‘హంగామా’లో షావొమి పెట్టుబడి
రూ. 165 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ, టెక్నాలజీ దిగ్గజం షావొమి.. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్లో 25 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఒక భారతీయ కంపెనీలో షావొమికి ఇదే తొలి ఇన్వెస్ట్మెంట్ కావడం గమనార్హం. భారత్‌లోని స్థానిక భాషల్లో కంటెంట్, సర్వీసుల పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయని షావొమి వైస్‌ప్రెసిడెంట్ హ్యూగో బరా పేర్కొన్నారు.