Human Resource Development
-
పేదలందరికీ ఇళ్లపై కేంద్ర బృందం పరిశీలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం అమలు, గృహనిర్మాణాల తీరును పరిశీలించేందుకు 25 మంది సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వ సచివాలయ బృందం గురువారం కృష్ణాజిల్లా వణుకూరు లేఅవుట్‌ను పరిశీలించింది. అక్కడ 621 ఇళ్ల నిర్మాణాలను చూసింది. తమ శిక్షణలో భాగంగా ఏపీ మానవ వనరుల అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంలోని కార్యదర్శులు, సెక్షన్ అధికారుల బృందం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, జాయింట్ మేనేజర్ ఎం.శివప్రసాద్ పేదల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా లేఅవుట్లలో కల్పిస్తున్న విద్యుత్, డ్రెయినేజీ, అంతర్గత రోడ్లు, నీటిసరఫరా వంటి మౌలిక సదుపాయాలను వివరించారు. 30 లక్షల మంది మహిళల పేరుతో 71,811 ఎకరాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. రూ.55 వేల కోట్లతో 2 దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం 20 టన్నుల ఇసుకతో పాటు సిమెంట్, ఇనుము, ఎలక్ట్రికల్, శానిటరీ వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకు సరఫరా చేస్తోందని చెప్పారు. -
నేనో ఆర్థికవేత్తను
సాక్షి, అమరావతి: ‘నేనో ఆర్థిక శాస్త్రవేత్తను.. ఆర్థిక శాస్త్ర విద్యార్థిని.. పేదరికం లేకుండా సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం శాసనసభలో ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’పై నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. సమాజానికి పేదరికం శాపం వంటిదని అన్నారు. దేశంలో 19 91లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక.. ప్రపంచీకరణతో కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల్లో పేదలు ఉన్నట్లు అగ్రవర్ణాల్లోనూ ఉన్నారన్నారు. లీడర్‌ను కాబట్టే.. జనాభా పెంచాలని కోరుతున్నా.. 2014 ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వాలని.. జనాభాను పెంచాలని పిలుపునిస్తే అందరూ అవహేళన చేశారని సీఎం అన్నారు. చైనా, జపాన్‌లో జనాభా తగ్గడం వల్ల వృద్ధులు అధికమైపోయార న్నారు. 1995 నుంచి 2004 వరకు తాను చేపట్టిన చర్యలతో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. కానీ ఇది సమాజానికి మంచిది కాదని, జనాభా పెరగాల్సి ఉందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తానీ పిలుపునిస్తున్నానని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.. ఆహార భద్రత చేకూర్చడంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని సీఎం చెప్పారు. విద్యా భద్రత చేకూర్చడం వల్ల పేదరికం తగ్గుతుందన్నారు. నిరుద్యోగులకు మార్చి నుంచి దీన్ని రెండువేలకు పెంచుతున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకిచ్చే చెక్కులకు బ్యాంకర్లు డబ్బులివ్వకపోతే.. తిరుగుబాటు చేసైనా డబ్బులు తీసుకోవాలన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. 23 ప్రాజె క్టులు పూర్తి చేశామన్నారు. జూన్‌నాటికి గ్రావిటీద్వారా పోలవరం నుంచి నీటినందిస్తామన్నారు. -
ఆధార్ లేని విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రతి ఒక్క విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందుతుందని, అలాగే ఆధార్‌కార్డును అందిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి కూడా అందజేస్తామన్నారు. ఆధార్ మంజూరుకు సదుపాయాలు లేనిచోట, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విశిష్ట గుర్తింపు నంబర్లను అందజేస్తాయని తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి వాటిని అవకాశాలుగా మార్చుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాలకు తమ మద్దతు ఉంటుందని జవదేకర్ తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దేశంలో విద్యాప్రమాణాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని జవదేకర్ అన్నారు. విద్యారంగంలో సంస్కరణల అమలుకు కృషి చేయడంతోపాటు.. పేదలకు సైతం ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే హెచ్ఆర్డీ అధికారులతో సమావేశమైన అనంతరం విద్యకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. ఇక స్మృతి ఇరానీ శాఖ మార్పుపై జేడీయూ ఎంపీ అలీ అన్వర్ వ్యాఖ్యలను జవదేకర్ ఖండించారు. కాగా కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి (పర్యావరణం-స్వతంత్ర హోదా) ప్రకాష్ జవదేకర్‌కు కేబినెట్ హోదా లభించిన విషయం తెలిసిందే. అలాగే స్మృతి ఇరానీని మానవనరుల అభివృద్ధి శాఖ నుంచి తప్పించి.. జౌళిశాఖ అప్పగించారు. ఈ నేపథ్యంలో జవదేకర్... నిన్న స్మృతి ఇరానీని కలిశారు. -
నైతిక విలువలతో శిక్షణ వల్లే అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: మానవ వనరులకు నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్లే దేశం అభివృద్ధివైపు పురోగమిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. దేశంలో తెలివిగల వ్యక్తులు, డిగ్రీలు కలిగినవారు ఉన్నప్పటికీ అంతిమ ఫలితంలో ఎక్కడో లోపం వెంటాడుతోంద ని, అభివృద్ధి, శాస్త్రవేత్తలు పెరిగినా మానవ సంబంధాలు అనుకున్నంత స్థాయిలో బలోపేతం కావడం లేదన్నారు. అందుకే హెచ్ఆర్డీలో శిక్షణ తరగతులను విస్తృత పరచాలని సూచించారు. శిక్షణ పద్ధతుల్లో మూస ధోరణికి స్వస్తి పలికి.. నూతన పంథా అవలంబించాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో దేశం మొత్తంలో రాష్ట్రం వెనకబడి ఉందని, ముందంజ వేయాలంటే హెచ్ఆర్డీ వంటి సంస్థలు మార్గనిర్దేశం చేయాలన్నారు. బయటివారికి శిక్షణ తరగతులు: కడియం మానవ వనరులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఎంసీఆర్ెహఆర్డీలో ప్రభుత్వ రంగ సంస్థ లు, అధికారులకే కాక ఇతర రంగాలకు చెందిన వారికీ శిక్షణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. అవసరమైతే సిబ్బందిని పెంచుకుని సంస్థగా ఎది గి, సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. రాష్ట్రంలో పుష్కలమైన వనరులు, నిధులు ఉన్నందున ఆ దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలను సంఘటిత శక్తిగా మార్చడానికి శిక్షణ నైపుణ్యాలే సరైన మార్గమని పేర్కొన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు బడ్జెట్రూపకల్పన, ప్రణాళిక, ఖర్చు, పద్దులు తదితర అంశాలు తెలియవని, తాను కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీలోనే తర్ఫీదు పొందానని గుర్తు చేసుకున్నారు. ఫలాలు అందరికీ అందితేనే సార్థకత.. మానవ వనరులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే క్రమంలో విజయం సాధిస్తే ఏ దేశమైనా పురోగతి సాధిస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ 40 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని, ఇక్కడ శిక్షణ పొందిన వారు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సమాజాన్ని మార్చగలిగేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులేనని దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విషయం అందరి గుండెల్లో దాగుందన్నారు. సమాజంలో మానవ విలువలు తరిగిపోతున్న తరుణంలో వాటిని పాదుకొల్పేలా మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కె.అగర్వాల్‌తో పాటు సంస్థ సిబ్బంది, శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతవిద్యలో మార్పులు: స్మృతి
సాక్షి, బెంగళూరు: ఉన్నతవిద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఎడ్యుకేషన్ ప్రమోషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఈపీఎస్ఐ) ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో భారత్ పురోగతిపై మంగళవారం జరిగిన సదస్సులో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. విద్యావిధానం ఎలా ఉండాలన్నదానిపై దేశంలోని ఐదు వేలకుపైగా విద్యారంగ సంస్థల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. ఉన్నత విద్యకు సంబంధించి వృత్తివిద్యా కోర్సుల పై కళాశాలలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రముఖ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, వైస్ చాన్స్లర్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
ఐఐటీల్లో ఫీజుల మోత
-
ఐఐటీల్లో ఫీజుల మోత
♦ ఐఐటీల్లో 150 శాతం, ఎన్ఐటీల్లో 300 శాతం పెంపునకు హెచ్ఆర్డీ ఓకే ♦ వారం పది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ♦ {పతిపాదన అమల్లోకి వస్తే వార్షిక ఫీజులు ♦ ఐఐటీల్లో రూ. 2.5 లక్షలు, ఎన్ఐటీల్లో రూ. 2 లక్షలు ♦ పేద విద్యార్థులకు గ్యారంటీతో నిమిత్తం లేని బ్యాంక్ రుణాలు.. ♦ ఓబీసీలకు క్రీమీలేయర్‌ను బట్టి మినహాయింపు సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ల్లో చదువు ఇక మరింత భారం కానుంది. పేద విద్యార్థులకు వీటిల్లో చదువు మరింత దూరం కానుంది. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు భారీగా పెరగనున్నాయి. పెరి గిన జీతభత్యాల ఖర్చు, ఇతర వ్యయాలను తట్టుకునేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజును 300% పెంచాలన్న ఎన్ఐటీ, 150% పెంచాలన్న ఐఐటీల ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదముద్ర వేసింది. తదుపరి జరిగే కేం ద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణ యం తీసుకుని.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోనూ ఫీజులు పెంచనున్నారు. పెంపుపై ఇప్పటికే నిర్ణయం ఐఐటీ, ఎన్ఐటీల్లో ఫీజులు పెంచాలని గతేడాది అక్టోబర్‌లోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో బీహార్ ఎన్నికలు ఉండడంతో దానిని వాయిదా వేసింది. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ ఈ ఫీజు పెంపు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం వస్తే ఈ ఏడాది జూలై నుంచి ఐఐటీ ల్లో చేరే విద్యార్థులు ఏటా రూ. 2.5 లక్షలు, ఎన్ఐటీల్లో చేరేవారు రూ. 2 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంటే నాలుగేళ్ల బీటెక్ కోర్సు పూర్తయ్యేసరికి రూ. 10లక్షలు, రూ. 8 లక్షలు కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం వార్షిక ఫీజులు ఐఐటీల్లో రూ. 90 వేలు, ఎన్ఐటీల్లో రూ.70 వేలు మాత్రమే. ఇక ఐఐటీలు, ఎన్ఐటీలకు ఎంపికయ్యే 22 శాతం మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం ఫీజును భరిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వారి క్రీమీలేయర్‌ను బట్టి ఫీజులో కొంత మినహాయింపు ఉంటుంది. విద్యార్థులకు బ్యాంకు రుణాలు పేద విద్యార్థులకు బ్యాంకుల నుంచి విద్యా రుణాలిప్పించాలని కేంద్రం భావిస్తోంది. విదేశీ విద్యకు మంజూరు చేస్తున్న తరహాలో కాకుండా వీటికి విద్యార్థి కుటుంబ ఆదాయంతో నిమిత్తం లేకుండా రుణాలు ఇస్తారు. ఐఐటీ లేదా ఎన్ఐటీకి ఎంపికైన విద్యార్థి రుణం కోసం తన కుటుంబ సంవత్సరాదాయం వివరాలను సం బంధిత జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా 15 రోజుల్లోగా అందజేయాలి. ఏటా రూ. 2లక్షల కంటే తక్కువ ఆదాయమున్నవారికి మాత్రమే కేంద్రం కొంత ఫీజును స్కాలర్షిప్ రూపేణా, కొంత బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుతుంది. కోర్సు కొనసాగే నాలుగేళ్లపాటు ఈ విద్యా రుణానికి 4 శాతం వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ కోర్సుకు ఎంపికయ్యే శారీరక వికలాంగులకు మొత్తం ఫీజు రాయితీ ఉంటుంది. ఒక్కో విద్యార్థికి వ్యయం రూ. 3.5 లక్షలు ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కోసం ఏటా సగటున రూ. 3.5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విద్యార్థి చెల్లిస్తున్న రూ. 90 వేల కంటే ఇది రూ.2.6 లక్షలు అధికం. ప్రస్తుతం మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన రూ.2.5 లక్షల ఫీజు అమల్లోకి వచ్చినా కేంద్రం పై కొంత భారం కొనసాగుతుంది. ఎన్ఐటీల్లో ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షలు ఖర్చవుతుండగా.. ప్రస్తుతం విద్యార్థుల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రూ.2 లక్షలకు ఫీజు పెం చినా ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష వరకు కేంద్రంపై భారం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తు న్న నేపథ్యంలో ఫీజులు పెంచవచ్చంటూ కేం ద్రం నియమించిన కమిటీ పచ్చజెండా ఊపిం ది. ఐఐటీ, ఎన్ఐటీల ప్యాకేజీల వివరాలను కూడా కమిటీ నివేదికలో పొందుపరిచింది. -
అన్ని రాష్ట్రాల్లో ‘కామన్’ ఇంటర్
♦ ఒకే సిలబస్, పరీక్షల విధానం అమలు చేయాలని కేంద్రం ఆదేశం ♦ ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీల ఏర్పాటు ♦ కామన్ సిలబస్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ బోర్డు కార్యదర్శి ♦ {పశ్నపత్రాల రూపకల్పన విధాన కమిటీ సభ్యుడిగా ఏపీ బోర్డు కార్యదర్శి ♦ జూన్ 8లోగా అన్ని బోర్డులు మార్కులు పంపించాల్సిందే సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 12వ తరగతి, ఇంటర్మీడియట్‌కు ఒకే సిలబస్ అమల్లోకి రానుంది. అంతేకాదు ఒకే తరహాలో పరీక్షల విధానం, ఫలితాల వెల్లడి ఉండనుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డుల కార్యదర్శులు, ఎన్ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలతో మానవ వనరుల శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డుల కార్యదర్శులు అశోక్, సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న 12వ తరగతి, రాష్ట్ర విద్యా సంస్థల్లో అమల్లో ఉన్న ఇంటర్ విద్యా విధానాన్ని మానవ వనరుల శాఖ సమీక్షించి... పలు అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, అన్ని బోర్డుల్లో 12వ తరగతి, ఇంటర్ సిలబస్ ఓకేలా ఉండేలా, ఇందుకు ఏయే సబ్జెక్టుల సిలబస్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కామన్ సిలబస్‌పై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శిని నియమించినట్లు తెలిసింది. అలాగే పరీక్షల విధానం, ప్రశ్నపత్రాల ప్యాట్రన్ కూడా కామన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని మానవ వనరులశాఖ సూచించింది. సాధారణంగా ప్రశ్నపత్రాల్లో 40 శాతం ప్రశ్నలు సులభంగా, 40 శాతం మాడరేట్‌గా, మరో 20 శాతం ఇంటర్‌ప్రిటేషన్‌తో కూడినవిగా ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రాలు దీనిని సరిగా పాటించడం లేదు. దీంతో ప్రశ్నపత్రాల రూపకల్పనలో కామన్ ప్యాట్రన్ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శిని సభ్యుడిగా నియమించినట్లు తెలిసింది. ఇక ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తుండడంతో... మార్కుల జాబితాలను పరిశీలన, వెయిటేజీ కోసం జాతీయ స్థాయి విద్యాసంస్థలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, బోర్డులు ఏటా జూన్ 8వ తేదీలోగా తమ పరిధిలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులను ఎన్ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలకు పంపాలని స్పష్టం చేసింది. అలాగే సీబీఎస్ఈ విద్యాసంస్థల్లో, ఇంటర్ బోర్డుల్లో ఇస్తున్న సబ్జెక్టు కోడ్లు వేర్వేరుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఒక్కో సబ్జెక్టుకు అన్ని బోర్డుల్లో ఒకే కోడ్ (కామన్ కోడ్) ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో లెక్చరర్లకు మారుతున్న పరిస్థితులపై అవగాహన అవసరమని, పెద్ద ఎత్తున ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. -
ఇక పండుగ భోజనం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అందించే దిశగా గుజరాత్ తరహాలో రాష్ట్రంలో అమలు చేసేందుకు సమాలోచనలు బెంగళూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటి వరకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని సైతం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పండుగల సందర్భాల్లో విద్యార్థులకు వివిధ రకాలైన పిండివంటలతో ప్రత్యేక భోజనం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తోంది. ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని ప్రత్యేకంగా అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందించే పథకం ఇప్పటికే గుజరాత్లో అమల్లో ఉంది. గుజరాత్లో ‘తిథి భోజన్’ పేరిట ఈ పథకం అమలవుతోంది. పండుగ సందర్భాలు, స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో వివిధ రకాల పిండి వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని ‘తిథి భోజన్’ పేరిట అక్కడి విద్యార్థులకు అందజేస్తున్నారు. గుజరాత్లో ఈ పథకం ఎంతో విజయవంతమైంది. ఈ పథకం అమలు ద్వారా చాలా మంది చిన్నారులు అపౌష్టికత నుంచి సైతం బయటపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు. ఈ కారణంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్మృతి ఇరానీ ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏరా్పాటు చేశారు. ఈ సమావేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో హబ్బదూట పేరుతో. ఇక కర్ణాటకలో ఈ పథకాన్ని హబ్బదూట(పండుగ భోజనం)’ పేరుతో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి విధి, విధానాలు ఇప్పటికే తయారయ్యాయని రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం రాష్ట్రంలో అమల్లోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.