igp
-
ఫస్ట్ ఉమన్.. డేరింగ్ అండ్ కేరింగ్ ఆఫీసర్
అస్సాం తొలి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (ఐజీ) గా వయొలెట్ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన తరువాత ఆమె ట్విట్టర్ పేజీలో అభినందనలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని... ‘ఈ పదవికి మీకంటే అర్హులైన వారు లేరు’ ‘మీ విజయం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ ‘అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు’ ‘ఐపీయస్ చేయాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం, సలహాలు కావాలి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అస్సాంలో వరదలు ఎంత సహజమో, అల్లర్లు అంతే సహజం. వరదలకైనా టైమ్ ఉంటుందేమోగానీ, అల్లర్లు మాత్రం... అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అలాంటి చోట పోలిసు ఉద్యోగం చేయడం అనేది కత్తులవంతెన మీద ప్రయాణం చేయడమంత కష్టం. అయితే డియస్పీ, ఎస్పీ, డిఐజీగా రకరకాల హోదాల్లో పనిచేసిన బారువా మాత్రం తాను రిస్క్ జాబ్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అలా అనుకోని ఆగిపోయి ఉంటే చారిత్రక గుర్తింపుకు నోచుకొని ఉండేవారు కాదమో! వయొలెట్ బారువా....‘బ్యూటిఫుల్ నేమ్’ అంటారు ఆమె సన్నిహితులు. వర్ణశాస్త్రం ప్రకారం వయొలెట్ కలర్‌ను జ్ఞానానికి, సున్నితత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘సాహసం’ అనే మరో ప్రతీకను కూడా చేర్చారు బారువా. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు బారువా. యూనివర్శిటీ రోజుల్లో కూడా చదువు ఎంత ముఖ్యమో, సమాజం కూడా అంతే ముఖ్యం అనుకునేవారు. తాను వెళ్లే దారిలో ఎక్కడైనా గొడవ జరిగితే సర్దిచెప్పడం, ఆకతాయిల పని పట్టడం జరిగేది. గౌలపర, మోరిగన్, కచర్,బర్పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించడమంటే మాటలు కాదు. కేవలం తూటాలు, లాఠీలను నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. తెలివి ఉపయోగించాలి. అల్లర్లకు అడ్రస్ అయిన ఆ నాలుగు జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో బారువా విజయం సాధించారు. సీబిఐ విభాగంలోనూ తన సత్తా చాటారు. నేరపరిశోధనలో, నేరాలను అదుపులో పెట్టడంలో తనదైన ముద్ర వేసిన బారువా ఇలా అంటున్నారు... ‘నా కెరీర్లో ఏ పోస్టింగ్, టాస్క్‌కు ఇబ్బంది పడలేదు. నో చెప్పలేదు. గౌహతి పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేయడం కంటే మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికే ఆసక్తి చూపాను’ బారువా ఏ ప్రాంతంలో పనిచేసినా ‘పోలిస్ ఆఫీసర్’తో పాటు ‘కేరింగ్ ఆఫీసర్’ అని అభిమానంగా పిలుచుకుంటారు ప్రజలు. అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే అస్సాం తొలి మహిళా డీఎస్పీ, తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బారువా సాధించించిన మరో మహత్తరమైన విజయమిది! -
స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల లిస్టింగ్‌ను ప్రోత్సహించే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొన్ని నిబంధనలను సరళీకరించింది. 25 శాతం ప్రీ ఇష్యూ క్యాపిటల్ హోల్డింగ్ సమయాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించడం తదితర సవరణలను చేపట్టింది. అంతేకాకుండా అర్హతగల ఇన్వెస్టర్లకు విచక్షణాధికార కేటాయింపునకు సైతం అనుమతించనుంది. 30 రోజుల లాకిన్ గడువుతో ఇష్యూ పరిమాణంలో 60 శాతం వరకూ షేర్లను కేటాయించవచ్చు. ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్టార్టప్‌ల లిస్టింగ్‌కు వీలు కల్పించనుంది. గురువారం (మార్చి 25) జరిగిన బోర్డు సమావేశంలో సెబీ ఇంకా లిస్టెడ్ కంపెనీలు, ప్రమోటర్లు, ఆర్థిక ఫలితాలు తదితర అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర వివరాలివీ.. 1,000 కంపెనీలకు.. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలను నిర్ధారించడంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సెబీ క్రమబద్దీకరించింది. ఇక లిస్టెడ్ కంపెనీలు నిర్వహణ సంబంధ(సస్టెయినబిలిటీ) నివేదికలను రూపొందించడంలో కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుత బీఆర్ఆర్ స్థానే వ్యాపార బాధ్యతలు, నిర్వహణ సంబంధ నివేదిక (బీఆర్ఎస్ఆర్) పేరుతో తాజా నిబంధనలు రూపొందించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్-1,000 లిస్టెడ్ కంపెనీలకు తాజా బీఆర్ఎస్ఆర్ నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్వచ్చందంగా పాటించేందుకు వీలుంది. అయితే 2022-23 ఏడాది నుంచి తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలి. డివిడెండ్ పంపిణీ విధానాల అమలులో ప్రస్తుతమున్న టాప్-500 లిస్టెడ్ కంపెనీల జాబితాను తాజాగా టాప్–1,000కు సవరించింది. 24 గంటల్లోగా లిస్టెడ్ కంపెనీలు విశ్లేషకులు, ఇన్వెస్టర్ల సమావేశాలను నిర్వహించినప్పడు ఈ ఆడియో, వీడియో వివరాలను 24 గంటల్లోగా(తదుపరి ట్రేడింగ్ రోజు) తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరి్థక ఫలితాలు ప్రకటించిన ఐదు పని దినాలలోగా వెబ్సైట్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారాన్ని చేరవేయవలసి ఉంటుంది. రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించిన పక్షంలో ఆర్థిక ఫలితాలను 30 నిమిషాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల ఫిర్యాదులు, కార్పొరేట్ పాలన, వాటాదారుల వివరాలు వంటి అంశాలను ప్రతి క్వార్టర్ తదుపరి 21 రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. కంపెనీలో మెజారిటీ వాటాలను విక్రయించాక ప్రమోటర్లు నామమాత్ర వాటాలను మాత్రమే కలిగి ఉండి, యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు పబ్లిక్ వాటాదారుగా గుర్తించే అంశంలోనూ నిబంధనలను సవరించింది. డీలిస్టింగ్ వెనుక ఉద్దేశ్యం చెప్పాల్సిందే మార్కెట్ల నుంచి కంపెనీల డీలిస్టింగ్‌ను మరింత పారదర్శకంగా మార్చాలని సెబీ నిర్ణయించింది. ఇందుకోసం డీలిస్టింగ్ ప్రకటన చేసే ప్రమోటర్లు/కొనుగోలుదారులు తమ ఉద్దేశ్యాన్ని వెల్లడించేలా చేయాలని సెబీ నిర్ణయించింది. అలాగే, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల నిర్వచనం కింద నిషేధిత కార్యకలాపాలు లేదా రంగాల జాబితాను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) కింద నమోదైన వెంచర్‌క్యాపిటల్ ఫండ్స్‌కు వెసులుబాటు రానుంది. డీలిస్టింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ఇందుకు సంబంధించి నిబంధనల సవరణకు బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ గురువారం ప్రకటించింది. నూతన నిబంధనల కింద ప్రతిపాదిత డీలిస్టింగ్‌కు సంబంధించి ఇండిపెండెంట్ డైరెక్టర్లు తమ సిఫారసులు తెలియజేయాల్సి ఉంటుంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్! -
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్‌పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
మహిళల భద్రతలో పోలీసులే కీలకం
న్యూఢిల్లీ/పుణె: మహిళలకు భద్రత కల్పించడంలో పోలీసులు సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ అన్నారు. పుణెలో జరుగుతున్న 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో ఆదివారం ఆయన ప్రసంగించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణ పౌరుల నమ్మకాన్ని చూరగొనేందుకు పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీసు అధికారులు నిత్యం విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తనకు తెలుసునంటూ ప్రధాని..‘ఇలాంటివి ఎన్ని ఉన్నా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనప్పుడు ఉన్న ఉత్సాహం, ఆదర్శ భావాలను మనసులో ఉంచుకుంటూ జాతిహితం, సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అవసరాల మేరకు చట్టాల్లో మార్పులు దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హోం శాఖ కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయం వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయాలి సార్క్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఖమ్మంలో కేరళ ఐజీపీ
కారేపల్లి: కేరళ రాష్ట్ర ఐజీపీ గుగులోతు లక్ష్మణ్‌నాయక్ శనివారం కారేపల్లి మండలంలోని భాగ్యనగర్‌తండా గ్రామాన్ని సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాంప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ మాట్లాడుతూ నేటి యువత బంజార సంస్కృతి సంప్రదాయాలను అవలంబిస్తూ పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు. -
శ్రీలంక సంచలన నిర్ణయం : కొత్త పోలీస్ బాస్
కొలంబో: వరుస ఆత్మాహుతి బాంబు దాడులతో విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయడానికి నిరాకరించిన పోలీసు బాస్‌పై వేటు వేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందరను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు చేసింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. అలాగే డీఐజీ చందన విక్రమ రత్నేను యాక్టింగ్ పోలీస్ ఛీప్‌గా నియమిస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలను ఖండించిన పుజిత్ రాజీనామా చేసినప్పటికీ, సంబంధిత పత్రాలను అధికారికంగా సమర్పించకపోవడంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తులు మరిన్నిభీకర దాడులకు పాల్పడవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ శ్రీలంక భద్రతా వర్గాలకు , నిఘా విభాగం తాజాగా హెచ్చరికలు జారీచేసింది. దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ముసుగు వేసుకుని సంచరించడాన్ని నిషేధించింది.ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం ఆదేశాలు జారీచేశారు. దేశంలోని ఉంటున్నవారు తమ ముఖాన్ని ఇతరులు గుర్తు పట్టకుండా ఉండేట్లు ఎలాంటి ముసుగు ధరించకూడదని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అటు ముఖాన్ని కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించవద్దని ఇటీవల శ్రీలంకలోని ఓ ముస్లిం సంస్థ కూడా సూచించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా, నింధితులను గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే శ్రీలంకకు వస్తున్న భారతీయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. కాగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశంలో సోమవారంనుంచి అత్యయిక పరిస్థితి చట్టాన్ని వినియోగిస్తూ పలు నిబంధనలను విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదుల మారణకాండను నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు శ్రీలంక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర శుక్రవారం రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల నేపథ్యంలో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ కమాండ్ ఏర్పాటు.. ‘ఈ ఉగ్రవాది చోటుచేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలీ కారణమే. దేశంలో జర్నలిస్టుల హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన కొందరు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులను ఇటీవల అరెస్ట్ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటుచేస్తాం. ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తాం’ అని సిరిసేన తెలిపారు. సూత్రధారి.. జహ్రాన్ హషీమ్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు ఎన్టీజే విధేయత ప్రకటించిందని వెల్లడించారు. ‘ఈస్టర్ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు జహ్రాన్ ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో వీరిద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు’ అని సిరిసేన పేర్కొన్నారు. ముస్లింలపై ఉగ్రముద్ర వద్దు.. ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని అధ్యక్షుడు సిరిసేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)ను నిషేధించే అంశాన్ని మేం పరిశీలించాం. కానీ ఇప్పుడున్న చట్టాల ద్వారా అది సాధ్యం కాదు. ఇందుకోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తాం’ అని సిరిసేన చెప్పారు. -
పోలీసులూ .. కుమ్మక్కైతే ఇక అంతే!
జమ్మూ: తమ రాష్ట్ర పోలీసులకు జమ్మూకాశ్మీర్ పోలీసు బాసు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడేవారితో కుమ్మక్కై వారితో వ్యవహారాలు నడుపుతున్నట్లు ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఐజీపీ దానిశ్ రాణా హెచ్చరించారు. చాలాకాలంగా జమ్మూ రాష్ట్రంలో మాఫియా వారితోను, మోసాలు, నేరాలకు పాల్పడేవారితోను పోలీసులు కుమ్మక్కై పనిచేస్తున్నారనే అపవాదు ఉంది. మాఫియా లీడర్లు చేసే అక్రమాలకు పోలీసులు సహకరిస్తున్నారని, భూముల కబ్జాల్లో భాగం పంచుకుంటున్నారని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఐజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు, మాఫియా లీడర్లు కఠినంగా శిక్షించడానికి అర్హులని వారి విషయంలో దాతృత్వం వహించడం ఏమాత్రం అంగీకరించకూడని విషయమని, పోలీసులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి కేసుల్లో ఆలస్యం ఉండబోదని చెప్పారు.