House panel
-
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్?
వాషింగ్టన్ : అమెరికాలో టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుంది. ఆపిల్, అమెజాన్ లాంటి దిగ్గజాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా హౌజ్ కమిటీ తన నివేదకను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న డెమొక్రాట్ల నేతృత్వంలోని హౌస్ ప్యానెల్, ఆపిల్, అమెజాన్ ఆపిల్ ఇంక్ వంటి దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి స్వంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడంలాంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఇవి అమలు చేస్తున్న వ్యూహాల దృష్టి పెట్టింది. డెమొక్రాటిక్ ప్రతినిధి డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని హౌస్ యాంటీట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తు అనంతరం ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. అంతేకాదు టెక్ కంపెనీలు తమ డేటాను ఒక వెబ్సైట్ నుండి మరొక వెబ్సైట్లోకి సులభంగా తరలించడానికి అనుమతించే చట్టాన్ని కూడా ఇది సిఫారసు చేసినట్టు సమాచారం. పోటీదారులను అణిచివేసేందుకుఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిపిలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఈ నివేదిక ఈ వారంలోనే బహిర్గతం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నివేదికను అమోదిస్తే అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఈ నివేదికను ఎంతమంది కమిటీ సభ్యులు ఆమోదిస్తారనేది అస్పష్టం. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీ విచారణకు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే. -
‘నోట్ల రద్దు’పై తాజా ఆదేశం
ముంబై: నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి పరిస్థితులు, కేంద్రం నిర్ణయం తర్వాత జమ అయిన పాతనోట్ల వివరాలను ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ.. ఆర్బీఐని ఆదేశించింది. నవంబర్ 8 ప్రకటన తర్వాత వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం వివరాలూ పొందుపరచాలని సూచించింది. కాంగ్రెస్ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ బుధవారం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎన్నెస్ విశ్వనాథన్, బీపీ కనుంగోలతో సమావేశమైంది. సీనియర్ బ్యాంకర్లు, ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులూ పొల్గొన్నారు. ‘నోట్లరద్దు తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధించిన అంశాలపై కమిటీ ఆర్బీఐ గవర్నర్లను ప్రశ్నించింది. వ్యవస్థలోకి వచ్చిన రద్దయిన నోట్లు, దొంగనోట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నోట్లరద్దు ద్వారా వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం ఎంతని కూడా కమిటీ ప్రశ్నించింది’ అని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. మోసాలు జరగకుండా వినియోగదారులను కాపాడేందుకు తీసుకుంటున్న భద్రత చర్యలేంటని కూడా ఆర్బీఐని ప్రశ్నించింది. అయితే డిపాజిట్ అయిన నోట్ల లెక్కింపు జరుగుతున్నందున ఇప్పుడే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు చెప్పినట్లు తెలిసింది. కరెన్సీ కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారని బ్యాంకర్లను కమిటీ ప్రశ్నించింది. ఈ–బీమా పాలసీలను ఇవ్వటంలో ఐఆర్డీఏఐ నిబంధనలను కమిటీ పరిశీలించింది. -
కార్పొరేట్లకు బ్యాంకు లెసైన్సులొద్దు: స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇచ్చే అంశాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. దీని వల్ల బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందని అభిప్రాయపడింది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సారథ్యంలోని స్థాయి సంఘం(ఆర్థిక) ఈ నివేదికను రూపొందించింది. లెసైన్స్ల విషయంలో ఆర్బీఐకి ఇచ్చిన విచక్షణాధి కారాలవల్ల ఏకపక్షంగా దరఖాస్తులను ఆమో దం/తిరస్కరణ అధికారం లభిస్తుందనేది సభ్యుల వాదన. కొత్త బ్యాంక్ లెసైన్సులను జారీ చేసేందుకు 2001 నాటి మార్గదర్శకాలే ప్రాతిపదికగా ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.