healthcare schemes
-
'చిరంజీవి ఆరోగ్య బీమా' అద్భుతం: రాహుల్ గాంధీ
పేదల కోసం రాజస్థాన్ ప్రభుత్వ అమలు చేస్తున్న 'చిరంజీవి ఆరోగ్య బీమా పథకం’ అద్భుతమని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తామన్నారు. కేరళలోని తన లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొత్త బ్లాక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ఆరోగ్య భద్రతను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందించడాన్ని ప్రథమ ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వం భావించాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన హామీలలో ఒకటని రాహుల్ అన్నారు. దీనిపై రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం కృషి చేసిందని, 2024లో తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఈ రకమైన ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని దేశానికే ఆదర్శమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తాము మళ్లీ గెలిస్తే మెడికల్ కవరేజీని రూ. 50 లక్షలకు పెంచుతామని ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: దేశంలో వైద్య సదుపాయాల విస్తరణ కోసం తీసుకొచ్చిన ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’ లక్ష్యాలను సాధించాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య సదుపాయాల విస్తరణ కీలకమైనది. వైద్య సదుపాయాలు మెరుగుపడడం అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడుతుంది. ఈ పథకం లక్ష్యాల మేరకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలి. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న చోటు దీన్ని మరింతగా చురుగ్గా అమలు చేయాలి. పరిశ్రమ భాగస్వాములు, బ్యాంకులు, ఆర్థిక సేవల విభాగం కలసికట్టుగా దీన్ని సాధించాలి’’ అంటూ మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో భాగంగా మంత్రి కోరారు. ఐటీలో టెక్నాలజీ వినియోగంపై సూచనలు ఆదాయపన్ను శాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తృతం చేసే విషయమై ఆలోచనలు పంచుకోవాలని ఆ శాఖ యువ అధికారులను మంత్రి కోరారు. అధికారులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. యవ అధికారులకు సీనియర్ అధికారులు మార్గదర్శనం చేయాలని సూచించారు. -
‘ఆయుష్మాన్ భారత్’ ప్రీమియం ఎంతంటే..?
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్) కింద బీమా కోసం ఒక్కో కుటుంబానికి ప్రీమియం రూ.900 నుంచి రూ.1,000 వరకు ఉండొచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు 6:4 నిష్పత్తిలో భరిస్తాయి. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఉచితంగా అందజేస్తామని కేంద్రం ఇటీవల తన బడ్జెట్లో పేర్కొనడం తెలిసిందే. దీనిపై మంగళవారం నిర్వహించిన సమావేశానికి త్రిపుర మినహా (ఎన్నికలు జరుగుతుండటంతో) అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారని నీతి ఆయోగ్ అధికారి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టప్పుడు ప్రకటించారు. దీని కోసం రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని ‘మోదీ కేర్’గా సమాచార మాధ్యమాలు పేర్కొంటున్నాయి. -
జన్‌ధన్‌కు లింక్‌గా ఆరోగ్య పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎండీవై)కు పేదలకు సంబంధించిన ప్రజారోగ్య పథకాలను జోడించనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జన్ ధన్ యోజనకు ఇప్పటికే అనూహ్యంగా విజయవంతమైందని, దాదాపు పద్నాలుగు కోట్లమంది ఖాతాలు తెరిచారని, 14 వేల డిపాజిట్లు వాటిల్లో ఉన్నాయని చెప్పారు. వచ్చే దశలో పేదలకు ఆరోగ్య సంబంధమైన లబ్ధిని జన్ ధన్ ద్వారా అందించమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.