hate crimes in usa
-
‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’
అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. -
సిక్కు బాలుడిపై దాడి : సుష్మా స్వరాజ్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల సిక్కు బాలుడిపై విద్వేషపూరిత దాడి జరిగింది. వాషింగ్టన్లో అతని సహ విద్యార్థి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. భారతీయ సంతతికి చెందడం వల్ల తమ కుమారుడిని టార్గెట్ చేశారని, ఇది కచ్చితంగా విద్వేషపూరిత దాడేనని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్నాప్‌చాట్‌లో పోస్టు అయిన ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సీరియస్ అయ్యారు. వెంటనే తనకు రిపోర్టు అందజేయాలని భారత రాయబార కార్యాలయాన్ని సుష్మాస్వరాజ్ ఆదేశించారు. ఈ ఘటనపై స్థానిక అథారిటీలు కూడా విచారణ జరుపుతున్నాయి. ఆ బాలుడి సంతతికి, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్కూల్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఇది క్లాస్రూమ్ గొడవేనని అంటున్నారు. అయితే దాడికి పాల్పడ్డ సహ విద్యార్థితో తమ కొడుకు అసలు మాట్లాడడని బాలుడి తండ్రి ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పారు. ''నా కొడుకుకు ఇలాంటి ఘటన జరుగడం నిజంగా నాకు చాలా బాధకరంగా ఉంది. అతనితో నా కొడుకు అసలు మాట్లాడడు. అతని పేరు కూడా తెలియదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే నేను సహించను'' అని బాలుడి తండ్రి అన్నారు. ఇటీవల నెలలో విద్వేషపూరిత దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. సిక్కు కమ్యూనిటీలపై ఈ దాడులు మరింత జరుగుతున్నాయి. సెప్టెంబర్ 11 దాడి అనంతరం సిక్కు కమ్యూనిటీని విపరీతంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. -
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
-
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
ఎన్నారై సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ ఘాటుగా స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని, శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పాటు దివంగత శ్రీనివాస్ భార్య సునయన ప్రెస్‌మీట్ పెట్టి ట్రంప్ ఏం సమాధానం చెబుతారని అడిగిన వార్తా కథనం క్లిప్పింగ్ కూడా జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది. కాన్సాస్ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మరణించిన కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ఏడు ముస్లిం దేశాలకు చెందిన వాళ్లు అమెరికా రావడానికి వీలుండదు. ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులకు కోర్టులు అడ్డుకట్ట వేశాయి. దాంతో దాన్ని సవరించి మరో కొత్త చట్టాన్ని తెస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఎయిరిండియా విమానంలో సునయనతోపాటు శ్రీనివాస్ సోదరుడు ఈ మృతదేహాన్ని తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో పాటు ఉన్న అతడి స్నేహితుడు మాడసాని అలోక్ రెడ్డి మీద కూడా 51 ఏళ్ల ఆడమ్ పురిన్టన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అలోక్ రెడ్డితోపాటు, పురిన్టన్ను ఆపేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. With threats & hate crimes on rise, we shouldn't have to tell @POTUS to do his part. He must step up & speak out.https://t.co/QKKyXyuqNM — Hillary Clinton (@HillaryClinton) 27 February 2017 అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’