Hooda
-
‘సర్జికల్స్’పై అతి వద్దు
ఛండీగఢ్: రెండేళ్ల క్రితం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేసిన సర్జికల్ దాడులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఉడీ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులపై తొలినాళ్లలో సంబరాలు చేసుకోవడం సహజమేనని, కానీ అదే పనిగా ఆ విజయాన్ని ప్రచారం చేయడం తగదని మాజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. 2016, సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు జరిగిన సమయంలో హూడా నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఛండీగఢ్‌లో శుక్రవారం ప్రారంభమైన మిలిటరీ సాహిత్య వేడుకలో ‘సీమాంతర ఆపరేషన్లు, సర్జికల్ దాడుల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మిలిటరీ చర్యల్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సర్జికల్ దాడుల ఆపరేషన్‌ను రహస్యంగా చేస్తే బాగుండేదని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. ఉగ్రవాదుల ఆవాసాల్ని కకావికలం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా ఈ ఆపరేషన్ వ్యూహాత్మక లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు దిగే ముందు శుత్రు మూకలపై వాటి ప్రభావం దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలని సూచించారు. పంజాబ్ గవర్నర్ వీపీ బాద్నోర్, పలువురు మాజీ ఆర్మీ కమాండర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మీని సొంత ఆస్తిలా భావించారు: కాంగ్రెస్ డీఎస్ హూడా నిజమైన సైనికుడిలా మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కితాబిచ్చారు. సర్జికల్ దాడుల్ని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. ‘ మిస్టర్ 36( 36 రఫేల్ విమానాల కొనుగోళ్లనుద్దేశిస్తూ) మిలిటరీని నిస్సిగ్గుగా తన సొంత ఆస్తిలా వాడుకున్నారు. రఫేల్ ఒప్పందంతో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’ అని ట్వీట్ చేశారు. సర్జికల్ దాడులపై ఛాతీ చరుస్తూ మోదీ చేసిన చిల్లర రాజకీయాల్ని హూడా బట్టబయలు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలపై రాజీపడి ప్రధాని దేశం ముందు దోషిగా నిలబడ్డారని పేర్కొన్నారు. -
‘మోదీ బండారం బట్టబయలు’
సాక్షి, న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) డీఎస్ హుడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. సర్జికల్ దాడులను రాజకీయంగా వాడుకున్నారని, అతిగా ప్రచారం చేశారని హుడా వ్యాఖ్యానించారు. 2016, సెప్టెంబర్ 29న భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులు జరిగినప్పుడు ఆర్మీ నార్త్ కమాండ్ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హుడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన నిజమైన సైనికుడిలా మాట్లాడారని ప్రశంసించారు. సర్జికల్ దాడులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడటం లేదని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. ‘ నిజమైన సైనికుడిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యాన్ని సొంత ఆస్తిలా వాడుకునేందుకు మిస్టర్ 36 మాత్రం ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్ దాడులను ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. రఫేల్ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడి అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు లబ్ది చేకూర్చార’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Spoken like a true soldier General. India is so proud of you. Mr 36 has absolutely no shame in using our military as a personal asset. He used the surgical strikes for political capital and the Rafale deal to increase Anil Ambani’s real capital by 30,000 Cr. #SurgicalStrike https://t.co/IotXWBsIih — Rahul Gandhi (@RahulGandhi) 8 December 2018 సర్జికల్ దాడులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ప్రధాని మోదీ బండారాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జెవాలా కూడా హుడాకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం తగదన్నారు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన మోదీ దోషి అని ట్వీట్ చేశారు. తన స్వార్థం కోసం వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. Thank you Lt.Gen.Hooda for exposing the petty politicisation by PM Modi! No one can use the valour & sacrifice of our brave soldiers to score cheap political points Modiji is squarely guilty of compromising National Security & Strategic Interests by unwarranted chest thumping! pic.twitter.com/VjrUxS3alC — Randeep Singh Surjewala (@rssurjewala) 8 December 2018 -
సర్జికల్ దాడులకు వీడియో సాక్ష్యం..!
న్యూఢిల్లీ : దాదాపు రెండేళ్ల క్రితం (దాదాపు 636 రోజుల కిందట) పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) వీడియోలు తాజాగా విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన ‘టెర్రర్ లాంచ్ఫాడ్’లను ధ్వంసం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా భావిస్తున్నారు. కశ్మీర్ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి జొరపడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను మట్టుపెట్టారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా తమ సత్తా చాటారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన నాలుగు వీడియోలున్నాయి. ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్న విపక్షాలు... 2016లో జరిగిన దాడులను ఓటుబ్యాంక్‌గా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం తాజాగా వీడియోలు విడుదల చేసిందని కాంగ్రెస్ విమర్శించింది.సర్జికల్ స్ట్రయిక్స్ నుంచి ఓట్లరూపంలో ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్‌కు మద్దతు తెలిపిన ఎన్డీఏ మిత్రపక్షం జేడీ(యూ) కూడా అప్పటి మెరుపుదాడులతో ఏమి సాధించారని ప్రశ్నించింది. ఇప్పుడు వీడియోలు బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోపై కాంగ్రెస్ స్పందన పాకిస్తాన్ టెర్రరిస్టులను ప్రోత్సహించేదిగా ఉందంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ విరుచుకుపడ్డారు. అసలప్పుడేం జరిగింది ? పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఎంచుకున్న ఉగ్రవాద లక్ష్యాల గురించి వివరించే పటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దాడిలో పాల్గొన్న సైనికులకు అమర్చిన కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులను చిత్రీకరించారు. దాడులకు ముందు, ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా తెలిసేలా రికార్డ్ చేశారు. ఈ కెమెరాల ద్వారా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి, ఆ తర్వాత రాకెట్ లాంఛర్లు, యాంటీ బంకర్ మిసైల్స్‌ని ప్రయోగించి పాక్ టెర్రర్ బంకర్లు ధ్వంసం చేయడాన్ని మొదటి వీడియోలో చిత్రీకరించారు. రెండు నిముషాల వ్యవధిలోనే రెండో లక్ష్యంపై దాడి చేయడాన్ని యూఏవీల ద్వారా రికార్డ్ చేశారు. మరో 20 సెకన్ల వ్యవధిలోనే జరిపిన దాడిలో ఉగ్రవాదుల బంకర్ ధ్వంసం కావడాన్ని కెమెరాల్లో బంధించారు. ఈ విధంగా మొత్తం 8 దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతం కావడం కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జమ్ము,కశ్మీర్ సరిహద్దులోని ఆధీనరేఖ (ఎల్ఓసీ)కు కొన్ని కి.మీ లోపలికి వెళ్లి పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు నెలమట్టం చేయడానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఈ స్థావరాల్లో తీవ్రవాదులు, సైనికులు కలగలిసి స్వేచ్ఛగా తిరగడం ఈ వీడియోల్లో రికార్డయింది. దాడి జరిగిన తేదీ, సమయం కూడా వీడియోల్లో స్పష్టంగా నమోదైంది. గతంలోనూ ‘సర్జికల్ స్ట్రయిక్స్’... గత రెండుదశాబ్దాల్లో పలు సందర్భాల్లో మెరుపుదాడులు జరిగాయని కాంగ్రెస్ నేత సుర్జేవాలా వెల్లడించారు. ఆ జాబితా ఇదే... –2000 జనవరి 21న నీలం నది వ్యాప్తంగా నడాలా ఎన్‌క్లేవ్‌లో... –2003 సెప్టెంబర్ 18న ఫూంచ్‌లోని బారా సెక్టర్లో... –2008 జూన్ 19న ఫూంచ్‌లోని భట్టల్ సెక్టర్లో... –2011 సెప్టెంబర్ 1న నీలంనది లోయలోని కెల్ (శారద సెక్టర్) ప్రాంతంలో... –2013 జనవరి 6న సావన్ పత్ర చెక్‌పోస్ట్... –2013 జులై 27–28 తేదీల్లో నజాపిర్ సెక్టర్లో... –2013 ఆగస్టు 6న నీలం లోయలో... –2014 జనవరి 14న మరో మెరుపు దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. -
టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా
– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్–44పై ఆందోళన – పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి కర్నూలు సిటీ: టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా ఏదో ఉందని.. అందువల్లే హోదాపై బాబు వెనక్కు తగ్గారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్యాకేజీ వస్తే కాంట్రాక్టుల పేరిట టీడీపీ నేతలకు దోచిపెట్టే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మొదటి నుంచి అదే పాట పాడుతున్నాడని విమర్శించారు. విభజన బిల్లులో హోదా విషయం ఎందుకు పెట్టలేదనే విషయాన్ని ఆనాడు బీజేపీ ఎందుకు కోరలేదని.. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ, బీజేపీలు కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో 11 రాష్ట్రాల విభజనలు జరిగిన సమయంలోనే జాతీయ అభివద్ధి మండలి ఆమోదం, కేంద్ర కేబినెట్ తీర్మానాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుపతి సభలో కాంగ్రెస్ పార్టీ హోదా ఐదేళ్లు ఇస్తామంటుందని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని బీజేపీ నేతలు చెప్పగా, కాదు కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు కోరిన మాటలను ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇస్తామని చెప్పినవే ఇవ్వలేమని మాట మార్చిన మీరు.. చెప్పనివి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సీఎం తన తీరు మార్చుకోకపోతే ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. బాబుకు ప్రతిపక్ష పార్టీలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీలను కలుపుకుపోదామనే భావనే ఆయనకు లేదన్నారు. హోదా సాధించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు కొంత నిరాశ కలగనుంది. ఆయన రణదీప్ హుడా కోసం పాట పాడటం లేదని తెలిసింది. సుల్తాన్ సినిమా షూటింగ్ తో బిజిబిజీగా ఉన్న సల్మాన్... గతంలో మేహూ హీరో తేరా, హ్యాంగోవర్ వంటి పాటలు పాడి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రణదీప్ హూడా కోసం ఓ పాటను పాడిద్దామనుకున్నారు. అదే విషయాన్ని గతంలో రణదీప్ వెల్లడించాడు కూడ. సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాల్ రంగ్' సినిమా కోసమే సల్మాన్ తో పాట పాడించాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు రావడం, మరోపక్క, సుల్తాన్ చిత్రంతో సల్మాన్ ఖాన్ బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి సల్మాన్ పాట పాడలేకపోవచ్చని, తదుపరి చిత్రం కోసం పాడించే ప్రయత్నం చేస్తామని రణ్ దీప్ స్వయంగా చెప్పారు. అక్షయ్ ఓబ్రాయ్, పియా బాజ్ పేయ్ ప్రముఖ తారాగణంగా రూపొందుతున్న లాల్ రంగ్ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమౌతోంది. -
గుర్గావ్లో యాదవుల యుద్ధం
గుర్గావ్: ఢిల్లీకి దక్షిణాన కొలువైన గుర్గావ్ను పేద, ధనికవర్గాల ప్రజలతోపాటు పట్టణ, పల్లెలున్న ప్రాంతంగా చెప్పుకుంటారు. కార్పొరేట్ టవర్లు, రెసిడెన్షియల్ టవర్లేకాదు పర్ణకుటీరాల్లాంటి గుడిసెలు కనిపించే పల్లెలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో చెప్పుకునే గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారందరూ యాదవులే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో యాదవుల జనాభా గెలుపోటములను శాసించే స్థాయిలో లేకపోయినా దాదాపు పోటీలో ఉన్న మూడు పార్టీలు యాదవ అభ్యర్థులనే రంగంలోకి దించాయి. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రావ్ ధర్మపాల్యాదవ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. రేవారి నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం భూపిందర్‌సింగ్ హూడా కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న అజయ్‌సింగ్ యాదవ్ ఈసారి గుర్గావ్ లోక్‌సభ సీటును తన తనయుడు చిరంజీవ్ రావ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న రెండో యాదవ అభ్యర్థి చిరంజీవ్రావ్ యాదవ్ అవుతారు. ఇక సిట్టింగ్ ఎంపీ ఇంద్రజీత్ సింగ్(ఈయన కూడా యాదవుల సామాజికవర్గానికి చెందినవారే) ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ గుర్గావ్ టికెట్‌ను ఈయనే ఇస్తామని హామీ ఇవ్వడంతో దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఇంద్రజీత్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న యాదవ అభ్యర్థి ఇంద్రజీత్ కానున్నారు. ఇక కొత్త సంచలనం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యూహాత్మకంగా యాదవ అభ్యర్థినే బరిలోకి దించింది. ఆ పార్టీలో కీలకసభ్యుడిగా వ్యవహరిస్తున్న యోగేందర్ యాదవ్ గుర్గావ్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నా మిగతా యాదవ అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఏఎన్ఎల్డీ) నుంచి మాత్రం ముస్లిం అభ్యర్థి జాకీర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. గుర్గావ్లోని 1,80,000 మంది ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నలుగురు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏప్రిల్ 10న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 9 అసెంబ్లీ నియోజకవర్గాలమేర గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం విస్తరించింది. గుర్గావ్, బాద్షాపూర్ సెగ్మెంట్లనే హర్యానాలో అతిపెద్దవిగా చెప్పుకుంటారు. ఈ రెండు సెగ్మెంట్లలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో పటౌడీ, రేవారి, బావల్, సో్న, ఫిరోజ్‌పూర్, ఝిర్కా, పున్హానా, నూహ్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. యాదవులు, రావ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో వారి ఓట్లు దాదాపు 5,00,000 పైగానే ఉంటాయి. ముస్లిం ఓటర్లు 4,50,000 వరకు ఉన్నారు. ఇక గెలుపోటములను శాసించే స్థాయిలో జాట్ల జనాభా కూడా ఉంది. ఈ ఓటర్ల సంఖ్య దాదాపు 1,50,000 పైనే ఉంటుంది. ఐఎన్ఎల్ పార్టీకి ఇప్పటికే జాట్ మద్దతు పుష్కలంగా ఉంది. దీంతో మిగతా సామాజికవర్గాల్లో ఎక్కువగా ఉన్న యాదవులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌లు యాదవ అభ్యర్థులను బరిలోకి దించాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ రావ్ ఇంద్రజీత్ సింగ్‌కు దక్షిణ హర్యానా సమస్యలను పార్లమెంటులో బలంగా వినిపించిన నేపథ్యం ఆయనను గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇక పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చరిష్మా యోగేంద్ర యాదవ్‌ను గెలిపిస్తాయని ఆప్ నమ్ముతోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 10న జరిగే ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం గెలిచే అభ్యర్థులెవరో చెప్పకనే చెబుతుందంటున్నారు. అందరూ యాదవులే.. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.