hindupur assembly constituency
-
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
శ్రీసత్యసాయి, సాక్షి: చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా బటన్లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుతం మీ బిడ్డ ప్రభుత్వమే.మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ డాక్టర్, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. ప్రతీ నగరంలో హైటెక్ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా?..మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా. ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అనిరాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి. బ్రిటీష్ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేస్తున్నాం. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి. ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.ఇంకో అబద్ధం.. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్లైన్లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
ఉంటే సినిమా షూటింగులో.. అది లేదంటే హైదరాబాద్‌లో ఉంటారాయన. తనను నమ్మి గెలిపించిన ప్రజలు అప్పుడప్పుడూ ఆయనకు గుర్తొస్తుంటారు. అలా యాదికొచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి చుట్టపుచూపుగా వస్తుంటారు. స్థానికుల అవస్థలు పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోతుంటారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో నియోజకవర్గంలో వాలిపోయారు. వెంటే కుటుంబ సభ్యులను తెచ్చుకున్నారు. ప్రచారం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వారంతా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయకుండానే కాలక్షేపం చేసి.. నేడు మరోసారి గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మళ్లీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పదేళ్లుగా హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ పట్టుమని పదిరోజులు కూడా స్థానికంగా ఉన్న దాఖలాలు లేవు. ఓవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ‘గడప గడపకూ’ అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుంటే.. బాలయ్య మాత్రం నిత్యం షూటింగులతో బిజీగా ఉండేవారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో ‘పురం’పై వాలిపోయారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు బ్రాహ్మణి ఇలా మొత్తం హిందూపురం చేరారు.పీఏలదే పెత్తనంబాలకృష్ణ లేకపోవడంతో ఆయన పీఏలే పెత్తనం చెలాయించేవారు. అధికారం మాటున యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. తమ నాయకుడికే పట్టనప్పుడు తమకేం సంబంధం అన్నట్లు ప్రజలకు అంటీముట్టనట్లు వ్యవహరించేవారు. ఒక వైపు అప్పుడప్పుడు వచ్చి పోయే ఎమ్మెల్యే, మరో వైపు తమ వ్యాపకాల్లో మునిగితేలే ఆయన పీఏలు.. ఇలా ఎవరికి వారు బిజీబిజీగా ఉండే నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విసిగి పోయారు.బావ బాటలో బామ్మర్ది..తన సొంత బావ చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక్క పునాది రాయి కూడా బాలకృష్ణ వేయలేదు. కానీ, నేడు బావ కుటిల సూత్రాలు పాటించేందుకు సిద్ధమయ్యారు. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న బాలయ్య నేడు ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోరేటు నిర్ణయించి తమ వైపు తిప్పుకున్నారు.వ్యతిరేకతను గ్రహించి ప్రలోభాలు..గత పదేళ్లూ బాలకృష్ణ నిర్లక్ష్యపు తీరుతో విసిగిపోయిన స్థానికులు ఈ ఎన్నికల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకే సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన బాలకృష్ణ ప్రలోభాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఇప్పటికే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కొన్న ఆయన.. అంతటితో ఆగక ప్రజలకు చీరలు, డబ్బు పంచడం తదితర అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం.తామెందుకు ఎమ్మెల్యేలు కాకూడదు!బాలకృష్ణ వైఖరిపై అక్కడి ప్రజలే కాదు... టీడీపీ నాయకులు కూడా విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నందమూరి కుటుంబాన్ని ఆదరించింది చాలు.. వారిని ఇలాగే గెలిపిస్తూ వెళితే తమకు అవకాశం రాదు అన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ టీడీపీ నేతతో పాటు ఆ పార్టీకే చెందిన మరో ముఖ్యనాయకుడు కిందిస్థాయి కార్యకర్తల వద్ద ఈ విషయంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిని ఆదరిస్తున్నాం కదా అని అలుసైపోయాం, ఒక్కసారి ఓడిస్తే వాళ్లు వేరే నియోజకవర్గం చూసుకుంటారు అంటూ మాట్లాడుకున్నట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ నాయకుడు తెలిపాడు. -
బాలయ్య కోపం ఎవరి మీద?
ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్‌కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు. ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం. అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే.. హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది. దూరం దూరం.. పీఏల యవ్వారం! అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్‌ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్ను మరింత పల్చన చేశాయి. గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు అభిమానులు జర జాగ్రత్త! నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్‌ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు. బస్సుపై బాలయ్య గుస్సా అన్‌స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్‌స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్‌తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?.. -
Nandamuri Balakrishna: ఎన్నాళ్లీ మేకప్? మీకు ప్యాకపే.!
రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న బాలకృష్ణ.. మూడోసారి రాయలసీమలోని హిందూపూరం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాయలసీమ గొప్పతనాన్ని మరిచి.. అక్కడ అంతా రక్తపాతంతో నిండి ఉంటుందని రెండున్నర దశాబ్ధాల క్రితమే తప్పుడు సంకేతాలు ఇస్తూ 'సమరసింహా రెడ్డి'తో లాభ పడ్డాడు. అప్పటి నుంచి అదే కిక్‌ను కొనసాగిస్తూ.. తాజాగా 'వీర సింహా రెడ్డి'తో ‘అఖండ’మైన లాభాలను పొందాడు. రాజకీయంగా, సినిమాల పరంగా రాయలసీమతో ఎంతో లబ్ధి పొందిన బాలకృష్ణ ఉండేది మాత్రం హైదరాబాద్‌లో... సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తూ ఎన్నికల సమయం వచ్చేసరికి హిందూపూరంలో వాలిపోతాడు. చివరకు కరోనా సమయంలో కూడా హిందూపురం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన భాగ్యనగరంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు రాగానే హిందూపురం వచ్చి ప్రజలకు మేకప్ వేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ సారి మేమే బాలయ్యకు ప్యాకప్ చెప్పేస్తామని అంటున్నారు అక్కడి ప్రజలు. 30 ఏళ్లకు పైగా అక్కడ టీడీపీనే.. ప్రజలకు చేసింది శూన్యం 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి 16 వేల ఓట్లతో గెలుస్తే.. 2019 ఎన్నికల్లో మాత్రం 17వేల ఓట్లతో నెగ్గారు. మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న హిందూపురం నియోజక వర్గానికి ఇప్పటి వరకు టీడీపీ చేసిన అభివృద్ధి శూన్యం. దీనికి ప్రధాన కారణం బాలయ్య అనే చెప్పవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలను ఏడాదికి ఒక్కసారి అయినా పలకరించిన దాఖలాలు లేవు. ఇక ఎమ్మెల్యేగా బాలకృష్ణ పనితీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ఆయన సమయం అంతా సినిమా షూటింగ్స్‌కే కేటాయించడానికి సరిపోతుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే.. ఎప్పుడో తనకు బుద్ది పుడితే అడపాదడపా హిందూపురం వెళ్లి హల్చల్ చేసే వారు. ఆ సమయంలో మందీమార్బలాన్ని పెట్టుకుని బైకు తోలుతూ, ఎద్దులబండి తోలుతూ.. బాలకృష్ణ సర్కస్ ఫీట్లు చేసే వారు. కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో బాలకృష్ణ హిందూపురం వైపు వెళ్లడం అనేది జరిగింది లేదు. బాలయ్యకు వార్నింగ్ బెల్స్ 30 ఎళ్లుగా టీడీపీ వెంట నడిచిన హిందూపురం ప్రజలకు బాలకృష్ణ చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదు. అందుకే హిందూపురం పరిధిలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా అక్కడి ప్రజలు ఓడించారు. టీడీపీ గతంలో అధికారంలో లేని సమయంలో కూడా హిందూపురం మున్సిపాలిటీని ఆ పార్టీ నిలుపుకునేది. ఉనికిని గట్టిగా చాటుకునేది. అయితే బాలకృష్ణ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి నెగ్గినా కూడా మున్సిపల్, ఇతర స్థానిక ఎన్నికల్లో దారుణమైన ఓటమిని టీడీపీ చూసింది. దీనంతటికి కారణం బాలకృష్ణ అనే చెప్పవచ్చు. గెలిపించిన ప్రజల కోసం నిలబడకుండా.. నిత్యం సినిమా షూటింగ్స్‌లతో బాలయ్య బిజీగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గం బాధ్యతలను ఆయన పీఏలు చూసుకుంటూ వచ్చారు. డబ్బులు దోచుకోవడం..దోచుకున్నది పంచుకోవడం తప్ప ఆ పీఏలు చేసిందేమి లేదు. దీంతో అక్కడ ప్రజల్లో బాలయ్యపై తీవ్రమైన వ్యతిరేఖత రావడం మొదలైంది. అందుకే గత మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో హిందూపురం ప్రజలు టీడీపీని చావుదెబ్బ కొట్టారు. ఇదే రేంజ్లో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణకు ఇదేగతి పడుతుందని హిందూపురం ప్రజల నుంచి వార్నింగ్ బెల్ మోగింది. టీడీపీ ఎన్ని ఎత్తులు వేసిన ఈసారి బాలకృష్ణ గెలుపు కష్టమే అని చెప్పవచ్చు. సినిమాలకే బాలయ్య ఓటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య 2014లో ఎంపికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు..? నమ్మి గెలిపించిన ప్రజల కోసం అండగా నిలబడుతారు. కానీ బాలయ్య ఆ పని చేయలేదు. తన పంతాను మార్చుకోకుండా సినిమాలతోనే తన 10 ఏళ్ల ఎమ్మెల్యే కాలాన్ని పూర్తిచేశారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగుతూనే 12 సినిమాలు విడుదల చేసి 13వ చిత్రం కూడా షూటింగ్ పనులు కానిచ్చేశారు. సినిమాలతో పాటు ఓటీటీ షోలతో బాలకృష్ణ చాలా బిజీగా కాలం వెళ్లదీశారు. తను ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మరిచినట్టుగా ఉన్నారు. 2014-2024 వరకు ఎమ్మేల్యేగా పదేళ్ల కాలం పదవిలో ఉంటూనే 13 సినిమాలు తీసిన బాలకృష్ణ.. పదవి లేకుండా అంటే 2004-2014 వరకు 14 సినిమాలు విడుదల చేశారు. ఈ లెక్కలు చాలు హిందూపురం ప్రజలకు బాలకృష్ణ ఏ మాత్రం అందుబాటులో ఉంటున్నాడో చెప్పడానికి అని నెటిజన్లు లెక్కలతో సహా చెబుతున్నారు. అందుకే ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత హిందూపురంలో చాప చుట్టేసి.. అక్కడ ప్రజలను గాలికొదిలేసి సినిమాలకు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలతో అయినా న్యాయం చేశారా..? బాలకృష్ణకు ప్లాపులు పడితే చాలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్ పేరుతో సినిమా తీస్తాడు. అందులో సీమ గురించి తక్కువ చేస్తూ చూపించడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. రాయలసీమంటే రక్తపాతం.. అక్కడ అందరూ వికృతంగా కనిపిస్తారని తన సినిమాలో చూపించడం. రాక్షసుల్లాంటి వాళ్లందరూ ఆ ప్రాంతంలో ఉంటారని చెప్పడం. అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని చెప్పడం. వాళ్లందర్నీ నరికినరికి చంపేది బాలకృష్ణ ఒక్కడే అన్నట్లు చూపిస్తాడు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించేది రాయలసీమలోని హిందూపురం. గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎన్నికైన వ్యక్తి. బాలకృష్ణ వియ్యంకుడు పుట్టి పెరిగింది కూడా రాయలసీమలోనే.. ఇవన్నీ ఆయన కంటికి కనిపించకపోవడం బాధాకరం. తనకు రాయలసీమ సినిమా జీవితాన్ని ఇస్తే.. అదే ప్రాంతానికి చెందిన హిందూపురం రాజకీయ భిక్ష పెట్టింది. అలాంటి ప్రాంత ప్రజలనే చిన్నచూపు చూసే బాలకృష్ణకు ఈసారి ఎన్నికల్లో హిందూపురం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీ శాంత
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ జె. శాంత మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె 2009లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరిన అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జె.శాంత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలకు ఆయనపై అపారమైన నమ్మకం ఏర్పడిందని, అందుకే వైఎస్సార్సీపీలో చేరానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరానని, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. వాల్మికి సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నానని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, హిందూపురం ఎంపీగా పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించారన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా జరుగుతుండటం తాను గమనించానని చెప్పారు. 17 వేలకు పైగా జగనన్న కాలనీలు ప్రత్యేక ఊళ్లుగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. దేశంలో మరెక్కడా ఈ విధంగా జరగటంలేదన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తోందని, గాం«దీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో సాకారమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి ప్రజలను కదిలించినా జయహో జగనన్న అంటున్నారని చెప్పారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ నేతలు గుంతకల్లు రమేష్ రెడ్డి, పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
బాలకృష్ణ ఓవరాక్షన్.. పడిపడి నవ్విన టీడీపీ నేతలు
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆయన ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా బాలకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. అది కాస్తా ఓవర్ కావడంతో అందరిలో నవ్వులపాలయ్యారు. దీంతో, పక్కనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. బాలకృష్ణ చేసిన పని చూసి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. హిందూపురంలో గురువారం టీడీపీ-జనసేన సంయుక్త సమావేశం జరగింది. ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన వెంటనే బాలకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా షూటింగ్ అనుకున్నాడో ఏమో కానీ.. తాను పెట్టుకున్న కళ్ల జోడును ఒక్కసారిగా తీసేసి.. పైకి ఎగరేసి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అవి కాస్తా.. చేతికి దొరక్క అదుపు తప్పి కిందిపడిపోయాయి. దీంతో, బాలకృష్ణ నాలుక కర్చుకున్నాడు. ఇక, బాలకృష్ణ చేస్తున్న పనిని పక్కనే ఉన్న నేతలంతా గమనించారు. బాలకృష్ణ చేష్టలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నవ్వు ఆపుకోలేకపోయారు. అనంతరం, బాలకృష్ణ ముఖం అదోలా పెట్టుకుని ముందుకు సాగారు. -
‘మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే’
సాక్షి, శ్రీసత్యసాయి: వెనకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం హిందూపురంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో గత ప్రభుత్వంలో.. ఈ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు జరిగిన మంచిని అశేష జనవాహినికి వివరించారు. మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ‘‘బీసీలను ఓటు బ్యాంకులా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని పదవులు ఆయన ఇచ్చారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌దే. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరాలి. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు. జగన్ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు మేలు చేశాయి. జగన్ పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 30 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత జగన్‌దే. వైఎస్ జగన్ గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు జగన్ ప్రభుత్వం లో నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల జీవితాలను మార్చిన ఘనత సీఎం జగన్‌దే. హిందూపురంలో 40 ఏళ్లుగా టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బాలకృష్ణను రెండు సార్లు గెలిపిస్తే.. హిందూపురం నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ చెప్పటం అనైతికం. వచ్చే ఎన్నికల్లో హిందూపురం లో బాలకృష్ణ ను ఓడించాలి. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముస్లిం మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మైనారిటీలకు చంద్రబాబు ద్రోహం చేశారు. హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని పక్కనపెట్టి మరీ బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. రూ. 2.40 లక్షల కోట్ల రూపాయల ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచిన పార్టీ. టీడీపీ - జనసేన పెత్తందార్ల పార్టీలు. హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురుబ దీపిక మాట్లాడుతూ.. ‘‘హిందూపురం నియోజకవర్గం లో నందమూరి బాలకృష్ణ చుట్టం చూపుగా వస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో హిందూపురం లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేస్తాం. -
లోకేష్ పోటీ చేసేది అక్కడినుంచేనా.. ఆ నియోజకవర్గ సర్వేల్లో తేలిందేంటి?
ఆయన ఒక మాజీ సీఎం కుమారుడు. ఒకసారి దొడ్డిదారిలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే కొంచెం గ్యారెంటీ ఉండే సీట్ కోసం వెతుక్కుంటున్నారు. ఇందుకోసం సర్వేలు కూడా చేయించుకున్నారట. ఇంతకీ ఆయనెవరో, ఆయన కథేందో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారనే ప్రచారం టీడీపీలో జోరుగా నడుస్తోంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలతోనే పార్టీలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు.దీంతో మంగళగిరిలో గెలుస్తాననే నమ్మకం లేకనే వేరే నియోజకవర్గం వెతుక్కుంటున్నారనే ఊహాగానాలు టీడీపీలో ఊపందుకున్నాయి. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత మూడేళ్లపాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనాకు భయపడి లోకేష్.. చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గ నాయకులతో, కార్యకర్తలతో కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి లోకేష్ అప్పుడప్పుడు వచ్చినా నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టేవారు కాదు. దీంతో సొంతపార్టీ నేతల్లోనే లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. కీలకమైన పదవుల్లో బీసీలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా, బీసీలకు చేయలేని ఎన్నో పనులను సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. దీనికితోడు మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమైన బీసీ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వారంతా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి.. పార్టీ సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారితోపాటు క్షేత్రస్థాయి టీడీపీలో కూడా అనేక మంది వైఎస్సార్సీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఓటమి తప్పదని భావించిన లోకేష్ వేరే నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉన్నట్లు సమాచారం. తాను పోటీచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో లోకేష్ వివిధ రూపాల్లో సర్వేలు చేయించుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడ తూర్పు, పెనుమలూరు, విశాఖసిటీలోని సెగ్మెంట్లు, భీమిలీ, హిందూపురం నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరం అయితే హిందూపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన మామ బాలకృష్ణను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించి తాను హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం చెప్పుకునే లోకేష్ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయలేక మరో నియోజకవర్గం కోసం రాష్ట్రమంతా వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చించుకుంటున్నారు. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
టీడీపీ వారి చేపల చెరువు
నీళ్లు మనవిరా.. ఆ చెరువు మనదిరా.. పంచాయతేందిరో.. ఆ ప్రజలు ఏందిరో.. చెప్పినంత ఇచ్చుకో.. చెరువు కొనేసుకో.. ఇదీ హిందూపురం ప్రాంతంలో తెలుగుదేశం నాయకుల తీరు హిందూపురం నియోజకవర్గంలో కబ్జాకు ఏదీ అనర్హం కాదని తెలుగు తమ్ముళ్లు నిరూపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంలోనూ అడ్డగోలుగా దోచేశారు. ప్రభుత్వ ఆధీనంలోని ఓ చెరువును విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు బావమరిది, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండతోనే ఈ అక్రమాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, హిందూపురం : ‘రాజావారి చేపల చెరువు’ సినిమా గుర్తింది కదూ! అచ్చం అలాంటిదే. అదే కథను పోలిన విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు కొందరు హిందూపురం మండలం బేవినహళ్లి చెరువును అక్రమంగా విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి చెరువులో చేపపిల్లల పెంపకం చేపట్టాడు. ప్రస్తుతం ఆ చెరువులో రూ. 20 లక్షల విలువైన జలపుష్పాలు ఉన్నాయి. అసలేం జరిగింది..? పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులో చేప పిల్లల పెంపకం చేపట్టేందుకు ఆయా పంచాయతీలే అధికారికంగా వేలం నిర్వహిస్తూ ఉంటాయి. అలా వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. అయితే బేవినహళ్లి గ్రామంలోని చెరువును స్థానికులకు, పంచాయతీ అధికారులకు తెలియకుండానే తెలుగు తమ్ముళ్లు విక్రయించి, నిధులు స్వాహా చేశారు. ఈ అక్రమాల వెనుక అప్పటి టీడీపీ ఎంపీపీ సుభద్రమ్మ బంధువు విజయ్‌కుమార్, సాగునీటి సంఘాల అధ్యక్షుడు శ్రీరాములు, ఈ.నాగరాజు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చేతులు మారిన రూ.5 లక్షలు ఉమ్మడి హక్కుగా బేవినహళ్లి ప్రజలు సాధించుకున్న చెరువు నీటిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. తమ మాట కాదని చెరువు కట్టను పూడ్పిన గ్రామస్తులపై టీడీపీ నాయకులు క్షుద్ర రాజకీయాలకు తెరలేపారు. పూర్తిగా నిండిన చెరువును బెంగళూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గుట్టుగా అమ్మేశారు. రూ.1.50 లక్షలకు అమ్మేసినట్లు అగ్రిమెంట్ రాసిచ్చారు. అయితే వాస్తవానికి ఈ అక్రమ వ్యవహారం వెనుక రూ. 5 లక్షలు చేతులు మారినట్లు సమాచారం. విషయం వెలుగు చూసిందిలా.. టీడీపీ నాయకుల నుంచి చెరువును కొనుగోలు చేసిన వ్యక్తి అందులో రెండు లక్షల చేప పిల్లలను వదిలాడు. అవి కాస్తా పెరిగి పెద్దవయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. చెరువును విక్రయించిన వారంతా తేలు కుట్టిన దొంగలయ్యారు. వారం రోజులుగా చెరువులో చేపల వేట మొదలైంది. కర్ణాటక వాసి రోజూ చెరువు వద్దకు చేరుకుని చేపలు తరలించడం మొదలు పెట్టాడు. పంచాయతీ అధీనంలోని చెరువులో చేపల వేట కొనసాగిస్తుండడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నాయకులు తన వద్ద డబ్బు తీసుకుని చెరువు అమ్మేశారని, హక్కుదారుగా అందులో చేపల పెంపకాన్ని చేపట్టినట్లు కర్ణాటక వాసి గుట్టు రట్టు చేశాడు. దీంతో విషయం కాస్తా పోలీసుల వద్దకు చేరింది. చెరువు నీళ్లు బాలయ్యవట! పంచాయతీకి చెందిన చెరువులో అక్రమంగా చేపలను వదలడమే కాకుండా, రూ. లక్షలు దండుకుని ఏ హక్కుతో చెరువును అమ్మేశారంటూ టీడీపీ నాయకులను బేవినహళ్లివాసులు నిలదీసినట్లు తెలిసింది. అయితే చెరువును నింపిన హంద్రీ–నీవా నీరు తమ నాయకుడు బాలకృష్ణవేనని, తమ నీళ్లు తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామంటూ టీడీపీ నాయకులు గ్రామస్తులపై మరోసారి జులుం ప్రదర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం చెరువులో రూ. 20లక్షల విలువైన చేపలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, పంచాయతీకి దక్కాల్సిన నిధులను దోచుకున్న వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడంతో పాటు, చెరువులోని సంపదను స్వాధీనం చేసుకుని పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. ఓట్ల కోసం హడావుడి.. 2019 ఎన్నికల తాయిలంలో భాగంగా హిందూపురంలోని సూరప్ప చెరువును హంద్రీ–నీవా నీటితో నింపేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నాలు చేపట్టారు. వాస్తవానికి బేవినహళ్లి చెరువు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత సూరప్ప చెరువుకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. అయితే సూరప్ప చెరువును నీటితో నింపేందుకు బేవినహళ్లి చెరువు నిండకుండానే కట్టను దౌర్జన్యంగా ఎమ్మెల్యే అండతో ఆయన అనుచరులు తెంపేశారు. ఈ విషయంపై బేవినహళ్లి వాసులు కోపోద్రిక్తులయ్యారు. ఐక్యంగా ఉద్యమించి చెరువు కట్ట గండిని పూడ్చేశారు. ఆ సమయంలో గ్రామస్తులకు, ఎమ్మెల్యే బాలయ్య అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలను గ్రామస్తులు ఐకమత్యంతో ఎదుర్కొన్నారు. హంద్రీ–నీవా నీళ్లు వాళ్లవేనంట మా బేవినహళ్లి చెరువులోకి హంద్రీ–నీవా నీరు వదిలారు. ఈ చెరువులో మాకు కానీ, అధికారులకు కానీ కనీస సమా చారం కూడా లేకుండా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రెండు లక్షల చేప పిల్లలను వదిలాడు. వారం రోజులుగా అతను చెరువు వద్ద మకాం వేసి చేపల వేట కొనసాగిస్తున్నాడు. ఈ చెరువును టీడీపీ నాయకులు అమ్మేశారని చెప్పడంతో షాక్ తిన్నాం. హంద్రీనీవా నీళ్లు వాళ్లవేనంట. – ఓబన్న, బేవినహళ్లి నిధులు మింగేశారు చెరువు అనేది స్థానిక పంచాయతీకి ఆదాయ వనరుగా ఉంది. ఇందులో చేపల పెంపకం చేపట్టడం ద్వారా పంచాయతీకి పెంపకందారు సుంకం చెల్లించాల్సి ఉంది. అలాంటి చెరువును టీడీపీ నాయకులు స్వార్థం కోసం అమ్మేసుకున్నారు. పంచాయతీకి అందాల్సిన నిధులను అక్రమంగా స్వాహా చేశారు. ప్రభుత్వం స్పందించి నిధులు దోచుకున్న టీడీపీ నాయకులపై చర్యలు చేపట్టాలి. – రామాంజునరెడ్డి, బేవినహళ్లి నోటీసులిస్తాం చెరువు ఆదాయ వనరులను వేలం పాట ద్వారా అధికారికంగా విక్రయించాలి. అయితే అధికారులకు, గ్రామస్తులకు తెలియకుండా కొందరు ఈ చెరువుపై పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తాం. సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, చెరువును ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటాం. – చంద్రశేఖర్, ఈఓఆర్డీ, హిందూపురం -
బాలయ్య హీరోనా... జీరోనా?
కళల కాణాచి.. లేపాక్షితో ప్రపంచ ప్రఖ్యాతి.. తరచిచూస్తే మినీ ఇండియా సాక్షాత్కారం.. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఎంతో గుర్తింపు. నాలుగు దశాబ్దాలుగా పచ్చపార్టీ కి కంచుకోట. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం.. కానీ ఇప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరం. తాగేందుకు నీళ్లు లేని నియోజకవర్గం.. జబ్బుచేసినా వైద్యం అందని దైన్యం. మౌలిక సదుపాయాలు లేని పట్టణం. ఈ ఎన్నికలు మార్పునకు నాంది పలుకుతుండగా.. హిందూపురం ఓటెత్తేందుకు సిద్ధమవుతోంది. హిందూపురం: ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం. ఆ తర్వాత ఆయన తనయుడు హరికృష్ణను.. అనంతరం ఆయన మరో కుమారుడు బాలకృష్ణను ఎమ్మెల్యేలుగా గెలిపించింది.. కానీ అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. నాయకుల హామీలన్నీ నీటిమూటలు కాగా.. తాగేందుకు నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు. ఇక్కడ గత 37 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారు. అయినా శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం చూపించలేక పోతున్నారు. ఇక్కడుంటున్న ప్రతి కుటుంబం బిందె నీటిని రూ.5 ప్రకారం నెలకు నీటికోసమే రూ.2వేల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా ఇదే దుస్థితి. ఎన్టీ రామారావు నుంచి నేటి బాలకృష్ణ దాకా అందరూ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం అని చెబుతున్నా.. ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారు. కేంద్రం ఇచ్చిన రూ.194 కోట్లతో గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే పనులు పూర్తికాకుండనే బాలకృష్ణ ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. దీంతో జనం ఎప్పటిలానే ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. రూ.650 కోట్లు కేటాయించిన వైఎస్సార్ ‘పురం’ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వైఎస్సార్ తనవంతుగా కృషి చేశారు. పీఏబీఆర్ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని హిందూపురానికి తీసుకొచ్చే శ్రీరామరెడ్డి నీటి పథకం కోసం ఏకంగా రూ.650కోట్ల వ్యయం చేసి 14 వందల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయించారు. 2008 డిసెంబరు 30న రాజశేఖర్‌రెడ్డి సీఎం హోదాలో శ్రీరామరెడ్డి నీటి పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ చలువ వల్లే పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా పక్కనున్న పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం 220 గ్రామాలకూ తాగునీరు అందుతోంది. అయితే వైఎస్సార్ మరణానంతరం నాయకుల స్వార్థంతో శ్రీరామరెడ్డి పథకం నిర్వీర్యమైంది. తాగునీటి సమస్యలు షరామామూలయ్యాయి. వెంచర్లుగా మారిన పారిశ్రామిక హబ్‌లు సీఎం చంద్రబాబు...స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ ఐదేళ్లలో పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం శంకుస్థాపనలు..భూమిపూజలతో హడావుడి చేశారు. ఈ క్రమంలోనే చిలమత్తూరు సమీపంలోని కొడికొండ చెక్‌పోస్టుకు సమీపంలో 66 ఎకరాల్లో రాగమయూరి ఎలక్ట్రానిక్ ఇండ్రస్టీస్ పార్కు, లేపాక్షి బయోటెక్నాలజీ ఇండస్ట్రీలకు 2016 ఏప్రిల్ 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ పార్కుతో పదివేలమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కానీ ఆ శిలాఫలకాలు కూడా నామరూపాలులేకుండా పోయాయి. ఇప్పుడా భూమిలో లేవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక హిందూపురం–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్గా మారబోతోందని పలుమార్లు బాలకృష్ణ గొప్పలు చెప్పారు. కానీ అదీ కార్యరూపం దాల్చకపోవడంతో స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం బెంగళూరు, కేరళ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పేరు ఘనం.. వైద్యం మృగ్యం పేరుకు హిందూపురంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా...వైద్యం సేవలు మాత్రం మృగ్యంగా మారాయి. చూసేందుస పెద్దపెద్ద భవనాలున్నా...వైద్యసేవలందికే వారు కరువయ్యారు. కనీసం ప్రసవాలు కూడా చేసేందుకు సిబ్బంది లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రూ. 24 కోట్లతో నిర్మించిన మాతశిశు కేంద్రం అలంకార ప్రాయంగా మారగా...సకాలంలో వైద్యసేవలందక మాతాశిశు మరణాలు పెరిగిపోయాయి. హిందూపురం ఆస్పత్రిలో 2017 జనవరి నుంచి 2019 మార్చి వరకు 8 మంది బాలింతలు చనిపోగా... 167 శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక గర్భంలోనే 92 మంది బిడ్డలు చనిపోయారు. బిడ్డలు కోల్పోయిన బాధితులు ఆస్పత్రి ఎదుట ధర్నాలు చేసిన సంఘటలు ఎన్నో ఉన్నాయి. అయినా ఏనాడూ ఎమ్మెల్యే వీటిపై కనీసం ఆరా తీసిన సందర్భాలు కూడా లేవు. రైతులకు అందని గిట్టుబాటు ధర హిందూపురం చింతమార్కెట్ యార్డు, పట్టుగూళ్ల మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు సరుకు రవాణా అవుతోంది. అయితే ఇక్కడ దళారీ వ్యవస్థ అధికమై రైతులకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పట్టుగూళ్ల మార్కెట్ ఉన్నా... రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. దీంతో రైతులు ఎన్నోసార్లు ఆందోళనకు దిగినా...స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఏనాడూ నోరుమెదపలేదు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ కూడా సుమారు రూ.4 కోట్లు బకాయి ఉంది. విద్యాభివృద్ధికి చేయూత కరువు నియోజకవర్గంలో విద్యాభివృద్ధి చేయూత కరువైంది. జూనియర్ కళాశాల, డిగ్రీ, ఉర్దుకళాశాలలు లేవు. దీంతో విద్యార్థులు ప్రయివేట్ కళాశాలల్లో చదువుకునే స్థోమత లేక మధ్యలోనే ఆపివేస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు కూడా దుర్భరంగా ఉన్నా ఈ ఐదేళ్లలో బాలకృష్ణ ఏనాడూ వీటి గురించి పట్టించుకోలేదు. అభివృద్ధికి నోచుకోని పర్యాటక కేంద్రాలు హిందూపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన బాలకృష్ణ...ఈమేరకు చర్యలు తీసుకోవడం లేదు. లేపాక్షి ఉత్సవాలకు మాత్రం సినీ నటులతో నాలుగు రోజులు హడావుడి చేసి హైదరాబాద్‌కు మకాం మార్చేస్తున్నరు. దీంతో లేపాక్షి క్షేత్రం అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. ఇక వీరాపురం సైబేరియన్ పక్షుల విడిది కేంద్రం పరిస్థితి మరి అధ్వాన్నంగా మారింది. కనీసం పక్షులకు సరైన నీటివసతి కూడా కల్పించలేకపోయారు. పక్షులకు సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఏళ్లుగా కన్నీళ్లే.. నీటి కోసం ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. వేసవిలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. అయినా ఎవరికీ మా బాధలు పట్టడం లేదు. కొన్నేళ్లుగా టీడీపీ వాళ్లనే గెలిపిస్తున్నాం. అందరూ మాటలు చెప్పే వారే కానీ కాసిన్ని నీళ్లిచ్చే వాళ్లు కరువయ్యారు. – లక్షమ్మ, వెంకటాపురం -
వామ్మో బాలయ్యా! లోకేశ్ మళ్లీ వేసేశారు..
సాక్షి, అమరావతి: అదోరకం హాస్యాన్ని పంచడంలో అందరికంటే ముందుండే మంత్రి నారా లోకేశ్.. మరోసారి వేసేశారు! ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని ఆయన..‘‘పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి రెడీ..’’ అన్నారు. మరునిమిషంలోనే నాలుకకరుచుకుని...‘‘ఆగండాగండి.. ఒక్క హిందూపురంలో తప్ప ఏ సీటైనా ఒకే’’ అని సవరించుకున్నారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాలయ్యతో గొడవలు పెట్టకండి: రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీచేసి గెలిచే సత్తా తనకుందని లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘‘చంద్రబాబు గారు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీచేస్తా. కానీ ఒక్క హిందూపురం జోలికి మాత్రం వెళ్లను. ఎందుకంటే అక్కడ మా మామగారు అద్భుతంగా పనిచేస్తున్నారు. వచ్చేసారి కూడా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. అలాంటప్పుడు నేను అక్కడికెళ్లి చేసేది ఏముంటుంది? ముమ్మాటికీ నేను హిందూపురం నుంచి పోటీ చేయనుగాకచేయను. దయచేసి మా మామ బాలకృష్ణకు నాకు మధ్య గొడవలు పెట్టాలని చూడొద్దు..’’ అని లోకేశ్ అన్నారు. ముందస్తుకు ఒప్పుకోను: దేశమంతటా ముందస్తు ఎన్నికల జపం చేస్తున్నవేళ ఏపీ మంత్రి లోకేశ్ ఒకింత భిన్నంగా స్పందించారు. డిసెంబర్‌లోగా ముందస్తు ఎన్నికలొస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు! కనీసం డిసెంబర్ తర్వాతే ఎన్నికలు జరపాలని సూచించారు. ఒకవేళ మోదీ గనుక ముందస్తుకు వెళితే, బీజేపీతో టీడీపీ కలవదని, ప్రజా తీర్పు ప్రకారం తాము మాత్రం ఐదేళ్లూ అధికారంలో ఉంటామని చినబాబు వివరించారు. మోదీతో కేటీఆర్ భేటీపైనా వ్యంగ్యాస్త్రాలు: తెలంగాణ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు సహకరించాలని అభ్యర్థించడం తెలిసిందే. అయితే, మోదీ-కేటీఆర్ భేటీపై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ‘‘ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా ముఖ్యమంత్రులకే మోదీ అపాయింట్మెంట్ దొరకట్లేదు. అలాంటిది (కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా) ఇవాళ జరిగింది చూస్తే.. వాళ్లు(బీజేపీ) ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విమర్శలు సరికావు’’ అని లోకేశ్ వివరించారు. -
అసలు బాలయ్యకు ఏమైంది..!
సాక్షి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం..! నూటొక్క సినిమాల హీరో.. తెలుగువారి అభిమాన నటుడు అన్నగారి కొడుకు. ఆంధ్రప్రదేశ్ ఆసెంబ్లీలో సభ్యుడు.. ఒక నియోజక వర్గానికి ఎమ్మెల్యే. కానీ.. ఒక్కోసారి అతని ప్రవర్తన చూస్తే, మాటలు వింటే ఈ హోదాలన్నీ సిగ్గుపడతాయి. సాటి మనుషుల పట్ల, సొంత అభిమానుల పట్ల అతను స్పందించే తీరు అత్యంత అవమానకరంగా ఉంటోంది. ఎందుకు కొడతారో తెలియదు, వేలమంది మధ్యలో మైక్ పట్టుకుని ఏం మాట్లాడతారో తెలియదు. నిత్యం తన ఉపన్యాసాల్లో రామాయణం, మహాభారతాలను ప్రస్తావించే ఈ హీరోగారు.. తనదాకా వచ్చేసరికి జీరో అయిపోతున్నారా? అసలు బాలయ్యకు ఏమైంది? సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కోపమొచ్చింది. అభిమాని చెంప చెల్లుమనిపించారు. తన కంటే ముందుకెళ్తున్నాడన్న అసహనంతో చేయి చేసుకున్నాడు. దీంతో అభిమాని షాక్‌కు గురయ్యాడు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిజానికి అభిమానులను కొట్టడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అభిమానంతో వచ్చి చాలా మంది ఫ్యాన్స్ బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల విజయవాడలో సెల్ఫీ కోసం ఎగబడ్డాడంటూ.. అభిమాని చేతిలోని ఫోన్‌ను విసిరికొట్టారు బాలకృష్ణ. హిందూపురంలో ఈ మధ్య ఓ అభిమాని చెంపు చెల్లుమనిపించాడు బాలయ్య. అభిమానంతో మీదకొచ్చాడంటూ చెంపపై కొట్టాడు. అభిమాన హీరో తీరుతో.. ఆ ఫ్యాన్ నివ్వెరపోయాడు. ఫ్యాన్స్‌నే కాదు...తనకు అనునిత్యం సహకరించే అసిస్టెంట్‌పై కూడా బాలయ్య తన రౌద్రరూపం ప్రదర్శించాడు. షూటింగ్ సమయంలో బూట్లు సరిగా తుడవలేదంటూ అసిస్టెంట్‌ని కొట్టాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్‌మీడియాలో బాగా హల్చల్ చేసింది. సమీపంలో అభిమాన హీరో షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని వెళ్లిన ఫ్యాన్‌కు .. .బాలయ్య నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వీడు మనోడా కాదా అంటూ నేరుగా ప్రశ్నించి... కాదని తెలిసే సరికీ గెట్ అవుట్ అన్నాడు. ఏంటిరా అలా చూస్తున్నావంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు...ఇటీవల వెనక నుంచి ఎవరో నెట్టారంటూ బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బండ బూతులు తిట్టేంత పని చేశారు. ఆ సమయంలో బాలకృష్ణను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ విజ్వల్లో బాలయ్య ముఖకవళికలు చూస్తే ....ప్రతిఒక్కరికీ అర్ధమైపోతుంది. తాను నటించిన గౌతిమిపుత్ర శాతకర్ణి చిత్ర ట్రైలర్ లాంచ్ సమయంలోనూ..... బాలయ్య సహనాన్ని కోల్పోయారు. ఫోటో దిగేందుకు వస్తున్నాడంటూ ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడారు. ఫ్యాన్స్‌పై సమయమొచ్చినప్పుడుల్లా బాలయ్య రౌద్రరూపం చూపిస్తుండగా...కొందరు మాత్రం ఆయన్ను వెనుకేసుకొచ్చే పనిలో పడుతున్నారు. బాలయ్య అభిమానంతోనే కొడతారని.. ఫ్యాన్స్‌కు అది ఆశీర్వదమంటూ కొత్త భాష్యం చెప్పుకొస్తున్నారు. ఈ మధ్య జరిగిన పైసా వసూల్ చిత్ర వేడుకలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇదే చెప్పాడు. ఇక, బాలయ్య బాదుడికి టీడీపీ నేతలు కొత్త అర్థం చెబుతున్నారు. ఆయన కొడితే అభిమానులు ఉప్పొంగిపోతారని చెప్పుకొస్తున్నారు. ఆయన చేయి తగలడం కోసం ఎదురుచూస్తారని అంటున్నారు. బాలయ్య ఎంత పెద్ద నటుడైనా.....గొప్ప రాజకీయ నాయకుడు కుమారుడైనా ....ఇలా సందు దొరికినప్పుడల్లా ఆగ్రహం పేరుతో ఫ్యాన్స్‌పై చేయి చేసుకోవడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని బాలయ్య ఎప్పుడు తెలుసుకుంటారో...వేచి చూడాలి. ఈ చర్చా కార్యక్రమం పూర్తి వీడియో ఇక్కడ చూడండి -
'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా'
అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలంతా తమ కుటుంబం వంటి వారని ప్రముఖ నటుడు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలిపారు. బుధవారం సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరం బాలకృష్ణ హిందూపురంలో విలేకర్లతో మాట్లాడారు. హిందూపురంను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. హిందూపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు తాను పార్టీలో నడుచుకుంటానని చెప్పారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని బాలకృష్ణ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కష్టాల కాపురం
టీడీపీని ఆదరిస్తూ వచ్చిన హిందూపురం ప్రజలు వారి గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఆది నుంచి పట్టం కడుతూ వచ్చారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ఎన్నికలు జరగ్గా.. అన్నిసార్లూ ఆ పార్టీ అభ్యర్థులకే అవకాశమిచ్చారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను 1989లో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఓటర్లు తిరస్కరించినా.. హిందూపురం ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మరో రెండుసార్లూ ఆదరించారు. దీంతో ఎన్టీఆర్ హిందూపురాన్ని దత్తత తీసుకున్నారు. కాగా, చంద్రబాబు హయాంలో ‘పురం’ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ఎన్టీఆర్‌ను ఆదరించిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. తాగునీరు, రహదారులు వంటి కనీస సదుపాయాలూ కల్పించలేదు. వైఎస్ సీఎం అయ్యాకే అభివృద్ధికి నోచుకుంది. మూడు దశాబ్దాల నుంచి టీడీపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నా తమను పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టీడీపీకి బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. తొమ్మిదేళ్లూ కష్టాలే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హిందూపురం ప్రజలను కష్టాలపాలు చేశారు. నియోజకవర్గంలోని కొడికొండ వద్ద 1977లో ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఇందులో 1979 నుంచి 1998 వరకు రోజుకు సగటున మూడు వేల టన్నుల చెరకు క్రషింగ్ చేసేవారు. రోజూ సగటున 1,200 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసేవారు. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 473 మందికి, పరోక్షంగా 1,500 కుటుంబాలకు ఉపాధి లభించేది. లాభాల్లో ఉన్న ఈ పరిశ్రమను చంద్రబాబు ప్రభుత్వం నష్టాల పాలు చేసింది. మొలాసిస్ విక్రయాల్లో పెట్టిన నిబంధన ఇందుకు కారణమైంది. నష్టాల సాకు చూపి చంద్రబాబు 1998లో చక్కెర ఫ్యాక్టరీని విక్రయానికి పెట్టారు. రూ.100 కోట్ల విలువ కలిగి... 143 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీని కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చంద్రబాబు సన్నిహితుడికి సంబంధించిన రేణుకా షుగర్స్‌కు రూ.5 కోట్లకే ధారాదత్తం చేశారు. పరిశ్రమల ప్రాణం తీశాడు! హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ భావించారు. తూమకుంట వద్ద 350 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయించారు. ఇందులో విప్రో సంస్థ 23 పరిశ్రమలను నెలకొల్పింది. దీంతో పాటు శాంతి, గోమతి స్టీల్ ప్లాంట్లు, అజాద్, శాంశరత్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఈ పారిశ్రామికవాడపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యుత్ రాయితీలను ఎత్తేసింది. దీంతో సగానికి పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. మూడు వేల మందికిపైగా కార్మికులు రోడ్డున పడ్డారు. రైతుల పొట్ట కొట్టారు... చంద్రబాబు తన హయాంలో హిందూపురం రైతుల పొట్ట కొట్టారు. నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించడంలో విఫలమయ్యారు. పెన్నా, కుముద్వతి, చిత్రావతి నదులపై కర్ణాటక ప్రభుత్వం 1996-98 మధ్య అక్రమంగా వందలాది చెక్‌డ్యాంలను నిర్మించినా పట్టించుకోలేదు. దీంతో ఆ నదులు ఎండిపోయాయి. నియోజకవర్గంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. ఎగువ నుంచి నీరు రాక పెన్నార్-కుముద్వతి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. తమ నోట్లో దుమ్ముకొట్టిన బాబుకు గుణపాఠం చెబుతామని రైతులు అంటున్నారు. సమస్యలు తీర్చేవారికే.. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారు. మా కష్టాలు తీరుస్తామని చెబుతారు. వాటిని నమ్మి ఇన్నా ళ్లూ మేం ఒక పార్టీకే ఓట్లు వేస్తూ వచ్చాం. అయినా.. మా కష్టాలు తీర్చలేదు. ఆ పార్టీ వాళ్ల కథ ఇప్పుడు చెబుతాం. మా సమస్యలను తీర్చే పార్టీకే ఓటేస్తాం. - వెంకటలక్ష్మి, హిందూపురం. ఎమ్మెల్యే పట్టించుకోలేదు మా వీధిలో మురుగుకాలువలు పూడికతో నిండిపోయాయి. దుర్వాసన మధ్య చస్తూ బతుకుతున్నాం. ఇంతవరకు ఎమ్మెల్యే మా ముఖం చూడలేదు. ఇప్పుడు నా వద్దకు ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు? - ఫకృద్దీన్,హిందూపురం. వైఎస్ హయాంలో పరుగులెత్తిన ప్రగతి హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. మునిసిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని 90 శాతం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండేది. బిందెడు నీళ్లు కావాలంటే రూ.5 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఈ సమస్యను గుర్తించిన వైఎస్.. రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని పూర్తి చేయించారు. 180 కిలోమీటర్ల దూరంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి హిందూపురానికి పైపులైన్ వేయించి.. నీటిని సరఫరా చేయించారు. ఈ పథకాన్ని ఆయన డిసెంబర్ 30, 2008న ప్రారంభించారు. 1. హిందూపురం వద్ద 55.92 ఎకరాలలో రూ.3 కోట్లతో ఆటో నగర్‌ను ఏర్పాటు చేయించారు. 2. చంద్రబాబు పాలనలో కళ తప్పిన హిందూపురం పారిశ్రామికవాడకు వైఎస్ సీఎం అయ్యాక నూతన శోభ వచ్చింది. దీనిని ఆయన 350 నుంచి 3,500 ఎకరాలకు విస్తరించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, రాయితీలివ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొచ్చారు. రూ.500 కోట్లతో బెర్జర్ పెయింట్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 3. హిందూపురాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వైఎస్ భావిం చారు. ఇందులో భాగంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సంస్థలు రూ.11 వేల కోట్లతో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా 2008లో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే, వైఎస్ హఠాన్మరణంతో ఆ పరిశ్రమలు ఏర్పాటుకు నోచుకోలేదు. 4. హిందూపురం వద్ద ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్సీ) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి 2008లో కేంద్రాన్ని వైఎస్ ఒప్పించారు. ఆయన మరణంతో కేంద్రం దానిని పక్కన పెట్టింది. -
ఎన్టీఆర్ వారసులకు మొండిచేయే...
బావ తీరుపై హరి కారాలు మిరియాలు సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు సొంత జిల్లాలోని గుడివాడతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రెండు పర్యాయాలు ఆయన గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణంతో చంద్రబాబుపై కోపంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత ఎన్టీఆర్ వారసులు ఎవరూ జిల్లా నుంచి పోటీ చేయలేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసులు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. జిల్లా వదిలి.. హిందూపురంతో సరి.. బావ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమేనని తొడకొట్టిన బాలయ్య చివరకు హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నారు. దీనికితోడు పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు వర్గపోరుతో చిరాకు వచ్చిన ప్రతిసారి అవసరమైతే బాలకృష్ణను, లేకుంటే లోకేష్‌ను పోటీకి తీసుకొస్తానని ప్రకటించేవారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం వంశీతో వర్గపోరు నేపథ్యంలో బాలకృష్ణను పోటీకి తీసుకొస్తానని రాజకీయ వేడి రగిల్చేవారు. గుడివాడ నుంచి కూడా బాలకృష్ణ పోటీకి దిగుతారన్న ప్రచారం జరిగింది. ఈసారి ఏదోక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అనుయాయులు పెనమలూరు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించుకున్నారు. పెనమలూరు, నూజివీడులో రెబల్స్ బెడద తీవ్రంగా ఉండటం, గుడివాడలో కొడాలి నాని గాలి ఎక్కువగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బాలకృష్ణ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఓటమి భయమో, వర్గపోరు ప్రభావమో, మరేదైనా కారణమో కానీ బాలకృష్ణ జిల్లాను వదిలి హిందూపురం టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలయ్యను ఉసిగొల్పి బాబు రాజకీయం.. ప్రచారం, పర్యటన, ఎన్నికలు ఏదైనా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాలకృష్ణతో చంద్రబాబు చెక్ పెట్టించి రాజకీయం నెరపడంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. వస్తున్నా మీకోసం అంటూ జిల్లాలో యాత్రకు వచ్చిన చంద్రబాబు పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో బాలకృష్ణను ప్రయోగించారు. అప్పట్లో బాబు యాత్ర సందర్భంగా రెండు రోజులు ఇక్కడే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేలా కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు రేగాయి. బాబు, బాలయ్య తీరుపై ఎన్టీఆర్ అభిమానులు పెద్ద దుమారమే లేపారు. తాజాగా హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు చెక్ పెట్టి బాలకృష్ణకు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబంలో కొత్త చిచ్చు రాజేశారు. కారాలు మిరియాలు నూరుతున్న హరికృష్ణ... హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం అందరూ పదవులకు రాజీనామాలు చేసినా అంతగా పట్టించుకోకపోయినా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగమేఘాలపై ఆమోదించేలా చేశారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. ఈసారి హిందూపురం కాకుంటే జిల్లాలో టిక్కెట్ ఇస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న హరికృష్ణ తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు.