Housing Market
-
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉద్భవించింది. పుణె, కోల్‌కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్‌లో 5% నుంచి హైదరాబాద్‌లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్‌కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్‌సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సందడి
న్యూఢిల్లీ: ఇళ్ల డిమాండ్ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి (టైర్–2) పట్టణాల్లోనూ ఇళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) టాప్30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం పెరిగి 2,07,896 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ తెలిపింది. 2022–23 సంవత్సరంలో 1,86,951 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. ఈ మేరకు ఒక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం విక్రయాల్లో 80 శాతం టాప్–10 టైర్–2 పట్టణాలైన అహ్మదాబాద్, వదోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మోహాలిలో నమోదయ్యాయి. ఈ పది పట్టణాల్లో 2023–24లో 1,68,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 1,51,706 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిగిలిన 20 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భోపాల్, లక్నో, గోవా, రాయిపూర్, విజయవాడ, ఇండోర్, కోచి, త్రివేండ్రం, మంగళూరు, గుంటూరు, భివాండి, డెహ్రాడూన్, లుధియానా, చండీగఢ్, ఆగ్రా, మైసూర్, సోనేపట్, పానిపట్, అమృత్సర్ ఉన్నాయి. ఎన్నో సానుకూలతలు.. ‘‘టైర్–1 పట్టణాల కంటే టైర్–2 పట్టణాల్లోనే ఇళ్ల మార్కెట్ పరంగా మెరుగైన పనితీరు నమోదైంది. దీనికి కారణం ధరలు తక్కువగా ఉండడంతోపాటు, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే. ఈ చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి వాసుల సొంతింటి కలను అందుబాటు ధరలు సాకారం చేస్తున్నాయి’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజ తెలిపారు. చిన్న మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), పరిశ్రమల ఏర్పాటుతో ఈ పట్టణాలు ఆర్థిక బూమ్‌ను చూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మద్దతునిస్తుండడం కూడా ఈ పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపారు. పశి్చమాదిన ఎక్కువ దేశవ్యాప్తంగా టాప్–30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన ఇళ్ల విక్రయాల్లో 70 శాతం వాటా.. పశి్చమాదినే ఉండడం గమనించొచ్చు. ఇక్కడి పట్టణాల్లో విక్రయాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 1,44,269 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని పట్టణాల్లో అధిక డిమాండ్ కనిపించింది. ఉత్తరాదిన విక్రయాలు 8 శాతం పెరిగి 26,308 యూనిట్లుగా ఉంటే, దక్షిణాదిన 8 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. తూర్పు, మధ్య భారత్‌లోని పట్టణాల్లో 18 శాతం అధికంగా 15,372 ఇళ్లు అమ్ముడయ్యాయి. సొంతింటి కల ఆకాంక్షల ఫలితం..మౌలిక వసతులు, ప్రాంతాల మధ్య అనుసంధాన పెరగడంతో పెద్ద ఎత్తున మార్పును చూస్తున్నట్టు ఎల్డెకో గ్రూప్ సీవోవో మనీష్ జైస్వాల్ పేర్కొన్నారు. తమ కంపెనీ లుధియానా, రుద్రాపూర్, సోనిపట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయం కావడంతో టైర్–1 పట్టణాల్లో 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గాయి. కానీ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం పెరిగాయి. ధరలు అందుబాటు ధరల్లో ఉండడంతో మధ్యతరగతి వాసుల సొంతింటి ఆకాంక్ష డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని బెంగళూరుకు చెందిన సముద్ర గ్రూప్ సీఎండీ మధుసూదన్ జి తెలిపారు. -
హౌసింగ్‌కు మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: హౌసింగ్ మార్కెట్‌పట్ల ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి చూపుతున్నట్లు ఫిక్కీ–అనరాక్ చేపట్టిన సర్వే తెలియజేసింది. సర్వేలో 36 శాతంమంది పెట్టుబడి ఆలోచనతోనే ఇళ్ల కొనుగోలు కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఫిక్కీ–అనరాక్ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే 2023 ద్వితీయార్ధం’ పేరుతో నిర్వహించిన రియల్టీ సదస్సులో సర్వేను విడుదల చేశారు. సర్వే ప్రకారం కొనుగోలుదారులు భారీ గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులలో ఫ్లాట్ల కొనుగోలుకీ ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్–19 సవాళ్లు, వినిమయ ఆదాయం పుంజుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సంప్రదాయానికి తెరలేవడం వంటి అంశాలు విశాలమైన గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు ఫిక్కీ రియల్టీ కమిటీ చైర్మన్ రాజ్ మెండా పేర్కొన్నారు. వెరసి భారీ ఇళ్లు, విలాసవంత గృహాలకు దేశవ్యాప్తంగా గిరాకీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా అద్దె ఇళ్లకు బదులుగా సొంత గృహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ధరలు పెరిగినా.. ఇటీవల ధరలు పెరిగినప్పటికీ సర్వేలో పాల్గోన్న 50 శాతంమంది మూడు పడకగదుల(3బీహెచ్‌కే) గృహాలకు, 38 శాతంమంది 2బీహెచ్‌కే ఇళ్లకు ఆసక్తి ప్రదర్శించినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. 2020 ద్వితీయార్ధంతో పోలిస్తే 2023 ద్వితీయార్ధంలో పెట్టుబడి యోచనతో ఇళ్ల కొనుగోలుకి ఆసక్తి చూపినవారు 26 శాతం నుంచి 36 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. వెరసి రియల్ ఎస్టేట్ లాభదాయక పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్ భారీ లాభాలకు అవకాశాలు కలి్పంచనున్నట్లు అత్యధిక శాతంమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నట్లు వివరించింది. దీనికితోడు భారీ సంస్థలు, లిస్టెడ్ కంపెనీల నుంచి కొత్త ప్రాజెక్టులు పెరగడంకూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితంగా గృహ కొనుగోలుదారులకు విశ్వాసం పెరుగుతున్నదని, ఇది హౌసింగ్ మార్కెట్ బలపడేందుకు దోహదం చేస్తున్నదని అభిప్రాయపడింది. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! అక్కడేమో..!
కోవిడ్-19 రాకతో రియాల్టీ రంగం పూర్తిగా దెబ్బతింది. వరుస లాక్‌డౌన్స్‌తో ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. కరోనా ఉదృత్తి కాస్త తగ్గడంతో మళ్లీ రియల్ బూమ్ పట్టాలెక్కింది. కరోనా మహమ్మారి భూముల ధరలు, గృహ నిర్మాణ రంగంపై కొంతమేర ప్రభావం చూపాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో ఇండ్ల ధరలు భారీగానే పెరిగాయి. కాగా అత్యంత తక్కువ ధరలకే ఇళ్లు వచ్చే నగరాల జాబితాను ప్రముఖ రియాల్టీ సంస్థ నైట్ ఫ్రాంక్ ‘ అఫర్డబిలిటీ ఇండెక్స్-2021’ జాబితాను విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అగువకే ఇండ్లు..! నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలిచింది. ఈ నగరంలో ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. అయితే ముంబై మహానగరంలో సొంత ఇళ్లును సొంతం చేసుకోవాలంటే భారీగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఆయా నగరాల్లోని గృహ ఈఎంఐ, మొత్తం ఆదాయ నిష్పత్తి దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను విడుదల చేసింది. నివేదికలోని కొన్నిముఖ్యాంశాలు..! 2021లో అహ్మదాబాద్ 20 శాతం, పుణె 24 శాతంతో దేశంలోనే అత్యంత సరసమైన గృహా రంగ మార్కెట్‌గా అవతరించాయి. ముంబైలో మినహా 53 శాతం స్థోమత నిష్పత్తితో భారత్‌లోనే అత్యధిక ధరలు గల నగరంగా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో స్థోమత నిష్పత్తి గరిష్టంగా 2020లో 38 శాతం నుంచి 2021లో 28 శాతానికి మెరుగుపడిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ స్థోమత నిష్పత్తి 29 శాతం, బెంగళూరు 26 శాతం, చెన్నై, కోల్‌కతా 25 శాతంగా నమోదైనాయి. అంటే బెంగళూరు, చెన్నె, కోల్కత్తా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త గృహాల కోసం ఎక్కువ డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు... నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం.... ఈ ఏడాదిలో గృహాల ధరలలో క్షీణత , చాలా కాలంగా వస్తోన్న తక్కువ వడ్డీరేట్లు ఆయా నగరాల్లో కొత్త ఇంటిని సొంతం చేసుకునే వారి స్థోమత గణనీయంగా పెరగడానికి సహాయపడిందని పేర్కొంది. అఫర్డబిలిటీ సూచిక ..! స్థోమత సూచిక అనేది ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ ఈఎంఐకు నిధులు సమకూర్చడానికి ఒక కుటుంబానికి అవసరమయ్యే ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. కాబట్టి, ఒక నగరం స్థోమత సూచిక స్థాయి 40 శాతం ఉంటే ఆ నగరంలోని కుటుంబాలు ఇంటి కోసం నిధులు సమకూర్చడానికి వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 50 శాతం కంటే ఎక్కువ ఉంటే ఇంటి ధరలు భరించలేనిదిగా పరిగణించబడుతుంది. చదవండి: ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా.. -
హౌసింగ్ మార్కెట్లో తగ్గిన నల్లధనం ప్రాబల్యం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత గడచిన ఐదేళ్లలో హౌసింగ్ మార్కెట్లో నల్లధనం (లేదా నగదు లావాదేవీలు) ప్రాబల్యం 75 నుంచి 80 శాతం తగ్గిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ– అనరాక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏడు నగరాల్లోని డెవలపర్ల అభిప్రాయాల సేకరణ, బ్యాంకుల గృహ రుణ పంపిణీ గణాంకాలు, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సమీక్ష , 1,500కుపైగా సేల్స్ ఏజెంట్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. గృహ రుణ సగటు పరిమాణం మాత్రం గణనీయంగా పెరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు. కాగా, చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆస్తి లావాదేవీల్లో నల్లధనం ఉందని గుర్తించినట్లు అనరాక్ చైర్మన్ వివరించారు. కారణాలు ఇవీ... పెద్ద నగరాల తొలి గృహ కొనుగోళ్లలో నల్లధనం హవా తగ్గడానికి కారణాలను అనూజ్ పురి వివరిస్తూ, బ్రాండెడ్, లిస్టెడ్ సంస్థలు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయని, పూర్తి పారదర్శకతతో కూడిన అకౌంట్ల ద్వారానే మెజారిటీ గృహ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు తర్వాత గృహ కొనుగోలుదారుల డిమాండ్ కూడా పారదర్శకతలో కూడిన బ్రాండెడ్ ప్రాజెక్టులకే ఉంటోందని తెలిపారు. ఇక ప్రధాన డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపైనే కేంద్రీకరించే తమ గత ధోరణిని మార్చుకుని, చౌక, మధ్య తరగతికి అనుగుణమైన హౌసింగ్ విభాగంపై దృష్టి సారించాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడినట్లు వివరించారు. ‘దేశంలో గృహాల కొనుగోలు, విక్రయం అనే ప్రాథమిక అంశాలు, ధోరణుల్లో పెద్ద నోట్ల రద్దు గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. నేడు గృహ విక్రయాలు అధికభాగం వాస్తవ డిమాండ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. నల్లధనాన్ని చెలామణీలోకి తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నంగా ప్రస్తుతం రియల్టీ లేదు’’ అని పురి పేర్కొన్నారు. -
సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే!
సాక్షి, హైదరాబాద్: 90వ దశాబ్ధం వరకు సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనే లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. 45–55 ఏళ్ల వయసు గల వాళ్లే గృహ కొనుగోలుదారులుగా ఉండేవాళ్లు. బ్యాంక్ రుణాలపై అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 20వ దశాబ్ధం నుంచి గృహ కొనుగోలుదారుల వయసు 35–45 ఏళ్లకు తగ్గిపోయింది. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి. చదవండి: బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్ -
బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ
సాక్షి, హైదరాబాద్: గృహాల ధరల్లో బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ. పదేళ్లలో రెండు నగరాల మధ్య నివాస ధరల్లో తేడాలొచ్చేశాయి. 2010లో బెంగళూరులో 48 శాతంగా ఉన్న అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్.. 2020 నాటికి 28 శాతానికి తగ్గింది. అదే హైదరాబాద్‌లో దశాబ్ద క్రితం 47 శాతంగా ఉండగా.. ఇప్పుడది 31 శాతానికి తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత సరసమైన గృహా నిర్మాణ మార్కెట్‌గా అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్–2020ని విడుదల చేసింది. అఫర్డబులిటీ ఇండెక్స్ అనేది సగటు గృహానికి సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐ), ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. దీన్ని నగరాల్లోని గృహాల ధరలు, వడ్డీ రేట్లు, ఆదాయంలో వృద్ధి, కొనుగోలుదారుని సామర్థ్యం వంటి విభాగాల్లో కదలికలను బట్టి అంచనా వేశారు. గృహాల ధరలలో క్షీణత, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా హౌసింగ్ అఫర్డబులిటీ మెరుగవ్వటానికి ప్రధాన కారణాలని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. అఫర్డబులిటీ నిష్పత్తి 50 శాతానికి మించితే.. బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహ రుణాలు పొందటం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇతర నగరాల్లో.. ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 61 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం ఇక్కడ రేషియో 93 శాతంగా ఉంది. ఎన్సీఆర్లో 53 శాతం నుంచి 38 శాతానికి, పుణేలో 39 శాతం నుంచి 26 శాతానికి, చెన్నైలో 51 శాతం నుంచి 39 శాతానికి, కోల్‌కతాలో 45 శాతం నుంచి 30 శాతానికి అఫర్డబులిటీ హౌసింగ్ రేషియో తగ్గాయి. చదవండి: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్ ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త! -
ముస్లింలు.. సంచలన నివేదిక
- ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమిటీ నివేదిక - గత 40 ఏళ్లలో బాగా.. ఎస్సీ, ఎస్టీల కన్నా వెనకబడిపోయారు - అక్షరాస్యత, తలసరి ఆదాయం, వ్యయం అందరికంటే తక్కువ - 16 శాతం ముస్లిం జనాభా పాఠశాల ముఖమే చూడలేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లిం సామాజికవర్గం ఎస్సీ, ఎస్టీల కన్నా వెనుకబడిందని జి.సుధీర్ కమిషన్ తేల్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44.64 లక్షలు)ఉన్నారని... కానీ వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య స్థితిగతులు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. గత నలభై ఏళ్లలో బాగా వెనుకబడిపోయారని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ముస్లింల సామాజిక–ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జి.సుధీర్ అధ్యక్షతన ఎంఏ బారి, డాక్టర్ అమీరుల్లా ఖాన్, ప్రొ. అబ్దుల్ షాబాన్‌లతో కూడిన ఈ కమిటీ.. విస్తృతంగా అధ్యయనం చేసి, ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా ఆ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు.. 40 ఏళ్లలో బాగా వెనకబడ్డారు నలభై ఏళ్ల కింద సగటు స్థాయిలో ఉన్న ముస్లింలు ఇప్పుడు అందరికన్నా.. కొన్ని విషయాల్లో ఎస్సీ, ఎస్టీల కన్నా కూడా వెనుకబడిపోయారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) గణాంకాల ప్రకారం.. 1999లో సగటు పౌరులతో పోలిస్తే స్వల్పంగా దిగువన ఉన్న ఓబీసీలు ప్రస్తుతం అగ్రవర్ణాలకు సమాన స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ఓబీసీలకు సమానంగా ఉన్న ముస్లింలు ఇప్పుడు చాలా వెనకబడి పోయారు. 1999–2011 మధ్య కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల తలసరి ఆదాయ వృద్ధితో పోలిస్తే ముస్లింల తలసరి ఆదాయ వృద్ధి రేటు సగం మాత్రమే. 2004–12 మధ్య ముస్లింల తలసరి వ్యయం 60 శాతం పెరగగా... హిందూ ఎస్టీల్లో 69 శాతం, ఎస్సీల్లో 73 శాతం, ఓబీసీల్లో 89 శాతం, అగ్రవర్ణాల్లో 122 శాతం పెరిగింది. దారిద్య్రరేఖకు దిగువన హిందూ ఎస్సీల కన్నా ముస్లిం ఓబీసీల నిష్పత్తే ఎక్కువ. మధ్యలోనే చదువులకు ఫుల్స్టాప్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ముస్లింలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. పాఠశాల ముఖమే చూడని జనాభాలో అత్యధికంగా ఎస్టీలు, ముస్లింలే ఉండడం గమనార్హం. ఎస్టీల్లో 17శాతం, ముస్లింలలో 16 శాతం జనాభా అసలు విద్యా సంస్థల్లోనే చేరలేదు. ముస్లింల అక్షరాస్యత రేటు (70%) ఓబీసీల్లో (74శాతం)కన్నా, సాధారణ హిందువుల (86శాతం) కన్నా తక్కువగా ఉందని 2014లో అమితాబ్ కుందు నేతృత్వంలోని సచార్ ఎవాల్యుయేష న్ కమిటీ బహిర్గతం చేసింది. ఉన్నత విద్య విషయంలో ముస్లింల పరిస్థితి దయనీయం గా ఉంది. తెలంగాణలో వర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని వర్సిటీల నుంచి సేకరించిన సమాచారం స్పష్టం చేస్తోంది. సర్కారీ దవాఖానే దిక్కు పేదరికం కారణంగా ముస్లింలు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళుతున్నా రు. వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, పేద రికం, మురికివాడల్లో నివాసం వల్ల ముస్లిం వయోజనుల ఆరోగ్యం బాగా లేదు. ఈ కారణాల వల్లే హిందువులు (62శాతం), క్రైస్తవుల (49.6 శాతం)తో పోల్చితే ముస్లిం గర్భవతు ల్లో(66శాతం) రక్తహీనత అధికం. ఇతరులతో పోల్చితే ముస్లిం పురుషులు ఎక్కువగా మధుమేహంతో బాధపడు తున్నారు. ముస్లిం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఇతరుల కంటే మెరుగ్గా ఉంది. ముస్లింలలో మాతా, శిశు మరణాల రేటు తక్కువే. ‘నివాసం’లోనూ వివక్ష హౌజింగ్ మార్కెట్ ముస్లింలపై వివక్ష చూపి స్తోందన్న భావన ఉందని కమిటీ అభిప్రా యపడింది. గృహ సదుపాయం పొందడంలో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని.. 43 శాతం ముస్లింలు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని పేర్కొంది. ముస్లింల హౌజింగ్ పరిస్థితిపై లోతైన పరిశీలన జరపాలని ప్రభుత్వానికి సూచించింది. లింగపర అసమానతలూ ఎక్కువే.. ఇతర మతాలతో పోల్చితే ముస్లింలలో లింగపర అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ముస్లిం మహిళల్లో 21–29 ఏళ్ల మధ్య వయసు గలవారిలో 71.5 శాతం మంది మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అదే 18–20 ఏళ్ల మధ్య వయసు వారిలో 52.8శాతం మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. మొత్తంగా 21–29 ఏళ్ల వయసులో మధ్యలోనే చదువు మానేస్తున్న వారిలో 85.2 శాతం ముస్లిం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7.36 శాతమే! ∙మొత్తం ఉద్యోగులు 4,79,556.. వారిలో ముస్లింలు 35,279 ∙ముస్లిం గెజిటెడ్ అధికారులు 1.43 శాతమేనని సుధీర్ కమిటీ వెల్లడి ∙340 మంది అఖిల భారత సర్వీసు అధికారుల్లో 10 మందే ముస్లింలు రాష్ట్ర జనాభాలో 12.68 శాతం ముస్లింలు ఉండగా... ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు 7.36 శాతమే ఉన్నారని జి.సుధీర్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని 23 ప్రభుత్వ శాఖలు, సచివాలయం, జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 4,79,556 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో ముస్లిం ఉద్యోగులు 35,279 (7.36 శాతం) మందేనని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులు 340 మంది ఉండగా.. అందులో ముస్లింలు కేవలం 10 మందేనని, ఇందులోనూ ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యమే లేదని వివరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన కమిటీ.. పలు కీలక అంశాలను గుర్తించింది. ముస్లిం ఉద్యోగుల్లో 56.57 శాతం అట్టడుగు స్థాయి (ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్వీపర్, ఇతర నాలుగో తరగతి) ఉద్యోగులేనని తేల్చింది. ఇక 42 శాతం నాన్ గెజిటెడ్ అధికారులని, కేవలం 1.43 శాతం మాత్రమే గెజిటెడ్ అధికారులని తెలిపింది. వ్యవసాయేతర పనులే జీవనాధారం రాష్ట్రంలోని ముస్లింలకు వ్యవసాయేతర పనులే జీవనాధారం. హిందూ పురుషుల్లో 61 శాతం సొంత కమతాల్లో ఉండగా.. 38 శాతం మంది వ్యవసాయ రంగంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ముస్లిం పురుషుల్లో 52 శాతం మంది దినసరి కూలీలుగా, 48 శాతం మంది స్వయం ఉపాధి రంగంలో ఉన్నారు. జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది 2001–2011 మధ్య ముస్లిం జనాభా వృద్ధి 1.47% పట్టణాల్లోనే ఎక్కువ నివాసం సుధీర్ కమిషన్ నివేదిక స్పష్టీకరణ రాష్ట్రంలో ముస్లింల జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. గత దశాబ్దకాలంలో హిందువుల వృద్ధి రేటు 0.47 శాతం తగ్గిపోగా... ముస్లిం వృద్ధి రేటు అంతకు మించి 0.52 శాతం పడిపోయింది. జి.సుధీర్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 1991–2001 మధ్య తెలంగాణ జనాభా వృద్ధి రేటు 1.78 శాతంకాగా... హిందువుల జనాభా వృద్ధి రేటు 1.64 శాతం, ముస్లిం జనాభా వృద్ధి రేటు 1.99, క్రైస్తవ జనాభా వృద్ధి రేటు 3.19 శాతం ఉండేది. అయితే 2001–2011 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 1.27 శాతానికి పడిపోగా... హిందూ జనాభా వృద్ధిరేటు 1.17 శాతం, ముస్లింల జనాభా వృద్ధి రేటు 1.47 శాతం, క్రైస్తవుల జనాభా వృద్ధి రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది. పట్టణాల్లోనే ఎక్కువ.. మొత్తం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44,64,699 మంది) ముస్లింలు ఉన్నారు. పట్టణ జనాభాలో 24శాతం, గ్రామీణ జనాభాలో 5.05 శాతం ముస్లింలు ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్ జనాభాలో 43.4 శాతం, అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 5.2 శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్ర ముస్లిం జనాభాలో 50.01 శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి.. తూర్పు దిశగా వెళ్లే కొద్దీ ముస్లింల జనాభా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర ముస్లిం జనాభాలో షేక్, షేయిక్ వర్గాల వారు 66.2 శాతం, సయ్యద్‌లు 11.5 శాతం, పఠాన్లు 6.12 శాతం ఉన్నారు. ముస్లింల కుటుంబాల సగటు పరిణామం ఇతరులతో పోల్చితే పెద్దగా ఉంది. ఇతరుల కుటుంబాల్లో సగటున 4.8 మంది ఉండగా... ముస్లిం కుటుంబాల్లో సగటున 5.2 మంది ఉన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 99 శాతం సున్నీలు, 1 శాతం మాత్రమే షియాలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 99.3 శాతం సున్నీలు, 0.7 శాతం షియాలు ఉన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ముస్లింలకు కనీసం 9 శాతమైనా కల్పించాలన్న సుధీర్ కమిటీ అందరికీ సమాన అవకాశాల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని సూచన రాష్ట్రంలో ముస్లింలు చాలా వెనుకబడినందున వారికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని జి.సుధీర్ కమిటీ సిఫారసు చేసింది. కనీసం 9 శాతమైనా కల్పిం చాలని సూచించింది. న్యాయ నిపుణుల సల హాలు తీసుకుని, తమిళనాడు తరహాలో రిజ ర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని కమిటీ తాజాగా వెల్లడించిన తమ నివేదికలో ప్రతిపాదించింది. ‘ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రతిపాదనల ఆధా రంగా గమనిస్తే ముస్లింలు పలు విషయాల్లో రాష్ట్ర సగటు కన్నా దిగువన ఉన్నారు. సామా జికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారు. అందు వల్ల ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పించాలి. 82% ముస్లింలు వెనకబడినవారుగా వర్గీక రించిన దృష్ట్యా వాళ్ల రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచాలి. కనీసం 9 శాతానికైనా పెంచాలి’’ అని కమిటీ పేర్కొంది. ఎస్సీల తరహా వృత్తి చేస్తూ వివక్ష ఎదుర్కొంటున్న మెహ్తర్ వంటి ముస్లిం వర్గాలకు ఎస్సీ హోదా కింద రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. సామాజిక, మత, కుల, భాషాపర వివక్షకు తావులేకుండా ప్రైవేటు, పబ్లిక్ రంగాలతో సహా అన్ని చోట్లా, అన్నివర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు సమాన అవకాశాల కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అన్ని స్థాయిల్లో విద్య, ఉద్యోగం, గృహ వసతి, ఆరోగ్య సదు పాయం, అభివృద్ధి ప్రోత్సాహకాలపై ఆ కమిషన్ పర్యవేక్షణ ఉండాలంది. కమిటీ తమ సిఫారసులను 3 భాగాలుగా విభజించింది. తక్షణమే అమలు చేయాల్సిన కీలక అంశాలతో పాటు మధ్యంతర, దీర్ఘకాలిక సిఫారసులను నివేదికలో సూచించింది. మధ్య కాలిక సిఫార్సులు ► ఎస్సీ, ఎస్టీల తరహాలో ముస్లిం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్ఐపాస్ కింద రాయితీలు అందించాలి. టీఎస్ఐఐసీ ద్వారా ముస్లింలకు 12 శాతం పారిశ్రామిక స్థలాలు మంజూరు చేయాలి. ► పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో 12% ముస్లింలు స్థాపించిన యూనిట్లకు అందజేయాలి. ► ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింల కోటాను పట్టణ ప్రాంతాల్లో 20 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతానికి పెంచాలి. ► అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. స్టేట్ సర్వీసుల నుంచి ప్రమోషన్లు ఇచ్చి ఈ అంతరాన్ని పూరించాలి. ► ముస్లిం కుటుంబాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు లభించడం దుర్లభంగా మారింది. ఈ పరిస్థితిని మార్చాలి. ► ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన సెలెక్షన్ ప్యానెల్లో కనీసం ఒక ముస్లిం అకడమీషియన్ ఉండాలి. శాఖాపర పదోన్నతుల్లో సైతం ముస్లింలకు న్యాయం జరిగేలా బోర్డులో ఒక ముస్లిం సభ్యుడు ఉండాలి. ► రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి. రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాల్లో కార్పొరేషన్ కార్యాలయాలను తెరిచి సిబ్బందిని నియమించాలి. ► మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. ► మదర్సాల మౌలిక పాఠ్య ప్రణాళికలో జోక్యం చేసుకోకుండా వాటిని ప్రధాన స్రవంతి పాఠశాలల్లో కలిపి, మామూలు పాఠశాలలుగా గుర్తించాలి. మదర్సాల్లో సైన్స్, గణితం సబ్జెక్టులు బోధించేలా సూచనలివ్వాలి. మదర్సా బోర్డును స్థాపించి అందులో చేరేందుకు అన్ని మదర్సాలకు అవకాశం కల్పించాలి. మదర్సా కోర్సులకు రెగ్యులర్ కోర్సులతో సమాన హోదా కల్పించాలి. ► మొత్తం జనాభాలో, ప్రత్యేకంగా ముస్లింలలో రక్తహీనత కేసులు పెరగకుండా చూడాలి. ► ముస్లింలు, ఇతర మత గ్రూపుల వేతనాల మధ్య వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలోని ముస్లింలకు కనీస వేతన చట్టాలు కచ్చితంగా వర్తించేలా చూడాలి. తక్షణమే అమలు చేయాల్సిన సిఫార్సులు ► రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్ రూపొందించి.. అన్ని శాఖలు ముస్లింల సంక్షేమం కోసం తగినన్ని నిధులు వెచ్చించేలా చర్యలు తీసుకోవాలి. నిధులు దారిమళ్లకుండా చూడాలి. ► సచార్, కుందూ కమిటీల సిఫారసుల మేరకు భిన్నత్వ సూచికల (డైవర్సిటీ ఇండెక్స్)ను ప్రభుత్వం అమలు చేయాలి. మానవ వనరుల విషయంలో ప్రదర్శించే భిన్నత్వం ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇవ్వాలి. ► ఉపాధ్యాయుల కొరత, బోధనా నాణ్యత లేక ఉర్దూ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలి. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం, స్కూళ్లలో డ్రాపౌట్లను తగ్గించడం కోసం స్కాలర్‌షిప్పులను పెంచాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే ముస్లిం విద్యార్థులకు విద్యాసంస్థల్లో క్యాష్‌లెస్ ప్రవేశాలకు అవకాశం కల్పించాలి. ► ముస్లిం ప్రజానీకం పోలీసు, భద్రతా వ్యవస్థలపై నమ్మకంతో ఉంది. ఆ భావనని మరింత పెంపొందించేందుకు వారిపట్ల పోలీసుల వైఖరి మార్చాలి (సెన్సిటైజ్ చేయాలి). ముస్లిం యువకులను ఉగ్రవాదు లు, నేరస్తులన్న అనుమానంతో విచక్షణా రహితంగా అరెస్టు చేయడం ఆపాలి. ► రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులకు ఉర్దూలోనూ సైన్‌బోర్డులు పెట్టాలి. దీర్ఘకాలిక సిఫార్సులు ► పాఠశాలల్లో ప్రవేశాలతో సహా ప్రభుత్వ సర్వీసుల్లో, విద్యా సంస్థల్లో ముస్లింలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. ► ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచాలి. ముస్లిం రిజర్వేషన్లలో 33 శాతం ముస్లిం మహిళలకు ఇవ్వాలి. ► ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠ శాలలను ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య లో ఆడపిల్లల ప్రాతినిధ్యం తక్కువగా ఉ న్నందున వారి కోసం ఉన్నత పాఠశాలలు, కళాశాలలను ఆంగ్ల మాధ్యమంలో తెరవాలి.