
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆయన ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా బాలకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. అది కాస్తా ఓవర్ కావడంతో అందరిలో నవ్వులపాలయ్యారు. దీంతో, పక్కనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. బాలకృష్ణ చేసిన పని చూసి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
హిందూపురంలో గురువారం టీడీపీ-జనసేన సంయుక్త సమావేశం జరగింది. ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన వెంటనే బాలకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా షూటింగ్ అనుకున్నాడో ఏమో కానీ.. తాను పెట్టుకున్న కళ్ల జోడును ఒక్కసారిగా తీసేసి.. పైకి ఎగరేసి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అవి కాస్తా.. చేతికి దొరక్క అదుపు తప్పి కిందిపడిపోయాయి. దీంతో, బాలకృష్ణ నాలుక కర్చుకున్నాడు.
ఇక, బాలకృష్ణ చేస్తున్న పనిని పక్కనే ఉన్న నేతలంతా గమనించారు. బాలకృష్ణ చేష్టలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నవ్వు ఆపుకోలేకపోయారు. అనంతరం, బాలకృష్ణ ముఖం అదోలా పెట్టుకుని ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment