చెస్టర్ లీ స్ట్రీట్: బ్యాట్లపై ఉండే పూతను తొలగిస్తే హాట్ స్పాట్ నుంచి కచ్చితమైన ఫలితాలను రాబట్టొచ్చని ఈ పరికరం సృష్టికర్త వారెన్ బ్రెనన్ అన్నారు. పూత ఉండటం వల్ల సున్నితమైన థెర్మల్ ఇమాజిన్ సిస్టమ్ ఎడ్జ్‌లను సరిగా అంచనా వేయలేకపోతుందన్నారు.
అయితే బ్యాట్లపై పూత వాడటం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సరైందే అయినా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు సిలికాన్ టేప్ చుట్టడం వల్ల హాట్ స్పాట్ థెర్మల్ ఇమాజిన్ పద్ధతి నుంచి బయటపడుతున్నారని చానెల్ నైన్ ఆరోపించింది. ఇదే విషయాన్ని బ్రెనన్ కూడా ఐసీసీ ముందు లేవనెత్తారు. యాషెస్ సిరీస్‌లో హాట్ స్పాట్ ద్వారా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో బ్రెనన్ శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. సిలికాన్ పూత టెక్నాలజీపై ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు.
బ్యాట్లపై పూత తొలగించండి
Published Sun, Aug 11 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement