Hobbies
-
Health: మీరు ఈ తొమ్మిది అలవాట్లు వదులుకుంటే.. సక్సెస్ గ్యారంటీ!
‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.1. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం..అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్‌ను చూస్తూ ముందుకు సాగాలి.2. మల్టీ టాస్కింగ్..ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. 4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి. 5. వాయిదా వేయడం..ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది. 6. అతిగా ఆలోచించడం..వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది. 7. క్లోజ్డ్ మైండ్ సెట్..చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. 8. నెగెటివ్ వ్యక్తులు..కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి. 9. బాధిత మనస్తత్వం..ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.— సైకాలజిస్ట్ విశేష్ -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్‌గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
బ్రాండ్ బాబులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయం సాధించి, ఆర్థికంగా మరో మెట్టు పైకెదు గుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా వారి అభిరుచులు, ఇష్టాలు మారుతున్నాయి. తదనుగుణంగా ఉన్నత శ్రేణి, అధిక నాణ్యత గల వస్తువులు లేదా అధిక ధరలు కలిగిన ఉత్పత్తుల (ప్రీమియం కన్జమ్షన్) కొనుగోలు వైపు వారు మొగ్గు చూపుతున్నారని, అలాంటి వాటిపై వారి ఆసక్తి పెరుగుతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న భారతీయులు చేస్తున్న వ్యయం, ఇతర అంశాలను పరిశీలిస్తే ప్రీమియం కన్జమ్షన్ వైపు వారి ప్రాధాన్యతలు మారుతున్నట్టుగా అవగతమవుతోందని పేర్కొంటున్నాయి. 2019 నుంచి వ్యక్తిగత వినియోగం (ప్రైవేట్ కన్జమ్షన్) అనేది అంతకంతకు (కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, తదనంతర పరిణామాల కారణంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా) వృద్ధి చెందుతోందని, వివిధ కేటగిరీల్లో ఎక్కువగా వ్యయం చేయడం వ్యక్తుల ఆర్థిక పురోభివృద్ధిని సూచిస్తున్నాయని స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ‘రెడ్‌సీర్’తాజా నివేదిక వెల్లడించింది. మరికొన్ని ముఖ్యాంశాలు ఆర్థికంగా ఎదుగుతున్నవర్గాలు.. ట్రావెల్–టూరిజం, ఫైనాన్షియల్ సర్విసెస్, రిక్రియేషన్, ఇన్సూరెన్స్ తదితరాలపై చేసే వ్యయంలో పెరుగుదల చోటు చేసుకుంది. నాణ్యమైన విద్య,వ్యక్తిగత వాహనాలు, పర్సనల్ కేర్ వస్తువులు, ఆహారం, వివిధ రకాల బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. ఏప్రిల్, మే, జూన్‌లతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు, చేసిన విమాన ప్రయాణాలు, వివిధ రకాల హైఎండ్ వాహనాల కొనుగోళ్లు ప్రైవేట్ కన్జమ్షన్ తీరును తెలియజేస్తున్నాయి. సంపద పెరుగుదలను సూచిస్తున్నవినియోగ ధోరణులు భారతీయుల దీర్ఘకాలిక వినియోగ ధోరణులు క్రమంగా సంపద పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారుల ప్రవర్తన, వ్యవహారశైలి (కన్జ్యూమర్ బిహేవియర్) చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఉన్నత శ్రేణి కేటగిరీల వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమౌతోంది.ఇండియా డిజిటల్‌గా ఎదగడంతో పాటు దేశంలో మౌలిక సదుపాయాలు కూడా మెరుగైనందున ఈ దశాబ్దంలో ఈ ప్రత్యేక ప్రయాణం మరింత ముందుకు సాగనుంది. – మృగాంక్ గుట్గుటియా, రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ -
గౌతమ్‌రెడ్డికి తల్లిదండ్రులు, స్నేహితులంటే ప్రాణం.. ఒక్కసారి పరిచయం అయితే చాలు
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ధనవంతుల ఇంట్లో జన్మించినా ఎక్కడా అహం, దర్పం లేని నిరాడంబరుడు. వ్యాపార వేత్తగా, రాజకీయ నేతగా, మంత్రి హోదాలో ఉన్నా.. ఏనాడు అధికారాన్ని అసలు చూపించలేదు. అందరితో స్నేహం చేయడం, సన్నిహితులతో గడపడం చాలా ఇష్టం. ఒకసారి తన మనస్సుకు నచ్చితే వారి స్నేహాన్ని వదలరు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఆయనకు ఎందరో స్నేహితులు, సన్నిహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా, పారిశ్రామిక రంగాల్లో కీలక వ్యక్తులు ఆయనకు సుపరిచితులే. గౌతమ్‌తో ఒక్కసారి పరిచయం అయితే చాలు.. ఎప్పటికీ గుర్తు పెట్టుకునే స్నేహశీలి. చదవండి: గౌతమ్ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి గౌతమ్‌రెడ్డి పుట్టింది నెల్లూరులో అయినా ఆయన బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. పదో తరగతి వరకు తమిళనాడులోని ఊటీలో చదివినా ఆపై హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశాలకు (విదేశాల్లోనైనా) వెళ్లి సందర్శించడం ఆయనకు సరదా. ట్రెక్కింగ్, హంటింగ్, కారు డ్రైవింగ్ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు. కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చేవారు. స్నేహితులతో పాటు బంధుమిత్రులను కూడా అమితంగా ప్రేమించేవారు. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు. చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ.. చదవండి: Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ గౌతమ్‌రెడ్డికి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజరి అంటే ఎనలేని ప్రేమ. హైదరాబాద్‌లో ఉంటే నిద్రలేచిన తర్వాత జిమ్‌కు వెళ్లి అటు నుంచే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రావడాన్ని దిన చర్యలో భాగంగా మార్చుకున్నారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, కష్టసుఖాలను తల్లిదండ్రులతో పంచుకొనేవారు. ప్రతిరోజూ తన తల్లిదండ్రులతోపాటు సోదరులు మేకపాటి విక్రమ్‌రెడ్డి, మేకపాటి పృథ్వీరెడ్డిని కలిసేవారు. చెరగని చిరునవ్వు రాజకీయ నాయకుల జీవితం ప్రజలతో మమేకంమై ఉంటుంది. వారు చేసే ప్రతి పనిని ప్రజలు దగ్గరగా గమనిస్తుంటారు. అందువల్ల కొందరు చిరునవ్వును కృతిమంగా సృష్టించుకుంటారు. కానీ మేకపాటి గౌతమ్‌రెడ్డి మాత్రం ఎప్పుడూ చెరగని చిరునవ్వుతోనే ఉంటారు. అభిమానులు, స్నేహితులు, కార్యకర్తలు వచ్చినప్పుడు చిరు నవ్వుతోనే వారికి సమాధానం చెబుతుంటారు. ఎన్నో సమస్యలతో వచ్చిన వారు కూడా ఆయన చిరునవ్వుతో బాధలు మరిచిపోయి ఆనందంగా తిరిగి వెళ్లేవారు. స్నేహానికి విలువిస్తారు మేకపాటి గౌతమ్‌రెడ్డి స్నేహానికి విలువిస్తారు. ఆయనతో మాకు బంధుత్వం ఉంది కానీ బంధువుకన్నా స్నేహితుడిగానే నన్ను అభిమానిస్తారు. రాజకీయ ప్రవేశం ముందు ఆత్మకూరులో జరిగిన పాదయాత్ర టూర్ షెడ్యూలంతా నాపైనే పెట్టారు. నేను ఆయన షెడ్యూల్ తయారు చేసి ముందుండి నడిపించాను. గౌతమ్‌రెడ్డి మంచి మనస్సున్న వ్యక్తి. 2012లో జరిగిన బైపోల్స్‌లో ఆయన తండ్రి విజయానికి ఎంతో కష్టంచి పనిచేయడమే కాకుండా మాతోను చేయించారు. – నరేష్‌చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం అనుకున్నది సాధిస్తారు గౌతమ్‌రెడ్డి నాకు చిన్న వయస్సు నుంచి తెలుసు. చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విశ్రమించరు. అతను ఏ విషయంలో తొందరపాటు చేయర. చాలా కూల్‌గా ఉంటూ పని చేసుకుంటారు. ధైర్యం కూడా ఎక్కువే. జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశం ఉంటే చాలు అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తారు. అంతటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. – వేమారెడ్డి వినీత్‌రెడ్డి, కోవూరు -
ఉద్యోగం రావడానికి టైం పడుతుంది కదా.. అభిరుచితో ఆదాయం
కరోనా విజృంభణ కాలంలో ఆందోళనగా, నిస్సారంగా గడిపిన ఖాళీ సమయాలను మర్చిపోలేం. అయితే, చాలా మంది ముఖ్యంగా యువత ఆ ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ తమకున్న అభిరుచులను పెంచుకునే దిశగా కృషి చేశారు. కొంతమంది కొత్త కొత్త అభిరుచులవైపు తమ దృష్టిని మళ్లించుకున్నారు. ఆ కళాత్మక దృష్టి వారిని కొత్త వ్యాపారం వైపు ప్రయాణించేలా చేసింది. దీపాక్షి దత్తా, దృష్టి అరోరా, తవ్లీన్కౌర్, నాజియా నసీఫ్లు ఖాళీ సమయాన్ని సద్వియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఆన్లైన్ వేదికగా తమ అభిరుచులకు పదును పెట్టుకున్నారు. అదే ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్పారు. చదువుకుంటూ, ఇంటివద్ద ఉంటూ ఆదాయాన్ని, గుర్తింపునూ పొందుతున్నారు. నాట్స్ ఆఫ్ లవ్ కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల దీపాక్షి దత్తా knotsoflovebydeepakshi అనే ఆన్ లైన్ స్టోర్ నడుపుతోంది. దీపాక్షి మాట్లాడుతూ, ‘నాకు ఉద్యోగం రావడానికి టైమ్ పడుతుంది. దాని కోసం ఎదురుచూసుకుంటూ ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మహమ్మారిలో, ప్రజలు ఎక్కువ మంది ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. నైపుణ్యాలు నేర్చుకోగల పెద్ద పాఠశాల ఆన్లైన్ అయ్యింది. ఇదే నాకు ఉపాధిని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ అల్లికలు అల్లుతూ, నేర్పిస్తూ ఆదాయం పొందుతున్నాను’ అని ఆనందంగా చెబుతుంది. ఆత్మీయ ఫొటో కార్డ్ @artsymomo ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న టవ్లీన్ కౌర్ రాజ్‌పాల్ వయసు 19. తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా ఫొటో కార్డ్ తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ‘నా ఫ్రెండ్ ఆ ఫొటో కార్డ్ చూసి చాలా సంతోషించింది. కుటుంబంలోని వ్యక్తుల ఆత్మీయ క్షణాలను బంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని కార్డ్స్ రూపంలో తయారు చేసి, లామినేట్ చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు మంచి పేరును, ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలు కూడా చేస్తున్నాను. ఇవి జనాలకు బాగా నచ్చుతున్నాయి’అని ఆనందంగా వివరిస్తుంది. కళాదృష్టి 21 ఏళ్ల దృష్టి అరోరా నివాసం ఢిల్లీలో @kalaadrishti అనే పేరుతో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దృష్టి ‘నేను మా అత్త నుండి కొన్ని బేసిక్ కుట్లు నేర్చుకున్నాను. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి, రింగ్స్ తయారీ నేర్చుకున్నాను. డిజిటల్ ఇలస్ట్రేషన్ నుండి కోచింగ్ వరకు, తెలుసుకోవడానికి కొరతే లేదు. వీటన్నింటినీ నేర్చుకోవడానికి, తయారీకి సమయం ఏ మాత్రం సరిపోవడం లేదు’ అని వివరిస్తుంది. కళాత్మక అన్వేషణ పాట్నాకు చెందిన నాజియా నఫీజ్ వయసు 30. ఇద్దరు పిల్లల తల్లి. కుటుంబ బాధ్యతలతో సమయమే సరిపోయేది కాదు. పైగా కుటుంబంలో ఆమె ఆలోచనలను ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ కరోనా మహమ్మారి కాలంలో చేసిన ఆల్లికలు ఆమెలోని కళాత్మక దృష్టిని సమాజం ముందుకు తీసుకు వచ్చేలా చేశాయి. ఆమె ఇప్పుడు @crazy_knot పేజీ ద్వారా చెప్పులు, జూకాలు, గాజులు.. రంగుదారాల అల్లికతో మంచి ఆదాయాన్ని పొందుతోంది. కుటుంబానికి అండగా నిలబడింది. వీరెవ్వరూ గొప్ప కళాకారులు, అనుభవజ్ఞులైన వ్యాపార వేత్తలు కాదు. తమకున్న కళను అమ్మడం అనే ఆలోచనే వారెప్పుడూ చేయలేదు. ఆర్డర్ తీసుకున్నాక, తను పంపాల్సిన ప్యాకేజీలను సరిగ్గా చేయకపోడం వల్ల టవ్లీన్ కొన్నిసార్లు నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ‘వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే రోజులు ఉంటాయి. నేర్చుకునే ప్రక్రియలో ఇది కూడా ఓ భాగం’ అంటోంది దృష్టి. అంతేకాదు వ్యాపార మెలకువల కోసం ఆమ్స్టర్ డ్యామ్ యూనివర్శిటీ నుంచి ఆన్లైన్ పాఠాలు కూడా నేర్చుకుంటోంది. తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సంవత్సరం ఆమె తన కాలేజీ ఫీజులో సగం చెల్లించానని టవ్లీన్ సంతోషంగా చెబుతుంది. టవ్లీన్, దీపాక్షి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే చదువుపై దృష్టి పెడుతున్నారు. దృష్టి తన వ్యాపారాన్ని ఫ్రీలాన్స్ అవకాశంగా చూస్తోంది. నాజియా ఇదొక సొంత వ్యవస్థాపక ప్రయాణంగా భావిస్తోంది. ‘నాట్స్’పై పెద్ద ప్రణాళికలను రచిస్తూనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంలో నిమగ్నమైంది. వీరంతా వేల మైళ్లు ప్రయాణించలేదు. ఇంటి వద్ద ఉండే ఉన్న వనరులతో కళాత్మక దృష్టికి పదునుపెట్టారు. ఆ అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని ఉపాధి పొందుతున్నారు. -
ముదిమిలో హాబీలతో మేలు
పరిపరి శోధన ముదిమి వయసులో ఏం చేయగలం... రామా కృష్ణా అని కాలక్షేపం చేయడం తప్ప అనుకుంటే తప్పే అంటున్నారు అంతర్జాతీయ వైద్య పరిశోధకులు. నిజానికి ఆ వయసులో కావలసినంత తీరిక దొరుకుతుందని, మనసుకు నచ్చిన హాబీలతో ఆ తీరికను సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. ఫొటోగ్రఫీ, కుట్లు, అల్లికలు, తోటపని వంటి హాబీలు అలవాటు చేసుకుంటే, ముదిమి వయసులో మెదడు చురుకుగా పనిచేస్తుందని, దానివల్ల డెమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవని తమ అధ్యయనంలో తేలినట్లు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ముదిమి వయసులో ఇలాంటి హాబీలలో నిమగ్నమైన వారికి మెదడుకు సంబంధించిన రుగ్మతలు తలెత్తే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వారు అంటున్నారు.