Growth Rates
-
India Q2 GDP Growth: జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది. చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9 శాతంగా నమోదుకావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదుచేసుకుంది. మొదటి త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలో ఈ రేటు 6.5 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితం నమోదుకావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతం కావడం గమనార్హం. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. 7.6 శాతం వృద్ధి అంటే.. 2011–12 ధరల ప్రకారం (ఈ సంవత్సరం బేస్‌గా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రియల్ ఎకానమీ వృద్ధి) 2022–23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత్ ఎకానమీ విలువ రూ.38.78 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో (సమీక్షా కాలంలో) ఈ విలువ రూ.41.74 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి రేటు 7.6 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా కరెంట్ ప్రైస్ పాతిపదిక చూస్తే, ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు (నామినల్) రూ.65.67 లక్షల కోట్ల నుంచి రూ. 71.66 లక్షల కోట్లకు ఎగసింది. అంటే నామినల్ వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. ఇక ఇదే సమయంలో నామినల్ రేటు 8.6 శాతంగా ఉంది. రంగాల వారీగా వృద్ధి తీరు ఇలా... వస్తువులు, సేవల ఉత్పత్తికి సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)విలువల ప్రకారం... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రంగాల వారీగా విడుదల చేసిన ఫలితాలు పరిశీలిస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 78 శాతం వాటా కలిగిన ఈ రంగంలో వృద్ధి భారీగా 13.9 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► గనులు, తవ్వకాలు: ఈ రంగంలో 0.1 శాతం క్షీణత సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిలోకి మారింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి ఎగసింది. ►నిర్మాణం: వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి ఎగసింది. ►వ్యవసాయం: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ కీలక రంగంలో వృద్ధి రేటు (2022 ఇదే కాలంతో పోల్చిచూస్తే) 2.5 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. ►ఫైనాన్షియల్, రియలీ్ట, ప్రొఫెషనల్ సేవలు: 7.1% నుంచి వృద్ధి 6 శాతానికి పడిపోయింది. ►ఎకానమీ పటిష్టతకు ప్రతిబింబం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరీక్షా కాలంలో ఎదురవుతున్న సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థాయిలో తట్టుకుని నిలబడుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు, పేదరికాన్ని త్వరితగతిన నిర్మూలించడానికి, మన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము. – ప్రధాని నరేంద్ర మోదీ -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా?
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఏపీ ముందుకు సాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదైందన్నారు. అర్థ గణాంక శాఖ నివేదిక ప్రకారం.. ఈ విభాగంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీదే అగ్రస్థానమని స్పష్టం చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ ప్రజలకు ఏ కష్టం రానీయలేదని గుర్తుచేశారు. ఎన్నికల హామీలను మరిచిపోకుండా కోవిడ్ విపత్తు నుంచి బయటపడిన విధానాన్ని యావత్ ప్రపంచం మెచ్చిందన్నారు. దీంతో ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నిరాధార ఆరోపణలు, అసత్యాలతో ప్రకటనలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఆయన (–)4 శాతం వృద్ధిరేటు క్షీణత అని పత్రికా ప్రకటన ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు మంత్రి బుగ్గన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. యనమలతోపాటు టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థిర ధరల ప్రకారం లెక్కిస్తేనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతమని.. అదే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 18.47 శాతంగా ఉందని తెలిపారు. ఏ ప్రకారం చూసినా, ఏ విధంగా లెక్కేసినా వృద్ధిరేటు నాలుగు శాతం క్షీణించడం అనేది అసంభవమని స్పష్టం చేశారు. ఇంకా మంత్రి బుగ్గన ప్రకటనలో ఏం చెప్పారంటే.. జాతీయ స్థాయిని మించి వ్యవసాయంలో ఏపీ వృద్ధి వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 11.27 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో ఇది కేవలం 3.0 శాతమే. ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే కారణం. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించింది. ఇవే కాకుండా ప్రతి గ్రామంలో సచివాలయాలు, మిల్క్ చిల్లింగ్ స్టేషన్లు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను కూడా నిర్మించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనమైనా నిర్మించారా అని యనమల ప్రశ్నించడం హాస్యాస్పదం. నవరత్నాల రూపంలో పేదలకు రూ.1.92 లక్షల కోట్లకుపైగా సాయం అందించాం. 104, 108 అంబులెన్సులు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, పశువుల కోసం ప్రత్యేకంగా మరో 340 వాహనాలు, స్కిల్ హబ్స్ ఇవన్నీ యనమలకు కనిపించడం లేదా? చంద్రబాబు హయాంలో కంటే మిన్నగా.. కోవిడ్ సమయంలో దేశ వృద్ధిరేటు (–)6.60 శాతం నమోదైతే రాష్ట్రం 0.08 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018–19లో వ్యవసాయ రంగంలో 3.54 శాతం జీఎస్డీపీ మాత్రమే నమోదైంది. అదే 2021–22లో ఇది 11.27 శాతానికి చేరుకుంది. అలాగే 2018–19లో పారిశ్రామిక రంగంలో 3.17 శాతం జీఎస్డీపీ మాత్రమే నమోదైంది. ఇది 2021–22కి 12.78 శాతానికి చేరుకుంది. అదేవిధంగా 2018–19లో సేవా రంగంలో 4.84 శాతం జీఎస్డీపీ మాత్రమే ఉండగా 2021–22కి ఇది 9.73 శాతంగా నమోదైంది. 2018–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.36 శాతం వృద్ధి రేటు మాత్రమే ఉండగా 2021–22లో ఏపీ 11.43 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పులపైనా తప్పుడు ప్రచారం అప్పులపైనా టీడీపీ వర్గాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. 2022 మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.3,98,903 కోట్లని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో ప్రకటించారు. ఆ లెక్క ప్రకారం..ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,34,452 లక్షల కోట్లు మాత్రమే. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే రూ.2,64,451 కోట్ల రుణ భారంలో ఏపీ ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,07,771 కోట్లు. దేశ తలసరి ఆదాయం రూ.1,50,007 కోట్లు. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం.. దేశ తలసరి ఆదాయం కంటే 38.5% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఏపీ దేశంలో ఆరో స్థానంలో ఉంది. ఈ విషయాల్లో యనమల చెప్పే లెక్కలన్నీ తప్పుడు లెక్కలే. అలాగే కేంద్ర గణాంకాల ప్రకారం.. తెలంగాణ 7.81 శాతంతో అత్యధిక ద్రవ్యోల్బణ రేటును కలిగి ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో ష్యూరిటీ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేసిన అప్పులు, గుదిబండలా వదిలేసిపోయిన బకాయిలు, నెలల తరబడి జీతాలివ్వక చిన్న ఉద్యోగులను క్షోభపెట్టిన వైనం, జన్మభూమి కమిటీల అరాచకాలు, భూముల కుంభకోణాలు, ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లపై యనమలతో చర్చకు సిద్ధం. నీతిఆయోగ్ 2020–21లో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. 2018–19లో ఈ స్కోర్ 64 మాత్రమే. -
ఎగుమతి రంగాలపై ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి భారత్‌కు అనుకూల పరిస్థితులు ఉన్న 12–13 రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. టెక్స్టైల్స్ తదితర రంగాలు వీటిలో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం 37 బిలియన్ డాలర్లుగా ఉన్న టెక్స్టైల్స్ రంగం ఎగుమతులు వచ్చే 10 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్లకు చేరగలవని గోయల్ పేర్కొన్నారు. సేవల రంగం ఎగుమతులు కూడా మెరుగైన వృద్ధి రేట్లు సాధిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మిగతా రంగాలతో పోలిస్తే అధిక స్థాయిలో ఎగుమతులకు ఆస్కారమున్న రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. 2019–20 ఏప్రిల్– డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 2 శాతం, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసంబద్ధ పోటీ నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు భారత్ కొన్ని రక్షణాత్మక విధానాలు పాటించడం తప్పనిసరిగా మారిందని చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలకు వేల కోట్ల నష్టాలా.. ఎలా... బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో భారత్నేమీ ఉద్ధరించడం లేదంటూ అమెజాన్‌ను గతంలో ఆక్షేపించిన గోయల్ తాజాగా ఈ–కామర్స్ కంపెనీల నష్టాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ–కామర్స్ కంపెనీలు వేల కోట్ల నష్టాలు ప్రకటిస్తుండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రూ. 5,000 కోట్ల టర్నోవరుపై ఏకంగా రూ. 6,000 కోట్ల నష్టాలు ప్రకటించిందంటే నమ్మశక్యంగా అనిపించదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని గోయల్ స్పష్టం చేశారు. అలాంటి సంస్థలను ఎప్పుడూ స్వాగతిస్తామని చెప్పారు. అమెజాన్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ మంత్రి తాజా వివరణనిచ్చారు. ‘ఈ–కామర్స్‌తో ఇంత మందికి ప్రయోజనం చేకూరుతుందన్న హామీలు వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ చట్టరీత్యా ఆమోదయోగ్యం కాని విధానాల వల్ల పది రెట్లు మంది ప్రయోజనాలు దెబ్బతినకూడదు’ అని గోయల్ చెప్పారు. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది. -
సాగు సంక్షోభంతోనే మాంద్యం
మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. దీన్ని పక్కనబెట్టి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలపై మన ఆలోచనలు సాగినంతకాలం ఆర్థిక రంగం కోలుకోవడం కలలో మాటే. దేశాన్ని ఆవరిస్తోన్న ఆర్థిక రంగ క్షీణత అనూహ్యమైనదని, బహుశా గత 70 ఏళ్లలో ఇంతటి హీన పరిస్థితిని చవిచూడనట్లుందని సాక్షాత్తూ నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్వయంగా పేర్కొన్నారు. పైగా ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు కల్పించాలంటే అసాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. అయితే గత 17 ఏళ్ల కాలంలో అంటే 2000–17 మధ్య కాలంలో భారతీయ రైతులు దాదాపు రూ.45 లక్షల కోట్లను నష్టపోయి తీవ్రంగా దెబ్బతిన్నారనన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ నీతి అయోగ్ ఎలాంటి ప్రమాద హెచ్చరికలను చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పినట్లు మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పం దనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. రైతులకు న్యాయంగా లభించాల్సిన ఆదాయాన్ని తిరస్కరించడం వల్లే వారు రూ. 45 లక్షల కోట్లను కోల్పోవలసి వచ్చిందని ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెల్పింది. అలాగే 2017–18లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసుకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సమర్పించిన సర్వే ప్రకారం 2011–12 నుంచి 2017– 18 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్లమంది సాధారణ కూలీలు (వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కార్మికులు) తమ ఉపాధి కోల్పోయారు. భీతిగొల్పుతున్న గ్రామీణ ఆర్థిక దుస్థితి సంకేతాలు ఇక్కడే ఉన్నాయి. కానీ అసలు విషయం ఏదంటే మన విధాన నిర్ణేతలు ఈ వాస్తవాన్ని చూడడానికి కూడా ఇష్టపడకపోవడమే. తీవ్ర సంక్షోభం బారిన పడుతున్నట్లు మన పారిశ్రామికరంగం సంకేతాలు వ్యక్తపరిచేంతవరకు, భారత ఆర్థిక వ్యవస్థను ఏదీ దెబ్బతీయలేదనే భ్రమల్లో మునిగిపోయాం. ఇంకా సూటిగా చెప్పాలంటే గ్రామీణ భారత్ అసలు ఉనికిలోనే లేనట్లు, అది ఎక్కడో సబ్– సహారా ఆఫ్రికాలో ఉంటున్నట్లు భావిస్తూ వచ్చిన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు మన రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోనంత దూరానికి జరిగిపోయారు. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. అంతే తప్ప ప్రస్తుత సంక్షోభానికి నిపుణులు నొక్కి చెబుతున్నట్లుగా దేశంలో ద్రవ్యలభ్యత లేకపోవడం కారణం కాదు. గత రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో వాస్తవాదాయం దాదాపు జీరో వృద్ధిరేటుకు పడిపోయింది. అంతకుముందు 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో అయిదేళ్లలో వ్యవసాయ రంగ వృద్ధి అర్ధశాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక్కడే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూస్తోందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక వ్యవసాయ రంగ ఆదాయాలు చూస్తే గత 14 ఏళ్లలో అత్యంత స్వల్పస్థాయికి దిగజారిపోయాయి. నమ్మలేని విషయం ఏమిటంటే 2011–2017 మధ్య కాలానికి వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు మొత్తం జీడీపీలో 0.3 నుంచి 0.4 శాతంగా మాత్రమే నమోదైనట్లు సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడయింది. వీటిని బట్టే, దేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఇన్నేళ్లుగా ఎంతటి దారుణ నిర్లక్ష్యానికి గురయిందో బోధపడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రాతిపదికగా అన్ని ప్రయత్నాలు ముందుకుసాగాలి. కానీ దీనికి భిన్నంగా, అసలు సమస్య వ్యవసాయరంగ సంక్షోభంలో కనిపిస్తుం డగా వాహనాల అమ్మకాలు పడిపోయాయి మొర్రో అంటున్న పరి శ్రమ విషాదగీతికే ప్రచారం పొందుతోంది. దేశవ్యాప్తంగా లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోయాయని, చివరకు అయిదు రూపాయిలు పెడ్జి బిస్కెట్లు కొనడానికి కూడా ఒకటికి రెండుసార్లు పేదవారు ఆలోచిస్తున్నందున దాదాపు 10 వేలమంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వస్తోందని ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే బిస్కెట్స్ ప్రకటించడం వంటివి జాతీయ మీడియాలో విపరీత ప్రచారానికి నోచుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కన్నేసిన పారిశ్రామిక లాబీ బృందాలకు మన మీడియాలోని అతి పెద్ద సెక్షన్ పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఇలా పారిశ్రామికరంగానికి మద్దతుగా టముకు వాయిస్తున్న మీడియా కఠోర శబ్దాల మరుగున రైతులు, గ్రామీణ పేదలు మరోసారి తెరవెనక్కు పోతున్నారు. మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలంటే సంపన్నులకు మరిన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించాల్సిం దేనంటూ మీడియాలో వస్తున్న ఆర్భాటపు ప్రకటనల సారాంశం ఒక్కటే. సమాజంలో ఇప్పటికే బలిసి ఉన్న సంపన్న వర్గాలకు మరింత డబ్బును అందుబాటులో ఉంచడమే ఈ ప్రచారం పరమార్థం. కానీ పారిశ్రామిక పెట్టుబడుదారులు పెడుతున్న ఈ గావుకేకలు, హాహాకారాలు డిమాండును సృష్టించడంలో ఎలా తోడ్పడతాయన్నది నాకు పరమాశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. పరిశ్రమలకు మరిన్ని పెట్టుబడులను, డబ్బును తరలిస్తే అది పేదల చేతుల్లో మరింత డబ్బు చేరడానికి ఎలా సహకరిస్తుందన్నది పెద్ద పజిల్. అన్నిటికంటే మించి ఆర్థిక మాంద్యానికి వాస్తవంగా కారకులైన వారి చేతుల్లో మరింత డబ్బును పెట్టడానికే విధాన నిర్ణేతలు అన్ని చర్యలూ తీసుకుంటుండటాన్ని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ మొత్తం పరిస్థితిని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కె. సుబ్రమణియన్ గతంలో చేసిన ప్రకటనకు అన్వయించుకోవచ్చు. భారతీయ పారిశ్రామికవర్గం లాభాలను తమ సొంతం చేసుకుంటూ నష్టాలను సమాజపరం చేస్తోందా? అని ఆయన గతంలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నను సమర్ధిస్తున్న్టట్లుగానే, 2007 నుంచి గత 12 ఏళ్ల కాలంలో రూ. 8.5 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశారు. పైగా బ్యాంకులు తమపై ఇంకా రూ. 17 లక్షల కోట్ల రుణ భారం ఉందని ప్రకటిస్తున్నాయి. దీంట్లో కనీసం రూ. 12 లక్షల కోట్ల రుణాలు తిరిగి రానివే ఉంటాయని ఆర్థిక విశ్లేషకుల ఉవాచ. దేశీయ ప్రైవేట్ రంగం ఇప్పటికే బ్లాక్‌హోల్‌లో మునిగిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో 2009 నుంచి భారతీయ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ. 1.8 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అందుకుంటూ వచ్చింది. గత పదేళ్లలోనే అది రూ.18 లక్షల కోట్లను బెయిలవుట్ ప్యాకేజీ రూపంలో అందుకుంది. అదనంగా జీడీపీలో 5 శాతం వార్షిక పన్ను మినహాయింపును కూడా పొందుతోంది. కష్టమొచ్చినప్పుడు పరిశ్రమ తనకు తానుగా నిలదొక్కుకోవాలే తప్ప ప్రభుత్వం వద్దకు పరుగెత్తకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పింది సరైనదే. ఎయిర్ ఇండియా నష్టాలనుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్‌ని ప్రైవేటీకరించాలని పరిశ్రమదారులు గావుకేకలు పెడుతుంటారు. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఉద్దీపన ప్యాకేజీలకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వాటిని మనం ఎందుకు జాతీయం చేయకూడదు? ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల జీవనదానాన్ని ఆర్బీఐ సమర్పిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించాలంటే గ్రామీణ పేదలకు మరింత డబ్బును అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమ ఎంపిక. 17 రాష్ట్రాల్లో ఒక రైతు కుటుంబం సగటు ఆదాయం సంవత్సరాదాయం రూ.20,000లు మాత్రమే. అందుకే కేంద్రానికి అందుతున్న భారీ మొత్తంనుంచి ప్రధాన్ మంత్రి కిసాన్ స్కీం కింద రైతులకు అందిస్తున్న ప్రత్యక్ష నగదు సహాయాన్ని రెట్టింపు చేయాలి. ప్రస్తుతం భూమి ఉన్న రైతుకు ఏటా రూ.6 వేల రూపాయల నగదు సహాయం చేస్తుండగా దాన్ని కుటుంబానికి 12 కోట్ల రూపాయలకు పెంచాలి. అంటే నెలకు రైతుకు కనీసం వెయ్యిరూపాయల నగదు సహాయం అందుతుందన్నమాట. భూమిలేని రైతులను కూడా పీఎమ్ కిసాన్ పథకంలో భాగం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాగే వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా 20,000 గ్రామీణ రైతు బజార్లను ఆధునిక మండీలుగా మార్చాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వృద్ధి రేటు అంచనాలు కట్
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ఆర్థిక సేవల సంస్థలు కుదించాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఫిచ్ సొల్యూషన్స్.. 6.8% నుంచి 6.4%కి తగ్గించగా, సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ కూడా 6.8% నుంచి 6.2%కి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కన్నా మరింత తక్కువగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5%కి జీడీపీ వృద్ధి పడిపోయిన నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వృద్ధి మందగమనానికి దాదాపు అడ్డుకట్ట పడి ఉండొచ్చని.. రాబోయే త్రైమాసికాల్లో రికవరీ ప్రారంభం కావొచ్చని ఫిచ్ తెలిపింది. అయితే, అంతర్జాతీయంగాను, ప్రైవేట్ రంగంలో వినియోగపరమైన ఒత్తిళ్ల కారణంగా.. ఈ రికవరీ గతంలో కన్నా బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్య, ఆర్థికపరమైన ఉద్దీపనలు, సంస్కరణల కొనసాగింపు, సానుకూల బేస్ ఎఫెక్ట్ మొదలైనవి వృద్ధి మెరుగుపడటానికి దోహదపడొచ్చని వివరించింది. ‘బడ్జెట్ ప్రతిపాదనలు, ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన చర్యలు.. వృద్ధికి ఊతమివ్వడానికి గానీ .. సెంటిమెంట్‌ను మెరుగుపర్చడానికి గానీ సరిపోయినంత స్థాయిలో లేవు. మరిన్ని మెరుగైన చర్యలు ఉండొచ్చని ఆశావహ అంచనాలు నెలకొన్నప్పటికీ.. అలాంటివేమీ లేకపోయే రిస్కులు కూడా ఉన్నాయి‘ అని ఫిచ్ తెలిపింది. ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించడంతో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు పోవడం, నిర్మాణ రంగంలోనూ మందగమన పరిస్థితులు నెలకొనడం, వినియోగం తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా వ్యాపార సంస్థలు పెట్టుబడి ప్రణాళికలను పక్కన పెట్టే అవకాశం ఉందని వివరించింది. మరో విడత వడ్డీ రేట్ల కోత.. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి గతి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. సుమారు 7 శాతం దాకా నమోదు చేయొచ్చని వివరించింది. అయితే, బలహీన జీడీపీ గణాంకాల కారణంగా అక్టోబర్‌లో జరిగే సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను మరో 15–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చన్న గత అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు డీబీఎస్ తెలిపింది. వృద్ధిపై ఆందోళన పెరిగే కొద్దీ రేట్ల కోత అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు వివరించింది. ఇదే కనిష్ట స్థాయి కావొచ్చు.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నమోదైన వృద్ధే దాదాపు కనిష్ట స్థాయి కావొచ్చని, ఇకనుంచి కొంత కోలుకోవచ్చని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ అభిప్రాయపడింది. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్, పెట్టుబడులు, ఎగుమతుల అంచనాలు.. అన్నీ దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్ రికవరీ ప్రక్రియ చాలా సుదీర్ఘంగాను, మార్కెట్ అంచనాల కన్నా దిగువ స్థాయిలోనే ఉండవచ్చని యూబీఎస్ తెలిపింది. -
మారిన లెక్క.. పెరిగిన జీడీపీ
* గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంపు * 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మారిన ఫలితం న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడంతో గత సంవత్సరాల జీడీపీ వృద్ధి రేట్లను పెంచుతూ సవరించారు. ఈ మార్పుతో 2013-14 జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. 12-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. వరుసగా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం విలువ రూపంలో ఈ పరిమాణాలు రూ.92.8 లక్షల కోట్లు, రూ.99.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కొత్త బేస్ ఇయర్ ప్రకారం ప్రస్తుత ధరలపై జీడీపీ పరిమాణం ఈ రెండు సంవత్సరాల్లో రూ. 99.88 లక్షల కోట్లు, రూ. 113.45 లక్షల కోట్లుగా వుంది. 2011-12 మార్కెట్ ధరల ప్రాతిపదికన తాజా బేస్ ఇయర్ అమల్లోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ గురించి మరింత స్పష్టమైన చిత్రం రావడానికి గణాంకాల మంత్రిత్వశాఖ బేస్ ఇయర్‌ను మార్చింది. చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. జీడీపీ డేటా కోసం ఇప్పటి వరకూ బేస్ ఇయర్ 2004-2005 కాగా, తాజాగా 2011-2012కు మార్చారు. అంటే జాతీయ గణాంకాలు 2004-2005 స్థిర ధరలు కాకుండా 2011-2012 ఆర్థిక సంవత్సరంలోని స్థిర ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. బేస్ ఇయర్ అంటే... వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే ‘బేస్ ఇయర్’ అంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ అకౌంట్ల గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్(ఎన్ఎస్సీ) సిఫారసు చేసింది. ఇప్పటి వరకూ 10 ఏళ్లకు ఒకసారి ఈ మార్పు ఉండేది. గతంలో బేస్ ఇయర్‌ను 2010 జనవరిలో కేంద్ర ప్రభుత్వం మార్చింది. ద్రవ్యలోటుపై ఎఫెక్ట్... బేస్ రేటు మార్పు నేపథ్యంలో భారీగా పెరగనున్న ఆర్థిక పరిమాణం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు(ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాలకు మధ్య నున్న వ్యత్యాసం) ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా 4.1 శాతం వద్ద కట్టడి చేయడం సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, స్థిర ధరల ప్రకారం ఆర్థిక పరిమాణం పెరిగినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఆర్థిక వృద్ధి పరిమాణం తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై బేస్ రేటు మార్పు ప్రభావం ఉండకపోవచ్చని చీఫ్ స్టాటిస్టీషియన్ ఏసీఏ అనంత్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం నెలకు రూ.80 వేలు బేస్ ఇయర్ మార్పు ప్రాతిపదికన కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే, వార్షికంగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఈ మొత్తం 2011-12, 2012-13, 2013-14లలో వరుసగా, రూ.64,316, రూ.71,593, రూ.80,388గా ఉంది. 12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ: కేంద్రం భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం తెలిపారు. 10-12 సంవత్సరాల శ్రేణిలో దేశ ఆర్థిక పరిమాణం 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన అంచనావేశారు. భారత ప్రైవేటు వెంచర్ కేపిటల్ అసోసియేషన్ ఇక్కడ జరిపిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోకి భారీగా పెద్ద ఎత్తున కేపిటల్ పెట్టుబడులు(ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) వస్తున్న నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్టంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. రానున్న బడ్జెట్లో పన్ను సంబంధ సమస్యలను తగిన విధంగా ఎదుర్కొనేలా చర్యలు ఉంటాయని విదేశీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ముంబైని సింగపూర్, లండన్ తరహాలో దిగ్గజ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. అది మా క్రెడిట్... చిదంబరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని జీడీపీ సవరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వాణిజ్య వాహనాలకు మరికొన్నాళ్లు గడ్డుకాలమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వృద్ధిరేటు నెమ్మదించడంతో వాణిజ్య వాహన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇదే విధమైన పరిస్థితి మరో మూడు త్రైమాసికాలు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హైర్ పర్చేజ్ అసోసియేషన్ (ఎఫ్‌ఐహెచ్‌పీఏ) పేర్కొంది. గత రెండేళ్ళలో సగటున అమ్మకాలు 50 శాతం తగ్గాయని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 26 శాతం క్షీణత నమోదయ్యిందని ఎఫ్‌ఐహెచ్‌పీఏ ప్రెసిడెంట్ ఉమేష్ రేవంక్కర్ తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు బాగుండటంతో మరో మూడు త్రైమాసికాల తర్వాత అమ్మకాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తగ్గిన ఆర్థిక వృద్ధిరేటు, పెండింగ్‌లో ఉన్న రూ. 12 లక్షల కోట్ల ప్రాజెక్టులు వంటి సమస్యలకు ప్రభుత్వం సరైన పరిష్కారాలను కనుగొంటేనే తిరిగి ఆటోమొబైల్ రంగం గాడిన పడుతుందన్నారు. రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ఎఫ్‌ఐహెచ్‌పీఏ జాతీయ సదస్సుకు ఈసారి హైదరాబాద్ వేదికయ్యింది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంక్కర్ మాట్లాడుతూ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై ఉషాథోరట్ కమిటీ చేసిన సూచనలు అమలు చేస్తే ఈ రంగంపై పెను ప్రభావం చూపుతాయని, వీటిని అమలు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కంపెనీల నెట్‌వర్త్ పరిమితిని రెండు కోట్ల నుంచి రూ.25 కోట్లకు పెంచడం, ఎన్పీఏగా పరిగణించే కాలపరిమితిని 180 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం వంటివి చిన్న స్థాయి ఎన్బీఎఫ్సీ సంస్థల మనుగడకు ప్రమాదకరంగా పరిగణించినట్లు ఎఫ్‌ఐహెచ్‌పీఏ సెక్రటరీ జనరల్ టి.ఆర్.అచ్చా పేర్కొన్నారు. ప్రస్తుతం 2,500 సభ్యులున్న ఎఫ్‌ఐహెచ్‌పీఏ లక్ష కోట్లకు విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఏటా రూ.40,000 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నట్లు రేవంక్కర్ తెలిపారు.