కృష్ణమ్మకు హారతి
నాగాయలంక :
ప్రధాన పుష్కరఘాట్లో గురువారం రాత్రి సమరసతసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులతో దీవి మురళీఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావులు కృష్ణానదికి ప్రత్యేకపూజలు చేయించారు. కృష్ణమ్మకు చీర, పసుపు కుంకుమలతో సారె సమర్పించారు. నాగాయలంక, మర్రిపాలెం, బర్రంకుల టీ.కొత్తపాలెం, రేమాలవారిపాలెం, వక్కపట్లవారిపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. హారతుల్లో పాలుపంచుకోవడంతో కృష్ణాతీరం తీరం కిటకిటలాడింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీటీసీ సభ్యురాలు తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్బాషా, సీఐ ఎస్ఎస్వీ మూర్తి, బోయపాటి రాము ఫౌండేషన్ మండల శాఖ ధర్మప్రచారక్ పిరాటి శ్రీనివాసరావు, సంస్థ ఘాట్ కన్వీనర్లు ఎస్బీబీవీప్రసాద్, కేఎంఎస్ శేషుబాబు, రేమాల శ్రీనివాసరావు, ఆకురాతి బాబూరావు, శ్రీరామపాదక్షేత్రం కమిటీ, ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, పలు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.