hy dora
-
మీ–సేవ నుంచే విద్యుత్ కనెక్షన్లు బుకింగ్
– ఎనిమిది జిల్లాలో నేటి నుంచి అమలు – సదరన్ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర తిరుపతి రూరల్: దక్షిత ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ( సదరన్ డిస్కం) పరిధిలోని ఎనిమిది జిల్లాలో కొత్తగా ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీలకు సంబంధించి కొత్త కనెక్షన్లును ఇకపై మీ–సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సదరన్ డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర కోరారు. శనివారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరి«ధిలో కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందేందుకు నిబంధనలను సరళతరం చేసినట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి ఎల్టీ కేటగిరిలో గృహ విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, సాధారణ, దేవాలయాలకు విద్యుత్ కనెక్షన్లు, హెటీ కేటగిరిలో పరిశ్రమలు(సాధారణం), ఇతర సర్వీసులు, మౌలిక, పర్యాటకం, ప్రభుత్వ, ప్రై వేటు ఎత్తిపోతలు, వ్యవసాయం, సీపీడబ్లు్యఎస్, రైల్వే ట్రాక్షన్, టౌన్‌షిప్స్, రెసిడెన్షియల్ కాలనీస్, గ్రీన్ పవర్, తాత్కలిక సర్వీసులను పొందడానికి మీ–సేవా కేంద్రం నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేరు మార్చుకోవాలన్నా.. ఎల్టీ కేటగిరికి సంబంధించి పేరు, కేటగిరి, లోడ్ మార్పు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా మీ–సేవా ద్వారానే బుక్ చేసుకోవాలని సీఎండీ హెచ్‌వై దొర సూచించారు. ప్రస్తుత విద్యుత్ లైన్ల నుంచి కనెక్షన్‌ను మంజూరు చేసే సందర్భాల్లో డెవలప్మెంట్ చార్జీలను కూడా మీ–సేవా కేంద్రం ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యుత స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి సర్వీసును మంజూరు చేసే సందర్భాల్లో మాత్రమే సంబం«ధిత డెవలప్మెంట్ చార్జీలను ఏపీఎస్పీడీసీయల్ సబ్–డివిజన్ కార్యాలయాల్లో చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. కల్యాణ మండపాలు, ఎన్టీయార్ సుజల పథకం, తాత్కలిక సర్వీసులు, ఎన్టీయార్ జలసిరి సర్వీసులకు సంబంధించి మాత్రమే ఏపీఎస్పీడీసీయల్ కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రూ.351కోట్లతో 60 విద్యుత్ సబ్స్టేషన్లు
– వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం – ఎక్కడ నుంచైనా మోటర్ ఆఫ్ చేయడం కోసం రూ.12.26 కోట్లతో ప్యానెల్స్ – ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో రూ. 351కోట్లతో 60 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర తెలిపారు. తిరుపతిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవ డేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీయస్, డీడీయూజీజేవై పథకాల కింద 36 ఇన్డోర్, 24 ఔట్‌డోర్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. డీడీయూజీజేవై పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.125కే నాలుగు లక్షల విద్యుత్ కనెక్షన్లను అందించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సరళతరం చేసామని, కొత్త యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా బిల్లులను చెల్లించవచ్చన్నారు. రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు రూ.12.26 కోట్లతో 13వేల రిమోట్ కంట్రోల్ ప్యానెల్స్‌ను కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్‌శాఖ ఏర్పాటుచేసిన శకటానికి తృతీయ బహుమతి లభించడం అభినందనీయన్నారు. సివిల్స్ విజేతలకు సన్మానం.. ఇటీవల నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐపీయస్, ఐఆర్‌యస్‌కు ఎంపికైన విద్యుత్ ఉద్యోగుల పిల్లలను సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, వారి పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ బిలాల్ బాషా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోహర్, సీజీఎంలు ఏసునాధు, హనుమత్ప్రసాద్, సీఈ నందకుమార్ పాల్గొన్నారు. -
ప్రతి సబ్‌స్టేషన్ వద్ద ఇంకుడుగుంత
తిరుపతి రూరల్: సదరన్ డిస్కం పరిధిలో ఉన్న 2,200 సబ్ స్టేషన్లలో ఇంకుడు గంతలను నిర్మించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై కొత్తగా ఏర్పాటు చేయబోయే విద్యుత్ సబ్‌స్టేషన్లలోనూ ఇంకుడు గుంతలను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. -
పేరుకే.. ఉచితం
సాక్షి, గుంటూరు: జిల్లాల్లో అవసరమైనంత కరెంటు అందుబాటులో ఉందని, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటలు కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని ఇటీవల గుంటూరులో ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ప్రకటించారు. రైతులు మాత్రం ఏడు గంటల మాట దేవుడెరుగు మూడు గంటలకే దిక్కులేదని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు వినియోగం తక్కువగా ఉన్నా.. కోతలు మాత్రం గణనీయంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో వ్యవసాయానికి 0.9 మిలియన్ల యూనిట్లు వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం 4 గంటల లోపు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఏడు గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా, ఏడు గంటల్లో ఎడాపెడా కోతలు అమలవుతూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. మూడు నుంచి నాలుగు గంటలే గగనంగా ఉందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు సరిగా నీరందక, దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఇంజన్లతో అదనపు భారం.. గుంటూరు జిల్లాలో 69 వేల ఉచిత విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఈ బోర్ల కింద 1.80 లక్షల హెక్టార్లలో అరటి, పసుపు, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి వాణిజ్యపంటలు సాగు చేస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల సబ్ డివిజన్లలోని వినుకొండ, శావల్యాపురం. దుర్గి, బండ్లమోటు, రేమిడిచర్ల ప్రాంతాల్లో పత్తి, మిరప, తెనాలి, బాపట్ల సబ్ డివిజన్లలోని రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ప్రాంతాల్లో అరటి, పసుపు పంటలపై ఈ కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పల్నాడు, డెల్టాల్లోని రెండు ప్రాంతాల్లో మొక్కజొన్న భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. కరెంటుకోతలతో మొక్కజొన్నకు నీటి తడులు సమయానికి అందడం లేదు. ఆయిల్ ఇంజన్లతో నీటి తడులు ఇవ్వడం వల్ల అధికంగా ఖర్చవుతోంది. అధికారులేమంటున్నారు.. ఉచిత సర్వీసులకు కరెంటు సరఫరా సరిగా లేకపోవడానికి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) కారణమని అధికారులు చెబుతున్నారు. తమకు సంబంధం లేకుండానే స్టేట్ లెవల్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచే కోతలు అమలవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోతే ఉచిత సరఫరాకు కరెంటోళ్లు కనిష్ట ప్రాధాన్యత ఇస్తున్నారు. పదిహేను రోజుల నుంచి సింహాద్రిలో 250 మెగావాట్ల సామర్ధ్యం గల ఒక యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, రామగుండంలలో 200 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న యూనిట్లు రెండు సార్లు ట్రిప్ కావడంతో ఉచిత విద్యుత్తుకు ఎడా పెడా కోతలు అమలు చేస్తున్నారు. -
పేరుకే.. ఉచితం
సాక్షి, గుంటూరు: జిల్లాల్లో అవసరమైనంత కరెంటు అందుబాటులో ఉందని, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటలు కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని ఇటీవల గుంటూరులో ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ప్రకటించారు. రైతులు మాత్రం ఏడు గంటల మాట దేవుడెరుగు మూడు గంటలకే దిక్కులేదని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు వినియోగం తక్కువగా ఉన్నా.. కోతలు మాత్రం గణనీయంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో వ్యవసాయానికి 0.9 మిలియన్ల యూనిట్లు వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం 4 గంటల లోపు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఏడు గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా, ఏడు గంటల్లో ఎడాపెడా కోతలు అమలవుతూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. మూడు నుంచి నాలుగు గంటలే గగనంగా ఉందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు సరిగా నీరందక, దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఇంజన్లతో అదనపు భారం.. గుంటూరు జిల్లాలో 69 వేల ఉచిత విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఈ బోర్ల కింద 1.80 లక్షల హెక్టార్లలో అరటి, పసుపు, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి వాణిజ్యపంటలు సాగు చేస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల సబ్ డివిజన్లలోని వినుకొండ, శావల్యాపురం. దుర్గి, బండ్లమోటు, రేమిడిచర్ల ప్రాంతాల్లో పత్తి, మిరప, తెనాలి, బాపట్ల సబ్ డివిజన్లలోని రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ప్రాంతాల్లో అరటి, పసుపు పంటలపై ఈ కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పల్నాడు, డెల్టాల్లోని రెండు ప్రాంతాల్లో మొక్కజొన్న భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. కరెంటుకోతలతో మొక్కజొన్నకు నీటి తడులు సమయానికి అందడం లేదు. ఆయిల్ ఇంజన్లతో నీటి తడులు ఇవ్వడం వల్ల అధికంగా ఖర్చవుతోంది. అధికారులేమంటున్నారు.. ఉచిత సర్వీసులకు కరెంటు సరఫరా సరిగా లేకపోవడానికి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) కారణమని అధికారులు చెబుతున్నారు. తమకు సంబంధం లేకుండానే స్టేట్ లెవల్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచే కోతలు అమలవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోతే ఉచిత సరఫరాకు కరెంటోళ్లు కనిష్ట ప్రాధాన్యత ఇస్తున్నారు. పదిహేను రోజుల నుంచి సింహాద్రిలో 250 మెగావాట్ల సామర్ధ్యం గల ఒక యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, రామగుండంలలో 200 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న యూనిట్లు రెండు సార్లు ట్రిప్ కావడంతో ఉచిత విద్యుత్తుకు ఎడా పెడా కోతలు అమలు చేస్తున్నారు.