Hydroelectric power stations
-
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
అబ్బురం.. వించ్ వే
ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో వేల అడుగుల ఎత్తులో కొండల మధ్యనున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చారిత్రాత్మకం. ఇక్కడికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వించ్ వేకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1948లో ఏర్పాటుచేసిన నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతుంటారు. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో అవసరమైన సామగ్రి, యంత్రాలను తరలించేందుకు 2,750 అడుగుల ఎత్తులో వించ్ హౌస్‌ను నిర్మించారు. ఇందుకు అప్పటిలో ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చించినట్టు అధికారవర్గాలు చెబుతుంటాయి. 1955 ఆగస్టు 19న విద్యుత్ కేంద్రానికి అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వించ్ ద్వారా చేరుకుంటున్నారు.రెండుకొండల నడుమ లోయలో ఉండే మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి దిగేందుకు 18 నిమిషాలు, పైకి వచ్చేందుకు 13 నిమిషాలు సమయం పడుతోంది. ఆరోజుల్లోనే జీపీఎస్.. వించ్ ఏర్పాటు చేసినప్పుడే రోప్‌వేలో ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్‌ను ఏర్పాటు చేయడం విశేషం. వించ్ కదలిక బట్టి జీపీఎస్ సూచిక కదులుతూ ఉంటుంది. వించ్ ఎక్కడుందో సూచించే ముల్లు మలుపుల దగ్గరకు చేరుకోగానే కంట్రోల్‌రూమ్‌లోని డ్రైవర్ వేగాన్ని నియంత్రిస్తుంటారు. గతంలో పర్యాటకులు, సిబ్బంది వించ్‌లో ప్రయాణించేవారు.అప్పుడు అధికారులు పర్యాటకుల వించ్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు. సందర్శకుల నిరాశ గత కొన్నేళ్లుగా వించ్ ప్రయాణానికి అనుమతులు ప్రాజెక్టు అధికారులు ఇవ్వడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు వించ్‌ను చూసి ఆనందపడుతున్నారు తప్ప ప్రమాణించేందుకు అవకాశం లేకపోవడం తీవ్ర నిరాశ చెందుతున్నారు. వించ్ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. వించ్ ప్రయాణ విషయాన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, ఉన్నతాధికారుల అదేశాలతో అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. దేశంలో రెండే.. దేశంలో రెండే రెండు చోట్ల వించ్‌వేలు ఉన్నాయి. ఇక్కడి వించ్‌వే మొదటిది కాగా, రెండోది తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ఉంది. భారీ సామర్థ్యం ఉన్న మోటార్ సాయంతో స్టీల్ రోప్ ద్వారా వించ్‌ని లోయలోకి దించడం, ఎక్కించడం జరుగుతుంది. స్టీల్ రోప్‌ను ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తుంటారు. దీనికి సంబంధించిన డ్రైవర్ కంట్రోల్ రూంలో ఉండి వించ్‌ను నడుపుతుంటారు. ట్రాలీగార్డు మలుపుల దగ్గర వించ్ పట్టాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వించ్ ఏర్పాటు చేసి ఇప్పటికి 74 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి వించ్ అదుపుతప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిబ్బంది కేవలం గాయాలతోనే బయటపడ్డారు. -
జలవిద్యుత్ కేంద్రాలను పరిశీలించిన జెన్కో ఎండీ
సీలేరు (విశాఖ): విద్యుత్ ఉత్పత్తిలో దేశానికే తలమానికంగా నిలిచిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని పలు జలవిద్యుత్ కేంద్రాలను జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ డి.శ్రీధర్ శనివారం సాయంత్రం సందర్శించారు. తొలుత మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడే మరో రెండు యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. దీనిని ఆనుకుని ఉన్న రిజర్వాయర్ వద్దకు వెళ్లి నీటి మట్టాలను పరిశీలించారు. డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఇంజనీర్లు.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బదిలీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. త్వరలో బదిలీల ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారని ఇంజనీర్లు తెలిపారు. నేడు సీలేరు, బలిమెల పర్యటన.. సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో మొదటిరోజు పర్యటించిన జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఆదివారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం, గుంటవాడ, బలిమెల జలాశయాలను సందర్శించనున్నట్లు తెలిసింది. అలాగే సీలేరు ఎత్తిపోతల పధకానికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించి ఒడిశాలో ఏపీ పవర్‌హౌస్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. చీఫ్ ఇంజనీర్ (హెచ్పీసీ) సుజికుమార్‌తో పాటు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు, ఎస్ఈ ప్రశాంత్‌కుమార్, డీఈ బాలకృష్ణ, బాబురావు, తదితరులున్నారు. -
శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఐదోసారి శుక్రవారం రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను తెరచి నీరు విడుదల చేశారు. శనివారం నాటికి వరద ఉధృతి తగ్గడంతో ఒక గేట్‌ను 10 అడుగుల మేరకు తెరచి 28,029 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. 2 జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 66,283 క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా 48,540 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 589.90 అడుగులు ఉంది. -
సీలేరు.. లక్ష్యంలో సరిలేరు!
రంపచోడవరం/మోతుగూడెం: సీలేరు జలవిద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తిలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాయి. ఐదేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ఉత్పత్తి లక్ష్యాలను ఏటా కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) నిర్దేశిస్తుంది. సీలేరు కాంప్లెక్స్‌లోని నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకు 2020–21లో 2,074.98 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా, మార్చి నెలాఖరుకు 2,705.36 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తం నాలుగు విద్యుత్ కేంద్రాలు పరస్పరం పోటీ పడినట్టుగా అధిక ఉత్పత్తి సాధించాయి. అంతేకాదు.. ఈ కేంద్రాల ద్వారా ఈ ఏడాది గోదావరి డెల్టాకు 45 టీఎంసీల నీటిని కూడా అందించారు. గత ఏడాది నీటి సమస్యతో పాటు యూనిట్లు తరచూ మొరాయించిప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించడం విశేషం. ఈ ఏడాది పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంతో పాటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలోని యూనిట్లు మొరాయించాయి. స్థానిక ఇంజనీర్ల కృషితో పాటు కార్మికులు యూనిట్ల మరమ్మతులో జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ ఈ లక్ష్యాలను సాధించారు. రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 9.18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్క సీలేరు కాంప్లెక్స్‌లోనే డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు 7 నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టెయిల్ పాండ్, పెన్నా అహోబిలం, చెట్టుపేట మినీ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. సమష్టి కృషితోనే సాధ్యం డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. స్థానిక ఇంజనీర్లు, సిబ్బంది కృషితో లక్ష్యాన్ని సాధించాం. – ఎం.గౌరీపతి,చీఫ్ ఇంజనీర్, సీలేరు కాంప్లెక్స్, మోతుగూడెం, తూర్పు గోదావరి జిల్లా సాంకేతిక సమస్యలు అధిగమించాం.. ఈ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు ఏటా మొరాయిస్తున్నా.. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోగలిగాం. నాలుగు జలవిద్యుత్ కేంద్రాల యూనిట్ల ఆధునికీకరణకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. త్వరలోనే అనుమతులు లభిస్తే యూనిట్ల ఆధునికీకరణకు చర్యలు చేపడతాం. – కె.బాలకృష్ణ, డీఈ (ఎలక్ట్రికల్), ఆపరేషన్, మెయింటెనెన్స్ -
మనవైపు శ్రీశైలం ప్లాంట్లు సురక్షితం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో భద్రతను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) క్షుణ్నంగా పరిశీలించింది. ఏపీ జల విద్యుత్ కేంద్రాలు నూటికి నూరుపాళ్లు సురక్షితమని నివేదిక రూపొందించింది. ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని జనరేటర్లు పోలికే లేదు... ► ఏపీ జెన్కో పరిధిలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలు 1960లో ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిధిలో ఉన్నవి 1990లో డిజైన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వీటికి పోలిక లేదు. ► తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా భూగర్భంలో (భూ ఉపరితలం నుంచి కిలో మీటరున్నర) ఉన్నాయి. ఏపీ జల విద్యుత్ కేంద్రం భూ ఉపరితలంపైనే ఉన్నందున విపత్కర సమయంలో పొగ, విషవాయువులు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ► తెలంగాణ విద్యుత్తు కేంద్రం జనరేషన్, నీళ్ల పంపింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భూగర్భంలో నిర్మాణం చేశారు. ఏపీ వైపు ఉన్న ప్లాంట్లు కేవలం జనరేషన్ మాత్రమే చేస్తాయి. నీటిని రివర్స్ పంప్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రమాదానికి అంతగా ఆస్కారం లేదు. ► కుడివైపు జల విద్యుత్ కేంద్రాలు ఒక్కొక్కటి 110 మెగావాట్ల (మొత్తం 7) సామర్థ్యంతో కూడుకున్నవి. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బయటకు పంపి ట్రాన్స్మిషన్ వ్యవస్థకు లింక్ చేశారు. తెలంగాణలో భూగర్భంలోనే (ఇండోర్) ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంది. ఇండోర్ ట్రాన్స్మిషన్ వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కాపర్ వైర్ అతి వేడిని పుట్టించే వీలుంది. దురదృష్టవశాత్తూ ప్రమాదం.. ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తెలంగాణ విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. అక్కడి టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. భూగర్భ బొగ్గు గని తరహాలో తెలంగాణ ప్లాంట్లు ఉంటే ఏపీ వైపు ఉన్నవి ఓపెన్‌కాస్ట్ మాదిరిగా ఉంటాయి. ఏపీ జల విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా సురక్షితం’ – శ్రీధర్, జెన్కో ఎండీ -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం ఫొటోలు
-
జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..
-
పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. (విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్ చేసినట్లు సీఎండీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు. విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగటం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు. మంటల్లో చిక్కుకున్నవారు: డీఈ శ్రీనివాస్, ఏఈలు వెంకట్రావు ఫాతిమా బేగం, మోహన్, సుందర్, సుష్మ, కుమార్ ప్రైవేట్ ఉద్యోగులు కిరణ్, రాంబాబు -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మరీ కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీష్‌రెడ్డి శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మొదటి యూనిట్లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 10 మంది సురక్షితంగా బయటకొచ్చారు.. మరో 9 మంది చిక్కుకున్నారని వెల్లడించారు. ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్, పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు. -
వందేళ్లకు సరిపడా విద్యుత్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల 29 చిన్న జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వందేళ్లకు సరిపడా విద్యుత్ లభించే వీలుంది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నియమించిన టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, వ్యాప్కోస్ సంస్థలు క్షేత్ర స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన (నెడ్‌క్యాప్) సంస్థ ఎమ్డీ రమణారెడ్డికి ముసాయిదా నివేదిక అందజేశాయి. దీనిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబుతోపాటు పలువురు విద్యుత్ అధికారులు విజయవాడలోని విద్యుత్ సౌధలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. కొండ కోనల నుంచి కాంతులు - సముద్రం పాలవుతున్న వాగులు, వంకలు, జలపాతాల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో మినీ హైడల్స్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి రాష్ట్రంలో 30 ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 29 అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. - మినీ హైడల్ విద్యుత్ ప్లాంట్లను రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఆన్ రివర్ విధానంలో.. పారే నదిపై కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తారు. కిందకెళ్లే నీటిని రిజర్వాయర్‌లోకి రివర్స్ పంపింగ్ విధానంలో పంపి నిల్వ చేస్తారు. ఆఫ్ రివర్ విధానంలో.. డొంకలు, వాగులు, జలపాతాలను ఎంపిక చేస్తారు. ఎగువ, దిగువ భాగంలో రెండు రిజర్వాయర్లు నిర్మించి నీటిని మళ్లిస్తారు. - విద్యుత్ ఉత్పత్తి తర్వాత నీరు కింద ఉన్న రిజర్వాయర్‌లోకి వెళ్తుంది. మళ్లీ దీన్ని ఎగువ రిజర్వాయర్‌కు పంప్ చేస్తారు. ఇలా 25 చోట్ల ఏర్పాటు చేసే వీలుంది. - డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మినీ హైడల్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. చౌకగా లభించే సౌర విద్యుత్‌ను రివర్స్ పంపింగ్ కోసం ఉపయోగిస్తారు. పెట్టుబడి మాటేంటి ఈ ప్రాజెక్టుకు రూ.లక్షా 25 వేల కోట్ల నిధులు అవసరం. వీటిని పలు ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకునే వీలుంది. వాస్తవానికి మినీ హైడల్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు కనీసం రూ.5 కోట్లు అవుతుందని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు వెచ్చించే సొమ్మును మినీ హైడల్‌కు ఖర్చు చేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. మంచి ఆలోచన వచ్చే పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మరో 10 వేల మెగావాట్లు పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు మినీ హైడల్స్ ఉపయోగపడతాయి. వందేళ్లకు సరిపడా విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి ఇది ఆదాయం కూడా.. 32,740 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ముసాయిదా నివేదికను పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో సమర్పిస్తాం. ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే ప్లాంట్లు నిర్మించుకునే వీలు కల్పిస్తాం. మన వనరులు వాడుకున్నందుకు వాళ్లు చెల్లించే మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. – రమణారెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ -
‘రివర్స్’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయ్యాయి. అత్యధికంగా పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయి. -
ఏటా 724.3 ఎంయూల విద్యుదుత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన 320 మెగావాట్ల దుమ్ముగూడెం జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తైతే ఏటా 724.3 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. రూ.4504 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేసింది. 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయం పాటు 320 మెగావాట్ల విద్యుదు త్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొ క్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 విద్యుదుత్పత్తి యూనిట్లు కలిపి 320 మెగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ పవర్‌హౌజ్‌ను నిర్మించనుంది. ఏడెనిమిది ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీపీఆర్ నివేదిక ప్రకారం.. ఏటా 70–80 రోజుల పాటు నిరంతర వరద నీటి ప్రవాహం ఉండనుందని, ఆ మేరకు విద్యుదు త్పత్తి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 3 కి.మీ. దూరంలో ఉన్న అంగడిపేట సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా చేయనుంది. రూ.4,504 కోట్ల అంచనా వ్యయంలో రూ.3,639 కోట్లు జలాశయం నిర్మా ణానికి ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.866 కోట్లతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మిస్తారని తెలంగాణ జెన్కో అధికార వర్గాలు తెలిపాయి. ఒక యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.5 నుంచి రూ.6 వరకు వ్యయం కానుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. రుణం+రాష్ట్ర ప్రభుత్వ వాటా: దుమ్ముగూడెం జలాశయాన్ని నీటిపారుదల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరిపై సముద్ర మట్టానికి 63 మీటర్ల ఎత్తులో 6 కి.మీ. పొడవు, 6 కి.మీ. వెడల్పుతో తొలుత జలాశయాన్ని నీటిపారుదల శాఖ నిర్మించ నుంది. జలాశయానికి 70 రేడియల్ గేట్లను ఏర్పాటు చేయనుం ది. అనంతరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను జెన్కో చేప ట్టనుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత భాగాన్ని కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినట్లు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో జెన్కో సమీకరించనుంది. -
గోదావరిపై కొత్త జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరినది మీద కొత్త జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ జెన్కో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కంతనపల్లి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంల వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ముసాయిదాను సిద్ధం చేసింది. కంతనపల్లిలో 280 మెగావాట్లు, దుమ్ముగూడెంలో 320 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన డిజైన్లు.. అంచనా వ్యయాన్ని జెన్కో సిద్ధం చేసింది. గోదావరిపై నిజామాబాద్‌లోని పోచంపాడు మినహా ఎక్కడా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు లేవు. వరద నీరు వచ్చినప్పుడే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కంతనపల్లి, దుమ్ముగూడెంలవద్ద ప్లాంట్లు నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. కానీ.. ఈ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటంతో విద్యుత్ ప్లాంట్లు ప్రతిపాదనల్లోనే ఉండిపోయాయి. నాలుగేళ్ల కిందట ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులు సైతం నీటి పారుదల విభాగమే చేపడుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించే ప్రణాళికల్లో భాగంగా ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. దీంతో నీటిపారుదల విభాగం ఇటీవలే సంబంధిత ముసాయిదాలను సిద్ధం చేయాలని టీఎస్ జెన్కో అధికారులను కోరినట్లు తెలిసింది. నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ రెండు ప్రాజెక్టులతో పాటు.. అందులో అంతర్భాగమైన విద్యుత్ ప్లాంట్లపై ఈ వారంలోనే సమీక్ష జరపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కంతనపల్లి ప్రాజెక్టు టెండర్ల దశలోనే ఉంది. దీంతో ప్లాంట్ల నిర్మాణాన్ని నీటిపారుదల విభాగం చేపడుతుందా.. లేక టీఎస్ జెన్కోకు అప్పగిస్తుందా అనేది ఈ సమీక్ష సందర్భంగా వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగూడెం ప్లాంట్ ఏడో దశలో భాగంగా బీహెచ్ఈఎల్ చేపట్టిన 800 మెగావాట్ల ప్లాంటుకు కేంద్ర అటవీ శాఖ లైన్ క్లియర్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.