high fever
-
తన్విత.. లేమ్మా!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మూడేళ్ల చిన్నారి తన్వితకు మూడురోజులుగా తీవ్ర జ్వరం. కళ్లు తెరవలేని పరిస్థితి. వైద్యం చేయిద్దామన్నా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి తల్లిదండ్రులది. జ్వరంతోనే ఈ చిన్నారి మృత్యువాతపడింది. న్యూ రాజరాజేశ్వరి పేటలోని జీప్లస్ త్రీ అపార్ట్మెంట్ 20వ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్న రొట్టా కృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు. తని్వత(3) పెద్దపాప. కృష్ణ పెయింటింగ్ పనులు చేస్తూ, సునీత ఇంటి వద్ద కుట్టుమిషన్ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద కృష్ణ ఇంటిలోకి చేరడంతో సమీపంలో బంధువుల ఇంటిలో తలదాచుకున్నారు. వారం రోజులుగా రాజరాజేశ్వరిపేటను వరద ముంచేసింది. బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వీలులేదు. ఈ క్రమంలో తని్వతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లలేని నిస్సహాయస్థితి. ఇంట్లోనే అందుబాటులో ఉన్న మాత్రలు వేశారు. సోమ వారం కొంత వరద తగ్గడంతో తన్వితను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యంలోనే పాప చనిపోయిందని నిర్ధారించారు. మాయ దారి వరద తమ బిడ్డను మింగేసిందంటూ తన్విత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘తన్వీ.. లేనాన్న.. నన్ను చూడు.. నీకేం కాదు. నేనున్నాను..’ అంటూ చిన్నారి మృతదేహంపైపడి తల్లి సునీత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. -
హై ఫీవర్, దగ్గు, ఆయాసం.. 5 రోజుల్లో తగ్గకుంటే జర జాగ్రత్త!
►కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే ఔట్పేషెంట్లు, ఇతర విభాగాలకు వచ్చేవారు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేసుకుంటున్న వారూ పెద్దసంఖ్యలో ఉంటున్నారు. పలువురు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు కనిపించగానే ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడున్న ఈ భిన్నమైన వాతావరణంలో ఆయావర్గాల ప్రజల్లో కోవిడ్ టెస్ట్, ఐసోలేషన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చింది ఒమిక్రానా, డెల్టానా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన కిమ్స్ ఆసుపత్రి పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణప్రసాద్ ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇవీ ముఖ్యాంశాలు... – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి.. 90 శాతం ఒమిక్రాన్‌తోపాటు 10 శాతం డెల్టా కేసులు కూడా వస్తున్నాయి. డెల్టా తీవ్రత పట్ల జాగ్రత్త పడాలి. ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చేవారిలో ఎక్కువమందిలో ఒకే రకమైన స్వల్ప లక్షణాలుంటున్నాయి. త్రీ జీన్ డ్రాపౌట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అధికంగా ఒమిక్రాన్ కేసులే బయటపడుతున్నాయి. ఒకవేళ టెస్ట్‌ల్లో ఎస్ జీన్ పాజిటివ్ వస్తే అవి డెల్టా లేదా ఒమిక్రాన్, మరో వేరియెంట్ బీ ఏ 2 కావొచ్చు. అందువల్ల అయోమయంతో కొందరు వైద్యులు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్టెయిల్ థెరపీ ఇస్తున్నారు. ఇది అవసరం లేదు. ఐదురోజుల వరకు వేచి చూసి, లక్షణాలు తగ్గకుంటే, అప్పుడు కాక్టెయిల్ ఇవ్వొచ్చు. ఒక్క డోస్ టీకా కూడా తీసుకోనివారు లేదా ఒక్కడోసే తీసుకున్నవారు, పెద్దవయసు వారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గి, ‘లంగ్ షాడో’స్తో డెల్టా కేసులొస్తున్నాయి. అందువల్ల డెల్టా అనేది పూర్తిగా లేదని చెప్పలేం. మరి, చికిత్స.. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలున్న కేసుల్లో మామూలు చికిత్స అందిస్తే సరిపోతుంది. మోల్నుపిరవిల్ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీ బాడీ మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండురోజులు జ్వరం వచ్చి తగ్గినా, 2, 3 రోజులు జలుబు ఉండి తగ్గినా, 4, 5 రోజులకు గొంతులో గరగర తగ్గిపోయినా వీరంతా ఐదురోజులు ముగిసేనాటికి దాదాపు సాధారణస్థాయికి చేరుకుంటున్నారు. రక్తం పలుచన చేసే మందులు వాడాల్సిన అవసరం అంతగా పడటంలేదు. ఎక్కువ శాతం మంది 3 నుంచి 5 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటున్నారు. కొంచెం నీరసంగా ఉన్నా ఏడో రోజుకల్లా విధుల్లో చేరుతున్నవారే ఎక్కువ. ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే.. ఐదురోజుల తర్వాత కూడా హైగ్రేడ్ టెంపరేచర్‌తో జ్వరం, కొత్తగా దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరడం, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయంటే అలాంటివి డెల్టా వేరియంట్ కేసులయ్యే అవకాశాలు ఎక్కువ. ఐదురోజుల తర్వాత కూడా తీవ్రత తగ్గని వారికి దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కొనసాగే వారు యాంటీ డికంజెస్టెంట్లు, బ్రాంకోడైలేటరల్తో చికిత్స చేయించుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి పదార్థాలు తినకపోవడం, వేడిపదార్థాలే భుజించడం, వేడి పానీయాలు వంటివి తీసుకున్నవారిలో అత్యధికులు పదోరోజుకల్లా సాధారణస్థితికి వచ్చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసుల గుర్తింపు... గొంతులో నస, జ్వరం, జలుబు, తలనొప్పి, 3 నుంచి 5 రోజుల్లో తగ్గే ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోతే వాటిని ఒమిక్రాన్ కేసులుగా చెప్పవచ్చు. డెల్టా లక్షణాలు... ఇప్పటికీ డెల్టా కేసులు వస్తున్నాయి. రుచి, వాసన లేకపోవడం, విరేచనాలు, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలను డెల్టా లక్షణాలుగా భావించి జాగ్రత్తపడాలి. లేదంటే వ్యాధి ముదిరి న్యూమోనియాకు దారితీసి, నీరసం, జ్వరం వంటివి కొనసాగి ఆసుపత్రుల్లో, ఐసీయూల్లో చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీళ్లు అంటించేస్తున్నారు... ఒమిక్రాన్ లేదా డెల్టా బారిన పడినా ఆ లక్షణాలు బయటపడని, కనిపించని పేషెంట్లు సమాజంలో, కుటుంబంలోని ఇతరులకు అంటించేస్తున్నారు. ఒమిక్రాన్‌లో డబ్లింగ్ ఇంపాక్ట్ రెండురోజులే కావడంతో కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేని వారిని వారం సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెడితే సరిపోతుంది. ఆసుపత్రుల్లో టెస్ట్ చేశాక పాజిటివ్‌గా తేలిన కేసుల్లో అత్యధికుల ఇళ్లలోని వాళ్లకు అప్పటికే లక్షణాలున్నట్టు తేలింది. దీంతో వాళ్లు ఆస్పత్రులకు వస్తున్నట్టు నిర్ధారణైంది. -
ఆకలేస్తోంది.. లే అమ్మా
అశ్వారావుపేట రూరల్: తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఓ తల్లి నిద్రలోనే మృతిచెందింది. ఇది తెలి యని ఆమె ఏడేళ్ల కుమారుడు అమ్మ ఒడిలోనే రా త్రంతా నిద్రించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. సంతల్లో ప్లాస్టిక్ సామాన్లు, బుడగలు అమ్ముకునేందుకు వచ్చిన నిర్మల (45) తన ఏడేళ్ల కుమారుడు కృష్ణతో కలిసి స్థానికంగా పాకలో నివాసముంటోంది. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధ పడు తోంది. సోమవారం రాత్రి జ్వరం ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ విషయం తెలియని కొడుకు కృష్ణ రాత్రంతా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. తెల్లవారాక ఆకలి వేస్తోందంటూ తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ ఆమె లేవకపోవడంతో చుట్టుపక్కల వారికి చెప్పగా, వారు వచ్చి చూసేసరికే నిర్మల మృతి చెంది కనిపించింది. తన తల్లి జ్వరంతో నిద్రపోతోందని అమాయకంగా కృష్ణ చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న ఎస్సై చల్లా అరుణ నిర్మల మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు వరంగల్‌లో ఉన్నట్లు బాలుడి ద్వారా తెలియడంతో, వారు వచ్చాక మృతదేహాన్ని వారికి అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు. -
నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్ అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్ నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు. (చదవండి: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం) ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్నేహితుడు ఒకరు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం చెందాడు. కొంత విశ్రాంతి ఇస్తే ఈ 23 ఏళ్ల యువకుడు కొంత కోలుకునే అవకాశం ఉంది. చదవండి: ‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు -
రాహుల్‌కు తీవ్ర జ్వరం, టూర్ రద్దు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. మంగళవారం పుదుచ్చేరిలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం అర్ధరాత్రి దాటక రాహుల్ ట్వీట్ చేశాడు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించనట్టు వెల్లడించారు. 10, 11న పుదుచ్చేరితో పాటు తమిళనాడు, కేరళలో పర్యటన రద్దయ్యింది. ఎన్నికల ప్రచారానికి రాలేనందుకు ఆయన కాంగ్రెస్ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీని చంపుతామంటూ సోమవారం బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు తమిళంలో రాసిన లేఖలను పుదుచ్చేరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణస్వామి ఇంటికి పంపారు. ఆయన ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల విన్నపం మేరకు రాహుల్ గాంధీకి మరింత భద్రతను పెంచారు. రాజ్‌నాథ్ ఈ మేరకు ఇంటలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీలను ఆదేశించారు. -
హీరోయిన్‌కు జ్వరమొచ్చిందట!
వరుసపెట్టి ప్రయాణాలు చేస్తుంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అందులోనూ ఒకే రోజు 20 గంటల వ్యవధిలో నాలుగుసార్లు విమాన ప్రయాణాలు చేయడం అంటే చెప్పలేని ఇబ్బంది అయిపోతోందట పాపం హీరోయిన్లకు. ఇలా ప్రయాణం చేయడంతో తనకు విపరీతంగా త్రోట్ ఇన్ఫెక్షన్, చాలా హై ఫీవర్ వచ్చేశాయని బొద్దుగుమ్మ హన్సిక తెగ బాధపడిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వాతావరణంలో కూడా పని చేయాలంటే తనకు చాలా అయిష్టంగా ఉందంటూ సోమవారం పొద్దున్నే ట్వీట్ చేసింది. ముందుగా ఇచ్చిన డేట్ల ప్రకారం మనసు ఎలా ఉన్నా, శరీరం సహకరించినా.. సహకరించకపోయినా కూడా షూటింగులకు వెళ్లాల్సిందే కదా మరి! Throat infection n high fever !!grrr this wat happens wen one takes 4 flights in 20hours 🙈🙈hate being under the weather at work ..😓 — Hansika (@ihansika) September 21, 2015