Growth in India
-
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
ఈ-కామర్స్‌పై ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీఈఓ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ 90-100 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. కరోనాకు ముందు ఈ-కామర్స్ వృద్ధి రేటు 26-27 శాతంగా ఉందని, కరోనా తర్వాత ఇది 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. చైనా ఆన్లైన్ మార్కెట్లో ఈ-కామర్స్ వాటా 25 శాతంగా ఉంటే.. ఇండియాలో 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 10-25 శాతమని చెప్పారు. (పసిడి డిమాండ్‌కు కరోనా కాటు) రాబోయే కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ ఆధునిక రిటైల్ మార్కెట్ల కంటే చాలా పెద్దగా ఉంటుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని.. ఇది ఈ-కామర్స్ రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఎంత ప్రభావితం అయ్యాయో.. అంతే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కిరాణా వ్యవస్థలో అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆధునిక రిటైల్ మంచి బిజినెస్ అవకాశమని, స్మాల్ బిజినెస్, చేతివృత్తులు వంటివి డిజిటల్ రిటైల్‌తో మంచి చాన్స్‌లుంటాయని.. ఈ దిశలో ఫ్లిప్‌కార్ట్ కృషి చేస్తోందని ఆయన వివరించారు. 2019లో దేశ జనాభాలో 10 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు జరిపారని కృష్ణమూర్తి తెలిపారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండాల్సి రావటంతో కిరాణా, నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ఆన్లైన్ మీద ఆధారపడ్డారని.. లాక్డౌన్ తర్వాత కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో వంద పిన్‌కోడ్స్‌లో ఈ-కామర్స్ ఆర్డర్లు వస్తున్నాయని.. 60 శాతానికి పైగా లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరుగుతున్నాయని చెప్పారు. -
భారత్ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే..
న్యూఢిల్లీ : పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్-రూపాయి ఎక్స్చేంజ్ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా అప్డేట్ చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్‌లో, దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి, 7.3 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా 2019లో వృద్ది అంచనాలను సైతం 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతం నమోదవబోతున్నట్టు పేర్కొంది. అంతకముందు ఇవి 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండనున్నట్టు ఐఎంఎఫ్ అంచనావేసింది. అయితే ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్ అత్యంత వేగవంతంగా ఆర్థిక వ్యవస్థగానే ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతంగానే ఉండనున్నట్టు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి స్టోరీ ప్రపంచ దేశాలకు పోటీగా ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9 శాతంగా ఉండబోతున్నట్టు అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో భారత్ వృద్ధి అంచనాలను 2018, 2019ల్లో 0.1 శాతం, 0.3 శాతం చొప్పున తగ్గించాం. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం ఇవన్నీ భారత్ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయి’ అని తన ఐఎంఎఫ్ అప్డేట్లో పేర్కొంది. కాగ, గతవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టులో భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. కాగ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో గత నాలుగున్నరేళ్లలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపో రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి, రెపో రేటును 6.25 శాతంగా నిర్ణయించింది. ఆర్బీఐ భయపడిన విధంగానే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 5.77 శాతానికి ఎగిసింది. ఈ ద్రవ్యోల్బణ భయాలతోనే అర్జెంటీనా, భారత్, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా తమ పాలసీ రేట్లను పెంచాయి. -
వృద్ధిపథంలో భారత్: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి పయనం కొనసాగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. లక్ష్యాలను చేరడానికి మరింత ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధానిగా తన బాధ్యతల సమయం ముగుస్తున్న నేపథ్యంలో మన్మోహన్ బుధవారం ప్రణాళికా సంఘం పూర్తిస్థాయి సభ్యులతో సమావేశం అయ్యారు. సంఘం చైర్మన్‌గా ప్రణాళికా సంఘానికి వీడ్కోలు ప్రసంగం ఇస్తూ, భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. యూపీఏ పదేళ్ల కాలంలో కమిషన్ పనితీరు చాలా బాగుందని అన్నారు. తాజా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని సైతం సూచించారు. 1991 నుంచి 1996 మధ్యకాలంలో ఆర్థికమంత్రిగా తన పదవీకాలాన్ని కూడా సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా ప్రస్తుత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి తనకు మంచి సహకారం లభించిందని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా మలుపుతిప్పే ఆ కాలంలో ప్రభుత్వం-ప్రణాళికా సంఘం చక్కని సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇదే రకమైన ధోరణి ఇకముందూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధిలో కొత్త ఆలోచనల సృష్టి, మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ సాధన, మౌలిక రంగం ప్రగతికి సంబంధించి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో మంచి ఫలితాలు వంటి అంశాల్లో ప్రణాళికా సంఘం పాత్ర కీలకమని అన్నారు.