
కోలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది మార్చి 29న హాట్ స్పాట్ సినిమా విడుదలైంది. ఇందులో కలైయరసన్, శాండీ మాస్టర్, ఆదిత్య నటి గౌరీ కిషన్, అమ్ము అభిరామి, జననీ అయ్యర్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు విగ్నేష్ కార్తీక్ సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోని సీన్లతో పాటు కాన్సెప్ట్ కూడా చిన్నపిల్లలు చూసేదికాదని దీనికి సెన్సార్ కూడా ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

సమాజంలో జరుగుతున్న ముఖ్య విషయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా 'హాట్ స్పాట్' ఉంటుంది. అయితే, ఈ చిత్రం జులై 17న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. కళ్లముందు జరిగే అన్యాయాలను పట్టించుకోకపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆశక్తికరమైన అంశాలతో పాటు సమకాలీన రాజకీయాలను చర్చించే చిత్రంగా హాట్ స్పాట్ తెరకెక్కింది.
ఇప్పటికే ఆహాలో తమిళ్ వర్షన్ ఉంది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను కూడా మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం విడుదల తర్వాత తమిళనాట పెద్ద చర్చ జరిగింది. తెలుగులో అందుబాటులోకి వచ్చాక ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment