ఓవైపు ఎక్స్‌గా పేరు మార్చేసి మరీ ట్విటర్‌ను #TwitterX అతలాకుతలం చేసేసిన ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్.. ఏకంగా ఎక్స్ వీడియోస్ అనే బూతు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేశాడు. ఈలోపు ఆయనగారికే చెందిన మరో X కంపెనీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది.
ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కి చెందిన ఫాల్కన్ రాకెట్ .. అయనోస్పియర్‌కు పెద్ద రంధ్రం చేసేసిందట. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పొరలను ‘‘ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో(ఐనో), ఎక్సో, మాగ్నెటోస్పియర్‌లుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అందులో అయానోస్పియర్‌కు జులై 19వ తేదీన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం ద్వారా భారీగానే డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది.
జులై 19వ తేదీన కాలిఫోర్నియా వండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో అయానోస్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని.. ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్‌గార్డెనర్ చెబుతున్నారు.
► రాకెట్ల ఇంధనం మండించినప్పుడు ఇది సాధారణంగా జరిగేదే అయినా.. అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ రాకెట్‌తో అయానోస్పియర్‌కు జరిగిన డ్యామేజ్ ఎక్కువేనని ఆయన అంటున్నారు.
► అయానోస్పియర్.. మొత్తం అయాన్‌లతో ఆవరించబడి ఉంటుంది. సోలార్ ప్లాస్మా అయాన్లతో చర్య జరిపి ఆకాశంలో కనిపించే అద్భుతమైన రంగులను సృష్టించడానికి కారణం ఇదే. అంతేకాదు.. భూ అయస్కాంత తుఫానులకు అయానోస్పియరే కారణమని అమెరికా పరిశోధన సంస్థ నాసా చెబుతోంది.
► వాతావరణ పొరల్లో అయానోస్పియర్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఇది కమ్యూనికేషన్, నేవిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబించడం, మార్పు చేయడం లాంటివి చేస్తుంది. ఒకవేళ అయానోస్పియర్‌కు డ్యామేజ్ జరిగితే.. అది GPS, నేవిగేషన్ సిస్టమ్‌లపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది.
► ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగం వల్ల ఇది సంభవించి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ప్రైవేట్ కంపెనీతో అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్న స్పేస్‌ఎక్స్ లాంటి కంపెనీలతో వాతావరణానికి పెను నష్టం తప్పదనే అభిప్రాయమూ చాలాకాలంగా వ్యక్తమవుతూ వస్తోంది.
► గమనించదగ్గ విషయం ఏంటంటే.. అయానోస్పియర్‌కు స్పేస్‌ఎక్స్ రాకెట్లు నష్టం చేయడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగష్టు 24వ తేదీ జరిగిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం, అలాగే.. 2022 జూన్ 19వ తేదీన జరిగిన ప్రయోగంలోనూ ఇదే తరహాలో అయానోస్పియర్‌కు నష్టం వాటిల్లింది.
► ఇదిగాక.. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ స్పేస్‌ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద భారీ రాకెట్ ప్రయోగం(టెస్టింగ్ దశలో).. పేలిపోగా, టెక్సాస్ బేస్ వద్ద నష్టం భారీ స్థాయిలో జరిగింది. దుమ్మూధూలి ఎగసిపడి మైళ్ల దూరం వరకు పర్యావరణానికి నష్టం వాటిల్ల జేయడంతో పాటు అక్కడి జీవజాలంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది.
ఇదీ చదవండి: వాట్సాప్ స్టేటస్‌లతోనూ ప్రమాదమే!
Comments
Please login to add a commentAdd a comment