hanging punishment
-
మృగాళ్లకు 'ఉరి'
వృద్ధాప్యానికి చేరువలో ఉన్న మహిళ అనే కనికరంకూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయాయి.పశువుల్లా మీదపడి తమవాంఛ తీర్చుకున్నారు. ఆపై అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. అంతటితో ఆగకుండాబంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ మృగాళ్లపై న్యాయదేవత కన్నెర్ర జేసింది. ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించింది.వన్‌సైడ్ లవ్‌తో వెంబడించి వేధించినా ససేమిరా అనడంతో సైకోలా మారి యువతిని దారుణంగా హత్యచేసినయువకుడికి మరణదండన విధించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరునెల్వేలి జిల్లా అంబై సమీపం కల్లిడైకురిచ్చికి చెందిన తమిళ్‌సెల్వి (50) పనిమాత్తురై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సుగా పనిచేసేది. నర్సు కుమారుడు రాజేష్‌కన్నన్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. భర్త చెల్లస్వామి మరణించాడు. ఈ స్థితిలో ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన రాత్రి నర్సు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆరుగురు అగంతకులు లోనికి ప్రవేశించారు. పెద్దగా అరిచేందుకు ప్రయత్నించగా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత పదునైన వైరుతో గొంతుబిగించి హతమార్చారు. ఇంట్లో ఉన్న 25 గ్రాముల బంగారు నగలు దొంగలించుకుని పారిపోయారు. ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నర్సు రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తిక్ (21), మహేంద్రన్ (24), వసంతకుమార్ (30), రాజేష్ (27), గణేశన్ (51), చిన్నదురై (27)ను అరెస్ట్ చేశారు. డీఎన్ఏ పరిశోధనలో వసంతకుమార్, రాజేష్ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణయ్యింది. ఈ కేసుపై బుధవారం తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. గట్టి బందోబస్తు నడుమ ఆరుగురు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు వసంతకుమార్, రాజేష్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇంద్రాణి బుధవారం సాయంత్రం తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగైన నర్సు ఇంట్లోకి జొరబడినందుకు యావజ్జీవం, హత్యచేసినందుకు ఉరిశిక్ష, అత్యాచారానికి పాల్పడినందుకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. మిగిలిన నలుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టారు. ప్రేమ పెళ్లి వద్దన్నందుకు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపం జ్యోతినగర్‌కు చెందిన తంగదురై (32) అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. వీడవకుండా ఆమె వెంటపడుతూ వేధించ సాగాడు. యువతి తల్లిదండ్రులు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తంగదురైని స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించగా ఇకపై ఆమె వెంటపడను అంటూ హామీ పత్రం రాసివ్వడంతో విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా 2014 నవంబర్ 13వ తేదీన తంగదురై సదరు యువతి ఇంట్లోకి జొరబడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిచేశాడు. ఆగ్రహించి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి, సోదరుడిని కత్తితో గాయపరిచాడు. హత్య, హత్యాయత్నం సెక్షన్ల కింద పొల్లాచ్చి పోలీసులు తంగదురైని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై కోయంబత్తూరు కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. నిందితుడు తంగదురై ప్రాణాలు పోయే వరకు జైల్లోనే ఉండేలా యావజ్జీవ శిక్ష విధించింది. తల్లి, సోదరుడిపై దాడికి పాల్పడిన నేరానికి తలా ఏడేళ్ల జైలు, హద్దుమీరి ఇంట్లోకి ప్రవేశించినందుకు 10 ఏళ్ల జైలు, రూ.41వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పూర్ణజయ అనంద్ తీర్పు చెప్పారు. -
కామాంధుడికి ఉరి
సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడిని కేసు నుంచి తప్పించారని, పునర్విచారణకు పట్టుబడుతూ కోర్టు ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అలాగే, కేసు పునర్విచారణకు కోరుతూ ఆ బాలిక తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పునర్విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలు, యువతులు, బాలికలకు భద్రత కల్పించే రీతిలో చట్టాలు కఠినం చేసినా, నేరాల కట్టడికి ప్రత్యేక బృందాలు, ప్రత్యేక టోల్ ఫ్రీలు ప్రకటించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకో చోట, ఎక్కడో ఓ చోట దాడుల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడి పట్టుబడే నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే నేరాల తగ్గతాయని మహిళా సంఘాలు నినాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల హైదరాబాద్‌లో వెలుగు చూసిన దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారిని మరింత కఠినంగా శిక్షించడంతో పాటు, ఇది వరకు దాఖలైన కేసుల విచారణల్ని త్వరిత ముగించే దిశగా జిల్లాల ఎస్పీలకు డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం సాగిన లైంగిక దాడి కేసు విచారణను ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో నిరూపించడం విశేషం. అదే సమయంలో ఈకేసులో మరో నిందితుడిని తప్పించిన్నట్టుగా ఆరోపణలు బయలు దేరడం వివాదానికి దారి తీసింది. అదృశ్యం...మరుసటి రోజే మృతదేహంగా. కోయంబత్తూరు పన్నిమడైకు చెందిన ఓ దంపతుల కుమార్తె (7) ఈ ఏడాది మార్చి 25వ తేదీన అదృశ్యమైంది. బిడ్డ కోసం గాలించినా ఫలితం శూన్యం. దీంతో ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ మరుసటి రోజే ఆ దంపతుల ఇంటికి కూత వేటు దూరంలో బాలిక మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టు విచారణలో తేలింది. డీఎన్ఏ పరిశోధనలకు సైతం పోలీసులు చర్యలు తీసుకున్నారు. విచారణను ముమ్మరం చేయగా, తొండముత్తూరుకు చెందిన సంతోష్‌కుమార్ చిక్కాడు. బాలిక మృత దేహం పడి ఉన్న ప్రదేశానికి కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలికి సాయంగా ఉంటూ వచ్చిన సంతోష్‌కుమార్ నిందితుడిగా తేల్చారు. ఎనిమిది నెలల్లో.....తీర్పు అన్ని రకాల ఆధారాల్ని సేకరించిన కోయంబత్తూరు పోలీసులు నిందితుడ్ని కటకటాల్లోకి నెట్టారు. కోయంబత్తూరులో పోక్సో కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా కోర్టులో గతవారం వాదనను ముగించింది. కోర్టులో పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్ములం మేరకు న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం తీర్పు ఇచ్చారు. నిందితుడు సంతోష్‌కుమార్‌కు ఉరి శిక్ష విధించారు. ఆ బాలికను హత్య చేసినందుకు ఉరి శిక్ష, పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు యావజ్జీవ శిక్ష, ఆధారాల్ని రూపు మాపేందుకు చేసిన ప్రయత్నానికి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సర్వత్రా ఆహ్వానించారు. మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఆ కోర్టు ఎదురుగా మహిళా సంఘాలు తీర్పును ఆహ్వానిస్తూ, ఈ కేసులో మరో నిందితుడ్ని పోలీసులు తప్పించి ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆ సంఘాలు ఆందోళనకు దిగాయి. డీన్ఏ పరిశోధన నివేదికలో ఆ బాలిక మీద లైంగిక దాడికి ఇద్దరు పాల్పడినట్టు పేర్కొన బడి ఉందని, అయితే, ఒకర్ని మాత్రే అరెస్టు చేసి , కేసును ముగించి ఉన్నట్టు ఆరోపించారు. అదే సమయంలో కేసును పునర్విచారణకు ఆదేశించాలని, మరో నిందితుడు సైతం శిక్షించబడాలని కోరుతూ, బాధిత కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణించిన న్యాయమూర్తి ఆ పరిశోధన నివేదిక ఆధారంగా పున్వరిచారణకు ఆదేవించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులతోపాటు మహిళాసంఘాలు హర్షం వ్యక్తం చేశారు. -
ఉరి శిక్ష ఖరారు.. అమలు ఎలా?
దిల్సుఖ్నగర్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల కేసుల్లో ఉగ్రవాదులకు న్యాయ స్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో మూడు దశలు దాటితే..మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఉరికంబం ఎక్కాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...రాష్ట్రంలో ఇప్పుడు ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులు(హ్యాంగ్మెన్) లేరు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్ జైలులో అమలు చేశారు. ముషీరాబాద్ సెంట్రల్ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. కాగా లుంబినీ పార్కులో పేలుడుకు పాల్పడిన అనీఖ్, అక్బర్‌లకు సోమవారం కోర్టు ఉరిశిక్ష విధించగా...దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు 2016 డిసెంబర్ 19న కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇవి అమలు కావాల్సి ఉంది. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌లో పేలుడుకు పాల్పడడంతో పాటు దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద బాంబు పెట్టిన ఇద్దరు ఐఎం ఉగ్రవాదులకు సోమవారం... క్యాపిటల్ పనిష్మెంట్గా పరిగణించే మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. మరో మూడు దశలు దాటితే ఈ ముష్కరులకు విధించిన శిక్ష ఖరారైనట్లే! ఇక్కడ తెరపైకి వచ్చే ఆసక్తికర అంశం ఏమిటంటే... ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేవు. తలారులుగా పిలిచే హ్యాంగ్మెన్ పోస్టులు అసలే లేవు. ఈ నేపథ్యంలో మొత్తం ఏడుగురు ఐఎం ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం ఖరారైతే... అది ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో :సిటీలో పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును దోషులు హైకోర్టులో సవాల్ చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే డిఫెన్స్ లాయర్లు ఈ మేరకు ప్రకటించారు. దిల్సుఖ్నగర్ కేసుల్లో ఆ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇలా జరగని పక్షంలో శిక్ష విధించిన న్యాయస్థానమే ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఉన్నత న్యాయస్థానం ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో తనంతట తానుగానే విచారణ చేయొచ్చు. హైకోర్టు సైతం ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను సమర్థిస్తే... దోషులు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంలోనూ వీరికి చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. దోషులో లేదా వారి తరఫు వారో ఈ పిటిషన్లను దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణశిక్ష ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. కానీ మరి రాష్ట్రంలో ఒక్క జైలులోనూ ఉరికంబం లేదు. 38 ఏళ్ల క్రితం చివరిసారి... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరి శిక్షను 38 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌లోని సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మెన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితం కావడం, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పటి జైల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్ష అమలు చేశారు. రామవతార్ ఓ వివాహితతో సంబంధం కొనసాగించాడు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో సదరు వివాహిత కుమారుడు చూశాడు. తమ గుట్టురట్టవుతుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఆ బాలుడిని చంపేశారు. మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌లో పడేసేందుకు గన్నీ బ్యాగ్‌లో కట్టి సైకిల్‌పై తీసుకొస్తున్న రామవతార్ ఓ కానిస్టేబుల్‌కు ఎదురుపడటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రామవతార్కు ఉరి, వివాహితకు జీవితఖైదు విధించింది. చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించిన ఆ వివాహిత రామవతార్ యాదవ్‌ను ఉరి తీసిన విషయం తెలుసుకొని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. జైలు మారడంతో... ముషీరాబాద్ సెంట్రల్ జైలునే కొన్నేళ్ల క్రితం చర్లపల్లికి మార్చారు. అక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ... ఉరికంబం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. మరోపక్క తెలంగాణ జైళ్ల శాఖలో కొన్ని దశాబ్దాలుగా హ్యాంగ్మెన్గా పిలిచే తలారీ పోస్టులు లేవు. ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డర్స్కే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైనప్పుడు వీరిలో ముందుకొచ్చిన వారికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడం ద్వారా దోషుల్ని ఉరితీయించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఓ రాష్ట్రంలోని ఓ జైలులో ఉరికంబం లేకపోతే అదే రాష్ట్రంలోని మరో జైలులో దీన్ని అమలు చేసే ఆస్కారం ఉంది. అయితే తెలంగాణలోని ఏ జైలులోనూ గ్యాలోస్ లేని నేపథ్యంలో ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైతే చర్లపల్లిలో గ్యాలోస్‌ను ఏర్పాటు చేయడమో లేక రాజమండ్రిలో అమలు చేయించడమో మాత్రమే మార్గాలు. అయితే రాజమండ్రిలో ఉరిశిక్ష అమలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ సర్కారు అమలు చేసినట్లవుతుందని, ఈ నేపథ్యంలో గ్యాలోస్ ఏర్పాటుకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో అవసరమైతే రెండుమూడు రోజుల్లోనే ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రిలో 40 ఏళ్ల క్రితం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆఖరుసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. ఆ తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అవి అమలు కాలేదు. 1875 నుంచి గ్యాలోస్ కలిగి ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో మొత్తం 94 మందిని ఉరితీశారు. అత్యధికంగా 42 శిక్షల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. క్యాపిటల్ పనిష్మెంట్గా పిలిచే ఉరిశిక్షను అమలు చేసే ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగడం అనవాయితీ. హత్య కేసులో ఉరిశిక్షకు గురైన కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరాడు. దీంతో జైలు అధికారులు ఉరితీయడానికి ముందు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఇతడిని ఉరితీశారు. ఆ ఇద్దరి శిక్షకు బ్రేక్... 1993 నాటి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులుగా ఉండి, దోషులుగా తేలిన విష్ణువర్ధన్‌రావు, చలపతిరావులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ శిక్ష ఖరారు కావడంతో అమలు కోసం ఇద్దరినీ 1997లో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. 1999లో శిక్ష అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా... సుప్రీంకోర్టు స్టే విధించడంతో తెల్లవారుజామున ఒంటిగంటకు రాజమండ్రి జైలు అధికారులకు ఫోన్ ద్వారా, 3గంటలకు అధికారికంగా ఉత్తర్వులు అందడంతో శిక్ష అమలు ఆగిపోయింది. ఆపై వీరికి పడిన శిక్ష జీవితఖైదుగా మారింది. విజయవాడలో జరిగిన శ్రీలక్ష్మి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మనోహర్‌కు కింది కోర్టు ఉరిశిక్ష వి«ధించడంతో 2004లో రాజమండ్రికి తరలించారు. హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చడంతో ఇతడిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. 2011లో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన బి.వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసదోర విషయంలోనూ ఇలానే జరిగింది. భూగర్భంలో ఉరికంబం రాజమండ్రి సెంట్రల్ జైలులోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఖైదీని జైలు గది నుంచి బయటకు తీసుకువచ్చి, ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. ఇక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలు మీదుగా బయటకు తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు. ఆ తరువాత దీన్ని అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు. మూడేళ్ల క్రితం ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే గ్యాలోస్‌ను అది ఉన్న ప్రాంతం నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తరచూ దీనికి ఆయిలింగ్ చేస్తూ పనితీరు దెబ్బతినకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంబంధిత వార్తలు.. అతడు ఊహాచిత్రాలు గీయడంలో దిట్ట మూడు బాంబుల టైమర్లుగా 'సమయ్' వాచీలు -
ఉరిశిక్ష రద్దుపై పిటిషన్.. కీలక పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది. కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొన్న వివరాలు -
‘మరణ’యాతన తగ్గించలేమా?
ఉరి ద్వారా మరణశిక్ష అమలు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ శిక్ష పడిన ఖైదీలు ప్రశాంతంగా మరణించాలే తప్ప బాధతో కాదని, ఒక మనిషిగా మరణంలోనూ గౌరవం పొందాల్సి ఉన్నందున ఈ విధానానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఉరిశిక్ష ద్వారా ఖైదీలను అంతమొందించే పద్ధతిని ఎందుకు నిలుపుదల చేయకూడదంటూ శుక్రవారం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో పరిస్థితి ఏంటి.. దాని పూర్వాపరాలపై కథనం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అమెరికాలో ఐదు రకాల పద్ధతులు... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాణాంతక ఇంజెక్షన్, విద్యుత్‌షాక్, గ్యాస్ ఛాంబర్, ఫైరింగ్ స్క్వాడ్, ఉరిశిక్షల ద్వారా మరణశిక్షలను అమలు చేస్తున్నారు. టెన్నెస్సీలో ఎలక్ట్రిక్ చైర్‌ను ఉపయోగిస్తుండగా, 35 రాష్ట్రాల్లో ఈ శిక్ష పడిన వారికి ఇంజెక్షన్ విధానాన్ని పాటిస్తున్నారు. 1977లో ఒక్లొహామాలో తొలిసారిగా ఈ ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా న్యూయార్క్ విద్యుత్ షాక్ విధానాన్ని ప్రవేశపెట్టి 1890లో మొదటిసారి అమలుచేసింది. నెవాడా 1920లలోనే గ్యాస్‌ఛాంబర్ ద్వారా మరణశిక్షను అమలుచేసింది. సంఖ్యపై కొరవడిన స్పష్టత... దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటివరకు ఎంత మందికి ఉరిశిక్ష విధించారన్న సంఖ్యపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 52 మందిని ఉరితీసినట్లు చెబుతున్నా, తమ పరిశోధనలో దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఈ శిక్షలు అమలయ్యాయని తేలిందని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ సంస్థ చెబుతోంది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ తన పరిశోధనలో భాగంగా 755 మందిని ఉరితీశారంటూ పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఏసీహెచ్ఆర్ గణాంకాల ప్రకారం 1995లో అత్యధికంగా 13 మంది, 1996, 97లలో ఒక్కొక్కరు చొప్పున, 1998లో ముగ్గురు, 2004లో «ఒకరు, 2012లో ముంబై ఉగ్రదాడిలో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్, 2013లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అçఫ్జల్గురు, 2015లో ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్లను ఉరితీశారు. ప్రపంచవ్యాప్తంగా... వివిధ దేశాల్లో ఉరి, ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పు లు, తుపాకీతో తల వెనక కాల్చడం, తల నరకడం, ప్రాణాంతక ఇంజెక్షన్, రాళ్లతో కొట్టి చంపడం, గ్యాస్ ఛాంబర్, విద్యుత్‌షాక్, ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడేయడం వంటి 9 పద్ధతులను అను సరిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మొదలుకుని బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మలేసియా, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, యూఎస్ఏ లాంటి దాదాపు 60 దేశాల్లో ఉరిశిక్షకు చట్టబద్ధత ఉంది. మిలిటరీ కోర్టుల్లో శిక్ష పడ్డవారికి ఫైరింగ్ స్క్వాడ్లతో కాల్పులను అఫ్గానిస్తాన్, బహ్రెయిన్, క్యూబా, కువైట్, యూఏఈ, యూ ఎస్ఏ, వియత్నాం వంటి 28 దేశాలు, తుపాకీతో కాల్చిచంపే శిక్షలను 20 దేశాలు అమలుచేస్తున్నా యి. ఇండోనేసియా, ఇరాన్, మౌరిటానియా, నైజీరి యా, పాకిస్తాన్, సౌదీ ఆరేబియా, సూడాన్, యూఏఈ, యెమన్లలో రాళ్లతో కొట్టి మరణశిక్షను పాటిస్తున్నాయి. వ్యభిచారం, స్వలింగసంపర్క సం బంధాలు, అత్యాచారాలు వంటి కేసుల్లోనే దీనిని అమలు చేస్తున్నారు. ఇరాన్, సౌదీఅరేబియా, యెమన్‌లో తల నరకడం, చైనా, గ్వాటామాలా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ శిక్షను పాటిస్తున్నారు. మరణశిక్ష రద్దుచేసిన దేశాలు.. అన్ని రకాల నేరాలకు కలుపుకుని మరణశిక్షను రద్దుచేసిన మొత్తం 104 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, భూటాన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, మెక్సికో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పనామా, ఫిలిప్పిన్స్, పోలండ్, పోర్చుగల్, రొమోనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ వంటివి ఉన్నాయి. సాధారణ నేరాలకు ఈ శిక్షను బ్రెజిల్, చిలీ, కజకిస్తాన్, ఇజ్రాయెల్, పెరూ, ఎల్‌సాల్వడార్, గునియా రద్దుచేశాయి. -
ఉగ్రవాదులకు ఉరే సరి..!
ఉరిశిక్షను ఏ సందర్భాల్లో విధించవచ్చు అనే అంశంపై ఎన్ని చర్చలు, వాదనలు అయినా జరగనివ్వండి. కానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం శిక్ష తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కొనసాగుతున్న స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో భాగమవుతున్న ఉగ్రవాదులని చివరికంటా శిక్షించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ప్రతి రోజూ ఎవ రో ఒకరిని ఎక్కడో ఒకచోట ఉరి తీయడంలేదు. గత పదేళ్లలో దేశంలో ముగ్గురిని మాత్రమే ఉరి తీశారు. గడిచిన ఏడేళ్లలో దేశంలో 3,751 మంది నేరస్తులకు పడిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. యాకూబ్ మెమన్ విషయంలో తీవ్రాతితీవ్రమైన శిక్ష విధింపును అధిగమించేందు కోసం న్యాయస్థానాలు, రాష్ట్రపతి కూడా తగు జాగ్రత్తతో వ్యవహరించారు. ఉరి శిక్షకు పాత్రులైన వారి విషయంలో ఎలాంటి తప్పూ జర గకుండా చూడాలనే అంశాన్ని ధ్రువీకరిస్తూ.మెమన్ పిటిషన్‌ను వినడానికి కనీవినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు ధర్మాసనం అర్ధరాత్రి నుంచి వేకువజాము దాకా సమావేశమైంది. అత్యంత అరుదైన కేసులకు మాత్రమే ఉరిశిక్ష విధిం పు వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ, ఉరిశిక్షపై సమీక్షకు సంబంధించిన డిమాండ్‌ను తిరస్కరించలేరు. న్యాయ మూర్తుల వివేచన సైతం తప్పులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టే ఉన్నత న్యాయస్థానాల్లో వారి ఆదేశాలపై సమీక్షల కారణంగా అనేక ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలు గా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశం అకాలంలో చర్చకు తీసుకున్నందువల్ల మొత్తం చర్చ కలుషితమవుతోంది. అదెలాగో ఇక్కడ చూద్దాం. కోల్‌కతాలో ఒక రేపిస్టుకు ఉరిశిక్ష విధించినప్పుడు ఈ చర్చ తారస్థాయికి వెళ్లింది. అలాగే నిర్భయ కేసు ప్రజల హృదయాలలో ప్రముఖంగా నిలిచి ఉన్నప్పుడు, శాసనంలో కొన్ని మార్పులకు అది కారణమైంది. తాను చేసిన నేరాలకు తన జీవితాన్ని పరిత్యజించానని యాకుబ్ మెమన్ పేర్కొన్న తర్వాతే ఉరికి వ్యతిరేకంగా జనాగ్రహం పెరిగి పోయింది. అయితే మెమన్ చేసినవి చిన్న నేరాలు కావు. న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభిప్రా యంచేత ప్రభావితం కాకూడదు. అలా కాదనే భావి ద్దాం. ఉరిశిక్షను ఒక శిక్షా సాధనంగా రద్దు చేయవలసిం దిగా ప్రముఖులు అభ్యర్థించిన సందర్భంలో ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం మిన్నంటుతోంది. ఈ అంశం పై సమాచారాన్ని అరకొ రగా పొందుతున్నవారు ఇలాంటి అభ్యర్థనలను అపరాధులను కాపాడేదాంట్లో భాగంగా అనుమానిస్తున్నారు. ఉరి శిక్ష రద్దుకు వారు చర్చిస్తున్న సందర్భం అసలు లక్ష్యాన్ని పక్కకు నెడుతోంది. అందుకే ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలని నా సూచన. మనం మొదట్లో చట్టాలను రూపొందించుకున్న ప్పుడు ఉగ్రవాదం ఉనికిలో లేదు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన పేలుళ్ల కారకులు దేశద్రోహులే. వారు మరణశిక్షకు అర్హులే. ఇలాంటి వారికి మరణశిక్ష విధించ కపోతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరా టాన్ని అది బలహీనపరుస్తుంది. అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించకపోవడాన్ని ఒక సారి ఊహించుకోండి. అతగాడి విచారణ సమయంలో సైతం కసబ్‌ని రక్షించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందం టూ నిఘావిభాగాలు పేర్కొన్నాయి. ఈ భయాల కార ణంగానే కసబ్‌ను ఉంచిన జైలు పరిసరాల్లో ఎత్తైన భవ నాలు నిర్మిచడాన్ని అనుమతించలేదు. విచారణను సైతం జైలులోపలే జరిపారు. దాన్ని ఉక్కుకోటలాగా మార్చారు. ఉగ్రవాదంపై పోరులో మరణశిక్ష విధింపుకు ప్రాధాన్యత ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. ఉగ్రవాదంపై పోరు పలురకాలుగా జరుగుతుంది. అవన్నీ కలసి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో సాయప డతాయి. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడమనేది వాటిలో ఒకటి. నిఘా సంస్థల నుంచి అనిర్దిష్ట హెచ్చరికలు పంపటం తప్ప, ఈ విషయంలో మాత్రం మనకు ఘన మైన రికార్డు ఏదీ లేదు. రెండు. మనం ఉగ్రవాదంతో వ్యవహరించేందుకు సిద్ధంగా లేము. ఎందుకంటే క్షమిం చకపోవడం అనే సంస్కృతి మనకు లేదు. మూడవ కారణం ఏదంటే హింస అనేది అత్యంత తీవ్ర స్వభావం నుంచే విస్తరిస్తుంది. అత్యంత చిన్న ఐఈడీలు సైతం దీపావళి టపాసుల స్థాయిలో ఉండవు. పేలుడు ఘటనలలో పాల్గొన్నవారు పట్టుబడితే న్యాయ విచారణ ప్రక్రియ తర్వాత వారికి బదులుకు బదులు చెప్పాలని మన సాధారణ తర్కం చెబుతుంది. ఒక అమాయకుడు ఉగ్రవాద బాధితుడు అయినట్లయితే, వ్యూహకర్తలు చెప్పింది చేసే అత్యంత కిందిస్థాయి ఉగ్ర వాదులకు సైతం తగిన శాస్తి చేయాలి. ఉగ్రవాద చర్యల్లో ముఖ్యమైనవని, తక్కువ స్థాయివని తేడా ఉండదు. ఒక ఉగ్రవాద చర్యకు పాల్పడటానికి ముందు ఉన్మాదులు అత్యంత పకడ్బందీగా పథక రచన చేస్తుంటారని గుర్తుంచుకోవాలి. సంప్రదాయిక యుద్ధాల్లో సైతం పౌరులపై దాడి చేయకూడదని నియమాలు ఉంటాయి. విషవాయు ప్రయోగాలు చేయకూడదని నిషేధాలు కూడా ఉంటా యి. వియత్నాం యుద్ధం తర్వాత నాపాం బాంబులను కూడా నిషేధించారు. ఇలాంటి ఆయుధాలు తుపాకుల వంటివి కాదు. వీటి ప్రభావం విస్తృత స్థాయిలో ఉండి సామాన్యులను, ఏ ప్రమేయంలేని పౌరులను బలిగొంటుంది. ఇలాంటి క్రూర ప్రపంచంలో పౌరులను చంపడం, నిరుత్తరులను చేయడమే ఉగ్రవాద లక్ష్యంగా ఉంటుంది. అలాంటి దాడులపై కఠిన చర్యలు చేపట్టాలి. మరణ దండన వాటిలో ఒకటి. అయితే మరణ దండన ఉగ్రవాద దాడులను తగ్గిం చగలదా? తగ్గించలేకపోవచ్చు కానీ ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని అది సజీవంగా ఉంచుతుంది. భద్రతపరం గా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మనలాంటి దేశాల్లో ఎవ్వరైనా, ఎక్కడివారైనా ఉగ్రవాదులకు లక్ష్యం గా ఉంటారు. ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అసమర్థత కారణంగా ఉగ్రవాదంపై కనీస సానుభూతి కూడా ఉండకూడదనే మాటలు శుష్క ప్రసంగాలే అవుతాయి. ఉగ్రవాద దాడుల్లో పాల్గొనేవారు తమ జీవితాలు పట్టుబడిన తర్వాత కూడా కొనసాగుతాయని తెలుసు కాబట్టే వారు ఉగ్రవాదాన్ని కౌగలించుకుంటుంటారు. అయితే అన్ని రకాల చర్యలకు ఉరితీతే ఉత్తమ శిక్షా మార్గం అనడానికి వీలు లేదు. ఉరిశిక్షను ఏ సందర్భాల్లో విధించవచ్చు అనే అంశంపై ఎన్ని చర్చలు, వాదనలు అయినా జరగనివ్వండి. కానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం శిక్ష తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కొన సాగుతున్న స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో భాగమ వుతున్న ఉగ్రవాదులని చివరికంటా శిక్షించాల్సిన అవసరం ఉంది. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్:mvijapurkar@gmail.com)) -
జీవితానికీ మరణానికీ మధ్య ‘మత’ గీత మెమన్!
తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లింలలో పలువురు భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. మెమన్ ఉరితీత ఘటన కూడా ప్రజలను వేరు పరచేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అంత్యక్రియలు జరిగిన రోజే ఉరిశిక్షపాలైన ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కి అంత్యక్రియలు నిర్వహించారు. మెమన్ అంత్యక్రియల గురించి నివేదించవద్దని ముంబై పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అదే సమయంలో సైనిక వందనంతో సహా ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం కలాం అంత్యక్రియలను ఘనంగా నిర్వహించింది. (అణు బాం బుల సృష్టికర్తగా, వాటిని మోసుకుపోయే క్షిపణుల సృష్టికర్తగా కీర్తిపొందిన ఆయ నకు ఇది అసలైన నివాళి). తన భావ వ్యక్తీకరణా హక్కులను కాపాడుకోవడంలో తీవ్రంగా పోరాడే స్వభావమున్నప్పటికీ, మీడియా రెండు కారణాలతో మెమన్ అంత్యక్రియల ప్రసారంపై నిషేధాన్ని అంగీకరించింది. ఉరిశిక్ష విధించిన వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా పోటెత్తి వచ్చే ముస్లిం జనసందోహం అతడికి మద్దతు ప్రకటించే వార్తలను ప్రచారం చేసినట్లయితే, ఇప్పటికే మతపర హింసలో తన వంతు వాటా కంటే అధిక భాగం కలిగి ఉన్న ముంబై వంటి నగరంలో ప్రజలు మతాల వారీగా వేరుపడిపోవడం జరుగుతుందనే ఆందోళనతో మీడియా ఏకీభవించింది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం. అప్రియత్వానికి సంబంధించింది. జనం గౌరవించనప్ప టికీ, ఉరిశిక్షకు గురైన వ్యక్తికి ప్రజల నుంచి సానుభూతి లభించడం అనే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమనేది వినడానికి అప్రియంగా ఉండవచ్చు. ఇలాంటి అప్రియ ఘటనలకు ప్రచారం కల్పించకూడదన్నదే తమ వైఖరి అంటూ కొన్ని చానళ్లు ఆన్-స్క్రీన్ బ్యానర్లను కూడా ప్రకటించాయి. మెమన్ అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారనే విషయంలో భారతీ యులు ఆ రోజు పత్రికలలో అచ్చయిన కొన్ని ఫొటోగ్రాఫ్‌ల బట్టే తెలుసుకో గలిగారు. యాకూబ్ మెమన్‌కు నమాజ్ చేయడానికి ముంబైలో దాదాపు 8 వేల మంది ముస్లింలు హాజరయ్యారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నివేదించింది. మన ప్రశ్న అల్లా ఏమిటంటే... వారెందుకలా చేశారు? అన్నదే. భారతీయ జనతా పార్టీ నేత, త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ దీనిపై తనదైన సూత్రీకరణ చేశారు. ‘యాకూబ్ మెమన్ భౌతికకాయం వద్ద గుమిగూడిన వారం దరిపై (కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులను మినహాయించి) నిఘా శాఖ ఓ కన్నేసి ఉంచాలి. వీరిలో చాలామంది భవిష్యత్తులో ఉగ్రవాదులుగా మారే ప్రమాదముంది’. అయితే మెమన్‌కు చివరి నివాళి అర్పించడానికి దూరప్రాంతాల నుంచి కూడా జనం వచ్చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అంత్యక్రియల వేదిక వద్ద నుంచి పంపిన వాట్సాప్ సందేశాలు, చివరి నివాళిని అందించిన సమ యాన్ని చూసినట్లయితే యాకూబ్‌కు నివాళి పలకడానికి అతనితో ఏమాత్రం సం బంధం, పరిచయం లేని పలువురు కొత్తవారు వచ్చారని తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది. సోషల్ మీడియాలో యాకూబ్ ఉరిపట్ల ఆగ్రహం వెల్లువెత్తిన సమాచారాన్ని సీనియర్ పోలీసు అధికారులు పసిగట్టారని కూడా ఆ పత్రిక నివేదిక తెలిపింది. అయితే పోలీసు కమిషనర్ మాత్రం అక్కడ ఆవేశకావేషాలను రెచ్చగొట్టే ఘట నలు చోటు చేసుకోలేదన్న వాస్తవాన్నీ అంగీకరించినట్లు ఆ వార్త బయటపెట్టింది. శ్మశాన వాటిక వద్ద గుమిగూడిన ప్రజలను ఎలాంటి నినాదాలూ చేయవద్దని కూడా కోరడమైంది. తమ నిరసన తెలుపడానికి అక్కడ అంతమంది గుమిగూడనట్లయితే, మీడి యాలో తీవ్ర వ్యతిరేకత, పోలీసు నిఘా ఉన్నప్పటికీ అంతమంది జనం అక్కడికి ఎలా రాగలిగారు? ఎలాంటి దురభిప్రాయాలకూ, మీడియా వర్ణనలతో ముం దస్తు అభిప్రాయాలకూ లోనుకాకుండా మనం ఘటనలను చూడగలిగితే, దీన్ని అర్థం చేసుకోవడం సులభమే. ఈ అర్థంలో గతంలో జరిగిన వరుస ఘటనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మెమన్ ఉరితీతకు దారితీసిన ముంబై పేలుళ్లు 1993 మార్చి 12న జరి గాయి. అదే సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఘర్షణల్లో 500 మంది ముస్లింలు (200 మంది హిందువులు) హత్యకు గురయ్యారు. దానికి నెల రోజు లకు ముందు బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ లేవనెత్తిన ఉద్యమం ఆ మసీదు కూల్చివేతకు కారణమైంది. ఈ అర్థంలో అనేక ఘటనల సమాహార ఫలితమే ముంబై పేలుళ్ల ఘటనకు దారితీసింది. ఇది హింసను ప్రేరే పించి మతపరమైన సామాజిక బృందాలు భారీ స్థాయిలో పాలుపంచుకోవడానికి కారణమైంది. ఈ ఘటనలో హతులైనవారితో పాటు, తమ వ్యాపారాలను కోల్పోయినవారు, గాయపడినవారు, అత్యాచారా లకు గురైనవారు. నిరాశ్రయుల సంఖ్యను కూడా కలపాల్సి ఉంది. వీరందరి సంఖ్య వేల సంఖ్యలో ఉంటుంది. ముంబై పేలుళ్ల నేపథ్యం ఇదే. మెమన్ ఉరితీత కూడా ప్రజలను వేరుపర్చేదే. ఇది కూడా పెద్ద స్థాయిలో విషం చిమ్మనుంది. ఈలోగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఉరిశిక్షకు గురైనవారిలో 94 శాతం మంది దళితులు లేదా ముస్లింలేనట. తమ మతం కారణంగానే తాము ఈ దేశంలో శిక్షకు గురవుతున్నట్లు ముస్లిం లలో అనేకమంది భావిస్తున్నారన్న భావనను యాకూబ్ మెమన్ ఉరి ఘటన బలపరుస్తోంది. మెమన్ నిజంగా తప్పు చేసినప్పటికీ, తన మతం కారణంగానే అతడిని ఉరితీయడానికి ప్రభుత్వం అంత ఆత్రుతను ప్రదర్శించిందన్న ముస్లింల ఆవేదనను ఇది స్పష్టం చేస్తోంది. ఈ కేసు విషయంలో సానుభూతి పూర్తిగా లోపించడాన్ని బీజేపీకి చెందిన హంతకులు మాయా కొడ్నాని, బాబూ బజరంగీల కేసుతో పోల్చితే స్పష్టమవుతుంది. వీళ్లిద్దరికి కూడా ఇదే స్థాయి తీవ్రనేరాలకు గాను శిక్ష విధించినప్పటికీ, వారు నిక్షేపంగా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింల మనుగడకు సంబంధించిన పెనువాస్తవం మనకు ఎదురవుతోంది. ఉగ్రవాదానికి సంబంధించిందే కాదు.. ముస్లింల విద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై వస్తున్న ఏ వ్యాసం కింద అయినా ఇంటర్నెట్లో పాఠకుల వ్యాఖ్యల కేసి చూస్తే మనందరికీ కాస్త జ్ఞాన బోధ కలుగుతుంది. ఆంగ్లీకరణకు గురైన మన మధ్యతరగతి ప్రజల్లో మతద్వేషం, మతపరమైన దురభిమానానికి సంబంధించిన భావనలు ఎంత బలంగా ఉన్నా యంటే ఆ వ్యాఖ్యలను చూస్తుంటే నిజంగానే భయం కలుగుతోంది. దీని ఫలి తంగా కిరాయి ఇళ్ల కోసం, ఉద్యోగాల కోసం మన దేశంలో ముస్లింలు ఎదు ర్కొంటున్న కష్టాలను పరిశీలించడం కూడా కష్టమైపోతోంది. భారత్‌లో ముస్లింగా బతకడంలో ఉన్న వాస్తవం ఇదే. మన కళ్లముందు అనేక ఘటనలు జరుగుతుంటాయి. యాకూబ్ మెమన్ ఉరితీత వాటిలో ఒకటి. అతడి అంత్యక్రియలకు హాజరైనవారి ముఖాల్లో వారికెదురవుతున్న అన్యాయాలు స్ఫుటం దాల్చినట్లు కనిపించాయి. ఆ శ్మశానంలో హాజరైన వారు నిరసన తెలుపడానికి రాలేదు. తామూ బాధితులే కాబట్టి వారు సానుభూతి తెలుపడానికి అక్కడికి వచ్చారు. (ఆకార్ పటేల్ , వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
ఉరి
క్లాసిక్ కథ నాకు మీరు ఉరిశిక్ష వేశారు. నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది. ఇప్పుడు చెప్పుకొన్నా ఒకటే చెప్పుకొనకపోయినా ఒకటే. కాని మీరిప్పుడు చెప్పుకోమనటంలో ఒక విశేషం ఉంది. ఎట్లాగూ చస్తున్నాడు కదా! చచ్చింతర్వాత మాట్లాడేది లేదు, పెట్టేది లేదు, ఆ మాట్లాడేది కాస్తా యిప్పుడే మాట్లాడమని. మనుష్యుడై జన్మ యెత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాపి హితులైన మానవులకు సహజ లక్షణం. మీకు నా శరీరం మీద ప్రేమలేదు. నా ఆత్మ మీద ప్రేమ. నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే గనుక, అయినా కాకపోయినా మీరనుకొంటున్నారు గనుక యిది ఒక మామూలు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు, మాట్లాడితే వచ్చే లాభం లేదు. కాని నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరనుకొంటారు. వాళ్ల ఉద్దేశంలో మాట్లాడవలసిందే. ఏమైనా సరే మాట్లాడవలసిందే. బ్రతికియున్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే. బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే. వాళ్లు మీ కన్న మాయాపిహితులు. నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు. ఆ చంపానన్నది నాకు తెలియదు. మీకూ తెలియదు. చంపానని సాక్ష్యం యిచ్చినవాళ్లకీ తెలియదు, నాకు తల్లీ పెళ్లాం బిడ్డలు ఉన్నారు. వాళ్లను పోషించలేక నేను చాలా బాధపడ్డా. వాళ్లకు తిండిలేదు, నాకూ తిండిలేదు. మీ దయవల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను. ఈ రెండు నెలలు వాళ్లేమైనారో నాకు తెలియదు. ఈపాటికి వాళ్లూ చచ్చే ఉంటారు. వాళ్లకన్న నేనే అదృష్టవంతుణ్ని. వాళ్లు చావకముందు మాడిమాడి చచ్చి ఉంటారు, నేను చచ్చేముందు ఏదో యింత అన్నం తినే చస్తున్నా. నేను ఉద్యోగం చేయలేదు. కూలీ నాలీ కుదురలేదు, మోసం చేయలేను. ఎక్కడో నాల్గురాళ్లు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అదివరకు నాల్గురోజులు ఇంటిల్లి పాదీ పస్తున్నాం. నేను నా భార్య ఎల్లాగో అల్లాగా తమాయించుకొన్నాం. పిల్లలు బక్కనరాలై కూర్చున్న చోటునించి లేవలేక యేడ్చేశక్తిగూడా లేక బ్రతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడటం యెలాగా? బియ్యం అమ్మే దుకాణం పెద్దపులల్లే ఇరవై గజాలతోక పెంచుకొని ఆ తోకచివ్వర నేను. నాలుగు రోజులు ఈ తోక చివరితనం పొందలేక పొందలేక విసిగి చివరికి యింటికి వచ్చాను. ఒక ముసలిది నామీద దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకు అమ్మింది. ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడ్దామంటే అవి గొడ్లు తినాలిగాని మనుష్యులు తినరు. నాలుగు పోట్లు వేసి చెరిగేతేనే గాని వండటానికి పనికిరావు. దంచాలి అంటే నాలుగురోజులు తిండిలేని మా యింటిదానికీ ఓపికలేదు, నాకూ లేదు. అయినా పిల్లల స్థితి చూడలేక మా యింటిది ఆ బియ్యం చిరిగిన చీర కొంగున కట్టుకొని పది కొంపలు తిరిగింది. ఒకళ్లు విసిరికొట్టారు, మరి ఒకళ్లు - వాళ్ల యింట్లో నోమట. అట్లకోసం పిండి దంచుకొంటున్నారు. అన్ని యిళ్లూ ఇట్లాగే అయినవి. చివరికా బియ్యమే పొయ్యి రాళ్లమీద పెట్టింది మా యింటిది, పొయ్యి క్రింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచెపుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరితెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మా మొగుడి సొమ్మనుకొన్నావు’’ అనివచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. ఇంటికి వచ్చాను, ఇల్లంటే నవ్వు వస్తోంది. ఎవరిదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో యెవళ్లూ కాపురానికి లేరు. ఆ గోడక్రింద ఉంటున్నాం, అదేయిల్లు, పైన పుల్లాపుడకా పెట్టి తలలు మాత్రం దానిక్రింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా యింటికి ఆధారం చేసింది. నేను వెళ్లేటప్పటికి ఆ ఆధారం తీసి దానితో మంట వేస్తోంది. ఈ ఆధారం ఎక్కువా? పిల్లల కడుపు మంట యెక్కువా? మరునాడు మా పిల్లల స్థితి చూడ కడుపులో నొప్పితో మెలి తిరిగిపోయినారు. నాలుగు వాము పరకలు తెద్దామంటే చేతిలో ఉన్న నాలుగణాలు నిన్నటి ముసలమ్మే కాజేసింది. మళ్లీ తర్వాత నాలుగురోజుల వరకు బియ్యం లేవు, పిల్లల కడుపునొప్పులూ తగ్గలేదు. మా యింటిది లేవనే లేకపోయింది. నేనట్టాగే తిరుగుతున్నాను. ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు. నేను వాళ్లెక్కడికి వెళుతున్నారని అడిగాను. అందరికీ బియ్యం ఇస్తారట అని చెప్పారు. నేను వాళ్ల వెంట వెళ్లాను, వాళ్లు వందా రెండువందలమంది ఉన్నారు. జనం ఒకచోటికి వెళ్లారు. జనం కేకలూ బొబ్బలూ నానా హంగామా ఉంది. ఒక యింటి దగ్గర ఆగారు. ముందర యేమి జరుగుతోందో నాకు తెలియదు. నేను వెనక ఉన్నాను. బియ్యం కోసం త్రొక్కిళ్లాడుతున్నారనుకొన్నాను. చుట్టుప్రక్కల యిళ్లవాళ్లందరూ కొందరు, తలుపులు వేసికొన్న వాళ్లు కొందరు తొంగిచూచేవాళ్లుగా కన్పించారు. కొంతసేపటికి రక్షకభటులు వచ్చారు. నేననుకొన్నాగదా ‘అమ్మయ్యా వీళ్లువచ్చారుగదా అందరికీ సరిగ్గా పంచిపెట్టిస్తారు’ అని. క్రమక్రమంగా నాకు తెలిసింది ఈ గుంపుకీ ఆ రక్షకభటులకీ దెబ్బలాట జరుగుతోందని. ఇంతలో రక్షకభటులు తుపాకులు కాల్చారు. ఈ గుంపులోంచి రక్షకభటుల మీద రాళ్లు విసురుతున్నారు. వ్యవహారం యెప్పుడైతే ముదిరిందో నాకెందుకురా బాబూ ఇది పోదామనుకొన్నాను. కాని పోవటమెట్లా? ఆట వరకు నెల్లాళ్లబట్టి తిండి లేదు. వారానికొకసారి యేదో తినీతిననట్టు తిన్నా నా ఒంట్లో ఓపిక లేదు. మనిషిని మరీ అబ్బనా కొరివి రాదు గనుక మనుష్యాకృతిలో లోపం లేదు. రక్షకభటులలో కొందరికి దెబ్బలు తగిలినవి. ఒకడు రాయి కణతకు తగిలి చచ్చాడు, ఆ రాయి ఆ చుట్టుప్రక్కలవాడెవడు విసిరాడో నాకు తెలియదు. పైగా చంపడంలో యిన్ని భేదాలేమిటి? రాయి తగిలితే చచ్చి, తుపాకీ గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకీ గుండు తగిలిస్తే శిక్ష లేదూ! రాయి తగిలి చస్తే శిక్ష? ఆ కళ్లులేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు. రాయి విసరటం మాట అట్లా ఉంచండి. నేను చేయి యెత్తగలిగితే చాలు! ఆ స్థితిలో ఉన్నాను. రక్షకభటులు తరిమారు. అందరూ పారిపోతున్నారు. నేనూ పారిపోతున్నాను. పరిగెత్తేందుకు నాకు ఓపిక యేది? వెనక నుంచి నా నెత్తిమీద పెద్ద దెబ్బపడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు. ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. గాఢాంధకారంలో కూర్చొని ఉన్నా, మరునాటి ప్రొద్దుటికి తెలిసింది నాకు అది ఖైదని. ఒకటి రెండు పూటలైన తర్వాత నాకన్నం పెట్టారు. అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చినవి. వెంటనే పిల్లలు జ్ఞాపకం వచ్చారు. వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టాను. మరునాటికి తెలిసింది యింక వాళ్లు నా దగ్గరకు రారని. వాళ్లేమైనారో! ఏమైనారో యెవడికి కావాలి? పూటపూటా అన్నం తినటం నాకూ అలవాటైంది. నా పని రాజభోగంగా ఉంది. రెండు పూటలా తిండి. ఎక్కడికైనా తీసుకొనివెళితే మోటారు కారులో తీసుకొనివెళ్లారు. పెద్దకోర్టుల్లో కూడ నా కోసం ఒక ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశయెత్తుకొంది. ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా ఆ వెనుక కూడా సాగిస్తే యెంతబాగుండేది. ఇంతకన్న యేమిచెప్పను? నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్లు బ్రతకండి. బ్రతుకంతా తిండిలేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండిపెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. కాని నా యింటిదీ, పిల్లలు ఏమైనారో తెలియలేదు, నాకు ఒక్కటే చింతగా ఉంది - నా పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయితే, ఎలాగోలాగా పెద్దవాళ్లు అయితే చివరిరోజుల్లో వాళ్లకుగూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని. అదంతా మీ దయ, వాళ్లని వెదికించి యీ ఉపకారం చేయిస్తే మీ కడుపున పుడ్తాను. చివరికా బియ్యమే రాళ్ల పొయ్యి మీద పెట్టింది మా యింటిది, పొయ్యి కింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచె పుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరి తెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మ మొగుడి సొమ్మనుకొన్నావు’’ అని వచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ -
2012 ఇంజనీర్ హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష
-
ఇంజనీర్ హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష
గుంటూరు:ఓ హత్య కేసుకు సంబంధించి ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2012 లో జరిగిన ఇంజనీర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున ముగ్గురికి ఉరిశిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ మంగళవారం అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు తీర్పు వెలువరించారు.ఆ దోషులు ముగ్గురు జిల్లాలోని దాచేపల్లికి చెందిన వారు. వీరు మరో 20కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఓ ఇంజనీర్ ను కిరాతకంగా హత్య చేసి ఘటనలో వీరు జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో తుది తీర్పును ప్రకటించిన కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.