ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రతి ఒక్క విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందుతుందని, అలాగే ఆధార్‌కార్డును అందిస్తామని వివరించారు.
ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి కూడా అందజేస్తామన్నారు. ఆధార్ మంజూరుకు సదుపాయాలు లేనిచోట, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విశిష్ట గుర్తింపు నంబర్లను అందజేస్తాయని తెలిపారు.