ias officers transfers
-
ఆమ్రపాలికి షాక్.. 9 మంది ఏఐఎస్‌లు ఏపీకి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్‌కు బదులుగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలన్న ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్‌కు బదులు ఏపీ కేడర్‌కు కేటాయించాలన్న మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులనూ తిరస్కరించింది.తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతోపాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు షంషేర్ సింగ్ రావత్, జి.అనంతరాము ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తూ తమను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించి వారిద్దరినీ ఏపీలోనే కొనసాగాలని ఆదేశించింది. మిగిలిన వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది. వివాదం నేపథ్యం ఇది... రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏఐఎస్ అధికారుల కేటాయింపులను కేంద్రం చేపట్టింది. ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం. ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి. సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఆయా ఐఏఎస్, ఐపీఎస్‌లు గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వారి వాదనలు విన్న ట్రిబ్యునల్.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి.. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017, 2018లో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. సోమేశ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ కేటాయింపును రద్దు చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలని 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను సమర్ధించింది.. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్న సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.ఈ తీర్పును నాటి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపులపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొని గతంలో జరిపిన తుది కేటాయింపులపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివాదంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది.ఆ అధికారుల విజ్ఞప్తులపై కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు వారందరినీ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ అధికారుల తుది కేటాయింపులపై పునఃపరిశీలన కోసం హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ శాఖ మాజీ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ ఖండేకర్‌తో ఆ శాఖ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా అధికారుల నుంచి కమిటీ వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు వారితో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరిస్తూ డీవోపీటీకి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను డీవోపీటీ ఆమోదించింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారులు 1..మల్లేల ప్రశాంతి 2. వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి 3. ఎ.వాణీ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ 4. డి.రోనాల్డ్ రోస్, ఇంధన శాఖ కార్యదర్శి 5. కాటా ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలంగాణకు కేటాయించాలన్న విజ్ఞప్తి తిరస్కరించడంతో ఏపీలోనే కొనసాగనున్న ఐఏఎస్ అధికారులు.. 1. షంషేర్ సింగ్ రావత్, స్పెషల్ సీఎస్, ఏపీ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) 2.జి.అనంతరాము, స్పెషల్ సీఎస్, ఏపీ అటవీ శాఖ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు 1.అంజనీకుమార్, డీజీ, రోడ్ సేఫ్టీ ఆథారిటీ 2. అభిలాష భిస్త్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏపీ నుంచి తెలంగాణకు రానున్న ఐఏఎస్ అధికారులు... 1.శివశంకర్ లోతేటి – వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ 2. శ్రీజన, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ 3. సి.హరికిరణ్ -
Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్‌రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్‌కు ఆ జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌గా బి.రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. -
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
ఐఏఎస్,ఐపీఎస్ బదిలీపై అత్యవసరంగా విచారించాలన్న కేంద్రం
-
ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ
-
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ఫ్ సీఈవోగా ఎం.గౌతమి, అదనపు సీసీఎల్ఏ కం సెక్రటరీగా ఇంతియాజ్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా బాబు.ఏ బదిలీ అయ్యారు. చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్‌లోనే అధికమని మొన్న ఏప్రిల్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్‌కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా గిరిజా శంకర్, పౌర సరాఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‌గా అరుణ్‌కుమార్ బదిలీ అయ్యారు. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. చదవండి: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. -
వేధించే ఎత్తుగడే.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్) కేడర్ రూల్స్–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసుల అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన బాధ్యతల నేపథ్యంలోనే.. వారిని డిప్యుటేషన్‌పై పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేలా నిబంధ నలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ ఈ విధా నాన్ని ఏకపక్షంగా మార్చేసి.. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రపు సంస్థలుగా మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధాన అంశాలివీ.. ఇది రాజ్యాంగాన్ని మార్చడమే.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 312లో ఉన్న నిబంధ నల ప్రకారం పార్లమెంటు ఆలిండియా సర్వీసెస్– 1951 చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. కానీ రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా, దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్–1954కు రంగు లద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదిత సవరణ అంటే.. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సం బంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడం తప్ప మరొకటి కాదు. ఈ సవరణలను ఇలా దొడ్డిదారిన కాకుండా.. ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాకే రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఈ నిబంధనను ఆర్టికల్ 368 (2)లో పొందుపరిచారని కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి. సవరణలను విరమించుకోండి రాష్ట్రాల పాలనా అవసరాలను చిన్నచూపు చూసేలా కేంద్ర ప్రతిపాదనలున్నాయి. అఖిల భారత సేవల అధికారుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టుగా ఈ సవరణలున్నాయి. వీటితో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటాయి. అధికారుల సేవలను సామరస్యంగా, సమతుల్యంగా వినియోగించుకోవడానికి ప్రస్తుత ఏఐఎస్ (కేడర్) నిబంధనలు సరిపోతాయి. పారదర్శకత, రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కేంద్రం ప్రతిపాదిత సవరణలను విరమించుకోవాలి.’’ అని ప్రధానికి లేఖలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరోక్ష నియంత్రణ కోసమే.. అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్‌ను సవ రించి.. రాష్ట్రాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవాలనుకోవడం ప్రమాదకరం. ఇది రాజ్యాంగ చట్రం, సహకార సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి, పరోక్షంగా నియంత్రించడానికి, వారిని చెప్పుచేతుల్లో ఉంచు కోవడానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది. అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా చేసే ఆలోచన ఇది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండటంపైనా ఇది ప్రభావం చూపుతుంది. – కేసీఆర్ -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్ఐ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వెయిటింగ్లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీచేశారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ను నియమించారు. పర్యాటక కార్పొరేషన్ ఎండీగా ఎస్ సత్యనారాయణ, ఎంఐజి ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా బసంత్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. చదవండి: 181 మంది ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతి ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అన్ని జిల్లాల నాన్‌కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనంతపురం జేసీ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల బదిలీ అయిన స్థానాలు.. ► శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్ ► శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు ► విజయనగరం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్ ► విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్ కుమార్ రావిరాల ► విశాఖపట్నం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి ► విశాఖపట్నం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు ► తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా ► తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి ► పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి ► పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా ► కృష్ణా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత ► కృష్ణా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్ లోతేటి ► గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్ దినేష్‌కుమార్ ► గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి ► ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ ► ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్ ► నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్ ► నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి ► చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు ► చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య ► వైఎస్సార్ జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి ► వైఎస్సార్ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ ► అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్ ► అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి ► కర్నూలు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్ ► కర్నూలు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి -
భారీగా అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 50 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించిన అజేయ కల్లంతో చర్చించి, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ బదిలీలపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సీఆర్డీఏ కమిషనర్, అదనపు కమిషనర్లను బదిలీ చేశారు. సీఆర్డీఏ కొత్త కమిషనర్‌గా లక్ష్మీనరసింహంను నియమించారు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆదిత్యనాధ్ దాస్‌ను నియమించారు. శశిభూషణ్ కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్, జెన్కో మాజీ ఎండీతోపాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి జె.మురళిని నియమించారు. ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. -
ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం విక్రయాల నియంత్రణంతోపాటు నిర్ణీత ధర కన్నా అధికంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న ఎక్సైజ్ కమిషనర్ పి.లక్ష్మీనర్సింహంపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఇద్దరు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ లాబీ ఒత్తిళ్లతోనే... ఎన్నికల ముందు మద్యం ఏరులై పారకుండా, ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న లక్ష్మీనర్సింహంను ఆ పదవి నుంచి తప్పించాలని అధికార పార్టీ నేతలతో పాటు లిక్కర్ లాబీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తోంది. అయితే ఆయన ఒక్కరినే బదిలీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించి ఇప్పుడు మిగతా ఐఏఎస్‌లతోపాటు ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనర్సింహంను కూడా బదిలీ చేశారు. పి.లక్ష్మీనర్సింహంను తాజాగా చేనేత– జౌళి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పర్యాటక, యువజన సర్వీసుల కార్యదర్శిగా ఉన్న ముఖేశ్‌కుమార్ మీనాను ఎక్సైజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పర్యాటక, యువజన సర్వీసుల బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం, కృష్ణా కలెక్టర్ల బదిలీ.. శ్రీకాకుళం, కృష్ణా జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత–జౌళి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను గనులశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. శ్రీనివాస శ్రీ నరేశ్‌కు గనుల శాఖ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ను పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని పర్యాటక అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి, భాస్కర్‌ను సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.విజయను సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్రితికా శుక్లాను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పర్యాటక శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న హిమాన్షు శుక్లాను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ సాక్షి, అమరావతి: ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీపీగా పనిచేస్తున్న కె.వి.వి.గోపాలరావును ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ రాజీవ్ కుమార్ మీనాను గుంటూరు రేంజ్ ఐజీపీగా బదిలీ చేశారు. విజయవాడ సిటీ డీసీపీగా పనిచేస్తున్న గజరావు భూపాల్‌ను మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. -
సీఎస్ గా ప్రదీప్ చంద్ర: ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కర్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన కొద్ది సేపటికే రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కీలకమైన భూపరిపాలన కమిషర్(సీసీఎల్ఏ) అదనపు బాధ్యతలను సీఎస్ ప్రదీప్ చంద్రే నిర్వహించనున్నారు. ఇంతకు ముందు కూడా ఆయనే సీసీఎల్ఏ(అదనపు బాధ్యత)గా కొనసాగిన సంగతి తెలిసిందే. సీఎస్ గా పదవీ విరమణ పొందిన రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్, సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆయా శాఖల వారీగా ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా అజయ్ మిశ్రా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అశోక్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా రమేశ్ దత్ ఎక్కా రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శిగా సోమేశ్ కుమార్ మత్య్స శాఖ ముఖ్య కార్యదర్శిగా బి. వెంకటేశ్వరరావు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్(అదనంగా ఐ అండ్ పీఆర్ బాధ్యతలు) హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్ రవాణా శాఖ కమిషనర్ గా సునీల్ శర్మ (అదనపు బాధ్యతలు) యువజన వ్యవహారాల కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలు: ఏపీ డెయిరీ డెవలెప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ - జె. మురళి హైదరాబాద్ సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - బి. రామారావు వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ - శ్వేతా తియెతియా విజయనగరం జాయింట్ కలెక్టర్ - శ్రీకేష్ బాలాజీ రావు సీఆర్డీఏ అదనపు కమిషనర్ - ఏ. మల్లికార్జున రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ - విజయ రామరాజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ - నాగలక్ష్మీ విజయవాడ సబ్ కలెక్టర్ - సృజన రాజమండ్రి సబ్ కలెక్టర్ - విజయ కృష్ణన్ రంపచోడవరం సబ్ కలెక్టర్ - రవి సుభాష్ తిరుపతి సబ్ కలెకర్ట్ - హిమంశు కుక్కునూరు సబ్ కలెక్టర్ - షాన్ మోహన్ పాడేరు సబ్ కలెక్టర్ - శివ శంకర్ నూజివీడు సబ్ కలెక్టర్ - లక్ష్మీషా మదనపల్లె సబ్ కలెక్టర్ - కృతికా బాత్రా నర్సాపురం సబ్ కలెక్టర్ - దినేష్ కుమార్ -
మళ్లీ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
వెయిటింగ్లో ఉన్న పదిమందికి పోస్టింగులు సీసీఎల్ఏగా అనిల్ చంద్ర పునేఠా కొన్ని విభాగాల కలిపివేత హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు భారీ స్థాయిలో ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ నెల ఏడో తేదీన పెద్ద ఎత్తున చేసిన ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగుల్లోనూ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. పలువురిని బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్లో ఉన్న పదిమందికి పోస్టింగులు ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తగ్గిన జనాభా, ఐఏఎస్ అధికారుల కొరతను దష్టిలో పెట్టుకుని కొన్ని విభాగాలను ఒకటిగా కలిపేసింది. ఇప్పటివరకూ వేర్వేరుగా ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్లను కలిపేసింది. అదేవిధంగా సాంకేతిక విద్య, కాలేజియేట్ విద్య కమిషనరేట్లను కలిపేసింది. వేర్వేరుగా ఉన్న కార్మిక, ఉపాధి కల్పన కమిషనరేట్లను సైతం ఒక్కటిగా మార్చింది. విపత్తు నిర్వహణ శాఖకు కమిషనర్ బదులు డెరైక్టర్‌ను నియమించింది. ఈ డెరైక్టర్‌ను కూడా విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శి కిందకు తెచ్చింది. (ఇప్పటి వరకూ విపత్తు నిర్వహణ కమిషనరే ఎక్స్అఫిషియో ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శిగా ఉండేవారు) మొత్తం 26 మంది అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖ నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఈనెల 7న బదిలీ అయిన అనిల్‌చంద్ర పునేఠాను తాజాగా రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా బదలాయించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నవారినే సీసీఎల్ఏగా నియమిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఉన్న పునేఠాను ఈ స్థానంలో నియమించింది. పదిరోజుల కిందటే పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా బదిలీ అయిన కె.కన్నబాబుకు మళ్లీ స్థానచలనం తప్పలేదు. ఆయన్ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేసినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వులో పేర్కొంది. బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం అనిల్ చంద్రపునేఠా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ జగదీష్ చంద్ర శర్మ కార్మిక, ఉపాధి ముఖ్యకార్యదర్శి రెవెన్యూ, విపత్తు శాఖల ముఖ్యకార్యదర్శి శాలినీ మిశ్రా వెయిటింగ్ ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యకార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్ వెయిటింగ్ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి.అనంతరాం రవాణాశాఖ కమిషనర్ కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మత్స్యశాఖ కమిషనర్ బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఓఎస్డీ, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్ బి.ఉదయలక్ష్మి వెయిటింగ్ సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్ డి.కాడ్మియల్ నీటిపారుదల శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్ వెయిటింగ్ పౌరసరఫరాల సంస్థ ఎండీ బి.రామాంజనేయులు కార్యదర్శి, వర్షాభావప్రాంతం పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి కమిషనర్ లవ్ అగర్వాల్ వెయిటింగ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్(ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు) శశిభూషణ్‌కుమార్ గ్రామీణాభివద్ధి కమిషనర్ నీటిపారుదల శాఖ కార్యదర్శి కె.సునీత కళాశాల విద్య కమిషనర్ ఆర్థిక శాఖ కార్యదర్శి డి.వరప్రసాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కమిషనర్ రాంశంకర్ నాయక్ ఇంటర్‌బోర్డు కార్యదర్శి మత్స్య శాఖ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా వెయిటింగ్ సాధారణ పరిపాలన(పొలిటికల్) కార్యదర్శి బి.శ్రీధర్ వెయిటింగ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ అనంతపురం కలెక్టర్ సెర్ప్ సీఈవో, ఆర్డీ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ ఈ-సేవ డెరైక్టర్ అనంతపురం కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సీఈవో, సెర్ప్ తూర్పుగోదావరి కలెక్టర్ పీఏ శోభ వెయిటింగ్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్టు విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు కె.కన్నబాబు పశ్చిమగోదావరి జేసీ గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ ఎల్ఎస్ బాలాజీరావు వెయిటింగ్ ఐటీడీఏ పీవో, పార్వతీపురం పి.కోటేశ్వరరావు వెయిటింగ్ పశ్చిమగోదావరి జేసీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న వాడరేవు వినయ్‌చంద్‌కు తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ(తుడా) వైస్ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఏపీలో 27 మంది ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన అధికారుల వివరాలు... తూర్పుగోదావరి కలెక్టర్- అరుణ్ కుమార్ అనంతపురం- కోన శశిధర్ సెర్ఫ్ సీఈవో- సాల్మన్ ఆరోగ్య రాజ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో- లవ్ అగర్వాల్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ముఖ్యకార్యదర్శి- శాలిని మిశ్రా ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్- ఏకే సింఘాల్ పౌరసరఫరాల శాఖ ఎండీ- రామ్ గోపాల్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి- శశిభూషణ్ కుమార్ భూపరిపాలన ప్రధాన కమిషనర్- అనిల్ చంద్రపునీత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి- విజయ్ కుమార్ బీసీ సంక్షేమ కార్యదర్శి- ప్రవీణ్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి- కె. సునీత కార్మిక శాఖ కమిషనర్-వరప్రసాద్ ఐటీ శాఖ కార్యదర్శి- శ్రీధర్ విపత్తు నిర్వహణ కమిషనర్- ధనుంజయ్ రెడ్డి కార్మిక శాఖ కార్యదర్శి- అనంతరాము తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్- వీవీ చాంద్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్- రామాంజనేయులు మత్స్యశాఖ కమిషనర్- రామశంకర్ నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి- శోభ పార్వతీపురం ఐటీడీఏ పీఓ- బాలాజీరావు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్- ఉదయలక్ష్మి సాధారణ పరిపాలన శాఖ కమిషనర్- కాడ్మియల్ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయం)- ఎంకె మీనా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్- కన్నబాబు పారసరఫరాల కార్పొరేషన్ ఎండీ- కె. రామగోపాల్ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్- కోటేశ్వరరావు -
ఖాళీయే!
* ఐఏఎస్‌ల కేటాయింపు లేనట్లే ! * జేసీ, కమిషనర్లు ఇక కష్టమే * బదిలీల సందర్భంగా దక్కని ఛాన్స్ * కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్ కొనసాగింపు * జేసీ నియామకంపై వీడని సస్పెన్స్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్ పోస్టుతో పాటు కీలక పదవుల నియామకానికి మోక్షం కలగడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 24 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకంలోనూ జిల్లాకు అవకాశం దక్కలేదు. నిజామాబాద్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించాల నే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మూడు నెలల కిందట జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ సైతం నిజామాబాద్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చిన నేపథ్యంలో కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు ప్రకటించారు. 20 రోజుల కిందటి వరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా వ్యవహరించిన మంగతాయారును సమగ్ర కుటుంబ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు పలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేశారు. ఆమె స్థానంలో నియమితులైన సత్యనారాయణ విధులలో చేరలేదు. దీంతో నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి ఇన్చార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి అంతకుముందు కలెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గా ఉన్న డి.వెంకటేశ్వర్రావు జూన్ 17న బదిలీ అయ్యారు. కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్‌కు పోస్టింగ్ ఇవ్వగా, జేసీగా మాత్రం ఎవరినీ నియమించ లేదు. సోమవారం ప్రభుత్వం 24 మంది పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు జిల్లాలలో కొందరు కలెక్టర్లకు స్థానచలనం కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న చోట జేసీ, కార్పొరేషన్ల కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమించారు. జిల్లాకు మాత్రం ఎవరినీ కేటాయించ లేదు. రొనాల్డ్‌రోస్ కలెక్టర్‌గా కొనసాగనున్నారు. ఆయనను ఆంధ్రకు కేటాయించినప్పటికీ, తెలంగాణకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి రాసిన లేఖకు సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రోస్‌ను కొనసాగించింది. జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ల నియామకంపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. అడిషనల్ జేసీగా ఉన్న డాక్టర్ పి.శేషాద్రి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ పోస్టు కూడ ఖాళీనే. -
సీఎం పేషీ ఖాళీ !
సంప్రదాయాలకు సీఎం తిలోదకాలు చివరి దశలో ఐఏఎస్‌ల హోల్‌సేల్ బదిలీలు తనతో పాటే పేషీ అధికారులను ఖాళీ చేయించడానికి రంగం సిద్ధం వారి కోసం నెలల తరబడి కీలక శాఖలు ఖాళీ ఇప్పుడు ఆ శాఖలకు ఈ అధికారుల బదిలీ సాక్షి, హైదరాబాద్: గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్లిపోయే సమయంలో హోల్‌సేల్‌గా ఐఏఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుడుతున్నారు. అంతే కాకుండా తనతోపాటే సీఎం పేషీలోని అధికారులను కూడా ఖాళీ చేయించాలనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసినా పేషీలోని ఐఏఎస్ అధికారులను అంతకు ముందే ఇతర శాఖలకు బదిలీ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన పేషీని మొత్తం ఖాళీ చేయించాలని కిరణ్ కంకణం కట్టుకున్నారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ అందుకు ముందే పేషీలోని అధికారులను ఎవరినీ బదిలీ చేయలేదు. సాధారణంగా తరువాత వచ్చే ముఖ్యమంత్రి తన ఇష్టానుసారం పేషీలోని అధికారులను నియమించుకుంటారు. కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి అప్పటి వరకు కొనసాగిన విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించడానికి అంతకు ముందు కొనసాగిన పేషీ అధికారులే ఉంటారు. అయితే తన పేషీలో పనిచేసిన అధికారులెవరూ కూడా ఇంకో ముఖ్యమంత్రి పేషీలో ఉండరాదనేది కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచనగా ఉంది. దీంతో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందుగానే తన పేషీలోని ఐఏఎస్ అధికారులకు కీలకమైన శాఖలను అప్పగించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా శాఖల్లో పనిచేసే కేడర్‌కు, ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే కనీస ఆలోచన ఇటు ముఖ్యమంత్రికిగానీ, ఆ పేషీలో పనిచేసే ఐఏఎస్ అధికారులకుగాని లేకపోవడం గమనార్హం. తన పేషీలోని అధికారులకు ముఖ్యమైన శాఖల్లో బాధ్యతలు అప్పగించడానికి నాలుగైదు శాఖలకు అధికారులను నియమించకుండా నెలల తరబడి ముఖ్యమంత్రే ఖాళీగా ఉంచారా? లేదా పేషీలోని అధికారులే ఆ పనిచేశారా.. అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సాధారణంగా అయితే నెలల తరబడి కీలకమైన శాఖలకు అధికారులు లేకపోతే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయా ఖాళీలను భర్తీచేసే బాధ్యత సీఎం పేషీలోని ఐఏఎస్‌లపై ఉంటుంది. ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే పేషీలోని అధికారులు విస్మరించారా లేదా సీఎం, అధికారులు కలిసే మిన్నకుండిపోయారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం, తన పేషీలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు అజయ్ కల్లం, జవహర్‌రెడ్డి, ఎస్.ఎస్.రావత్, శ్రీధర్‌లను నెలల తరబడి ఖాళీగా ఉన్న కీలక శాఖలకు బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక శాఖలో కీలకమైన ముఖ్యకార్యదర్శి పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. అలాగే సాగునీటి శాఖలో ముఖ్యకార్యదర్శి పదవి నెలల తరబడి ఖాళీగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పదవి కూడా నెలల తరబడి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యమైన శాఖలకు వీరిని పంపనున్నారని సమాచారం. అలాగే భారీ ఎత్తున ఇతర అధికారులను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. సీఎం రాజీనామా సంతకానికి ముందుగానే ఈ బదిలీలపై సంతకాలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. శనివారం వరకు ఫైళ్లన్నింటినీ సీఎం క్యాంపు కార్యాలయానికి తరలించిన పేషీ అధికారులు పనిలో పనిగా తమకు చెందిన వ్యక్తిగత పుస్తకాలు, ఇతర సామాగ్రిని కూడా సర్దుకుని ఇళ్లకు పట్టుకుపోయారని తెలిసింది.