Hero Group
-
కేంద్రంపై ‘హీరో’ పంకజ్ ముంజాల్ ఘాటు విమర్శలు
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ బైసికిల్ వ్యాపారానికి ముప్పు ఉందని హెచ్ఎంసీ గ్రూప్ సీఎండీ పంకజ్ ఎం ముంజాల్ అన్నారు. తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే ముఖ్యమైన పాలసీల నుంచి ఈ విభాగాన్ని విస్మరించడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2తోపాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల పథకంలో ఈ–బైసికిల్స్ చేర్చలేదు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో యూరోపియన్ యూనియన్‌కు రూ.10,000 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలను భారత్ కోల్పోయే ప్రమాదం ఉంది. చైనా నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు 83 శాతం వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని ఈయూ విధిస్తోంది. ఈ–బైక్స్ మార్కెట్ ఈయూలో రూ.43,000 కోట్లుంది. భారత్‌తో పోలిస్తే విలువ పరంగా 50 రెట్లు పెద్దది. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా భారత్ అవకాశంగా మలుచుకోవాలి. సైకిళ్లపై దిగుమతి సుంకాలను ప్రస్తుతం ఉన్న 14 శాతం నుంచి సున్నా స్థాయికి తీసుకు రావాలి’ అని అన్నారు. హీరో సైకిల్స్‌ను హెచ్ఎంసీ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు! -
హీరో యాజమాన్యంలో మార్పులు!
• హీరో మోటోకార్ప్ నుంచి తప్పుకుంటున్న సునిల్ ముంజాల్ • ఆగస్టు 16 నుంచీ గ్రూప్ ఇతర సంస్థల బాధ్యతలు • గ్రూప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్లాన్ మృతి నేపథ్యం న్యూఢిల్లీ : యాజమాన్య పంపిణీలో భాగంగా ఐదు బిలియన్ డాలర్ల హీరో గ్రూప్ ప్రధాన కంపెనీ హీరో మోటోకార్ప్ నుంచి సునిల్ ముంజల్ తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ వ్యవరిస్తున్నారు. ఆయన పెద్ద సోదరుడు పవన్ ముంజాల్ చీఫ్‌గా ఉన్నారు. ఇతర వ్యాపార అవకాశాలతోపాటు గ్రూప్‌లోని ఇతర కంపెనీపై ఆయన ఇకపై దృష్టి సారించనున్నారు. ఎంఎంల్ ముంజాల్ కుటుంబం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో హీరో గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్మోహన్ లాన్ ముంజాల్ మృతి నేపథ్యంలో తాజా యాజమాన్య మార్పులు చోటుచేసుకుంటుండడం గమనార్హం. సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా సునిల్ పదవీ బాధ్యతల కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. అటు తర్వాత ఆయన హీరో కార్పొరేట్ సర్వీస్, ఇతర అనుబంధ కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త వ్యాపార అవకాశాలపై సైతం ఆయన దృష్టి సారిస్తారు. తాజా పరిణామంలో భాగంగా హీరో గ్రూప్‌లో ప్రమోట ర్ వాటాలో ఎటువంటి మార్పూ వుండదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. సాన్నిహిత్యంపై ప్రభావం ఉండదు... కాగా ఇది వ్యాపార విభజన, విస్తరణ భాగమేనని, కుటుంబం సాన్నిహిత్యం, ఐక్యతపై ఈ ప్రభావం ఏదీ ఉండబోదని సునిల్ ముంజాల్ తెలిపారు. పవన్ ముంజాల్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ముంజాల్ సోదరులు నలుగురిలో సునిల్ చిన్నవారు. కాగా ఎన్ఎస్ఈలో హీరోమోటో కంపెనీ షేర్ ధర గురువారం క్రితం ముగింపు కన్నా స్వల్పంగా 0.39 శాతం (రూ.12.65) తగ్గి రూ. 3,192 వద్ద ముగిసింది. -
తెలంగాణకు పవనకాంతులు
♦ రూ.600 కోట్లతో రంగారెడ్డి జిల్లా పరిగిలో విండ్ పవర్ ప్రాజెక్టు ♦ ఈ నెలాఖరున అందుబాటులోకి.. రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ♦ వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన బహుళజాతి సంస్థలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి పవన విద్యుత్ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతోంది. పరిగి నియోజకవర్గంలో 100.5 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు కొన్ని రోజులుగా ‘నెడ్‌క్యాప్’ సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును మిత్రా ఎనర్జీస్ పూర్తి చేసింది. కాగా హీరో గ్రూపు సంస్థ ఇదే ప్రాంతంలో 31.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. నిజామాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదు గా మహబూబ్‌నగ ర్ వరకు గల క క్ష్యలో గాలి ఉధృతి అధికం గా ఉంటుంది. ఈ మేరకు ఈ పరిధిలో పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్న సర్కారు.. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. 120 మీటర్ల ఎత్తులో.. 120 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న ప్రతి టవర్ రోజుకు కనిష్టంగా 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. వీచేగాలి సాంద్రతపై విద్యుత్ ఉత్పత్తి ఆధారపడుతోంది. రుతుపవనాల రాక మొదలు.. వర్షాకాలం మొదలయ్యే వరకు విండ్ సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో పవనాల ఉధృతి (ఫ్రీక్వెన్సీ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 48 టవర్లను నిర్మించిన ఈ సంస్థ.. ప్రతి టవర్ సామర్థ్యాన్ని పరిశీలిస్తోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.6.5 కోట్లు వెచ్చించించింది. ప్రతి టవర్ ఉత్పత్తి చేసే కరెంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పిన పవర్ స్టేషన్‌కు పంపిణీ చేస్తాయి. అక్కడి నుంచి ఎస్పీడీసీఎల్ గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పరిగి మండలం కాళాపూర్, ఖుదావన్‌పూర్, సయ్యద్‌పల్లి, రాపోలు, తొండపల్లి, చిట్యాల్, మాదారం, పూడూరు మండలం సోమన్గుర్తి, కేరవెళ్లి.. మహబూబ్‌నగర్ జిల్లా పద్మారం గ్రామాల్లో ఇప్పటికే విండ్ పవర్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలు నెలకొల్పాయి. మరికొన్నింటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పవన విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలుగా 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను అక్కడ నిర్మిస్తున్నారు. రోజుకు 2.5 మిలియన్ యూనిట్లు పవన విద్యుత్ ఉత్పాదనలో కీలకంగా పనిచేసే గాలిమరలు 24 గంటలు పనిచేస్తే దాదాపు 2.5 మిలి యన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉం ది. పవన విద్యుత్ ప్రాజెక్టులో గాలి వేగాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కీలకమైన పీక్ అవర్స్ (విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం) వేళ ల్లో కరెంట్‌ను బాగా ఉత్పత్తి చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పవనాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహ, వాణిజ్య, పరిశ్రమలకు విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలవుతుంది. -
హీరో సైకిల్స్ చైర్మన్ కన్నుమూత
లూధియానా : హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఓపీ ముంజల్(87) పరమపదిం చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంజల్ గురువారం డీఎంసీ హీరో హార్ట్ సెంటర్లో చికిత్స పొందుతూ మరణించారు. ముంజల్ 1928లో కమాలియాలో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముంజల్ తన ముగ్గురు సోదరులతో కలిసి 1944లో అమృత్‌సర్‌లో సైకిల్ విడిభాగాల వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత వీరు 1956లో లూధియానా కేంద్రంగా ‘హీరో’ పేరుతో తొలి సైకిల్ తయారీ కంపెనీ స్థాపించారు. రోజుకు 25 సైకిళ్ల తయారీ సామర్థ్యంతో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం రోజుకు 19,500 సైకిళ్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. దేశంలోని సైకిల్ మార్కెట్లో 40 శాతం వాటా హీరో సైకిల్స్దే. హీరో సైకిల్స్ 1986లో ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించింది. ముంజల్ పర్యవేక్షణలో కంపెనీ క్రమంగా అభివృద్ధి చెందుతూ.. పలు ఇతర రంగాలకు విస్తరించింది. అనారోగ్య కారణాల వల్ల ముంజల్ ఇటీవలే హీరో మోటార్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ బాధ్యతల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఆయన అఖిల భారత సైకిల్ తయారీదారుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. రాక్‌మన్ సైకిల్ ఇండస్ట్రీస్, హైవే సైకిల్ ఇండస్ట్రీస్, సన్‌బీమ్ క్యాస్టింగ్, గుజరాత్ సైకిల్స్ లిమిటెడ్ వంటి కంపెనీల డైరె క్టర్‌గా వ్యవహరించారు. లూదియానాలోని భారతీయ విద్యా మందిర్ హైస్కూల్ ప్రెసిడెంట్, బీసీఎం పబ్లిక్ స్కూల్స్, బీఎడ్ కళాశాల ట్రస్టీగా వ్యవహరించారు. దయానంద్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. ఆయనను ఉద్యోగ్ పత్ర, పంజాబ్ రతన్, సాహీర్ వంటి అవార్డులు వరించాయి. ముంజల్ మృతికి పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
గతవారం బిజినెస్
నియామకాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) చీఫ్ జనరల్ మేనేజర్‌గా డి.వి.సురేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1985లో ఎస్బీహెచ్లో ఆఫీసర్ హోదాలో వృత్తిని ప్రారంభించిన సురేష్ కుమార్ ఎస్బీఐ చికాగో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియా నియమితులయ్యారు. ఇది వరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియా గత 16 ఏళ్లుగా కంపెనీలోనే పనిచేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించనుంది. వచ్చే నెల ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తామని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. తొలి ఏడాది రూ.5,000 కోట్ల వరకూ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలోకి హీరో గ్రూప్ పారిశ్రామిక దిగ్గజం హీరో గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. హీరో ఎలక్ట్రానిక్స్ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సుమారు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ సుమన్ కాంత్ ముంజల్ వెల్లడించారు. రిలయన్స్ జియోకి ఎంఎస్ఓ అనుమతి డిజిటల్ కేబుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియోకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ అనుమతితో రిలయన్స్ జియో ఇక నుంచి ఐఎంసీఎల్, సిటీ కేబుల్ నెట్వర్క్, డెన్ నెట్వర్క్ వంటి వాటికి పోటీ ఇవ్వనుం ది. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కేబుల్ రూపంలో టెలికం, హైస్పీడ్ డాటా, డిజిటల్ కామర్స్, మీడియా, పేమెంట్ సర్వీసులను అందించే జియో బ్రాండ్‌ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది. టెక్ మహీంద్రాకు రూ.500 కోట్ల ప్రాజెక్ట్ వైద్య సేవల రంగానికి సంబంధించి ‘ఎన్త్డెమైన్షన్’ పేరిట ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌కు చెందిన సర్కిల్ హెల్త్ సంస్థకి టెక్నాలజీ సర్వీసులు అందించేందుకు ఈ కొత్త కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల డీల్‌ను దక్కించుకుంది. అదనంగా పేషెంట్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఎంఆర్ఐ అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి, డాక్టర్లు మొబైల్ పరికరాల్లోనే స్కానింగ్ రిపోర్టులు చూడటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా టెక్ మహీంద్రా అందించనుంది. భారత సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10% గతేడాది రెండో అర్ధ భాగంలో భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతంగా నమోదైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి టాప్ ఐటీ కంపెనీలు స్థిరంగా రెండంకెల వృద్ధిని నమోదు చేయడమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో తెలిపింది. భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో ప్రాథమికంగా ఉన్న అప్లికేషన్ డెవలప్మెంట్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్స్, సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్(ఎస్ఐఎస్) అనే మూడు విభాగాలు దాదాపుగా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఆర్బీఐ అనుమతి అవసరం లేదు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే నిధులు సమీకరించవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సడలించింది. భారత ప్రభుత్వం ఒక వాటాదారుగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు/మల్టీలేటరల్ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవచ్చని, దీనికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఆర్బీఐ పేర్కొంది. చిన్న సంస్థలకు ఈపీఎఫ్ఓ ఊరట ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్ఓ కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుంది. ఉల్లి కనీస ఎగుమతి ధర పెంపు దేశీయంగా ధరలను కట్టడి చేసేందుకు, తగినంత సరఫరా ఉండేలా చూసేం దుకు ఉల్లి కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) కేంద్రం ఏకంగా టన్నుకు 175 డాలర్ల మేర పెంచింది. దీంతో ఇది 425 డాలర్లకు చేరింది. ఇంతకన్నా తక్కువ ధరకు ఉల్లిని ఎగుమతి చేయకూడదు. కోల్ పీఎఫ్ నిధుల నిర్వహణకు 2 సంస్థలు బొగ్గుగని కార్మికుల ప్రావిడెండ్ ఫండ్ నిధులను నిర్వహించడానికి రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఆర్క్యామ్), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ సంస్థలు ఎంపికయ్యాయి. ఈ రెండు సంస్థలు కోల్‌మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్‌ఓ)కు చెందిన రూ.60,000 కోట్ల పీఎఫ్ నిధుల నిర్వహణ బాధ్యతను చూసుకోనున్నాయి. కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పెంపు 2005కు ముందున్న కరెన్సీ నోట్ల మార్పిడి గడువును భారతీయ రిజర్వు బ్యాంక్ మరింత పొడిగించింది. సాధారణంగా ఈ గడువు జూన్ 30 నాటితో ముగుస్తుంది. కానీ ఆర్బీఐ ఆ గడువును డిసెంబర్ చివరిదాకా పొడిగించింది. ప్రజలు బ్యాంక్ శాఖల్లో వెంటనే మార్పు చేసుకోవచ్చు. 6 రోజుల్లోనే లిస్టింగ్ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు కీలక సం స్కరణలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఐపీఓ ప్రక్రియను ఇప్పుడున్న 12 రోజుల నుంచి 6 రోజులకు కుదించింది. ఇన్వెస్టర్ల నిధు లు ఎక్కువ రోజుల పాటు లాక్ కాకుండా.. అదేవిధం గా కంపెనీల లిస్టింగ్‌ను వేగవంతం చేయడం కోసం సెబీ ఈ మార్పులు చేసింది. అంటే ఇకపై ఐపీఓ ముగింపు తేదీ నుంచి ఆరు రోజుల్లోగా కంపెనీ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. తాజా మార్పులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐక్సిగోలో మైక్రోమ్యాక్స్ పెట్టుబడులు మొబైల్ ఫోన్లు తయారు చేసే మైక్రోమ్యాక్స్ సంస్థ ఐక్సిగో(మొబైల్ ట్రావెల్ సెర్చ్ అండ్ మార్కెట్ ప్లేస్)లో పెట్టుబడులు పెట్టింది. ఏడాదిలో 20 స్టార్టప్‌ల్లో 2 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలో భాగంగా ఐక్సిగోలో పెట్టుబడులు పెట్టినట్లు మైక్రోమ్యాక్స్ తెలిపింది. డీల్స్.. దేశీయంగా భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్, జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ కంపెనీ సౌర విద్యుత్ రంగంలో దాదాపు 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. బ్లూ డార్ట్ ఏవియేషన్‌లో 21 శాతం వాటా కొనుగోలు చేశామని బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీంతో తమ మొత్తం వాటా 49 శాతం నుంచి 70 శాతానికి పెరిగిందని పేర్కొంది. దీంతో బ్లూ డార్ట్ ఏవియేషన్ తమ అనుబంధ సంస్థగా మారిందని వెల్లడించింది. అమెరికాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సంస్థ మార్కెట్ మోటివ్ను భారత్‌కు చెందిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ సింపుల్ లెర్న్ కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే మార్కెట్ మోటివ్ను కోటి డాలర్లకు కొనుగోలు చేసినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సింపుల్ లెర్న్ తెలిపింది. -
పవన విద్యుత్‌లోకి హీరో గ్రూప్
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం హీరో గ్రూప్ ప్రకటించింది. ఇందుకు హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ పేరుతో కొత్త కంపెనీను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ప్రణాళికలకు అనుగుణంగా 2016-17కల్లా రూ. 7,000 కోట్లను ఇన్వెస్ట్‌చేయనున్నట్లు కంపెనీ ఎండీ రాహుల్ ముంజాల్ చెప్పారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధన ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ఒక గిగావాట్ లేదా 1,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. కాగా, ఒక్కో మెగా వాట్ పవన విద్యుత్ ఉత్పత్తికి రూ.7 కోట్లు, సౌర విద్యుత్‌కు రూ. 8 కోట్లు చొప్పున పెట్టుబడులు అవసరమని కొత్త యూనిట్ ప్రారంభం సందర్భంగా రాహుల్ వివరించారు. ద్విచక్ర వాహన దిగ్గజం హీరో గ్రూప్‌నకు పూర్తి అనుబంధ కంపెనీగా వ్యవహరిస్తున్న ఫ్యూచర్స్ ఎనర్జీస్ రాజస్థాన్‌లో 37.5 మెగావాట్ల పవన విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.