కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు ధరను పెరగనివ్వడం లేదు. వేరుశనగకు ప్రభుత్వం రూ.4వేలు మద్దతు దరను నిర్ణయించింది.జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1.60 లక్షల క్వింటాళ్లను రైతుల నుండి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుండి ఎక్కువగా రూ. 3000 వేల లోపే కొనుగోలు చేశారు.కాగా వచ్చిన దాంట్లో ఒక 10శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపించి మిగతా 90శాతం ఉత్పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కర్షకులను నట్టేట ముంచుతున్నారు. తెగుళ్లతో తగ్గిన దిగుబడి గత నెలలో మంచు కురవడంతో వేరుశనగపంటకు తిక్కాకుమచ్చ తెగులు, లద్దెపురుగు ఆశించింది. ఇది దిగుబడిని దెబ్బతీసింది. వీటిని అదుపు చేసేందుకు రైతులు క్రిమిసంహారక మందులకోసం భారీగా పెట్టాల్సి వచ్చింది. ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేసేనా? మద్ధతు ధర సమస్య వచ్చినప్పుడు ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ వంటివి ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఈ సంస్థలతో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కార్యాక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. కంట తడే... గద్వాల ప్రాంతంలో వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి బోర్లు, బావులు, కాలువల కింద వేరుశనగ పంటను వేశారు. గత మూడు నెలల నుంచి వేరుశనగను విక్రయించేందుకు గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకొస్తుండగా మార్కెట్లో వస్తున్న ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. యార్డుకు రోజూ దాదాపు 2 వేల బస్తాల వేరుశనగ వస్తోంది. నవంబర్ నెలలో రూ.3,500 నుంచి రూ.3,700 వరకు క్వింటాలుకు ధరలు వచ్చాయి. డిసెంబర్ నెలలో రూ,3,400 నుంచి రూ.3,500 వచ్చింది. జనవరి నెలలో సైతం రూ.3,600 నుంచి రూ. 3,800 వరకు వచ్చింది. జనవరిలో ఒక్క 24వ తేదీన ఒక లాట్‌కు అత్యధికంగా రూ.4,010 వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వేరుశనగకు రూ.4 వేలు మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులనుంచి ఆ ధర పలకడం లేదు. ఇక గద్వాల మార్కెట్లో వారం రోజుల క్రితం ప్రభుత్వం ఏపీ ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తేమ 8 శాతంగా, మట్టి, ధూళి క్వింటాలుకు కేవలం రెండు కేజీలు, నాపలు 4 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం రైతుల వేరుశనగ ఉండడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ రైతులు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. తిక్కఆకుమచ్చ తెగులు ముంచింది నేను మూడెకరాల్లో వేరుశనగ సాగుచేశాను.కాగా రాత్రి వాతావరణం చల్లగా ఉంటూ, ఆధికంగా మంచు కురవడంతో పంటకు తిక్క ఆకుమచ్చ తెగులు సోకింది.మందులకు రూ.10వేల ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి. - శేఖర్, వడ్డేమాన్ అప్పులు తీర్చే పరిస్థితే లేదు నేను 30 బస్తాల వేరుశనగ పంటను మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డుకు తీ సుకువచ్చాను.ధాన్యాంభాగాలేదని రూ. 2,400 వంతున చెల్లించారు. నేను ఈ పంట సాగు కోసం రూ.25వేల వరకు ఖర్చు చేశాను.కాగా ఇంత తక్కువ ధర చెల్లించడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. - మాణిక్యం...దౌల్తాబాద్ -
యాంత్రికీకరణపై రైతన్న మొగ్గు
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సేద్యంలో యంత్రాల వినియోగంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కూలీల ఖర్చు తగ్గుతుండడం, పనులు త్వరగా అవుతుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో 1.35 లక్షల హెక్టార్లు, రబీ సీజన్లో 17 వేల హెక్టార్లల్లో రైతులు వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు, ఇతర ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. అదే సమయంలో అధికారులు పరిచయం చేస్తున్న యంత్రాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా డ్రమ్ సీడర్ (విత్తనాలను నాటే యంత్రం) రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. దీని ద్వారా గంట వ్యవధిలో 2.5 ఎకరాల పొలంలో విత్తనాలు నాటుకోవచ్చు. యూనిట్ ధర రూ.4,500. రాయితీపై రైతులకు 2500 రూపాయలకే అందజేస్తున్నారు. ఈ యంత్రానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ఇప్పటివరకు 170 డ్రమ్ సీడర్ల కోసం ఇండెట్ పెట్టామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇవి మరో రెండు రోజుల్లో కోయంబొత్తూరు నుంచి జిల్లాకు రానున్నాయని ఏడీ మనోహర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. యాంత్రికీకరణ కోసం రూ.17 కోట్ల నిధులు శాఖలో ఉన్నాయని చెప్పారు. యాంత్రికీకరణ విధానంలో రైతులకు అవసరమైన మేరకు యం త్రా లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా రైతుల స్వయం సహాయక గ్రూపులకు యంత్ర పనిముట్లను మంజూరు చేసే సౌలభ్యం ఉందని వివరించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కేవలం డ్రమ్సీడర్ల ద్వారా రైతులు వేరుశెనగ విత్తనాలు వేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు.