hot spot
-
Maharashtra: ‘హాట్ స్పాట్’ వివాదం.. బ్యాంక్ మేనేజర్ హత్య
పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ హత్య చోటుచేసుకుంది. మొబైల్ హాట్ స్పాట్ ఇచ్చే విషయంలో వివాదం చోటుచేసుకుని అది బ్యాంక్ మేనేజర్ హత్యకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాసుదేవ్ రామచంద్ర కులకర్ణి(47)ని నలుగురు కుర్రాళ్లు హత్య చేశారు. కులకర్ణి తన ఇంటి దగ్గర వాకింగ్‌కు వెళుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కులకర్ణిని మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేయాలని అడిగారు. ఆయన అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఆగ్రహంతో ఆ యువకులు బ్యాంక్ మేనేజర్‌పై దాడిచేసి హత్య చేశారు. ఈ ఉందంతంలో నిందితులును పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ కథలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో తమిళంలో రిలీజైన 'హాట్ స్పాట్' మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి!కథేంటి?రివేంజ్, యాక్షన్, ప్రేమ కథలు విని విని ఓ నిర్మాతకు చిరాకొస్తుంది. అలాంటి టైంలో స్టోరీలు పట్టుకుని డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న మహమ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) వస్తాడు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వనని అనడంతో ఓ నాలుగు కథల్ని ఎదురుగా కూర్చున్న నిర్మాతకు చెప్తాడు. ఇంతకీ ఆ నాలుగు స్టోరీలు ఏంటి? ఇవన్నీ విన్న తర్వాత నిర్మాత ఏమన్నాడు? అసలు షఫీ.. సదరు నిర్మాతకే ఎందుకు చెప్పాడు అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?దీన్ని సినిమా అనడం కంటే 'ఆంథాలజీ' అనొచ్చు. 'హ్యాపీ మ్యారీడ్', 'గోల్డెన్ రూల్', 'టమాటో చట్నీ', 'ఫేమ్ గేమ్' అనే నాలుగు వేర్వేరు కథల్ని ఓ సినిమాగా తీశారు. చూస్తున్నంతసేపు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఎందుకంటే అంతలా ఆశ్చర్యపరుస్తాయి. అవాక్కయ్యేలా చేస్తాయి. ఏడిపిస్తాయి. భయపెడతాయ్!పెళ్లి తర్వాత ఆడపిల్లలు.. తమ ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి? అనేదే మొదటి స్టోరీ. ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? అనేది రెండో స్టోరీ. తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి.. మూడో స్టోరీ. టీవీ షోల వల్ల పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది నాలుగో స్టోరీ.ఈ సినిమాలో ఒక్కో స్టోరీ ఒక్కో ఆణిముత్యం. ఎందుకంటే ఏ మూవీలో అయినా ఒకటో రెండో సీన్లు వేరే వాటితో పోలిక రావొచ్చు. కానీ ఇందులో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చూస్తున్న మీకే నమ్మశక్యం కాని విధంగా సన్నివేశాలు ఉంటాయి. మొదటి కథ కాస్త కొత్తగా ఉంటుంది. చివరికొచ్చేసరికి ఆలోచింపజేస్తుంది. రెండో కథలో ఓ ట్విస్ట్ ఉంటుంది. అది ఇబ్బందిగా అనిపిస్తూనే మైండ్ బ్లాంక్ చేస్తుంది. మూడో కథ అయితే రెండో దానికంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మూడు స్టోరీలు.. యూత్‌ని టార్గెట్ చేసి తీసినవే.నాలుగో కథలో మాత్రం పిల్లలు.. ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోల కల్చర్ వల్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది చూపిస్తారు. చిన్న పిల్లలున్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన స్టోరీ ఇది. అయితే ఈ నాలుగింటిలోనూ దేనికది బాగానే ఉంటాయి కానీ మొదటి, చివరి స్టోరీలో మాత్రమే సరైన ముగింపు ఉంటుంది. మిగతా రెండింటిని మధ్యలో ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ విఘ్నేశ్ కార్తీక్ రాసుకున్న స్క్రిప్ట్ మేజర్ హైలైట్. చూపించేది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ ఫన్నీ వేలో చెప్పడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రాఫీ ఫెర్ఫెక్ట్. డైలాగ్స్ బాగున్నాయి. చూస్తున్నంతసేపు తెలుగు సినిమాలా ఉందేంటి అనిపిస్తుంది. యాక్టర్స్ తమిళవాళ్లే. కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమాని పొరపాటున కూడా ఫ్యామిలీతో చూడకండి. ఆహా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులో ఉంది.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఓటీటీలో 'హాట్ స్పాట్' స్ట్రీమింగ్.. పెద్దలకు మాత్రమే అంటూ..
కోలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది మార్చి 29న హాట్ స్పాట్ సినిమా విడుదలైంది. ఇందులో కలైయరసన్, శాండీ మాస్టర్, ఆదిత్య నటి గౌరీ కిషన్, అమ్ము అభిరామి, జననీ అయ్యర్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు విగ్నేష్ కార్తీక్ సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోని సీన్లతో పాటు కాన్సెప్ట్ కూడా చిన్నపిల్లలు చూసేదికాదని దీనికి సెన్సార్ కూడా ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.సమాజంలో జరుగుతున్న ముఖ్య విషయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా 'హాట్ స్పాట్' ఉంటుంది. అయితే, ఈ చిత్రం జులై 17న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. కళ్లముందు జరిగే అన్యాయాలను పట్టించుకోకపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆశక్తికరమైన అంశాలతో పాటు సమకాలీన రాజకీయాలను చర్చించే చిత్రంగా హాట్ స్పాట్ తెరకెక్కింది.ఇప్పటికే ఆహాలో తమిళ్ వర్షన్ ఉంది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను కూడా మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం విడుదల తర్వాత తమిళనాట పెద్ద చర్చ జరిగింది. తెలుగులో అందుబాటులోకి వచ్చాక ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. -
325 మంది.. చిన్నారుల్లో ‘స్మైల్’
నగర పోలీసులు ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్‌ను’ వినూత్నంగా చేపట్టారు. దాదాపు 200 హాట్‌స్పాట్స్(వెట్టి, భిక్షాటనకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు)ను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో ఉమ్మడిగా దాడులు జరిపారు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న 325 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్తోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. సాక్షి, సిటీబ్యూరో: వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్పించడం... తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్’లో నగర పోలీసులు కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్థోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అదనపు సీపీ షికా గోయల్, అదనపు డీసీపీ అబ్దుల్ బారిలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఐదో విడతలో అనేక మార్పులు... ఈ నెల 1 నుంచి 31 వరకు నగరంలో ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహించనున్నారు. ఈసారి ప్రధానంగా వెట్టిచాకిరీలో, భిక్షాటనలో మగ్గుతున్న చిన్నారులపై దృష్టి పెట్టారు. ఓసారి రెస్క్యూ అయిన చిన్నారులు మళ్లీ అదే మార్గంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆపరేషన్ స్మైల్ కోసం ఒక్కో సబ్–డివిజన్‌కు ఒక్కోటి చొప్పున ఎస్సైల నేతృత్వంలో మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేశారు. గత 27 రోజుల్లో రెవెన్యూ, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఈ బృందాలు నగరంలోని 200 ప్రాంతాల్లో చిన్నారుల వెట్టి, బిక్షాటనకు ఆస్కారం ఉన్నట్లు గుర్తించాయి. ఆయా చోట్ల దాదాపు మూడు రోజుల పాటు పరిశీలన చేసిన తర్వాత వరుస దాడులు చేశాయి. ఫలితంగా 11 మంది బాలికల సహా మొత్తం 325 మందిని కాపాడారు. యాజమాన్యాల వివరాలతో డేటాబేస్... ఈ రెస్క్యూ అయిన చిన్నారుల్లో ఏడుగురు పదేళ్లలోపు, 38 మంది 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో, మిగిలిన వారు 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. వీరిలో 272 మందిని పూర్తిస్థాయి కౌన్సిలింగ్ తర్వాత తమ కుటుంబీకులకు అప్పగించారు. మరో 53 మంది వివరాలు సరిచూడాల్సి ఉండటంతో వీరిని అంబర్‌పేటలోని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. 14 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం రూ.6.75 లక్షల జరిమానా విధించి వసూలు చేశాయి. ఈ చిన్నారుల్లో ఇద్దరు బిక్షాటన చేస్తుండగా మిగిలిన వారు బ్యాగ్స్ తయారీ, గాజుల కర్మాగారాలు, బిస్కెట్ ఫ్యాక్టరీలు, బేకరీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కార్ఖానాలు, మెకానిక్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు. వీరిలో ఏపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌కు చెందిన వారు 100 మంది ఉన్నారు. ఆసక్తి ఉంటే చదివిసాం్త.. ఆపరేషన్ స్మైల్ టీమ్స్‌లో ఉన్న ఎస్సైల్లో ఒకరైన తిరుమలగిరికి చెందిన రజిని ఇద్దరు చిన్నారులను, గోల్కొండ ఏఎస్సై రఫియుద్దీన్ మరొకరిని పాఠశాలల్లో చేర్పించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరు రోడ్డపై పడ్డారన్న విషయం తెలుసుకుని చదువుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఆ ముగ్గురూ ఆసక్తి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఆపై స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించి ఉచిత విద్య అందించేలా ఒప్పించి చేర్పించారు. వీరికి అవసరమైన యూనిఫామ్స్, పుస్తకాలను ఆయా అధికారులే కొనిపెట్టారు. చైల్డ్ లేబర్‌ను ప్రోత్సహిస్తూ పదేపదే పట్టుబడుతున్న యాజమాన్యాలను, తరచూ ఇదే బాటపడుతున్న చిన్నారులను గుర్తించడానికి ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు. -
బ్యాట్లపై పూత తొలగించండి
చెస్టర్ లీ స్ట్రీట్: బ్యాట్లపై ఉండే పూతను తొలగిస్తే హాట్ స్పాట్ నుంచి కచ్చితమైన ఫలితాలను రాబట్టొచ్చని ఈ పరికరం సృష్టికర్త వారెన్ బ్రెనన్ అన్నారు. పూత ఉండటం వల్ల సున్నితమైన థెర్మల్ ఇమాజిన్ సిస్టమ్ ఎడ్జ్‌లను సరిగా అంచనా వేయలేకపోతుందన్నారు. అయితే బ్యాట్లపై పూత వాడటం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సరైందే అయినా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు సిలికాన్ టేప్ చుట్టడం వల్ల హాట్ స్పాట్ థెర్మల్ ఇమాజిన్ పద్ధతి నుంచి బయటపడుతున్నారని చానెల్ నైన్ ఆరోపించింది. ఇదే విషయాన్ని బ్రెనన్ కూడా ఐసీసీ ముందు లేవనెత్తారు. యాషెస్ సిరీస్‌లో హాట్ స్పాట్ ద్వారా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో బ్రెనన్ శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. సిలికాన్ పూత టెక్నాలజీపై ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు.