heavy charges
-
వినాయక మండపాలకు చార్జీలా.. హవ్వ!
సాక్షి, అమరావతి: హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం విభ్రాంతి కలిగిస్తోంది. వినాయక మండపాలను ఆదాయ వనరుగా చేసుకునేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. సీఎం చంద్రబాబు చెప్పారని సింగిల్ విండో విధానం పేరిట స్వయంగా హోం మంత్రి వంగలపూడి అనిత వినాయక మండపాలకు అనుమతుల కోసం భారీ చార్జీలను నిర్ణయించడం వివాదాస్పదమైంది. వినాయక మండపాల ఏర్పాటుకు భారీ ఫీజులు చెల్లించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వం విధానంపై హిందువులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో తోకముడిచిన చంద్రబాబు ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు యతి్నంచి అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... జగన్ సర్కారుపై నెపం నెట్టేందుకు కుట్ర వినాయక మండపాలకు అనుమతుల పేరిట భారీగా చార్జీలు వసూలు చేయడం పట్ల రాష్ట్రంలోని హిందువులు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దాంతో బెంబేలెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం తోకముడిచింది. సీఎం చంద్రబాబు హోం మంత్రి అనితను పిలిపించి మాట్లాడి ఈ అంశాన్ని పక్కదారి పట్టించమని ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఆమె వినాయక మండపాలకు అనుమతుల కోసం నిర్ణయించిన చార్జీల విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం ప్రకటించారు.అంతేకాదు.. వాస్తవాలను కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు మంత్రి అనిత యతి్నంచడం గమనార్హం. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచి్చన జీవో గురించే తనకు అధికారులు చెప్పారని.. ఆ జీవోలోని అంశాలనే తాను వెల్లడించానని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదనే విషయాన్ని గణేశ్ ఉత్సవాల నిర్వహణ కమిటీలు గుర్తు చేశాయి. మొదటిసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే వినాయక మండపాల్లో మైకులు, విగ్రహాలు ఏర్పాటుకు చార్జీలు చెల్లించామని కూడా స్పష్టం చేశాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైకి నెపం నెట్టేసేందుకు హోంమంత్రి అనిత ప్రయతి్నంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఏడు సంక్షేమ పథకాలైన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.మంత్రి అనిత వెల్లడించిన ఫీజులు ఇవీ మైక్ సెట్ కోసం రోజుకు రూ.100 చొప్పున, 3 అడుగులలోపు విగ్రహం పెడితే.. రూ.350, 6 అడుగులలోపు విగ్రహమైతే రూ.700 చొప్పున వసూలు చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం గణేశ్ నవరాత్రుల నిర్వహణకు రోజుకు రూ.100 చొప్పున 9 రోజులకు రూ.900 చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వం కేవలం మైక్ సెట్ అనుమతుల పేరిట కోట్లాది రూపాయలు బలవంతంగా వసూలు చేసేందుకు పన్నాగం పన్నింది.ఇక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వినాయక మండపాల్లో విగ్రహానికి రూ.350 నుంచి రూ.700 చొప్పున వసూలు చేస్తూ కూడా కోట్లాది రూపాయలు ఆదాయంగా రాబట్టేందుకు కుతంత్రం పన్నింది. ఏకంగా హోం మంత్రి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు మైక్ సెట్, విగ్రహం ఏర్పాటు కోసం రుసుములు చెల్లించారు. ఆ మేరకు చార్జీలు చెల్లించిన రశీదులు చూపించిన అనంతరమే వినాయక మండపాలకు స్థానిక అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీ చార్జీలు చెల్లించే శనివారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు. -
విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు. తన పెట్టుబడులను డాలర్ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది. 2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది. ఏమిటి మార్గం..? విదేశీ విద్య కోసం డాలర్ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు. తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. డాలర్ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దారి నేరుగా స్టాక్స్ ► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి. ► ఎన్ఎస్ఈ, ఐఎఫ్ఎస్సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు ► ఆర్బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ► కింగ్ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి. ► ఈ పెట్టుబడులు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూపాయి విలువ క్షీణత.. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్ ఫెడ్ వైఖరితో డాలర్ సరఫరా తగ్గుతుంది. అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ ధనుంజయ్ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ సైతం ఫారెక్స్ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు. ఫీజులపై రూపాయి ప్రభావం ‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్షిప్ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్ వరల్డ్ సీఈవో అనిర్బన్ సిర్కార్ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్షా చెప్పారు. 2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ట్యూషన్ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్ తదితర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. యూఎస్ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక ప్రయోజనాన్నిస్తుంది. ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్అండ్పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్అండ్పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది. -
చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం. చదవండి: చెరువులో విషప్రయోగం.. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
దారుణం: ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు లక్షా 20 వేలు
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కరోనాను ఆసరాగా చేసుకుని బాధితుల నుంచి భారీగా దండుకుంటున్నారు. మానవత్వం మరచి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కరోనా రోగిని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. 350 కిలో మీటర్ల దూరానికి రూ.లక్షా 20 వేలు వసూల్ చేశాడు. దానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు రా ఈ దోపిడీ..? మానవత్వం కొంచెమైనా ఉండాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని గురుగ్రామ్ నుంచి కరోనా బాధితుడిని ఎక్కించుకుని పంజాబ్‌లోని లూదియానా వరకు (350 కిలోమీటర్లు) వెళ్లాలి. అంబులెన్స్‌ను మాట్లాడగా డ్రైవర్ రూ.లక్షా 40 వేలు ఇవ్వమని కోరాడు. ఎంత బతిమిలాడిన తగ్గలేదు. చివరకు ఆక్సిజన్ మా వద్ద ఉంది.. అని చెప్పడంతో రూ.20 వేలు తగ్గించుకున్నాడు. గురుగ్రామ్ నుంచి లూదియానాకు సోమవారం కరోనా బాధితుడిని అంబులెన్స్ డ్రైవర్ చేర్చాడు. అందుకు ఆయన తీసుకున్న మొత్తం రూ.లక్ష 20 వేలు. దానికి సంబంధించిన బిల్లు కుటుంబసభ్యులకు ఇచ్చాడు. ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ఈ బిల్లును ట్వీట్ చేశారు. సిగ్గుండాలి అని పేర్కొఒంటూ ఆ బిల్లు ఫొటోను పంచుకున్నారు. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అధిక మొత్తం ఛార్జీ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వాలు అంబులెన్స్ సేవలకు కూడా నిర్ధిష్ట ధరలు ప్రకటించింది. కానీ అంతకుమించి వసూల్ చేస్తుండడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. చదవండి: కర్ఫ్యూ ఫెయిల్: మే 24వరకు సంపూర్ణ లాక్డౌన్ చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ Gurgaon to Ludhiana Ambulance fare 1.20 lakhs !! Have some shame guys ! Fear God 🙏🙏 pic.twitter.com/6bzadERbHp — Pankaj Nain IPS (@ipspankajnain) May 6, 2021 -
హెచ్1బీ మరింత కఠినం
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్ పార్టీ వర్క్ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్–1బీ వీసాదారు వర్క్ కాంట్రాక్ట్ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది. భారతీయ కంపెనీల తరఫున హెచ్–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్ పార్టీ వర్క్సైట్లు’ అంటారు. పని ఉన్నంత కాలానికే.. అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది. యజమాని–ఉద్యోగి బంధం కొనసాగించాలి ఈ పాలసీ ప్రకారం ‘థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఉద్యోగి పనిచేస్తున్నంతకాలం చట్టబద్ధమైన యజమాని–ఉద్యోగి సంబంధం కొనసాగేలా కంపెనీ చూసుకోవాలి. అలాగే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యమున్న వృత్తిలోనే పనిచేస్తాడని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగి చేయాల్సిన ప్రత్యేకమైన పని.. ఎంత కాలం పనిచేస్తాడు.. అందుకు సరిపడా నైపుణ్యం ఉందా? మొదలైన వివరాల్ని వీసా దరఖాస్తు సమయంలోనే కంపెనీలు వెల్లడించాలి. హెచ్–1బీ వీసాను గరిష్టంగా మూడేళ్ల వరకూ జారీచేయవచ్చని, అయితే ఆ నిర్ణయం తన విచక్షాణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని, అయితే దరఖాస్తు సమయంలో కంపెనీ పేర్కొన్న కాలానికే వీసా జారీ చేస్తామని యూఎస్సీఐఎస్ తెలిపింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీ.. యజమాని–ఉద్యోగి సంబంధాన్ని తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీసా పొడిగింపునకు తాజా నిబంధనలే హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేస్తే తాజా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘తాము సూచించిన నిబంధనల్ని పాటించకపోయినా.. నియమాలకు అనుగుణంగా వీసా పిటిషన్ లేకపోయినా తగిన చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కొన్నిసార్లు అమెరికన్ కంపెనీలు ఉద్యోగితో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేసుకుంటాయి. ఆ సమయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఎలాంటి పని ఉండదు. బెంచ్ పిరియడ్‌గా పేర్కొనే ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. అయితే అలా చేయడం చట్ట విరుద్ధమని, వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. భారతీయ కంపెనీలకు ఇబ్బందే.. తాజా నిబంధనల నేపథ్యంలో హెచ్–1బీ ఉద్యోగుల్ని అమెరికాకు పంపే కంపెనీలు వీసా దరఖాస్తులు సమర్పించేందుకు మరింత ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తు లేఖతో పాటు.. ఉద్యోగికి కేటాయించే పని వివరాలు, ఆ పని చేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం, విద్యార్హతలు, పని ఎంతకాలం ఉంటుంది, వేతనం, పనిగంటలు, ఇతర ప్రయోజనాల్ని జతపరచాలి. -
సమ్మె ఎఫెక్ట్: జనం జేబుకు చిల్లు
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక బంద్ విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆర్టీసీ సిటీబస్సులు నిలిచిపోయాయి. ఆటోలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. దాంతో సామాన్యులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సిటీబస్సులు లేకపోవంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ప్రతిరోజూ వందలాది బస్సులు నడిపే వేలాది ట్రిప్పులలో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కానీ సార్వత్రిక సమ్మె పేరుతో ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో.. ఇక సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దొరికిందే చాన్సని సెట్విన్ బస్సులలో కూడా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని, వాటిలో పుష్పకవిమానంలా ఎంతమంది వస్తే అంతమందిని ఎక్కిస్తూ ఇరికిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ఇక షేర్ ఆటోలు, మామూలు ఆటో చార్జీల గురించి చెప్పనక్కర్లేదు. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల మీదుగా వెళ్లే షేర్ ఆటోలలో ఒక్కోదాంట్లో దాదాపు 15 మంది వరకు ఎక్కిస్తున్నారు. డ్రైవర్‌కు అటూ ఇటూ ఐదుగురు కూర్చుంటున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆటోలు వెళ్తున్నాయి. రామంతపూర్ నుంచి కోఠి వరకు వెళ్లాలంటే సాధారణంగా షేర్ ఆటోలో 15 రూపాయలు తీసుకుంటారు. కానీ, శుక్రవారం మాత్రం ఇది అమాంతం 100 రూపాయలు అయిపోయింది!! దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు అవసరమైతే వాయిదా వేసుకునే అవకాశం ఉన్నా.. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవాళ్లు మాత్రం సమ్మె వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వ్యక్తిగత వాహనాలను వాడొద్దంటూ ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కానీ, ఇలాంటి సమయాల్లో మాత్రం ప్రత్యామ్నాయం కల్పించడం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని జంటనగరాల వాసులు మండిపడుతున్నారు.