తెలంగాణకు పవనకాంతులు | Wind Lights to the Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు పవనకాంతులు

Published Wed, Apr 20 2016 4:11 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

తెలంగాణకు పవనకాంతులు - Sakshi

తెలంగాణకు పవనకాంతులు

♦ రూ.600 కోట్లతో రంగారెడ్డి జిల్లా పరిగిలో విండ్ పవర్ ప్రాజెక్టు
♦ ఈ నెలాఖరున అందుబాటులోకి.. రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన
♦ వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన బహుళజాతి సంస్థలు
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి పవన విద్యుత్ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతోంది. పరిగి నియోజకవర్గంలో 100.5 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు కొన్ని రోజులుగా ‘నెడ్‌క్యాప్’ సంస్థ  ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును మిత్రా ఎనర్జీస్ పూర్తి చేసింది.

కాగా హీరో గ్రూపు సంస్థ ఇదే ప్రాంతంలో 31.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. నిజామాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదు గా మహబూబ్‌నగ ర్ వరకు గల క క్ష్యలో గాలి ఉధృతి అధికం గా ఉంటుంది. ఈ మేరకు ఈ పరిధిలో పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్న సర్కారు.. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది.

 120 మీటర్ల ఎత్తులో..
 120 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న ప్రతి టవర్ రోజుకు కనిష్టంగా 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. వీచేగాలి సాంద్రతపై విద్యుత్ ఉత్పత్తి ఆధారపడుతోంది. రుతుపవనాల రాక మొదలు.. వర్షాకాలం మొదలయ్యే వరకు విండ్ సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో పవనాల ఉధృతి (ఫ్రీక్వెన్సీ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 48 టవర్లను నిర్మించిన ఈ సంస్థ.. ప్రతి టవర్ సామర్థ్యాన్ని పరిశీలిస్తోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.6.5 కోట్లు వెచ్చించించింది.

ప్రతి టవర్ ఉత్పత్తి చేసే కరెంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పిన పవర్ స్టేషన్‌కు పంపిణీ చేస్తాయి. అక్కడి నుంచి ఎస్‌పీడీసీఎల్ గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పరిగి మండలం కాళాపూర్, ఖుదావన్‌పూర్, సయ్యద్‌పల్లి, రాపోలు, తొండపల్లి, చిట్యాల్, మాదారం, పూడూరు మండలం సోమన్‌గుర్తి, కేరవెళ్లి.. మహబూబ్‌నగర్ జిల్లా పద్మారం గ్రామాల్లో ఇప్పటికే విండ్ పవర్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలు నెలకొల్పాయి. మరికొన్నింటి  ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పవన విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలుగా 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను అక్కడ నిర్మిస్తున్నారు.
 
 రోజుకు 2.5 మిలియన్ యూనిట్లు

 పవన విద్యుత్ ఉత్పాదనలో కీలకంగా పనిచేసే గాలిమరలు 24 గంటలు పనిచేస్తే దాదాపు 2.5 మిలి యన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉం ది. పవన విద్యుత్ ప్రాజెక్టులో గాలి వేగాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కీలకమైన పీక్ అవర్స్ (విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం) వేళ ల్లో కరెంట్‌ను బాగా ఉత్పత్తి చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పవనాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహ, వాణిజ్య, పరిశ్రమలకు విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement