heavy damage
-
వడగళ్లవానతో భారీ నష్టం
సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 14,553 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు. వరి 16,298 ఎకరాల్లో, మక్క 2,784.16 ఎకరాల్లో, జొన్న 705.2 ఎకరాల్లో, గోధుమ ఐదు ఎకరాల్లో, ఉల్లిగడ్డ 12 ఎకరాలు, బొప్పాయి పది ఎకరాలు, పొగాకు 20 ఎకరాలు, మామిడి 192 ఎకరాలు, కూరగాయలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నాయని పేర్కొ న్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహా్మజీవాడి గ్రామంలో గాలిదుమారానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరోనాలుగు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 6,058 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పది మండలాల్లోని 44 గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 3,076 మంది రైతులు నష్టపోయారన్నారు. అత్యధికంగా 5,661 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
తుపాను బాధితులకు అండగా ఉండాలి
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జిలా్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపులు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు. ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్రం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకే‹Ùకుమార్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్‌కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు. పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్‌లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి నష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థాయిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. -
శరవేగంగా ‘విద్యుత్’ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేని వర్షాలు, వేగంగా వీచిన ఈదురు గాలులకు వందలాది గ్రామాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల కొద్దీ విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్‌శాఖ యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను స్థానిక ఎనర్జీ అసిస్టెంట్లతో ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల పెనుప్రమాదాలు జరగకుండా అడ్డుకోగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల సేవలు ఇప్పుడు ఎంతో మేలు చేశాయి. భారీనష్టం జరిగిన చోట కూడా రికార్డు సమయంలో.. 4 నుంచి 18 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ, తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వినియోగదారుల నుంచి టోల్ ఫ్రీ నంబరు 1912కి, కంట్రోల్ రూమ్ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది త్వరితగతిన క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయటం ద్వారా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలుగుతున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో వందశాతం సర్విసులను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి బుధవారం చెప్పారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనూ వేగంగా పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు సీఎండీ ఐ.పృథీ్వతేజ్ తెలిపారు. -
TS: వానలు మిగిల్చిన విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్క ములుగు జిల్లాలోనే 30 మందికిపైగా వరదల్లో గల్లంతు అయినట్లు సమాచారం. అంతటా గల్లంతైన వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. జంపన్న వాగు ఉగ్రరూపంతో ఏడుగురు గల్లంతు అయ్యారు. వాగు పోటెత్తి కొండాయి, మల్యాల గ్రామాలను ముంచెత్తింది. ఏడుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులను మజీద్, షరీఫ్, అజ్జు, గుర్తు తెలియని ఓ మహిళ ఉన్నారు. ఇక.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచ వాగు ఉధృతితో నిన్న మొరంచపల్లి గ్రామం నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం కల్లా వాగు ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో మొరంచపల్లి గ్రామస్తులు ఉన్నారు. గల్లంతైన నలుగురు గ్రామస్తుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భూపాలపల్లి-పరకాల-హన్మకొండ జాతీయ రహదారి మరమతు పనులు చేపట్టారు అధికారులు. మొరంచపల్లి లో వరదలకు 100కు పైగా పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటుచేసుకుంది. మారేడుగొండ చెరువుకు గండిపడి ముగ్గురు సభ్యులున్న కుటుంబం కొట్టకుపోయింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యంకాగా.. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వరద కారణంగా ములుగు-ఏటూరు నాగారం బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాణ నష్టం లేకుండా చూడాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సైతం తాజాగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కురిసన వర్షాలు, వరదలతో.. భూపాలపల్లి, ములుగుతో పాటు ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్, అలాగే సిద్ధిపేట, నిజామాబాద్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయి.. గోడలు కూలి.. కరెంట్‌షాక్ మరణాలు సంభవించాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 14 మందే చనిపోయారని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని స్పష్టమవుతోంది. -
ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్?
ఓవైపు ఎక్స్‌గా పేరు మార్చేసి మరీ ట్విటర్‌ను #TwitterX అతలాకుతలం చేసేసిన ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్.. ఏకంగా ఎక్స్ వీడియోస్ అనే బూతు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేశాడు. ఈలోపు ఆయనగారికే చెందిన మరో X కంపెనీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్కి చెందిన ఫాల్కన్ రాకెట్ .. అయనోస్పియర్‌కు పెద్ద రంధ్రం చేసేసిందట. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పొరలను ‘‘ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో(ఐనో), ఎక్సో, మాగ్నెటోస్పియర్లుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అందులో అయానోస్పియర్‌కు జులై 19వ తేదీన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం ద్వారా భారీగానే డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. జులై 19వ తేదీన కాలిఫోర్నియా వండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో అయానోస్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని.. ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్గార్డెనర్ చెబుతున్నారు. ► రాకెట్ల ఇంధనం మండించినప్పుడు ఇది సాధారణంగా జరిగేదే అయినా.. అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ రాకెట్‌తో అయానోస్పియర్‌కు జరిగిన డ్యామేజ్ ఎక్కువేనని ఆయన అంటున్నారు. ► అయానోస్పియర్.. మొత్తం అయాన్లతో ఆవరించబడి ఉంటుంది. సోలార్ ప్లాస్మా అయాన్లతో చర్య జరిపి ఆకాశంలో కనిపించే అద్భుతమైన రంగులను సృష్టించడానికి కారణం ఇదే. అంతేకాదు.. భూ అయస్కాంత తుఫానులకు అయానోస్పియరే కారణమని అమెరికా పరిశోధన సంస్థ నాసా చెబుతోంది. ► వాతావరణ పొరల్లో అయానోస్పియర్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఇది కమ్యూనికేషన్, నేవిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబించడం, మార్పు చేయడం లాంటివి చేస్తుంది. ఒకవేళ అయానోస్పియర్‌కు డ్యామేజ్ జరిగితే.. అది GPS, నేవిగేషన్ సిస్టమ్‌లపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది. ► ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగం వల్ల ఇది సంభవించి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ప్రైవేట్ కంపెనీతో అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్న స్పేస్ఎక్స్ లాంటి కంపెనీలతో వాతావరణానికి పెను నష్టం తప్పదనే అభిప్రాయమూ చాలాకాలంగా వ్యక్తమవుతూ వస్తోంది. ► గమనించదగ్గ విషయం ఏంటంటే.. అయానోస్పియర్‌కు స్పేస్ఎక్స్ రాకెట్లు నష్టం చేయడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగష్టు 24వ తేదీ జరిగిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం, అలాగే.. 2022 జూన్ 19వ తేదీన జరిగిన ప్రయోగంలోనూ ఇదే తరహాలో అయానోస్పియర్‌కు నష్టం వాటిల్లింది. ► ఇదిగాక.. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ స్పేస్ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద భారీ రాకెట్ ప్రయోగం(టెస్టింగ్ దశలో).. పేలిపోగా, టెక్సాస్ బేస్ వద్ద నష్టం భారీ స్థాయిలో జరిగింది. దుమ్మూధూలి ఎగసిపడి మైళ్ల దూరం వరకు పర్యావరణానికి నష్టం వాటిల్ల జేయడంతో పాటు అక్కడి జీవజాలంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది. ఇదీ చదవండి: వాట్సాప్ స్టేటస్లతోనూ ప్రమాదమే! -
అస్తవ్యస్తంగా విశాఖ నగర వీధులు
-
వర్ష బీభత్సం
మునగపాక : హుదూద్ తుపానుతో మండలంలో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకవైపు భారీ ఈదురు గాలులు మరోవైపు వర్షాలు పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విపరీతమైన గాలులతో చెట్లు పలుచోట్ల పడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్త స్తంభించిపోయింది. ఇళ్లల్లోనుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. చాలా చోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. గాలలకు చెరకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరిపొలాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆయా ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. అరకు రూరల్ : హుదూద్ తుపాను బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి నుంచి వీచిన బలమైన గాలలుకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ నుంచి అరకు వరకూ ఉన్న రహదారి మొత్తం నేల కూలిన చెట్లతో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పద్మాపురం జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద, అరకు లోయ వరకూ రహదారంతా నేలకూలిన చెట్లతోనే నిండిపోయాయి. పుట్టగొల్లడ, అట్టగుడ, ఒసుబడల్లో గెడ్డలు పొంగిపొర్లాయి. దీని వల్ల సుంకరమెట్ట వారపు సంతకు వెళ్లిన వారివారి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది వారికి తెలిసిన వారి ఇళ్ల వద్దే ఉండిపోయారు. -
ఎడతెరిపిలేని వర్షాలతో భారీ నష్టం
రాయచూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లిందని, దీంతో సహాయ పనుల కోసం జిల్లా యంత్రాంగానికి తాత్కాలికంగా రూ.50 లక్షలు విడుదల చేశామని జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆయన శుక్రవారం తాలూకాలోని జే.మల్లాపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెగని వర్షాల వల్ల జిల్లాలో రూ.17 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు. ఎంత మేర నష్టం జరిగిందని అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందుతుందన్నారు. జిల్లా పంచాయతీకి సంబంధించి రూ.8.15 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 104 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంలో కూడా మరింతగా అధ్యయనం జరుగుతోందన్నారు. పూర్తి వివరాలు అందిన వెంటనే బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ చేపడుతామన్నారు. వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్లన్ని దెబ్బతిన్నాయని, త్వరలో మరమ్మతు పనులు చేపడతామన్నారు. రాజీవ్‌గాంధీ గృహ వసతి సంస్థ అధికారులతో చర్చించి కూలిన ఇళ్లకు పరిహారం అందించడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, జెడ్పీ ఉపాధ్యక్షుడు శరణప్ప, ఏసీ మంజుశ్రీ, కాంగ్రెస్ అధ్యక్షుడు వసంతకుమార్, కాంగ్రెస్ ప్రముఖులు శివమూర్తి, శాంతప్ప, అమరేగౌడ, తాయణ్ణ నాయక్ పాల్గొన్నారు.