Home Insurance
-
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
విపత్తుల నుంచి రక్షణ ఉందా ?
ఏటా వానాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే నష్టం భారీగా ఉంటోంది. ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు వర్షం పడితే పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటి మధ్య చిక్కుకుపోవడం గురించి వింటూనే ఉన్నాం. వాహనాలు నీట మునగడం, ఇంటికి నష్టం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. చెరువులు తెగి, నదులు పొంగడం వల్ల గ్రామాల్లోనూ పంటలకు, ఇతరత్రా ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే పరిణామం. ఈ విషయంలో మనం పెద్దగా చేయగలిగేదేమీ ఉండదు. కాకపోతే ఒక్క చర్యతో విపత్తుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాల తాలూకు నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చు. తగినంత బీమా కవరేజీ కలి్పంచుకోవడమే ఇందుకు ఉన్న ఏకైక మార్గం. సమగ్రమైన కవరేజీతో, అన్ని నష్టాలకూ రక్షణ కల్పించే విధంగా బీమా కవరేజీ ఉండాలి. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది. కార్లకు బీమా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసే వాహన బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సమగ్రమైన కవరేజీతోపాటు, స్టాండర్డ్ పాలసీల్లో నచి్చంది తీసుకోవచ్చు. కాకపోతే కారుకు కాంప్రహెన్సివ్ బీమా పాలసీ తీసుకున్నామని చెప్పి నిశి్చంతంగా ఉండడానికి లేదు. వరద నీరు కారణంగా ఇంజన్‌కు నష్టం ఏర్పడితే ఈ పాలసీల్లో పరిహారం రాదు. టైర్లు పేలిపోవడం, వరదనీరు కారణంగా వాహనం నిలిచిపోయినా పరిహారం రాదు. ‘‘వరద నీటి వల్ల ఇంజన్ ఆన్ అవ్వకపోతే అందుకు కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో కవరేజీ రాదు. అంతేకాదు విడిభాగాలు మార్చాల్సి వచి్చనా లేదా విడిభాగాలకు మరమ్మతులు చేయాల్సి వచి్చనా కానీ, తరుగుదలకు చెల్లింపులు చేయవు. అందుకని వాహనదారు తప్పనిసరిగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, స్పాట్ అసిస్టెన్స్, డిప్రీసియేషన్ కవర్ తప్పకుండా తీసుకోవాలి’’అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ సూచించారు. సాధారణంగా ఈ కవరేజీలు యాడాన్ లేదా రైడర్ రూపంలో అందుబాటులో ఉంటాయని, వాహన బీమాతోపాటు వీటిని కూడా తీసుకోవాలన్నారు. వ్యాధుల నుంచి రక్షణ వర్షా కాలంలో దోమల వల్ల, నీరు కలుషితం కావడం వల్ల, వైరస్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరం, డయేరియా, చికున్ గునియా ముప్పు వర్షాకాలంలో ఎక్కువ. వీటి కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. వేలు, లక్షల బిల్లు చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకుని వెక్టార్ బోర్న్ డిసీజ్ ఇన్సూరెన్స్‌ను ప్రతీ కుటుంబం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఈ కవరేజీ కింద దోమలు, ఇతర కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వచ్చే వ్యాధులకు సైతం కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా రిస్క్ ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోత వీటిల్లో ప్రాణ ప్రమాదం ఏర్పడొచ్చు. మనదేశంలో డెంగీ, మలేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా లక్షలాది మంది వీటి బారిన పడుతున్నారు. ‘‘కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లేని వారు, తప్పకుండా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్ కవరేజీని తమకు, తమ కుటుంబ సభ్యులకు తీసుకోవాలి. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యం చికిత్సలకు పరిహారాన్ని ఇవి చెల్లిస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యానికి చికిత్స పొందేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే రిస్క్ ఉంటుంది. డెంగీ బారిన పడితే కోలుకునేందుకు 8–10 రోజులు పట్టొచ్చు. చికిత్సా ఖర్చు రూ. లక్షల్లో ఉంటుంది. మెట్రోల్లో రూమ్ రెంట్ రూ. లక్ష ఉంటుందని, ఒక్కసారి ప్లేట్లెట్లు ఎక్కించేందుకు రూ.40,000 తీసుకుంటున్నారని పాలసీబజార్ అంచనా. డెంగీ కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే ఒకరికి ఒకటికి మించిన సార్లు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి రావచ్చు. బీమా పరిశ్రమ ప్రత్యేకంగా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్, వెక్టార్ బోర్న్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. డెంగీ జ్వరం, మలేరియా, ఫైలేరియా, కాలా అజార్, చికెన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్‌లకు వీటిల్లో కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు జీవిత కాలంలో ఒక్కసారే క్లెయిమ్ చేసుకోగలరు. ‘‘మీ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీటికి కవరేజీ లేకపోతే.. ఒక్కో వ్యాధికి విడిగా కవరేజీ తీసుకోవచ్చు. డెంగీ, మలేరియా ఈ రెండూ మన దేశంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు. కనుక వీటికి కవరేజీ కలిగి ఉండడం ఎంతో అవసరం’’అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చాబ్రా సూచించారు. ఇంటికి బీమా వర్షాలు, వరదలకు ఇంటికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వడగండ్లు, పిడుగులతో కూడిన వర్షాలకు ఇంటి నిర్మాణం దెబ్బతినొచ్చు. కుండపోతకు ఇంటి పైకప్పుకు నష్టం కలగొచ్చు. అలాగే, ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర వస్తువులు, ఫరి్నచర్ దెబ్బతినడం వల్ల ఆరి్థక నష్టం ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితుల్లో హోమ్ ఇన్సూరెన్స్ ఎంతో ఆదుకుంటుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో హోమ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. హౌస్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేకపోవడం, తప్పుడు అభిప్రాయాల కారణంగా మన దేశంలో దీని విస్తరణ చాలా నిదానంగా ఉందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ నాన్‌మోటార్ నేషనల్ హెడ్ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. అయితే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ‘‘ప్రకృతి విపత్తుల (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా వాటిల్లే నష్టానికి కవరేజీనే ఈ బీమా పాలసీలు ఆఫర్ చేస్తాయి. అలాగే, ఊహించని ఇతర ఉత్పాతాల వల్ల నష్టానికి కూడా రక్షణనిస్తాయి. ఏడాదికి మించిన కవరేజీని ఒకేసారి తీసుకోవడం వల్ల ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ హోమ్ కవర్ తీసుకోవాలి. దోపిడీ, దొంగతనం, వ్యక్తిగత ప్రమాద కవరేజీ, ఇల్ల దెబ్బతినడం వల్ల నష్టపోయే అద్దె ఆదాయాన్ని భర్తీ చేసే కవరేజీలు ఉండాలి. ఇంట్లోని ఖరీదైన పెయింటింగ్‌లు, ఆభరణాలకూ బీమా రక్షణ కలి్పంచుకోవాలి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కూడా తీసుకోవాలి’’ అని గురుదీప్ సింగ్ సూచించారు. ఇంటి నవీకరణ, పునరి్నర్మాణ సమయంలో ఏవైనా మార్పులు చేసినట్టయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కచి్చతమైన విలువను పేర్కొనాలని సింగ్ పేర్కొన్నారు. ‘‘మీ ఇల్లు దీర్ఘకాలం పాటు ఖాళీగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఎంతో అవసరం. సరైన చిరునామా, ప్రాపర్టీ విలువ సరిగ్గా పేర్కొనడం వల్ల పాలసీదారు తన వంతు నష్టాన్ని భరించాల్సిన అవసరం లేకుండా నివారిస్తుంది’’ అని సింగ్ తెలిపారు. ఇంట్లోని వస్తువులకు బీమా కవరేజీ కోసం విడిగా ఒక్కో ఆరి్టకల్ వివరాలను పూర్తిగా పేర్కొనడం, వాటి విలువను కూడా నమోదు చేయడాన్ని మర్చిపోవద్దు. రీప్లేస్మెంట్ లేదా రీఇన్స్టేట్మెంట్ కవర్‌ను తీసుకోవాలి. ‘‘హోమ్ ఇన్సూరెన్స్ విభాగంలో మార్కెట్ వేల్యూ కవరేజీ లేదంటే రీఇన్స్టేట్మెంట్ కవరేజీ తీసుకోవచ్చు. మార్కెట్ వేల్యూ కవర్లో తరుగుదల పోను మీ ఇంటి విలువలో మిగిలిన మొత్తాన్ని పరిహారం రూపంలో పొందుతారు. రీఇన్స్టేట్మెంట్ కవర్లో ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సమాన స్థాయిలో బీమా పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు వరదలు వచ్చి ఇల్లు దెబ్బతింటే, అప్పుడు ఇంటిని తిరిగి నిర్మించుకోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భాల్లో హౌస్ రీఇన్స్టేట్మెంట్ కవర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు. ఇవి ఉండేలా చూసుకోవాలి ► ఆటో బీమా: ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజన్ ఆయిల్, నట్లు, బోల్టులు, గ్రీజులు, వాషర్లతో కూడిన కన్జ్యూమబుల్ రైడర్లను కూడా తీసుకోవాలి. ► హోమ్ ఇన్సూరెన్స్: రీప్లేస్మెంట్ కాస్ట్ క్లాజ్ ఉందేమో చూసుకోవాలి. ఇది ఉంటే అప్పుడు ఇంటి పునరి్నర్మాణానికి కావాల్సినంత బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంట్లోని విలువైన గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సైతం కవరేజీ ఉండాలి. మరమ్మతులు, ప్లంబింగ్, కార్పెంటరీ, పెస్ట్‌కంట్రోల్ కవరేజీ ఉందేమో చూడాలి. దాదాపు అన్ని రకాల నష్టాలకు పరిహారం ఇచ్చే సమగ్రమైన ప్లాన్‌ను తీసుకోవడమే సరైనది. ► వెక్టార్ బోర్న్ డిసీజ్: తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెక్టార్ బోర్న్ డిసీజ్‌కు కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే విడిగా కొనుగోలు చేసుకోవాలి. విడిగా ఒక్కో వ్యాధి, దానికి ఉప పరిమితుల గురించి అడిగి తెలుసుకోవాలి. బీమా లేక భారీ నష్టం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కోసారి గణాంకాలను చూస్తే కానీ అర్థం కాదు. 2001 నుంచి ప్రకృతి విపత్తుల కారణంగా 85,000 మంది మరణించగా, వేలాది కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. హోమ్ ఇన్సూరెన్స్ కేవలం 8 శాతం మందే కలిగి ఉండడంతో, పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వచి్చనట్టు వాస్తవాన్ని గుర్తు చేసింది. 1900 నుంచి ప్రకృతి వైపరీత్యాల పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. మన దేశంలో 764 సహజ విపత్తులు సంభవించాయి. తుపానులు, వరదలు, భూకంపాలు, కొండ చరియలు విరిగి పడడం, కరువు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా 1900 నుంచి 2000 మధ్య 361 పెద్ద వైపరీత్యాలు నమోదు కాగా, ఆ తర్వాత 22 ఏళ్లలో (2001–2022) 402 విపత్తులు చోటు చేసుకున్నాయి. అంటే గతంతో పోలిస్తే ప్రకృతి విపత్తులు పెరిగిపోయినట్టు ఈ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా 41 శాతం వైపరీత్యాలు వరదల కారణంగా సంభవించినవే ఉన్నాయి. ఆ తర్వాత తుపానుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో వచి్చన వరదల కారణంగా రూ. 52,500 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇందులో బీమా కవరేజీ ఉన్నది కేవలం 11 శాతం ఆస్తులకే కావడం వాస్తవం. ఇంటికి, ఆస్తులకు, ఆరోగ్యానికి, జీవితానికి బీమా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. -
సొంతింటి కల నెరవేరేలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాల ప్రజలు తమదైన అంచనాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు. బడ్జెట్లో ఏయే వర్గాలకు ఊరట ఉంటుందనే అంశంపైనా పలు అంచనాలు వెల్లడవుతున్నాయి. హోం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను నుంచి ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెసులుబాటు ఇస్తారని భావిస్తున్నారు. సెక్షన్ 80డీని విస్తరించడం ద్వారా లేదా గృహ, ఆరోగ్య, జీవిత బీమా చెల్లింపులపై ప్రత్యేక సెక్షన్ ద్వారా రిబేట్‌ను వర్తింపచేస్తారని భావిస్తున్నారు. అందుబాటు గృహాలకు బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రిబేటు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు గృహ బీమా రంగంలో మార్కెట్ వాటా కోసం శ్రమిస్తున్న ఐసీఐసీఐ లాంబార్డ్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ వంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకూ ప్రభుత్వ నిర్ణయం లాభించనుంది. కాగా గృహ బీమా పన్ను నుంచి ఊరట కల్పించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రీ బడ్జెట్ భేటీల సందర్భంగా బీమా కంపెనీలు కోరాయని చెబుతున్నారు. -
భవనం దెబ్బతింటే? బీమాతో నిర్మాణ వ్యయం భర్తీ!
► హోమ్ ఇన్సూరెన్స్‌తో సొంతింటికి ధీమా ► బీమాతో ఇంట్లోని విలువైన వస్తువులకూ రక్షణ ► గృహరుణ వ్యక్తి మరణిస్తే బ్యాంకులకు చెల్లింపులు కూడా.. కష్టార్జితం ధారపోసి సొంతిల్లుకొనడంతోనే సరిపోదు. దురదృష్టం వెంటాడి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ ఇల్లు నాశనం అయ్యిందా? గోవిందే! అందుకే ఈ మధ్య కాలంలో దేశంలో ఇంటికి బీమా చేయించుకోవటం బాగా పెరిగిపోయింది. హోమ్ ఇన్సూరెన్స్‌తో ప్రకృతి వైపరీత్యాలు,అగ్ని ప్రమాదాలు, దొంగతనాలతో జరిగే ఆస్తి, ఆర్ధిక నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు మరి! సాక్షి, హైదరాబాద్: ‘హోమ్ ఇన్సూరెన్స్’ ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న పేరు. సొంతగా ఇంటిని నిర్మించుకుంటున్న వారు కేవలం గృహరుణ చెల్లింపులకే కాకుండా ఇంటి మొత్తానికి బీమా రక్షణ తీసుకుంటున్నారు. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకున్నప్పుడు రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఇక చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి బ్యాంకులకు చెల్లిస్తుంది. అది కాకుండా నిర్మించుకున్న కలల సౌధానికి ఎటువంటి నష్టం జరిగినా దాన్ని భర్తీ చేసుకునేందుకు బీమా పథకాలు ఉన్నాయి. బీమా 2 రకాలు.. హోమ్ ఇన్సూరెన్స్‌లు రెండు రకాలుగా ఉంటాయి. 1. బిల్డింగ్ ఇన్సూరెన్స్ 2. కంటెంట్ ఇన్సూరెన్స్. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో.. ప్రధానంగా ఇంటి స్ట్రక్చర్‌కు బీమా రక్షణ ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి నిర్మాణం దెబ్బతింటే దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే వ్యయం లేదా కూల్చి పూర్తిగా కొత్తది కట్టుకోవాలంటే దానికి అయ్యే ఖర్చునూ బీమా కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకు భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటి నిర్మాణానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని బీమా కంపెని తిరిగి చెల్లిస్తుందన్నమాట. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్.. ఇందులో ఇంటిలోని విలువైన వస్తువులకు బీమా రక్షణ కల్పిస్తుంది. నగలు, బాండ్లకు రక్షణుండదు.. పాలసీ డాక్యుమెంట్లో వేటికి బీమా రక్షణ కల్పిస్తారు? వేటికి ఉండదో వివరంగా ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని ఒకసారి పరిశీలించడం మర్చిపోవద్దు. ఇంటిలో ఉండే నగదు, విలువైన కాగితాలు, బాండ్లు వంటి వాటికి బీమా రక్షణ ఉండదు. అలాగే 50 ఏళ్లు దాటిన ఇంటికి, పదేళ్లు దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా రక్షణను ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. దాదాపు అన్ని నాన్‌లైఫ్ (సాధారణ) బీమా కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా కంపెనీలతో పాటు ఇఫ్కో టోక్యో, ఐసీసీఐ లాంబార్డ్, టాటాఏఐజీ, బజాజ్ అలయంజ్ వంటి కంపెనీలు అందిస్తున్నాయి. భూకంప ప్రాంతాల్లో ఇల్లుంటే? ప్రీమియం ఎంత అనేది మీరు నివసించే ప్రాంతం, ఇంటికి భద్రతకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ప్రీమియం విలువలో సెస్మిక్ జోన్.. అంటే భూకంప రావడానికి ఉండే అవకాశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ సెస్మిక్ జోన్3లోకి వస్తుంది. అంటే భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. అదే విశాఖపట్నం వచ్చేసరికి భూకంప అవకాశాలు చాలా తక్కువ. దీని ప్రకారం విశాఖపట్నం కంటే హైదరాబాద్ ఇంటికి ప్రీమియం అధికం ఉంటుంది. కాని హైదరాబాద్‌కు సునామీ ముప్పు లేదు. అదే విశాఖపట్నంకు సునామీ తీవ్రత హెచ్చుగా ఉంటుంది. ఇలా ప్రీమియం లెక్కించేటప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకునే భద్రతా చర్యలు కూడా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. అత్యాధునికమైన లాకర్స్, దొంగతనం జరిగేటప్పుడు, అగ్నిప్రమాదం జరిగేటప్పుడు హెచ్చరించే అలారంలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియం ధరలు తగ్గుతాయి. సాధారణంగా భూకంపం, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అధిక అవకాశం ఉన్న వాటికి ప్రతీ రూ.1,000లకు రూపాయి ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. మిగిలిన వాటికి 70 పైసలు వరకు ఉంటుంది. అదే కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వస్తువుల విలువను విడివిడిగా లెక్కించి దాని ఆధారంగా బీమా రక్షణ విలువను లెక్కిస్తారు. -
మీ ఇల్లు భద్రమేనా..!
ఇంటి రుణానికే కాదు... ఇంటికీ బీమా పలు రైడర్లను కలిపి మరీ అందిస్తున్న సంస్థలు.. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు తప్పనిసరి నేపాల్ భూకంప దృశ్యాలు ఇంకా మన కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలతో పాటు లక్షల మందికి చెందిన ఇళ్లు కూలిపోయాయి. పలు నివాసాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జీవితకాలం కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇలా ప్రకృతి వైపరీత్యాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? వీటి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు పరిష్కారమల్లా బీమానే. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని ‘హోమ్ ఇన్సూరెన్స్’ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. ‘హోమ్ ఇన్సూరెన్స్’ ఇపుడిపుడే దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్న వారు కేవలం గృహరుణ చెల్లింపులకే కాకుండా ఇంటి మొత్తానికి బీమా రక్షణ తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యా తేడా ఏంటంటే... గృహరుణ చెల్లింపులకు మాత్రమే బీమా తీసుకున్న పక్షంలో గృహ రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగి మరణిస్తే ఇక చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి బ్యాంకులకు చెల్లించేస్తుంది. అలా కాకుండా ఇంటి మొత్తానికి బీమా తీసుకుంటే ఆ కలల సౌధానికి ఎటువంటి నష్టం జరిగినా దాన్ని భర్తీ చేసుకునే వీలుంటుంది. బీమా వ్యవహారిక భాషలో హోమ్ ఇన్సూరెన్స్‌ను రెండు రకాలుగా చెబుతారు. ఒకటి బిల్డింగ్ ఇన్సూరెన్స్. మరొకటి కంటెంట్ ఇన్సూరెన్స్. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా ఇంటి స్ట్రక్చర్‌కు బీమా రక్షణ ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి నిర్మాణం దెబ్బతింటే దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే వ్యయం లేదా కూల్చి పూర్తిగా కొత్తది కట్టుకోవాలంటే దానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకు భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటి నిర్మాణానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని బీమా కంపెని తిరిగి చెల్లిస్తుంది. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇది ఇంటిలోని విలువైన వస్తువులకు బీమా రక్షణ కల్పిస్తుంది. మరీ ఖరీదేం కాదు.. ప్రీమియం ఎంత అనేది మీరు నివసించే ప్రాంతం, ఇంటికి భద్రతకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ప్రీమియం విలువలో సీస్మిక్ జోన్.. అంటే భూకంపం రావడానికి ఉండే అవకాశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ సీస్మిక్ జోన్3లోకి వస్తుంది. అంటే భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. అదే విశాఖపట్నం వచ్చేసరికి భూకంప అవకాశాలు చాలా తక్కువ. దీని ప్రకారం విశాఖపట్నం కంటే హైదరాబాద్ ఇంటికి ప్రీమియం అధికం ఉంటుంది. కాని హైదరాబాద్‌కు సునామీ ముప్పు లేదు. అదే విశాఖపట్నంకు సునామీ తీవ్రత హెచ్చుగా ఉంటుంది. ఇలా ప్రీమియం లెక్కించేటప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకునే భద్రతా చర్యలు కూడా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. అత్యాధునికమైన లాకర్స్, దొంగతనం జరిగేటప్పుడు, అగ్నిప్రమాదం జరిగేటప్పుడు హెచ్చరించే అలారం వంటివి ఏర్పాటు చేసుకుంటే ప్రీమియం ధరలు తగ్గుతాయి. సాధారణంగా భూకంపం, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అధిక అవకాశం ఉన్న వాటికి ప్రతీ రూ.1,000లకు రూపాయి ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. మిగిలిన వాటికి 70పైసలు వరకు ఉంటుంది. అదే కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వస్తువుల విలువను విడివిడిగా లెక్కించి దాని ఆధారంగా బీమా రక్షణ విలువను లెక్కిస్తారు. రైడర్లు ఉన్నాయి.. ఇప్పుడు అన్ని పాలసీలకు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందే రైడర్లను అందిస్తున్నారు. అలాగే హోమ్ ఇన్సూరెన్స్‌లో ఉగ్రవాదుల దాడి, పర్సనల్ యాక్సిడెంట్, సొంతింటి నిర్మా ణం పూర్తి అయ్యే వరకు నివాసము ఉండటానికి అద్దె చెల్లించే విధంగా పలు రైడర్లు అందుబాటులో ఉన్నాయి. అన్నీ డాక్యుమెంట్‌లోనే... పాలసీ డాక్యుమెంట్లో వేటికి బీమా రక్షణ కల్పిస్తారు, వేటికి ఉండదో వివరంగా ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని ఒకసారి పరిశీలించడం తప్పనిసరి. ఇంటిలో ఉండే నగదు, విలువైన కాగితాలు, బాండ్లు వంటి వాటికి బీమా రక్షణ ఉండదు. వీటిని ఇంటిలోని వారే దొంగలించి పోయినట్లు తప్పుడు క్లెయిమ్‌లకు దరఖాస్తు చేసే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇంటిలోని వస్తువులకు బీమా రక్షణ కల్పించేటప్పుడు ఆ ఇంటికి ఉండే భద్రత వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే 50 ఏళ్ళు దాటిన ఇంటికి, పదేళ్ళు దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా రక్షణను ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఇంటిలో బంగార వస్తువుల విషయానికి వస్తే.. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు. కానీ ఈ ప్రీమియం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాదాపు అన్ని నాన్‌లైఫ్ (సాధారణ) బీమా కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. అద్దె ఇంట్లో ఉంటున్న వారు కేవలం కంటెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రభుత్వ రంగ కంపెనీలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్, నేషనల్, యునెటైడ్ ఇండియా కంపెనీలతోపాటు ఇఫ్కో టోక్యో, ఐసీసీఐ లాంబార్డ్, టాటాఏఐజీ, బజాజ్ అలయంజ్ వంటి కంపెనీలు దీన్ని అందిస్తున్నాయి. ఇంటి విలువను ఎలా లెక్కిస్తారు? ఇంటి విలువను లెక్కించడంలో స్థలం విలువను పరిగణనలోకి తీసుకోరు. అలాగే బహిరంగ మార్కెట్లో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు లేదా ఇప్పుడున్న ఇంటిని కూల్చి తిరిగి నిర్మించాలంటే ఎంత వ్యయం అవుతుందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ ఇంటిని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో(బిల్డప్ ఏరియా) నిర్మించారనుకుందాం. ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకి రూ.1200లు అయితే అప్పుడు మీ ఇంటి విలువ రూ. 12,00,000 అవుతుంది. అంటే గరిష్టంగా రూ.12 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
క్లెయిమ్‌కు దారిదీ!
బీమా కంపెనీలందించే సేవల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్లెయిమ్. అన్ని కాగితాలతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కంపెనీలు ఏడు రోజుల్లోపే వీటిని పరిష్కరిస్తాయి. కానీ సరైన సమాచారం ఇవ్వకుండా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే మటుకు బీమా కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అసలు క్లెయిమ్ చెయ్యడానికి ఏవి అవసరమో, ఏ పత్రాలు కావాల్సి వస్తాయో ఓసారి చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్.. ఇందులో 2 రకాల క్లెయిమ్లుంటాయి. ఒకటి క్యాష్‌లెస్. మరోటి రీ-ఇంబర్స్మెంట్. క్యాష్‌లెస్ సౌకర్యం ఉంటే బీమా కంపెనీ సూచించిన ఆసుపత్రిలో చేరి పాలసీతో పాటు మీకిచ్చిన కార్డును ఇస్తే సరిపోతుంది. మిగిలినదంతా వారే చూసుకుంటారు. అదే రీ-ఇంబర్స్మెంట్ అయితే కనుక బిల్లులు మొత్తం జాగ్రత్త చేసి వాటిని క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బీమా కంపెనీ వీటిని పరిశీలించిన తర్వాత క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్.. ఇతర క్లెయిమ్‌లతో పోల్చితే హోమ్ ఇన్సూరెన్స్ విషయంలో కొద్దిగా హోం వర్క్ ఎక్కువ చేయాలి. వరదలు, తుపాను, అగ్ని ప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం వివరాలను పూర్తిగా వాటి వాస్తవ విలువలతో తెలియజేయాల్సి ఉంటుంది. ఇతర సంఘటనలో జరిగిన నష్టాల్లో కూడా నష్టపోయిన ఆస్తి విలువలను (అసలు) పేర్కొంటూ క్లెయిమ్ మొత్తాన్ని కోరాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసిన తర్వాత సర్వేయర్ వచ్చి నష్టం విలువ అంచనా వేస్తాడు. అదే దొంగతనం, దోపిడీ వంటి విషయాల్లో అయితే పై వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆనంద్కి దూరదృష్టి ఎక్కువే. తను ఉన్నా.. లేకున్నా తన కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలూ తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తగిన బీమా పాలసీ కూడా తీసుకున్నాడు. కానీ, తను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టాలూ రాకూడదన్న ఉద్దేశంతో పాలసీలు తీసుకున్న ఆనంద్.. ఆవిషయాన్ని మాత్రం భార్యకు చెప్పలేదు. అప్పుడప్పుడు ఆయన చెప్పబోతే.. అలాంటి అపశకునం మాటలెందుకంటూ ఆయన భార్య పెద్ద రాద్ధాంతమే చేసేది. దీంతో ఎప్పుడూ వారిద్దరూ తమ పాలసీలు, క్లెయిమ్‌ల గురించి చర్చించుకోవటమే కుదరలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదాలు మనకు తెలిసిరావు. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన భార్య కష్టాలు. అసలు ఆనంద్ ఏ పాలసీలు తీసుకున్నాడో ఆమెకు తెలియదు. ఆయన ఎక్కడెక్కడ డిపాజిట్లు చేశాడో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న పత్రాల ఆధారంగా కొన్ని పాలసీల గురించి తెలుసుకుంది. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలన్న అవగాహన కూడా ఆమెకు లేదు. చివరికి బంధువుల సహాయంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే క్లెయిమ్‌లు పూర్తి చేసింది. ఇంకా విచిత్రమేమిటంటే ఆనంద్ మరణించిన ఆరు నెలలకు ఓ బీమా కంపెనీ నంచి ప్రీమియం కట్టాలంటూ లేఖ వచ్చింది. దాంతో ఆ పాలసీ కూడా ఉన్నట్లు ఆయన భార్యకు తెలిసి.. ఆ క్లెయిమ్ కూడా పూర్తి చేసింది. ఆనంద్ కట్టిన పాలసీలన్నింటినీ ఆయన భార్య క్లెయిమ్ చేసిందా. అన్న ప్రశ్నకు నిజామానికి ఆమె దగ్గర సమాధానమే లేదు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుటుంబీకులతో చర్చించకపోతే అసలు లక్ష్యం నెరవేరటం కష్టం. పెపైచ్చు క్లెయిమ్‌పై కూడా అవగాహన అవసరం. లేదంటే సమయం, డబ్బు వృథా కాకతప్పదు. జీవిత బీమాతో పాటు, ఆటో, హెల్త్, ట్రావెల్, ఇన్సూరెన్స్‌ల విషయంలో క్లెయిమ్ ఎలా చేయాలన్న విషయమై అవగాహన పెంచేందుకు ఈ ప్రాఫిట్ కథనం.. మోటార్ ఇన్సూరెన్స్.. ఇందులో యాక్సిడెంట్ క్లెయిమ్, ఓన్ డ్యామేజీ, దొంగతనం వంటి రకరకాల క్లెయిమ్లుంటాయి. ముందుగా యాక్సిడెంటల్ క్లెయిమ్ గురించి చూస్తే. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. - ప్రమాదానికి మరో వాహనం కారణమైతే వెంటనే ఆ వాహనం నంబర్ రాసుకోవాలి. - అలాగే ఆ ప్రమాదానికి ఎవరైన ప్రత్యక్ష సాక్షులుంటే వారి వివరాలు, చిరునామా లేదా ఫోన్‌నంబర్లు సేకరించి పెట్టుకోవాలి. - ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించాలి. - ఒక వేళ మీరే ఎదుటి వాహనాన్ని ఢీకొన్నా.. థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం జరిగితే పారిపోకుండా సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం అందించండి. ఢీకొట్టి పారిపోవటాన్ని మన చట్టాలు అతిపెద్ద నేరంగా పరిగణిస్తాయి. - ప్రమాదం తర్వాత మీ వాహనం కదల్లేని స్థితిలో ఉంటే బీమా కంపెనీకి ఆ సమాచారం అందించి దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్లండి. - ప్రమాదం జరిగిన వెంటనే తొలుత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాక క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించాలి. నేరుగా లేదా ఏజెంట్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయవచ్చు. కావాల్సిన పత్రాలు.. - సంతకం చేసిన క్లెయిమ్ దరఖాస్తు - పాలసీ డాక్యుమెంట్లు (మొదటి రెండు పేజీలు) - వాహనం ఆర్సీ కాపీ - మీ డ్రైవింగ్ లెసైన్స్ - రిపేరు వ్యయానికి సంబంధించి ఒరిజినల్ బిల్ ఈ కాగితాలన్నీ జతపరిచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే చాలు. థర్డ్‌పార్టీ, దొంగతనం, యాక్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజీలకే ఎఫ్ఐఆర్ కావాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్వేయర్ వచ్చి నష్టాన్ని అంచనా వేసి క్లెయిమ్ మొత్తాన్ని నిర్ధారిస్తాడు.ఇప్పుడు చాలా కంపెనీలు రిపేర్లకు క్యాష్‌లెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే బీమా కంపెనీ ప్యానెల్లో ఉన్న గ్యారేజీల్లో ముందు డబ్బులివ్వకుండానే రిపేరు చేయించుకోవచ్చు. సర్వేయర్ గ్యారేజీకొచ్చి నష్టాన్ని చూసి క్లెయిమ్‌ను అంచనా వేస్తాడు. ఆ మొత్తాన్ని గ్యారేజీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆ మొత్తాన్ని మీరే చెల్లించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం విదేశాలకెళ్లినప్పుడు ప్రయాణంలో బ్యాగేజీ పోవడమో, దెబ్బతినటమో జరిగినప్పుడు ప్రయాణం ఆలస్యం వల్ల నష్టం జరిగినా విమానం రద్దు కావటమో మరోటి జరిగి ప్రయాణం రద్దయి నష్టపోతే.. పాస్‌పోర్ట్ పోవటం, ప్రమాదం, ఆసుపత్రి పాలు కావటం.. తదితరాలు జరిగితే బీమా ర క్షణ ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీది తీసుకున్నారో ఆ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్, పాలసీ నంబర్ దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు. మీరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా క్లెయిమ్ సంభవించినప్పుడు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే కంపెనీ దగ్గర్లోని క్యాష్‌లెస్ సౌకర్యం ఉన్న ఆసుపత్రి వివరాలతో పాటు అక్కడెలా క్లెయిమ్ చెయ్యాలన్న విషయంలో కూడా మీకు సహాయం చేస్తుంది. జీవిత బీమా.. జీవిత బీమాలో క్లెయిమ్ రెండు రకాలు. ఒకటి మెచ్యూరిటీ క్లెయిమ్ కాగా, రెండోది డెత్ క్లెయిమ్. మెచ్యూరిటీ క్లెయిమంటే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారు చేతికి వచ్చే మొత్తం. దీనికి మనం చేయాల్సింది ఏమీ ఉండదు. పాలసీ కాలపరిమితి ముగియగానే చాలా బీమా కంపెనీలు నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాయి. లేదంటే మీ పేరు మీద చెక్కును మీ ఇంటికే పంపిస్తాయి. దీనికన్నా నెల రోజుల ముందు మీ పాలసీ గడువు పూర్తి కావ స్తోందని.. మెచ్యూరిటీ క్లెయిమ్ అందబోతోందని చెబుతూ ఒక పత్రాన్ని పంపిస్తాయి. దానిపై సంతకం పెడితే చాలు. అలాంటి పత్రాలేవీ రానట్లయితే దగ్గర్లోని బ్రాంచిని కానీ, ఏజెంట్‌ను కానీ సంప్రదిస్తే దానికి సంబంధించిన కాగితాలిస్తారు. డెత్ క్లెయిమ్.. మెచ్యూరిటీ క్లెయిమ్‌తో పోలిస్తే దీని విధానం కొంత సుదీర్ఘం. ఇక్కడ పాలసీదారుడికి కాకుండా నామినీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలన్నీ క్లెయిమ్‌లను ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలించి కానీ సెటిల్ చెయ్యవు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని కాగితాలు ఉంటే క్లెయిమ్‌ను దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోపు సెటిల్ చేస్తారు. లేదంటే కొంత ఆలస్యమవుతుంది. అయితే బీమా నియంత్రణ రెగ్యులేటరీ సంస్థ (ఐఆర్ డీఏ) నిబంధనల ప్రకారం ఏ క్లెయిమ్నైనా దరఖాస్తు చే సిన 30 రోజుల్లోగా సెటిల్ చేయాలి. లేకపోతే వివాదాల పరిష్కార సెల్‌ను ఆశ్రయించవచ్చు. ఇవీ కావాల్సిన పత్రాలు.. - బీమా కంపెనీలకు క్లెయిమ్ కోరుతూ ఇచ్చే దరఖాస్తుతో పాటు పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. - ప్రమాదంలో మరణించినట్లయితే దాని ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలి. - ఏదైనా వ్యాధితో మరణిస్తే వైద్య చికిత్సకు సంబంధించిన కాగితాలు, డిశ్చార్జి కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది. - మీరిచ్చిన సమాచారంతో బీమా కంపెనీలు తృప్తి చెందితే క్లెయిమ్‌ను వెంటనే పరిష్కరిస్తాయి. లేకపోతే అదనపు సమాచారాన్ని అడగవచ్చు. సాధారణ బీమా విషయానికొచ్చే సరికి ఇందులో మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి అవసరమైన సందర్భాల్లో క్లెయిమ్ చెయ్యటం మాత్రమే ఉంటుంది. వీటిలో చాలా కేసుల్లో మనకు ఎఫ్ఐఆర్ అవసరమవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్, హోమ్, హెల్త్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ ఎలా చేయాలో, ఏ పత్రాలు అవసరమవుతాయో ఓ సారి చూద్దాం. మొదట ఏం చేయాలంటే.. - పాలసీదారు మరణించిన సందర్భంలో క్లెయిమ్ కు ఆ మరణం విషయాన్ని సాధ్యమైనంత త్వర గా బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలపాలి. - పాలసీదారు పేరు, పాలసీ నంబర్, మరణించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలు తెలియజేయాలి. - క్లెయిమ్ ఫారాన్ని మీ దగ్గర్లోని బ్రాంచి కార్యాలయం లేదా బీమా ఏజెంట్ ద్వారా పొందవచ్చు. కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి క్లెయిమ్ చేయడానికి తగిన సమాచారాన్ని ఇస్తారు.