గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన కేసీఆర్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వచ్చారు. 125 కోట్ల రూపాయలతో నిర్మించిన గూడెం ప్రాజెక్టును ప్రారంభించారు.
అంతకు ముందు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ధర్మారంలో కేసీఆర్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ ను తన కేబినెట్లోకి తీసుకుంటానని చెప్పారు.